బ్రాహ్మణ సంక్షేమనిధి ఏర్పాటు 

బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. కులం, మతం, ప్రాంతాలకతీతంగా సమాజంలోని అన్ని వర్గాల వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సమాజంలో ఇతర వర్గాల లాగానే బ్రాహ్మణ సామాజిక వర్గంలోనూ పేదలున్నారని ప్రభుత్వం భావిస్తోంది. అందుకనుగుణంగా ఈ బడ్జెట్‌లో తొలిసారిగా బ్రాహ్మణ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది. 2016-17 బడ్జెట్‌లో ఈ నిధికి రూ. 100 కోట్లు కేటాయించింది. ఈ సంక్షేమ నిధి విధివిధానాలు త్వరలో ఖరారు చేస్తామని ఆర్ధిక మంత్రి చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, మహిళా సంక్షేమం కోసం ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నది. ప్రతి వ్యక్తిపై, సంక్షేమ రంగానికి ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. ఈ బడ్జెట్‌లో రూ. 13,412 కోట్లు ఖర్చు పెడుతున్నామని ఆర్ధిక మంత్రి సగర్వంగా ప్రకటించారు. అల్పాదాయ వర్గాలుగా పరిగణించడానికి గతంలో ఉన్న ఆదాయ పరిమితిని కూడా పెంచడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పరిమితిని రూ. 60 వేల నుండి రూ. లక్షన్నర వరకు, పట్టణ ప్రాంతాల్లో పరిమితిని రూ. 75 వేల నుంచి 2 లక్షల వరకు పెంచాం. దీని వల్ల ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అంగన్‌ వాడీ వర్కర్లు, హోంగార్డులు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులకు కూడా అందుతున్నాయని మంత్రి తెలిపారు.

  • సామాజిక ఆర్ధిక రంగాల్లో తరతరాలుగా నిర్లక్ష్యానికి గురైన షెడ్యుల్డు కులాల వారి వికాసానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. వీరి సంక్షేమానికి ఈ బడ్జెట్‌లో రూ. 7, 122 కోట్లను ప్రతిపాదించారు.
  • గిరిజన సంక్షేమానికి రూ. 3,752 కోట్లు.
  • బీసీలకు ఆదిలాబాదు, కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌, ఖమ్మం జిల్లాలో బిసి స్టడీ సర్కిళ్ల నిర్మాణం కోసం భూమిని కేటాయించాం. వెనుక బడిన తరగతుల సంక్షేమం కోసం రూ. 2,538 కోట్లను ప్రతిపాదిస్తున్నాం.
  • మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు మైనారిటీల సంక్షేమం కోసం మా ప్రభుత్వం తీసుకున్న చర్యలే అందుకు సాక్ష్యం. షాదీ ముబారక్‌ కోసం గత ఏడాది రూ . 100 కోట్లు కేటాయించాం. ఇప్పు డు మరో 50 కోట్లు అదనంగా కేటాయించామని తెలియజేస్తున్నాను. ఇంకా వీరి కోసం 70 ఇంగ్లీషు మీడియం ఆశ్రమ పాఠశాలలను మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త ఆశ్రమ పాఠశాలలకు రూ. 350 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. మైనారిటీ సంక్షేమనికి మొత్తం రూ. 1,204 కోట్లను ప్రతిపాదిస్తున్నామని ఆర్ధిక మంత్రి తెలిపారు..

ఆసర ఫించన్లు: తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఆసరా ఫించన్ల వల్ల వృద్ధులు, వికలాంగులు, వితంతువుల జీవితాలకు భద్రత చేూరింది. నేత కార్మికులు, గీత కార్మి కులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు కూడా ఆసరా ఫించన్లు ఇచ్చి భరోసా కల్పించాం. ఆసరా ఫించన్ల కింద 35.74 లక్షల మందికి భద్రత ఏర్పడింది. 2016-17 బడ్జెట్‌లో ఆసరా ఫించన్ల కోసం రూ. 4,693 కోట్లు ప్రతిపాదిస్తున్నాం.

