బంగారు తెలంగాణ నిర్మాణాన్ని సాకారం చేసుకొనే దిశగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఫిబ్రవరి 22న శాసన సభలో సమర్పించారు. ఆర్థిక శాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి మొత్తం 1,82,017 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రెవిన్యూ వ్యయం రూ. 1,31,629 కోట్లు, మూలధన వ్యయం రూ. 32,815 కోట్లుగా పేర్కొన్నారు. రెవిన్యూ మిగులు రూ. 6,564 కోట్లు, ఆర్థిక లోటు రూ.27,749 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. రాష్ట్ర ప్రగతికి ప్రతిరూపంగా, ఎన్నికల హామీలకు కార్యరూపమిస్తూ భారీగా నిధులను కేటాయిస్తూ, అన్నివర్గాల ప్రజలపై ముఖ్యమంత్రి వరాలజల్లు కురిపించారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి సగర్వంగా ప్రకటించారు.

ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ…

దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ఒక సఫల రాష్ట్రంగా, పురోగామి రాష్ట్రంగా నేడు ముందడుగు వేస్తున్నది. స్వల్ప కాలంలోనే అనేక ప్రతికూలతలను అధిగమించి, సామాజిక, ఆర్థిక పునాదిని పటిష్ట పరుచుకుంటూ, దేశానికి ఆదర్శంగా నిలవడం ఒక అద్భుతం. ఈ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించే క్రమంలో నేడు 2019-20 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రం యొక్క ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నాను. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఆరవ బడ్జెట్‌.

2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు అన్ని రంగాల్లో వెనుకబాటుతనం ఆవహించి ఉంది. ఎటువైపు చూసినా సవాళ్ళే స్వాగతం పలికాయి. సమైక్య పాలన తెచ్చిన దుష్పరిణామాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మనల్ని వేధించాయి. తీవ్రమైన కరెంటు కొరతతో, పారిశ్రామిక ప్రగతిలో ప్రతికూల పరిస్థితి నెలకొన్నది. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. రైతుల ఆత్మహత్యలు, చిన్నాభిన్నమైన గ్రామీణార్థిక వ్యవస్థ, ముందుకు సాగని నీటి పారుదల ప్రాజెక్టులు, చెదిరిపోయిన చెరువులు, వరుస కరువులు, వలస పోయే ప్రజలు, గుక్కెడు నీళ్ల కోసం కూడా అలమటించే దౌర్భాగ్యం …. ఇదీ రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ సామాజిక ముఖచిత్రం. ఈ పరిస్థితిని మార్చేందుకు పట్టుదలతో ప్రయత్నాలు ప్రారంభించాం.

తెలంగాణ పునర్నిర్మాణం కోసం సాగిన ప్రయాణంలో భగవంతుడి నుంచి దీవెనలు, ప్రకృతి నుంచి అనుకూలతలు, ప్రజల నుంచి సంపూర్ణ సహకారం లభించాయి. మొదటి నాలుగున్నరేళ్లలో తలపెట్టిన కార్యక్రమాలు అనుకున్న పంథాలో సాగి, అద్భుతమైన విజయాలు సాధించాయి. అతి తక్కువ సమయంలోనే అతి ఎక్కువ అభివద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సష్టించింది. విద్యుత్‌ సంక్షోభాన్ని విజయవంతంగా పరిష్కరించి, చీకట్ల నుంచి వెలుగుల వైపు ప్రస్థానం సాగింది. అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసుకోగలుగుతున్నాం. వ్యవసాయరంగ సమస్యలను ఒకటొకటిగా పరిష్కరిస్తూ, రైతాంగంలో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించుకోగలిగాం. బలహీన వర్గాల ప్రజలకు ప్రత్యేక ఆర్థిక ప్రేరణ ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రజల జీవితాల్లో వెలుగు నింపడంద్వారా వచ్చే ఆనందం ప్రభుత్వ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తుందని, శక్తి సామర్ధ్యాలను ఇనుమడింప చేస్తుందని తెలియ చేస్తున్నాను.

