ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అజ్మీర్ దర్గాకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాదర్ పంపించారు. ఏప్రిల్ 13వ తేదీన తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వైపున ఈ చాదర్‌ను అందచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే చాదర్ పంపిస్తానని హజ్రత్ ఖాజా యా గరీబ్ నవాజ్‌కు మొక్కుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగి, టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మొక్కు తీర్చుకున్నారు. దర్గాకు చాదర్ సమర్పించే కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూశాఖా మంత్రి మహమూద్ అలీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హోం
»