brainశ్రీ డాక్టర్‌ సి.వీరేందర్‌

“ People rise in the life because of the decision but not because of their Condition & Situation”

తన కుడి చేయి బాంబు దాడిలో ముక్కలైంది అయినా సరే, నేను ఎలాగైన World best pistol Shooter కావాలి అని సంకల్పించుకొని ఎడమ చేతితో సాధన చేసి, రెండుసార్లు ఒలింపిక్స్‌ వాయిదా పడినా, మొక్కవోని సహనంతో 10 సం||రాలు సాధన చేసి రెండు ఒలింపిక్‌ బంగారు పతకాలు సాధించిన హంగేరి దేశ వీరుడు ‘కరోల్‌ టక్ట్‌’. మనిషి తలచుకుంటే అసాధ్యమనేది ఏదీ లేదు అని నిరూపించిన ఘనుడు. మానవాళికి స్ఫూర్తి ప్రదాత కూడా.

ఒక అమ్మాయికి 9 ఏళ్ళ వయసులో పోలియో సోకి రెండు కాళ్ళు చచ్చుబడి పోయాయి. 6 సార్లు డాక్టర్లు ఆపరేషన్‌ చేసి, కష్టంగా కొద్దిగా నడవగలవు, అంత కంటే ఎక్కువగా పరిగెత్తడంచేస్తే మళ్ళీ బెడ్‌ మీదకు రావాల్సిందే కాబట్టి నువ్వు ఎక్కువగా శ్రమించకు అని సలహా ఇచ్చారు. దాంతో పరిగెత్తాలనే కోరికతో ఆ అమ్మాయి పూర్తిగా దిగాలు పడిపోయింది. ఎలాగైనా సరే! తను పరుగులరాణి అనిపించుకోవాలనే కోరికతో నడవడం సాధన చేసింది. తర్వాత పరిగెత్తింది. మొదట ఏడ్చింది. అలా పరుగెత్తి, పరుగెత్తి 1964 ఒలింపిక్స్‌లో 3 గోల్డ్‌మెడళ్ళు గెలిచింది. ఆమె ఇటలీ దేశస్థురాలు, పేరు ”విల్మరుడాల్ఫ్‌” అనుకుంటే ఏదైనా, ఎవరైనా సాధించగలరనే నమ్మకాన్ని రెట్టింపు చేసిన యోధురాలు, పరుగుల శిఖామణి

పుట్టుకతోనే వెన్నెముకలో సమస్య, డాక్టర్లు బతకడం కష్టమన్నారు కాని బతికింది. వెన్నెముక నిలువుగా కాకుండ మధ్యలో ఒక పక్కకు వంగిపోయింది. చిన్నచిన్న బరువులెత్తడం కూడా కష్టం అయ్యింది. చదువు కూడా చదవలేక పోతుందేమో అనుకున్నారు, కాని చదువులన్నీ బాగా చదివింది. అంగ వైకల్యమన్నది శరీరానికి తప్ప తెలివి తేటలకు కాదని నిరూపించింది. ఆఫీసుల్లో ఫైళ్ళు మోయ లేవు కాని ఐఏఎస్‌ అవుతావా! అని గేలి చేశారు. తను మాత్రం తప్పకుండా ఐఏఎస్‌ కావాలి, నేను చదవగలను అవును చదువతాను ఐఏఎస్‌ చేస్తాను అనుకొని 2015లో దేశంలోనే ఐఏఎస్‌ టాపర్‌గా నిలిచింది.కుమారి ”ఇరా సింఘాల్‌’…