చిన్నాభిన్నమైన గ్రామీణార్థిక వ్యవస్థ, ముందుకు సాగని నీటి పారుదల ప్రాజెక్టులు, చెదిరిపోయిన చెరువులు, వరుస కరువులు, వలస పోయే ప్రజలు, గుక్కెడు నీళ్ల కోసం కూడా అలమటించే దౌర్భాగ్యం… ఇదీ రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ సామాజిక ముఖచిత్రం. ఈ పరిస్థితిని మార్చేందుకు పట్టుదలతో ప్రయత్నాలు ప్రారంభించాం. అనతి కాలంలో, ఈ చెప్పుకోదగ్గ అభివద్ధి, మా ప్రభుత్వ విధానాలకు, పనితీరుకు నిదర్శనం.

ప్రస్తుత ధరలలో, రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జిఎస్డీపీ) వద్ధి 2016-17లో 14.2 శాతం ఉంటే, 2017-18లో 14.3 శాతానికి పెరిగింది. ఇదే ధోరణి కొనసాగిస్తూ, 2018-19లో తెలంగాణ 15 శాతం వృద్ధి సాధించను న్నది. ఇది దేశ అభివృద్ధి రేటు 12.3 శాతం కన్నా ఎక్కువ. 2018-19 కాలంలో రాష్ట్ర జీఎస్డిపి 8,66,875 కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నాం.

2018-19లో ప్రస్తుత ధరలలో జిఎస్డీపీి ప్రాథమిక రంగం 10.9 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా విద్యుత్తు పరిస్థితిలో

మెరుగుదల, సాగునీటి సౌకర్యాల పునరుద్ధరణ, గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేవ పిల్లల సరఫరా, రైతులకు పెట్టుబడి మద్దతు కారణంగా ఈ వృద్ధి సాధ్యపడింది.

పారిశ్రామిక, ఉత్పత్తి రంగాలలో, చెప్పుకోదగ్గ మెరుగుదలను కనపరచింది. 2018-19లో, ప్రస్తుత ధరలలో 14.9 శాతంగా పెరుగుదల రేటు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈ పెరుగుదల కోతలులేని విద్యుత్‌ సరఫరా, టిఎస్‌-ఐపాస్‌, సులభతర వాణిజ్యంలో మెరుగుదల, నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత వల్ల సాధ్యం అయింది. తృతీయ రంగం అంటే సేవారంగం 15.5 శాతం చెప్పుకోదగిన పెరుగుదల నమోదు అవుతుందని ఆశిస్తున్నాం.

తలసరి ఆదాయం, 2017-18 లో రాష్ట్ర తలసరి ఆదాయం 1,81,102 రూపాయలు. 2018-19 సంవత్సరానికి 2,06,107 రూపాయలకు చేరుకోనున్నది. తద్వారా వద్ధిరేటు 13.8 శాతం పెరుగుదలను సూచిస్తున్నది. ఇది జాతీయ వృద్ధి 8.6 శాతం కంటే చాలా ఎక్కువ.

ఆసరా పెన్షన్లు:

సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం అనేక మందిని అసహాయులుగా మార్చింది. వారికి గత ప్రభుత్వాలు వృధాప్య పింఛను కింద కొన్నాళ్లు 75 రూపాయలు, మరికొన్నాళ్లు 200 రూపాయలు మాత్రమే విదిలించి, వృద్ధులనెంతో ఉద్ధరించినట్లు ప్రచారం చేసుకున్నాయి. ప్రభుత్వాలు విదిలించిన ఆ తక్కువ మొత్తం ఏ చిన్న అవసరం తీర్చుకోవడానికి కూడా సరిపోయేది కాదు. ఇది సరైన విధానం కాదని భావించి, అసహాయులందరిని ఆదుకునే విధంగా తెలంగాణ ఏర్పడిన వెంటనే వద్ధులు, వితంతువుల పించన్లను 200 రూపాయల నుంచి 1,000 రూపాయలకు పెంచాం. దివ్యాంగుల పెన్షన్‌ ను 1500 రూపాయలకు పెంచాం.