కళ్యాణలక్ష్మి: బీసీలతో సహా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలన్నింటికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బడ్జెట్‌లో కళ్యాణలక్ష్మి పథకం కోసం రూ. 738 కోట్లు ప్రతిపాదిస్తున్నాం.

మహిళా, శిశు సంక్షేమం: మహిళా, శిశు సంక్షేమం కోసం ఈ బడ్జెట్‌లో రూ. 1,553 కోట్లను ప్రతిపాదించారు.

కార్పొరేషన్లకు నిధులు 
రాష్ట్రంలోని ఖమ్మం, రామగుండం, కరీంనగర్‌, నిజామాబాద్‌ కార్పొరేషన్లకు ఒక్కోదానికి రూ. 100 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ. 100 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. వీటితో పాటు రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లోని మున్సిపాలిటీలకు రూ. 500 కోట్లు ప్రతిపాదిస్తున్నామని ఆర్ధిక మంత్రి తెలిపారు.

రహదారుల అనుసంధానం 
అన్ని మండలాలను ఆ జిల్లా ప్రధాన కేంద్రంతో అనుసంధానిస్తూ డబుల్‌ లైన్ల రోడ్లను, అన్ని జిల్లాలను రాష్ట్ర రాజధానితో కలుపుతూ నాలుగు లైన్ల రోడ్లను వేయాలని ప్రభుత్వం సంకల్పించింది. రోడ్ల పనులను దశలవారీగా చేపడుతున్నారు. ఆర్‌అండ్‌ ఆధ్వర్యంలో 2570 కిలోమీటర్ల మేర కొత్త రహదారులు నిర్మిస్తున్నారు. నాలుగు వేల కిలోమీటర్ల మేర రహదారులను బాగుచేస్తున్నారు.

తెలంగాణలో జాతీయ రహదారుల కోసం చేసిన పోరాట ఫలితంగా ఈ ఒక్క ఏడాదే తెలంగాణ రాష్ట్రానికి 1600 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు మంజూరైనట్టు ఆర్ధిక మంత్రి చెప్పారు. శాసనసభ్యులకు కార్యాలయాలు, ముఖ్యమంత్రికి కొత్తగా క్యాంపు కార్యాలయం, అధికారులకు నివాస గృహా లు, రాజ్‌భవన్ వద్ద అదనపు భవనాలు, తెలంగాణ కళాభారతి నిర్మించదలిచారు. 2016-17 బడ్జెట్‌లో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ. 3333 కోట్లు భవనాల నిర్మాణానికి రూ. 475 కోట్లు ప్రతిపాదించాం.

2016-17 లో రోడ్ల అభివృద్ధి, నిర్వహణ పనులకు పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు గ్రామీణ ఉపాధి హామీ పథకంతో కలిపి మొత్తం రూ. 10,731 కోట్లు ప్రతిపాదించాం.

పోలీసు, ప్రజా భద్రత రక్షణ 
పోలీసు శాఖకు కొత్తగా సీసీ టీవీలను మంజూరు చేస్తున్నం. ముఖ్యమైన ప్రదేశాల్లో, రహదారి కూడళ్లలో వీటిని ఏర్పాటు చేస్తాం. నగర సిసి టివిల పర్యవేక్షణ కోసం ఈ బడ్జెట్‌లో రూ. 225 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ట్రాఫిక్‌ పోలీసులకు బేసిక్‌ వేతనానికి 30 శాతం అదనపు భత్యం కల్పించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. సిఐడి, ఇంటెలిజెన్సు శాఖల్లో పనిచేసే వారికి బేసిక్‌పై 25 శాతం అదనపు భత్యాన్ని ఇచ్చినం. హోంగార్డుల జీతం ఇదివరకు రూ. 9000 ఉండేది, దానిని ఇప్పుడు రూ. 12,000 పెంచినం అని రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటల తెలిపారు.

సిటీ పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌ నిర్మాణానికి బంజారాహిల్స్‌లో 7 ఎకరాల స్థలాన్ని కేటాయించినం. ఇక్కడ పోలీస్‌ ట్విన్‌ టవర్స్‌ నిర్మిస్తాం. అత్యాధునిక కమాండ్‌, కంట్రోల్‌ సెంటర్‌ నిర్మిస్తున్నాం. ఈ బడ్జెట్‌లో దీని కోసం రూ. 140 కోట్లు, పోలీసు సిబ్బంది క్వార్టర్ల నిర్మాణానికి, రూ. 70 కోట్లు ప్రతిపాదిస్తున్నాం.