ప్రొ || హవర్డు గార్డనర్‌ సిద్ధాంతం ప్రకారం ప్రతి వ్వక్తి పుట్టుకతోనే అత్యంత తెలివితేటలు గలవారుగా ఉంటారు. మనిషి మెదడు అనంతమైన మెమరీని కలిగి వుంటుంది. అయితే అది మన ఉపయోగంతో మాత్రమే అందుబాటులోకి వస్తుంది. చదువులో నైనా, పోటీ పరీక్షల్లోనైనా సరే! మనకున్న తెలివితేటలు అందుబాటులోకి తెచ్చుకోవాలంటే,ముందుగా మనతో మనం స్నేహం చేయాలి, లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత దిశా నిర్దేశం చేసుకోవాలి. నేను ఈ లక్ష్యాన్ని ఎంత కష్టమైనా సరే సాధిస్తాను, సాధించడానికి కావాల్సిన శక్తులు నా దగ్గర వున్నాయి. నైపుణ్యాలున్నాయి సరిపోకపోతే అవసరమైన నైపుణ్యాలు నేర్చుకొని లక్ష్యాన్ని సాధిస్తాను అని నిర్ణయించుకోవాలి.

నిర్ణయం తీసుకోవడం, దిశానిర్దేశం చేసుకోవడం అంటే నిన్ను నువ్యు నమ్ముకోవడం కంటే పెద్డ భావన. నువ్వు ఏం చెయ్యగలవో స్పష్టంగా నీ గురించి నువ్వు తెలుసుకొని వుండటం అవసరం. శాస్త్రీయంగా లక్ష్యాలను నిర్ణయించుకోవడం మీకున్న సామర్థ్యాన్ని అర్థంచేసుకోవడం.

మీ మెదడులో ఏ సందేహం లేకుండా ఒక కొత్త లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. ఎలాగైనా దీనిని నేను సాధించగలననే విశ్వాసాన్ని కలిగి వుండాలి. ఎందుకంటే గతంలో ఇలాంటి లక్ష్యాన్ని సాధించారు. ఇప్పుడు కొత్తగా నిర్ణయించుకున్న లక్ష్యం కొంత కష్టంగా వుండొచ్చు. కాని గతంలో సాధించిన అనుభవం, సామర్థ్యం అన్నీ కలిసి ఈ లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తానన్న నమ్మకం కలుగుతుంది.

చిన్న చిన్న లక్ష్యాలు సాధించిన అనుభవం, పెద్దపెద్ద లక్ష్యా లను ఛేదించడానికి కావలసిన సామర్థ్యం, చిన్న చిన్న లక్ష్యాల సాధనలలో కలిగిన ఆత్మ విశ్వాసం, ఒక రూపు దిద్దుకుంటుంది. ఈ కొత్తగా రూపు దిద్దుకున్న సామర్థ్యం, విశ్వాసం సునాయాసంగా పెద్ద పెద్ద లక్ష్యాలను సాధించేందుకు సహకరిస్తుంది.

ఇలా! చిన్న చిన్న లక్ష్యాల నుండి పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్ణయించుకోవడం, వాటిని సాధించే క్రమంలో కావలసిన నైపుణ్యాలను నేర్చుకోవడం వల్ల మన మీద మనకు ప్రేమ పుడుతుంది. మనం చాలా చేయగలం అనే ఆత్మవిశ్వాసం వస్తుంది. సెల్ఫ్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ అంటే తన గురించి తనకు, తన శక్తుల ఆవిష్కరణ జరుగుతుంది. తన మీద తనకు ప్రేమ ఎక్కువవుతుంది ఈ తీపి ప్రేమ మనకున్న విజ్ఞానంలోంచి, పెరుగుతున్న సామర్థ్యంలోనుంచి పుట్టి, వస్తున్న విజయాలు, ఫలితాలు దానిని బలపరుస్తాయి. ఇది ఇంకా ఎక్కువ సాధన చేసేందుకు కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొనేందుకు, అనుకున్నది సాధించేందుకు దోహదం చేస్తుంది. దీంతో అనుకున్న సామర్థ్యంలో నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించగలమనే నమ్మకం బలపడుతుంది.