నేను నా విద్యార్థి దశలో దుబ్బాకలో చేనేత, బీడీ కార్మికుల ఇళ్లల్లో ఉండి చదువుకున్నాను. బీడీలు చుట్టే తల్లులు అనుభవించే దుర్భర వేదనను నేను దగ్గర నుంచి గమనించాను. అందుకే వారి వేదన తీర్చాలని ఎక్కడ ఎవరూ డిమాండ్‌ చేయకుండానే ప్రతీ నెల వెయ్యి రూపాయల జీవన భతిని బీడీ కార్మికులకు ప్రకటించాను.

తోడు లేని ఒంటరి స్త్రీ, సమాజంలో పడే పాట్లు చెప్పనలవి కావు. పేదరికంతో బాధపడే ఒంటరి మహిళలకు నెలకు వెయ్యి రూపాయల బృతిని ప్రకటించాం. ఈ నిర్ణయం వారికి కొండంత అండగా మారింది. బోదకాలు వ్యాధితో బాధపడే వారి పరిస్థితిని కూడ మానవీయ కోణంలో ఆలోచించి, ప్రభుత్వం వారిని ఆసరా పించన్ల పరిధిలోకి తెచ్చింది. నిస్సహాయులైన పేదలకు ఆసరా పెన్షన్లు ఎంతో ఊరటనిస్తున్నాయి. ఊపిరి నిలబెడుతున్నాయి. ఎక్కడా మధ్యదళారుల ప్రమేయం లేకుండా నేరుగా అందుతున్న ఈ పించన్లు పేదల జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్నాయి. ఆసరా పెన్షన్లు అందుకుంటున్న వారు కేసిఆర్‌ మమ్ములను కాపాడుతున్న పెద్ద కొడుకు అని, దేవుడిచ్చిన అన్న అని దీవించడం నా రాజకీయ జీవితానికి గొప్ప సార్ధకతగా భావిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ఆసరా పెన్షన్లు నా హదయానికి దగ్గరయిన కార్యక్రమం. ప్రతీ పైసా సద్వినియోగమై, పేదల ప్రయోజనాలు తీర్చడానికి ఉపయోగపడుతున్న ఆసరా పెన్షన్లు మొత్తాన్ని రెట్టింపు చేసి, పేదలకు మరింత వెసులుబాటు కల్పిస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చాము.

గత ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే నెలసరి పెన్షన్‌ మొత్తాన్ని 1000 రూపాయల నుండి 2016 రూపాయలకు పెంచుతున్నాం. దివ్యాంగుల పెన్షన్‌ 1500 రూపాయల నుండి 3016 రూపాయలకు పెంచుతున్నాం. వృద్ధాప్య పెన్షన్‌ కు కనీస అర్హత వయస్సును 65 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు తగ్గించి, పెంచిన పెన్షన్‌ను అందిస్తామని ప్రకటిస్తున్నాను. ఆసరా పెన్షన్ల కోసం ఈ బడ్జెట్లో 12,067 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.

ఆరు కిలోల బియ్యం:

రేషన్‌ షాపుల ద్వారా అందించే బియ్యంపై గత ప్రభుత్వాలు అమలు చేసిన కోటా పరిమితిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంత మందికి రూపాయికి కిలో చొప్పున రేషన్‌ బియ్యం సరఫరా చేస్తున్నది. విద్యార్థులందరికి హాస్టళ్ళలో, మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యంతో వండిన అన్నం పెడుతున్నది.

బియ్యం సబ్సిడీల కోసం ఈ బడ్జెట్లో 2,744 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.

