అనాథ-పిల్లలకు--ఇక-అన్నీ-ప్రభుత్వమే-!అనాథ బాలబాలికకు ఇకపై ప్రభుత్వమే తల్లిదండ్రులుగా , అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్‌ 10న సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలోపు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు స్వయంగా మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. వర్గాలకు సంక్షేమ కార్యక్రమాల అములుపై ఈ సమావేశంలో చర్చించి, నిర్ణయాలు తీసుకున్నారు.

అనాథ విద్యార్థులకు చదువుకయ్యే పూర్తి వ్యయాన్ని ప్రభుత్వమే భరించనుందని, ఇకపై తెలంగాణలో ఎవరూ అనాథులుగా వుండబోరని ముఖ్యమంత్రి చెప్పారు.

‘‘పదోతరగతి వరకూ అనాథ పిల్లలను చదివించేందుకు కస్తూర్బా పాఠశాలలు వున్నాయి. ఆ తర్వాత ఎం చేయాలో, ఎక్కడికి పోవాలో తెలియని , దిక్కుతోచని దయనీయ స్థితిలో ఉన్నవారిని ఆదుకోవడం సామాజిక బాధ్యతగా ప్రభుత్వం తీసుకుంటుంది. దేశం మొత్తం అనుసరించే గొప్ప కార్యక్రమంగా ఇది వుండాలని భావిస్తున్నాం. అనాథ పిల్లలను ఎక్కడ చేర్పించాలి, ఎక్కడ చదివించాలి, ఏమేమి ఏర్పాట్లు చేయాలి అనే విషయంలో విధానాలు ఖరారు చేసేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించాం. మంత్రులు ఈటల రాజేందర్‌, జోగు రామన్న, చందూలాల్‌, లక్ష్మారెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా వుంటారు.’’ అని ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. తెలిపారు.

నీటి ప్రాజెక్టుకు సంబంధించి ఈ సమావేశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 43,440 కోట్ల రూపాయల వ్యయంతో పాలమూరు ఎత్తిపోత, డిరడి ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాలకు అనుగుణంగా కొద్దిరోజుకే ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ ఈ రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేశారు. అలాగే అసంపూర్తిగా వున్న ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన చర్యకోసం ఒక కమిటీని నియమించారు. ఇందులో అనుభవంగ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా వుంటారని ముఖ్యమంత్రి తెలిపారు.

నిరుద్యోగ యువతీ, యువకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉద్యోగ నియామకాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. ఒక శుభవార్తను వెల్లడించారు. 25,000 ఉద్యోగాలకు జులై నెలలో ప్రకటన మెలువరించాని మంత్రివర్గం నిర్ణయించింది. వయోపరిమితి సడలించే విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటుచేసినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఒప్పంద ఉద్యోగులలో స్థానికులను గుర్తించి వారిని క్రమబద్ధీకరిస్తామన్నారు.

రైతులకు అండగా నిలవండి.. సి.ఎం ఆదేశం

రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి వర్షాలు కురవడంతో తెలంగాణ లోని పది జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఖరీఫ్‌ సీజను ప్రారంభమైన నేపథ్యంలో రైతుకు అన్నివిధాలా అండగా వుండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు. జూన్‌ 17న ముఖ్యమంత్రి కరీంనగర్‌ వెళ్తూ మార్గమధ్యంలో మెదక్‌ జిల్లా ఎర్రవల్లి, నర్సన్నపేట, తదితర గ్రామాలో ఆగి అక్కడి రైతుతో మాట్లాడారు. వర్షాల పరిస్థితి తెలుసుకున్నారు.ఏ పంట వేస్తున్నారని ఆరా తీశారు. విత్తనాలు, ఎరువులు, పురుగులు మందుల అభ్యతను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జాతో మాట్లాడుతూ, ఖరీఫ్‌ సీజన్‌కు వర్షాలు మంచి ఆరంభం ఇచ్చాయని, చాలాచోట్ల రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారని ముఖ్యమంత్రి తెలిపారు. రైతులకు కావల్సిన విత్తనాలు అందేవిధంగా, ఎరువులు, పురుగు మందులు కొరత రాకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతుల అవసరాలు ఏమిటో తెలుసుకొని, అందుకు అనుగుణంగా కావాల్సినవి సమకూర్చాలని, జిల్లా స్థాయిలో సాధ్యం కాకుంటే ప్రభుత్వపరంగా సాయం అందిస్తామని సి.ఎం చెప్పారు.

తమ గ్రామానికి పంచాయతీ భవనం కావాలని, బస్సు సౌకర్యం కల్పించాలని, సి.సి. రోడ్లు మంజూరుచేయాలని ఈ సందర్భంగా నర్సన్నపేట ప్రజలు ముఖ్యమంత్రికి విన్నవించు కున్నారు. ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించడంతో తెల్లవారి నుంచే ఆ గ్రామానికి బస్సు ప్రారంభమయ్యింది. బస్సు ష్టెర్‌కు అధికారులు భూమిపూజ చేసి పని ప్రారంభించారు. సిఎం హామీ వెంటనే అమలు జరగడంపై నర్సన్నపేట గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Other Updates