ఆకస్మిక సంఘటనలు జరిగినప్పుడు తక్షణమే చర్యలు తీసుకునేందుకు జిల్లా పోలీసు సూపరింటెండెంటు, నగర పోలీసు కమిషనరుల ఒక్కొక్కరి వద్ద రూ. 1 కోటి ఉంచాలని ప్రతిపాదిస్తున్నాం. దీనికి తోడు రూ. 10 కోట్లు పోలీసు డైరెక్టరు జనరల్‌ ఆధీనంలో ఉంటుంది. ఈ బడ్జెట్‌లో ఆకస్మిక పరిస్థితుల నిర్వహణ కోసం రూ. 20 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. అగ్నిమాపక వాహనాలు మూడింటిని సమూరుస్తున్నం. అగ్నిమాపక శాఖకు రూ . 223 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఇందు లో 63 ఫైర్ల స్టేషన్ల ఏర్పాటుకు రూ. 64 కోట్లు ప్రతిపాదించాం.

నగరంలో కొత్త రిజర్వాయర్లు 
మిషన్‌ భగీరథ కోసం వేసే పైపులైన్ల ద్వారానే అన్ని నగరాలు, పట్టణాలకు మంచి నీరు ఇవ్వాలని నిర్ణయించాం. ఔటర్‌ రింగు రోడ్డు లోపల ఉన్న 190 గ్రామాలకు కూడా మెట్రో వాటర్‌ వర్క్స్‌ ఆధ్వర్యంలోనే మంచినీటి సరఫరా చేయాలని ప్రభ్వుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌ నగరానికి మంచినీరు సరఫరా చేయడం కోసం ప్రత్యేకంగా డ్రింకింగ్‌ వాటర్‌ రిజర్వాయర్‌ కట్టాలని నిర్ణయించాం. హైదరాబాదులో త్వరలోనే మెట్రో రైలు పరుగు తీస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మెట్రో రైలు సౌకర్యం రావడం వల్ల కొంతమేర ట్రాఫిక్‌ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. మెట్రో వార్షిక చెల్లింపుల కోసం రూ. 200 కోట్లు, హైదరాబాద్‌ మహానగర మంచినీటి సరఫరా బోర్డుకు రూ. 1,000 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి సహాయంగా 650 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. ఈ బడ్జెట్‌లో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ మరియు పట్టణ అభివృద్ధి శాఖకు రూ. 4,815 కోట్లు ప్రతిపాదిస్తున్నామని మంత్రి చెప్పారు..

పారిశ్రామికాభివృద్ధి: 
కొత్త పారిశ్రామిక విధానం అమలులోకి వచ్చినప్పటి నుండి 1609 యూనిట్లకు అనుమతులు ఇచ్చాం. ఈ పరిశ్రమల ద్వారా రూ. 33,101 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే కాక 1,20,169 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. హైదరాబాద్‌ నగరంలో ఫార్మాసిటీ, వరంగల్‌లో టెక్స్‌టైల్‌ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. మెదక్‌లో నిమ్జ్‌ (నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మ్యానిఫాక్చరింగ్‌ జోన్‌) ప్రారంభిస్తున్నాం. పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ రంగానికి రూ.967 కోట్లు ప్రతిపాదిస్తున్నాం.

ఐటి, కమ్యూనికేషన్‌ 
హైదరాబాద్‌లో టి-హబ్‌ను నవంబర్‌లో ప్రారంభించినాము. ఇది వినూత్నం, విశిష్టం. టెక్నాలజీకి సంబంధించిన స్టార్టప్‌లను టి-హబ్‌ ప్రోత్సహిస్తుంది. ఐటి శాఖకు ఈ బడ్జెట్‌లో రూ. 254 కోట్లను ప్రతిపాదిస్తున్నాము. ఐటీకి చిరునామా తెలంగాణ.