కళ్యాణ లక్ష్మి:

పేద ఆడపిల్ల పెళ్ళి తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. లక్ష 116 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఇప్పటి వరకు కళ్యాణలక్ష్మి ద్వారా 3,28,923 మంది, షాదీ ముబారక్‌ ద్వారా 1,08,702 మంది సహాయం పొందారు.


కళ్యాణ లక్ష్మి పథకం పేదలకు ఆర్థికంగా అండనివ్వడంతో పాటు సామాజిక సంస్కరణకూ దోహదపడింది. 18 సంవత్సరాలు నిండిన వారే ఈ పథకానికి అర్హులు అనే నిబంధన పెట్టడం ద్వారా బాల్య వివాహాలు గణనీయంగా తగ్గాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకానికి ఈ బడ్జెట్లో 1,450 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.

 

 

నిరుద్యోగ భృతి :
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు ప్రతి నెల 3,016 రూపాయల నిరుద్యోగ భృతి అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలు కోసం విధి విధానాల రూపకల్పన చేయాల్సిందిగా అధికారులను ఆదేశించాం. నిరుద్యోగ భతి అందివ్వడం కోసం ఈ బడ్జెట్లో 1,810 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.

ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి చట్టం:

ఎస్సీ, ఎస్టీ వర్గాల జనాభా నిష్పత్తికి అనుగుణంగా ప్రత్యేక ప్రగతినిధిని ఏర్పాటు చేస్తూ చేసిన చట్టాన్ని ప్రభుత్వం రెండేళ్ళుగా పకడ్బందీగా అమలు చేస్తున్నది. ఈ నిధిలో ఒక ఏడాదికి కేటాయించిన నిధులు ఖర్చు కాకుంటే, ఆ నిధులను మరుసటి ఏడాదికి బదలాయింపు జరిగేలా చట్టంలో నిబంధన చేసింది. ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఇంత ఆదర్శవంతమైన చట్టం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదు. ఈ ఏడాది కూడా ఎస్సీ, ఎస్టీల ప్రగతి కోసం ప్రత్యేక నిధిని కేటాయిస్తున్నాం. 2019-20 బడ్జెట్లో షెడ్యూల్‌ కులాల ప్రగతి నిధికి 16,581 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము. షెడ్యూల్డు తెగల ప్రగతి నిధికి 9,827 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.

మైనారిటీ సంక్షేమం:

ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివద్ధికి చేపట్టిన కార్యక్రమాలన్నీ మైనారిటీ వర్గాలకు చెందిన పేదలకు కూడా అందించాలని ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నది. మైనారిటీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం ఉపాధి అవకాశాలను మెరుగుపరిచింది. మైనారిటీల విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ప్రభుత్వం గత నాలుగేళ్లలో 206 గురుకుల విద్యా సంస్థలను ప్రారంభించింది. కార్పొరేట్‌ స్కూళ్ల స్థాయిలో, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో నిర్వహిస్తున్న ఈ గురుకులాల ద్వారా మైనారిటీలకు చెందిన భావితరాలు గొప్పగా ఎదుగుతున్నాయి. రంజాన్‌, క్రిస్ట్‌మస్‌ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. ఆరు లక్షల మందికి కొత్త దుస్తులను పంపిణీ చేస్తున్నది. ప్రార్థనా మందిరాలలో విందులు ఏర్పాటు చేస్తున్నది. మసీదుల్లో ప్రార్థన చేసే ఇమామ్‌, మౌజామ్‌లకు 5,000 రూపాయల భతిని అందిస్తున్నది. మైనారిటీల అభివద్ధి కోసం ఈ వార్షిక బడ్జెట్లో 2,004 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.

