tsmagazine
ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖరరావు దార్శనికతతో బి.సి.లు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వ ప్రోత్సాహం పొందుతున్నారు. ప్రభుత్వపరంగా వారికి అన్ని రకాల అండదండలు లభిస్తున్నాయి. బి.సి. వర్గాలు కూడా సంపన్న వర్గాలుగా మారడానికి ముఖ్యమంత్రి తన మేధస్సుకు పదును పెట్టి, అనేక వినూత్న పథకాలను ప్రవేశపెడుతున్నారు. వెనుకబడిన తరగతులలోని ప్రతి కులానికి ప్రభుత్వపరంగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంలో భాగంగా రాష్ట్రస్ధాయి బి.సి. స్టడీ సర్కిల్‌, జిల్లాలలోని బి.సి. స్టడీ సర్కిళ్లు ప్రైవేటు సంస్ధలతో పోటాపోటీగా నడుస్తూ, బి.సి. నిరుద్యోగులకు వరంగా మారాయి. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల శిక్షణకే పరిమితమైన బి.సి. స్టడీ సర్కిళ్లు ఇప్పుడు స్వయం ఉపాధి సామర్ధ్యాన్ని పెంచటంలో, ప్రైవేటు ఉద్యోగాలకు ఎంపిక కావటంలో కూడా ఉచిత శిక్షణ ఇస్తూ, బి.సి. విద్యార్ధులకు అండదండలు అందిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలోని జనాభాలో సగంపైన ఉన్నది వారే. 150 పైగా కులాలు వారివే. ప్రజల దైనందిన జీవనానికి ఆలంబనగా ఉన్న వృత్తులలో 90 శాతం పైగా వారి చేతుల మీదుగా జరగవల్సిందే. ఆ ప్రజా సమూహమే మన తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల (బి.సి.) కులాల ప్రజలు.

సామాజిక వెనుకబాటుతనం, అవిద్య, అసమానతలు వంటి అనేక అవరోధాలను అధిగమించి బి.సి.లు చదువుకోవటమే కష్టం. ఒక వేళ చదువుకున్నా, ఈ పోటీ పరీక్షల యుగంలో పోటీని తట్టుకుని ఉద్యోగాలు పొందటం చాలా కష్టం.

ఇటువంటి క్లిష్ట పరిస్ధితులలో ఉన్న బి.సి. నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర బి.సి.స్టడీ సర్కిళ్లు కొండంత బాసటగా నిలుస్తున్నాయి. ఆర్ధికంగా వెనుకబడిన నిరుద్యోగ బి.సి. విద్యార్ధులకు పోటీ పరీక్షల్లో అవగాహన కల్పించి, శిక్షణ ఇచ్చి వారు ప్రభుత్వ ఉద్యోగులుగా ఎంపిక కావటమే లక్ష్యంగా హైదరాబాద్‌లో రాష్ట్రస్ధాయి స్టడీ సర్కిల్‌ను, జిల్లాలలో జిల్లాస్ధాయి స్టడీ సర్కిళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ స్టడీ సర్కిళ్లు ఉద్యోగార్ధులకు శిక్షణను ఇచ్చే కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి.

పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు నిరుద్యోగులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉచిత శిక్షణను అందివ్వటమేకాక, ఉచిత భోజన సదుపాయాలను, స్టయిపెండ్‌ను, పుస్తకాల అలవెన్స్‌ను కూడా బి.సి. స్టడీ సర్కిళ్లు అందజేస్తున్నాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ ఖాళీలను ప్రకటించగానే బి.సి. స్టడీ సర్కిళ్లు అభ్యర్ధులకు శిక్షణా కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాయి. ప్రైవేటు కోచింగ్‌ సెంటర్లుకు దీటుగా జరుగుతున్న ఈ శిక్షణ బి.సి.యువతకు దిక్సూచిలా మారింది. వేలాదిమంది బి.సి. యువతీయువకులు రాష్ట్రస్ధాయి కేంద్రంలో, జిల్లా కేంద్రాలలో శిక్షణ తీసుకుంటూ ప్రయోజనం పొందుతున్నారు.

  • తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, 2014-15 లో పోలీసు కానిస్టేబుళ్ల నియామకం కోసం బి.సి. స్టడీ సర్కిల్‌ 264 మందికి శిక్షణ ఇస్తే, వారిలో 61 మంది ఎంపికయ్యారు. ఇదే ఏడాది ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు జరిగిన పరీక్షలలో బి.సి. స్టడీ సర్కిల్‌ విద్యార్ధులు 35 మంది. ఎంపికయ్యారు. వి.ఆర్‌.వో, వి.ఆర్‌.ఎ ఉద్యో గాలకు బిసి స్టడీ సర్కిల్‌ నుండి 16 మంది ఎంపిక య్యారు. పంచాయితీ సెక్రటరీ ఉద్యోగాలకు బిసి స్టడీ సర్కిల్‌ నుంచి శిక్షణ పొందిన అభ్యర్ధులు 12 మంది ఎంపికయ్యారు.
  • 2015-16 సం||లో జరిగిన గ్రూప్‌-1 పరీక్షలకు కూడా రాష్ట్ర స్టడీ సర్కిల్‌తో పాటు, జిల్లా స్టడీ సర్కిళ్లు కూడా అభ్యర్ధులకు శిక్షణ అందించాయి. వీటి ఫలితాలు వెలువడవలసి ఉంది. 2016-17 లో జరిగిన సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ పరీక్షలలో 6 మంది బి.సి. స్టడీ సర్కిల్‌ విద్యార్దులు విజేతలుగా నిలిచారు. 2016-17 లో జరిగిన పోలీసు కానిస్టేబుళ్ల నియామకంలో 135 మంది బి.సి. స్టడీ సర్కిల్‌ విద్యార్దులు నియమితులయ్యారు.
  • 2016-17లో జరిగిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (మల్టిటాస్కింగ్‌) నాన్‌ టెక్కికల్‌ పరీక్షలలో బి.సి. స్టడీ సర్కిల్‌ విద్యార్దులు 31 మంది విజేతలుగా నిలిచాలు. ఇదే ఏడాది జరిగిన గురుకుల పాఠశాలల ఉపాధ్యాయుల పరీక్షల ప్రిలిమ్స్‌కి 610 మంది ఎంపికయ్యారు. గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల మెయిన్స్‌ పరీక్షలలో లాంగ్వేజెస్‌కి 50 మంది, సబ్జెక్టులకు 71 మంది ఎంపిక కాగా, ఇంటర్వ్యూలో 79 మంది ఎంపికయ్యారు.
  • అటవీశాఖలో 2017-18 సం||లో జరిగిన నియామకాలలో కూడా బి.సి. స్టడీ సర్కిల్‌ విద్యార్దులు పోటీ పడ్డారు.

ప్రైవేట్‌ ఉద్యోగాలకు కూడా సమాయత్తం…

  •  ప్రభుత్వ ఉద్యోగాలే కాక, ప్రైవేటు రంగంలో ఉపాధి పొందటానికి అవసరమైన, డిమాండ్‌ కలిగిన పలు రకాలు శిక్షణలను రాష్ట్ర బి.సి. ఉపాధి సామర్ధ్య, నైపుణ్యాభివృద్ది శిక్షణా కేంద్రం అందజేస్తోంది. సిసిటివి, సెక్యూరిటీ సిస్టమ్స్‌, మేజిక్‌ స్కిల్స్‌, బ్యుటీషియన్‌ కోర్సులు, తదితర అనేకమైన నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వటం జరుగుతోంది.

గొట్టిపాటి సుజాత

Other Updates