నేను అనుకొంటే తప్పకుండా చేయగలననే భావన వల్ల అంతరంగం చాలా ప్రశాంతంగా, సంతోషంగా వుండడమే కాకుండా, స్వీయ ప్రేమ వుండడం ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కో గలను, ఇబ్బందులూ అధిగమించగలననే నమ్మకం బలపడుతుంది. వాటిని ఎదుర్కోగల మానసిక శక్తి, నైపుణ్యం మనలో ఉన్నదన్న సత్యం.. బాహ్యంగా వచ్చేవాటిని ఎదుర్కోగలిగి విజయాన్ని సాధించ వచ్చుననే భావం బలాన్నిస్తుంది.

మనం అనుకున్న విధంగా జీవితాన్ని నిర్మించే ”చీఫ్‌ ఆర్కిటెక్ట్‌” మన మెదడు, మనం నిర్ణయించుకున్న లక్ష్యాలను, దానికి అనుగుణంగా జీవితాన్ని నడిపించే విధానాన్ని మెదడుకు పదేపదే గుర్తుకు తెప్పించాలి. ఇలా గుర్తుకు తెప్పించే పనే ” నిర్ణయం తీసుకోవడం” ”నేను సాధించాలి అని అనుకుంటున్నాను” ”సంకల్పించు కున్నాను.” అంటారు. ”నేను సాధించాలి అని నిర్ణయించుకున్నాను అనగానే మన మెదడులో ఉన్న ” అన్ని రూల్స్‌ కంటే, నిర్ణయం తీసుకున్న రూల్‌ ముఖ్యమైనది. కాబట్టి వాటన్నింటిని అధిగమించి నిర్ణయంచుకున్న రూల్‌ను పాటించాలి అనే ఒక బలమైన సందేశం అంతర్గతంగా పని చేసి మెదడు ఈ నిర్ణయాన్ని పాటించి మన శరీరాన్ని ప్రభావితం చేసి కార్యోన్ముఖులను చేస్తుంది.

”ఈ నిర్ణయం జీవితంలోని విలువలు, జీవించే విధానాన్ని, సమన్వయ పరుస్తూ, మనం చేయాల్సిన పనులను నిర్ణయానికి అనుగుణంగా పని చేయిస్తూ, దానికి అనుగుణంగానే చేసేటట్టు చేసి నిర్ణయాన్ని బలోపేతం చేస్తుంది.

”తీసుకున్న నిర్ణయం” జీవితంలో పాటించే నియమాలు, మనం నమ్మే సిద్ధాంతాలకు లోబడే మన శక్తియుక్తులు నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడానికి మన ‘న్యూరాన్‌’ వ్యవస్థ పనిచేస్తుంది.

ఈ పని చెయ్యాల్సిందే అనే నిర్ణయం రాబోయే కాలంలో చెయ్యాల్సిన పనుల గురించి మనకు అవగాహనను కలగజేస్తుంది.

నిర్ణయం అంటే ఒక ప్రార్థన కాదు, అడుక్కోవడం అంతకన్నా కాదు. అది మన అంతరాళంలో దాగి వుండి కార్యాచరణకు నోచుకోవడానికి తహ తహలాడుతున్న జీవితానికి సంబంధించిన సత్యం. నిర్ణయం తీసుకోవడం వల్ల మెదడులో వున్న శక్తి రిజర్వుడ్‌్‌ బ్యాంక్‌ నుంచి మనకు అందుబాటులోకి వస్తుంది. మెదడులో ఈ శక్తి అందరికీ వుంటుంది. ఎవరైనా ఫలానా పని చెయ్యాలి అని నిర్ణయం తీసుకోగానే శక్తి అందుబాటులోకి వస్తుంది. అయితే కొంత మందికి మాత్రమే ఈ రహస్యం తెలిసి దానిని నమ్మి నిర్ణయం తీసుకుంటారు.

కాబట్టి విద్యార్థులు నిర్ణయం చేసుకొండి మీలోనే రహస్యంగా దాగివున్న శక్తిని ఉపయోగించుకొండి, విజయాలు సాధించండి.

Other Updates