sampadakeeyam2018 జనవరి 1 . క్యాలెండర్‌ లో మరో అధ్యాయం ఆరంభమైంది. ఈ కొత్త సంవత్సరం వస్తూనే తెలంగాణ ప్రజానీకానికి ఎన్నో సరికొత్త వెలుగులు వెంటపెట్టుకొని వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్‌ వైర్లపై బట్టలు ఆరవేసుకోవాల్సి వస్తుందని విమర్శించిన వారికి దీటైన సమాధానంగా, అధికారంలోకి వచ్చిన ఆరు మాసాలలోనే కోతలులేని విద్యుత్‌ ను అందించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర విద్యుత్‌ రంగంలోనే నూతన శకాన్ని ఆవిష్కరించింది. ఇప్పటికే అన్నివర్గాలవారికీ 24 గంటల నిరంతర విద్యుత్‌ ను అందిస్తున్న ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని రైతాంగానికి 24 గంటల విద్యుత్‌ సరఫరాను ప్రారంభించింది..

రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ పంపుసెట్లకు ప్రయోగాత్మకంగా అందించిన 24 గంటల విద్యుత్‌ సరఫరా ప్రక్రియ విజయవంతం కావడంతో జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో 24 గంటల విద్యుత్‌ సరఫరాకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ విద్యుత్‌ సరఫరాను సద్వినియోగం చేసుకొనే విధంగా, గతంలో విద్యుత్‌ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని అగమ్యగోచర పరిస్థితుల్లో రైతులు అమర్చిన ఆటో సా’ర్టర్లను తొలగించాలని రైతాంగానికి ప్రభుత్వం పిలుపునిచ్చింది.

ఏ కార్యక్రమమైనా, చేపట్టిన పనిని నూటికి నూరు శాతం విజయవంతం చేయడం, అందుకోసం తుదికంటా శ్రమించడం ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ కు వెన్నతో పెట్టిన విద్య. అది తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి ప్రపంచదేశాలలో హైదరాబాద్‌ కు ఖ్యాతి తెచ్చిపెట్టిన మొన్నటి ప్రపంచ వాణిజ్య వేత్తల సదస్సు నిర్వహణ కావచ్చు, నిన్నటి ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ కావచ్చు, నేడు విద్యుత్‌, సాగునీరు , తదితర రంగాలలో సాధిస్తున్న విజయాలే ఇందుకు నిదర్శనం.

ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సును రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించి ప్రపంచానికి తమ సత్తా చాటింది. అంతర్జాతీయ స్థాయి ఏర్పాట్లతో విజయవంతంగా నిర్వహించిన ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రశంసలు లభించాయి. ఈ సదస్సు నిర్వహణతో హైదరాబాద్‌ నగరం ప్రపంచ ఖ్యాతిని ఆర్జించింది. హైదరాబాద్‌ ప్రతిష్ట మరింత ఇనుమడించింది.

ఇటీవల ఐదు రోజులపాటు ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా, వైభవోపేతంగా నిర్వహించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కింది. 42 దేశాలు, 17 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి వేలాదిగా ప్రతినిధులు తరలివచ్చారు. స్వయంగా తెలుగు భాషాభిమాని అయిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మార్గనిర్దేశంలో న భూతో న భవిష్యతి అన్న రీతిగా మహాసభలు అత్యంత వైభవంగా జరుపుకో గలిగాం. సాహిత్య ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. కవులు, కళాకారులు, సాహితీవేత్తలతో భాగ్యనగరం మురిసి పోయింది. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన తెలంగాణ బిడ్డలను స్మరించుకోవడంతోపాటు, తెలంగాణ సంస్క తి, సాంప్రదాయాలకు ఈ మహాసభలు నిలువెత్తు అద్దంగా నిలిచాయి. ఆతిథ్యం పై సర్వత్రా హర్షం వ్యక్తమయింది. తెలంగాణలో జరిగిన సాహితీ సజనను, ఇక్కడి సాహితీ మూర్తుల ప్రతిభా పాటవాలను ప్రపంచానికి చాటింది.

తెలంగాణాను సస్యశ్యామలం చేసేందుకు, తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా, రాష్ట్రంలో ప్రతి ఎకరా సాగుభూమికి సాగునీరు, అన్ని గ్రామాలకు తాగునీరు అందించాలన్న ప్రభుత్వం స్వప్నం, ప్రజల ఆశలు వేగవంతంగా నెరవేరుతున్నాయి. మరో వంక ఇంటింటికీ తాగునీటిని సమకూర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పనులు కూడా పూర్తిచేసుకొని ఈ ఏడాదిలోనే వేలాది గ్రామాల దాహార్తిని తీర్చేందుకు సిద్ధమవుతోంది.

Other Updates