telangana-bavanమన రాష్ట్రంనుండి రాజస్థాన్‌ రాష్ట్రంలోని అజ్మీర్‌దర్గా దర్శనార్థం వెళ్ళే భక్తుల సౌకర్యార్థం ‘రుబాత్‌’కోసం స్థలం ఇవ్వడానికి రాజస్థాన్‌ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. అజ్మీర్‌ పట్టణంలోవున్న సుప్రసిద్ధ దర్గా హజ్రత్‌ ఖాజా మొయినుద్దీన్‌ చిస్తీ గరీబ్‌నవాజ్‌ రహ్మతుల్లాలైను దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డందుకు తనవంతు మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత దర్గా సమీపంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గెస్ట్‌హౌజ్‌ (రుబాత్‌) నిర్మాణానికి కావలసిన స్థలం విషయంలో దర్గాముతవల్లీ, అక్కడి ప్రముఖులతో చర్చించారు.

ఆ మరుసటి రోజు రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరరాజేను క్యాంపు కార్యాలయంలో కలిశారు. అజ్మీర్‌లో 5 కోట్ల రూపాయలతో నిర్మించతలపెట్టిన ‘రుబాత్‌’ కోసం ఒకటి లేదా రెండు ఎకరాల స్థలం కేటాయించాలని కోరుతూ మన ముఖ్యమంత్రి కెసీఆర్‌ వ్రాసిన లేఖను వసుంధరరాజేకు అందజేశారు.ఈ విషయంపై స్పందించిన వసుంధర రాజే త్వరలోనే స్థలాన్ని పరిశీలించి, అనువైన స్థలాన్ని కేటాయిస్తామని భరోసా ఇచ్చినట్లు డిప్యూటీ సిఎం మహమూద్‌ అలీ తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ నగర చారిత్రక నమూనా చార్మినార్‌ను రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరరాజెకు తమ కుటుంబ సమేతంగా కలిసి ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ అందజేశారు .

Other Updates