రాష్ట్రం ఏర్పడిన గత 18 నెలల కాలంలో పోలీస్ శాఖలో ఊహలకు అందంనంత ఎక్కువగా అభివ ద్ధి సాధించిందంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వం ఏర్పడిన కేవలం రెండు నెలల కాలంలో 350 కోట్ల వ్యయంతో 11 వందల బ్రాండెడ్ పెట్రోలింగ్ కార్లను ప్రభుత్వం మంజూరు చేసింది. జి.పి.ఎస్ సిస్టం కలిగివున్న ఈ కార్లు ఎక్కడ అవాంచనీయ సంఘటనలు జరుగుతున్నా అక్కడికి వెంటనే సిబ్బందితో చేరుకొని, క్షణాల్లో నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఉగ్రవాదుల దాడిని ఎదుర్కోవడానికి జంట నగరాల్లో గుర్తించిన 17 కేంద్రాల్లో సున్నితమైన ప్రాంతాల్లో ఆయుధ సంపత్తితో కూడిన సిబ్బంది అందుబాటులో వుంటున్నారు.
690 పోలీస్ స్టేషన్లు, 57 వేల సిబ్బంది కలిగివున్న తెలంగాణరాష్ట పోలీస్ శాఖలో ప్రస్తుతం అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు సమకూర్చడం దేశ చరిత్రలో ఇది మొదటి సారని చెప్పవచ్చు. ఏ రాష్ట్రంలో కూడా ఇలా జరుగలేదు. హైదరాబాద్ నగరం స్మార్ట్ అండ్ సేఫ్ సిటీగా, ఒక గ్లోబల్ నగరంగా ఉంటేనే ప్రపంచంలో ఈ నగర ప్రతిష్ట పెరుగుతుంది. అధికంగా పెట్టుబడులు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇందుకు శాంతి భద్రతలు ప్రధానమని ముఖ్యమంత్రి పలు సందర్భాలలో చెప్తున్నారు. అందుకే మౌలిక వసతుల ఏర్పాటుకు ఎన్ని ప్రతిపాదనలు సమర్పిస్తున్నప్పటికి, అన్నీ వెంట వెంటనే అమలు జరుగుతున్నాయి. ఒక వేయి కోట్ల వ్యయంతో ప్రపంచంలోనే ఒక అద్భుతమైన పోలీస్ హెడ్ క్వార్టర్స్ భవనాన్ని 24%శ%18 అంతస్తులతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీస్ ట్విన్‌టవర్స్‌ను నిర్మించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి 22 నవంబర్, 2015 న శంఖుస్థాపన చేశారు. ఒక లక్ష సి.సి. కెమరాలతో ఈ పోలీస్ భవనం అనుసంధానమై వుంటుంది కనుక ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో తెలిసిపోతుంది.
రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటే అన్నీ సర్దుకుంటాయనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నది. ఆధునిక టెక్నాలజీని విస్త తంగా ఉపయోగించడం జరుగుతున్నది. ప్రతి సిటిజన్ ఒక పోలీస్ అనే భావనతో రూపొందించిన ”హాక్ ఐ ానూఔఖ జ్‌ుజ్ణు ఆప్ ను 1.65 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకుని ఉపయోగిస్తున్నారు. ఎవరు ఆపదలో ఉన్నప్పటికీ, అందుకు సంబంధించిన బటన్ నొక్కితే దగ్గరలో వున్న పోలీసులకు ఆ విషయం తెలిసిపోతుంది. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుంటారు. ఈ ాaజూజ్ణూ కు డిజిటల్ తెలంగాణా అవార్డ్ కూడా వచ్చింది. ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఈ-చలాన్ అక్కడికక్కడే ఇస్తారు. వారు మీ సేవ, పోస్టాఫీస్, బ్యాంక్‌లలో ఎక్కడైనా జరిమానా రుసుము చెల్లించవచ్చు. అలాగే, వాహనాల స్పీడ్ ను తెలుసుకునే వీలుగా, స్పీడ్ లేజర్ గన్స్, మద్యం తాగి వాహనాలు నడిపే వారికోసం బ్రీతింగ్ ఎనలైజర్స్, బాడీ వార్న్ కెమెరాలు.. ఇలా ఎన్నో సాంకేతిక విధానాలను రూపొందించడం జరిగింది. పాస్‌పోర్ట్‌ల కోసం గతంలో నెలల కొద్ది పట్టే సమయం ఇప్పుడు కేవలం 7 రోజులలో పాస్ పోర్ట్ వచ్చే విధంగా వేరిఫాస్ట్ ాహజు=Iఖ్ణీూూుసాఫ్టవేర్ ద్వారా సాధ్యమౌతున్నది. జంట నగరాలలోని 60 పోలీస్ స్టేషన్‌లకు ఫేస్ బుక్ సౌకర్యం ఏర్పడింది. ఎవరు ఏ పోలీస్ స్టేషన్ కైనా తమ అభిప్రాయాలను పంపించవచ్చు. అన్ని పోలీస్ స్టేషన్‌లకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఏర్పడింది. అన్ని విషయాలను ఈ కాన్ఫరెన్స్ ద్వార చర్చించవచ్చు. వాట్సప్ ద్వార తమకు జరిగిన ఇబ్బందులను పోలీసులకు క్షణాల్లో చెప్పవచ్చు. ఏడాది కింద ప్రారంభమైన ”షి” టీమ్స్ ఇతర రాష్ట్రాల్లో మనల్ని చూసి అమలు చేస్తున్నారు. 14 మందిని నిర్భయ చట్టం కింద బుక్ చేయడం జరిగింది. కార్దన్ అండ్ సర్చ్ (ాజశీతీసశీఅ aఅస ూవaతీషష్ట్ర్ణ) ద్వార అనేక మంది సంఘ విద్రోహులు పట్టు పడుతు న్నారు. సోషల్ నెట్‌వర్క్ ద్వారా ఉగ్రవాదానికి ఆకర్షితులయే వారిని పట్టుకుని కౌన్సిల్లింగ్ చేయడం జరుగుతున్నది. ఇటీవల జరిగిన గోదావరి పుష్కరాల్లో మొదటిసారిగా రేడియో ఓవర్ ఐ.పి. నెట్ వర్క్ ా=aసఱశీ ూఙవతీ Iూ చీవ్‌షశీతీస్ణను ఉపయోగించి ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటన జరుగకుండా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకున్నది.
గతంలో ఎన్నడూ లేని విధంగా, పోలీస్ స్టేషన్ కార్యాలయాలలో కే.ఎం ఆటం సాఫ్ట్ వేర్ అప్లికేషను ద్వార పేపర్ రహిత కార్యాలయాలుగా రూపొందించడానికి యత్నాలు జరుగుతున్నాయి. బయో మెట్రిక్ విధానం ద్వార సిబ్బంది హాజరు పట్టికను ఉపయోగిస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు ప్రజలతో పోలీసులు స్నేహ పూర్వక సంబంధాలను ాూవశీజూశ్రీవర ఖీతీఱవఅసశ్రీవ ూశీశ్రీఱషవ్ణ కలిగి ఉండటానికి ఆధునిక టెక్నాలజీ ని పోలీస్ శాఖ విస్త తంగా ఉపయోగించుకుంటున్నది. ప్రజలకు దగ్గరయే ాజఱ్‌ఱఓవఅ ూవతీఙఱషవర్ణఅన్ని సేవలను వ్యక్తిగతంగానే కాకుండా సాంకేతిక విజ్ఞానంతో కూడా అందించడానికి క షి జరుగుతున్నది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలైన మిషన్ కాకతీయ, హరిత హారం, స్వచ్ఛ తెలంగాణా-స్వచ్ హైదరాబాద్, గ్రామ జ్యోతి కార్యక్రమాలలో పోలీసులు ప్రజలతో పాటు సేవలు చేసారు. చాల గ్రామాలను పోలీసులు దత్తత తీసుకున్నారు. పోలీస్ ఉద్యోగాలను ఆశించే యువతకు పోలీసులే దగ్గరగా వుండి శిక్షణ మెళుకువలను నేర్పిస్తున్నారు. మెక్-ఎ-విష్ ఫౌండేషన్ ద్వార ప్రాణాపాయంలో వున్న పిల్లలకు పోలీసులు ఆశల ఆక్సిజన్ అందిస్తున్నారు. అవయవ దానం చేసేవారికి క్షణాల్లో సేవలు అందించారు. ఇన్ని సేవలకు ఇంకా అదనంగా ఏమి చేయాలో సూచించాలని ప్రజలకు తెలంగాణా స్టేట్ పోలీస్ పేరుతొ పేస్ బుక్ పేజిని ప్రజల ముందు పెట్టింది. ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ విద్యార్థులు, అద్యాపకులతో సూచనలు సలహాలు ఇవ్వమని ఒప్పందం చేసుకుంది తెలంగాణా పోలీస్ శాఖ.
తెలంగాణా పోలీస్ శాఖ అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రతిష్టలను కలిగి ఉండాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిక. ఆ కోరికను నెరవేర్చేలాగా పోలీస్ శాఖలోని సిబ్బంది అందరు క షి చేస్తున్నారు. అందుకే భారత ప్రధాన మంత్రి మన రాష్ట్ర పోలీస్ పురోగతిని దగ్గరగా గమనిస్తుంటారు. అన్ని సమావేశాల్లో రాష్ట్ర పోలీసులు అవలంబిస్తున్న విధానాలను అమలు చేసేదిశగా ప్రయత్నం చేయాలంటారు.