సమాచార సాంకేతిక విజ్ఞానానికి దేశంలో ప్రముఖంగా వినిపించేది తెలంగాణ రాష్ట్రం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్‌ నగరం. తెలంగాణలో నమోదైన ఐటీ యూనిట్లు 1300. రాష్ట్రంలో 2014-15లో జరిగిన ఐటీ ఎగుమతులు, ఐటీ సేవల విలువ రూ. 68,258 కోట్లు అని మంత్రి తెలిపారు.

మైక్రోసాఫ్ట్˜ గూగుల్‌, ఐబీఎం, ఒరాకిల్ లాంటి అనకే బహుళ జాతీయ సంస్థలు తెలంగాణలో తమ కార్యాలయాల్ని నడుపుతున్నాయి. దేశీయ ఐటి దిగ్గజాలు అనదగిన ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, టెక్ మహేంద్ర వంటి ఎన్నో కంపెనీలు తెలంగాణలో ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో ప్రముఖ ఐటి దిగ్గజం గూగుల్‌ సంస్థ రూ. 1000 కోట్ల పెటుబ్ట డతి తమ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నది.

గూగుల్‌ సంస్థ అమెరికా బయట, అదీ హైదరాబాద్‌లో ఇంత పెద్ద ఎత్తున తమ కార్యకలాపాలను విస్తరించడం విశేషం. అమేజాన్‌ సంస్థ తమ క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించనున్నది.

టి-హబ్‌ను 2015 నవంబర్‌లో ప్రారంభించాం. ఇది వినూత్న విశిష్ట పబ్లిక్ ప్రైవేట్‌ భాగస్వామ్యంతో నడిచే సంస్థ. దేశంలో ప్రతిష్టాత్మకమైన మూడు సంస్థల సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సాకారం చేసింది. ఐటీ రంగంలో ప్రశంసాత్మకంగా చెప్పదగిన మరో ముందడుగు డిజిటల్‌ తెలంగాణ కార్యక్రమం. పల్లెపల్లెలో ప్రతి పౌరుడికి డిజిటల్‌ సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో 2015 జూలై 1న ప్రారంభించాం. సామాన్యులను కూడా డిజిటల్‌ అక్షరాస్యులుగా తీర్చిదిద్దటం ఈ కార్యక్రమం విశిష్టత. ఐటీ శాఖకు 2016-17 బడ్జెట్‌లో రూ. 254 కోట్లను ప్రతిపాదిస్తున్నామని మంత్రి తెలిపారు.

సంస్కృతి, పర్యాటక రంగం, క్రీడలు 
చారిత్రక ప్రదేశాలను, ఆలయాలను పునరుద్ధరించేందుకు తగినన్ని నిధులు కామన్‌ గుడ్‌ ఫండ్‌లో లేనందున ఈ బడ్జెట్‌లో వన్‌టైమ్ గ్రాంట్‌గా రూ. 50 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పాటుపడుతున్న, టోర్నమెంట్లు నిర్వ హిస్తున్న క్రీడాసంఘాలను గుర్తించేందుకు పారదర్శకంగా ఉండేవిధంగా మార్గదర్శకాలు రూపొందించినాము. యువజన వ్యవహారాలు, పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ . 232 కోట్లు ప్రతిపాదిస్తున్నాం.

ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌.డి.ఎఫ్‌) 
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని శాఖల్లో ఆకస్మికంగా వచ్చే అవసరాలు, వాటికి అయ్యే వ్యయాలను మనం ముందుగానే ఊహించలేం. అనుకోని అవసరాలు వచ్చినప్పుడు తక్షణమే పరిస్థితిని అర్థం చేసుకొని చక్కదిద్దడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం సమయం కూడా పడుతుంది. అందుకే ఈ ప్రత్యేక అభివృద్ధి నిధి. నిధిని ఏ పద్దుకు కేటాయించక, వేలం అనుకోని అవసరాలు వచ్చినప్పుడు మాత్రమే వినియోగిస్తాము. ఈ బడ్జెట్‌లో ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ. 4,675 కోట్లు ప్రతిపాదిస్తున్నామని మంత్రి ఆర్ధిక మంత్రి ఈటల తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు.

Other Updates