వ్యవసాయం :

వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను యావత్‌ దేశం వేనోళ్ల కొనియాడుతున్నది. రైతుబంధు, రైతుబీమా పథకాలు, భూరికార్డుల ప్రక్షాళన, రైతులను సంఘటిత పరిచేందుకు సమన్వయ సమితుల ఏర్పాటు తదితర కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నూతనోత్సాహాన్ని నెలకొల్పింది. రైతు పక్షపాత ప్రభుత్వంగా తెలంగాణ దేశంలో గొప్ప గుర్తింపుని సాధించింది. రైతులు ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పూర్తిస్థాయి నిబద్ధతతో వ్యవసాయ రంగాభివద్ధికి పాటుపడతాం. పండిన పంటకు మద్దతు ధరను సాధించేందుకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను రాష్ట్రవ్యాప్తంగా రైతుల భాగస్వామ్యంతో నెలకొల్పబోతున్నాం.


తెలంగాణ ఏర్పడగానే ప్రభుత్వం వ్యవసాయ రంగం సమస్యల పరిష్కారానికి నడుం బిగించింది. మొదట తక్షణ ఉపశమన చర్యలకు పూనుకున్నది. 2014 నాటి ఎన్నికల హామీకి కట్టుబడి 35 లక్షల 29 వేల మంది రైతులకు సంబంధించిన 16,124 కోట్ల రూపాయల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. సకాలంలో ఎరువులు, విత్తనాలను అందించింది. ఎరువుల కోసం లైన్లు కట్టి పడిగాపులు కాయాల్సిన దుస్థితిని పూర్తిగా రూపుమాపింది. నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువుల తయారీదారులపై ఉక్కు పాదం మోపింది. మార్కెటింగ్‌ శాఖను బలోపేతం చేసింది. పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం చేపట్టింది. తెలంగాణ ఏర్పడే నాటికి 4.17 లక్షల టన్నుల నిల్వ సామర్ధ్యం కలిగిన గోదాములు మాత్రమే ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 364 గోదాములు నిర్మించి, 22.50 లక్షల టన్నుల నిల్వ సామర్ధ్యం కలిగిన గోదాములను అందుబాటులోకి తెచ్చింది. రెండోవైపు శాశ్వత పరిష్కారాల దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం కోసం భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. సమైక్య పాలనలో ధ్వంసమైన చెరువులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పునర్‌ నిర్మిస్తున్నది. రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తు ఉచితంగా సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం యావత్‌ దేశంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని సగర్వంగా తెలియచేస్తున్నాను.

రుణమాఫీ:

రైతుల పరిస్థితి చక్కబడేంత వరకు అన్ని విధాల ప్రభుత్వం వారిని ఆదుకుంటుంది. అందుకనే గత ఎన్నికల్లో కూడా పంట రుణాల మాఫీని హామీ ఇచ్చాం. ఇచ్చిన మాటకు కట్టుబడి 2018 డిసెంబర్‌ 11 నాటికున్న లక్ష రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశాం. ఈ ఏడాది బడ్జెట్‌లో రైతు రుణమాఫీ కోసం 6,000 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.

రైతుబంధు:


వంటకాలంలో పెట్టుబడి కోసం రైతులు అక్కడా ఇక్కడా చేయి చాచడంతోనే రుణబాధలకు బీజం పడుతున్నది. ఆ ప్రారంభదశలోనే తగిన సహాయం లభిస్తే, వారు ఇక అప్పుల ఊబిలో చిక్కుకోకుండా కాపాడగలుగుతామని ఆలోచించి రైతుబంధు పథకాన్ని రూపుదిద్దాం. ఈ పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి కోసం ఏటా ఎకరానికి 8 వేల రూపాయలు ప్రభుత్వం ఉచితంగా అందచేస్తున్నది. రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించడం మనందరికి గర్వకారణం. రైతుబంధు పథకం దేశంలో ఇప్పుడు ఓ రోల్‌ మోడల్‌ పథకంగా మారింది. అశోక్‌ గులాటి, అరవింద్‌ సుబ్రహ్మణ్యం, రమేశ్‌ చంద్‌ లాంటి ప్రముఖ వ్యవసాయ, ఆర్థిక నిపుణులు వ్యవసాయ సంక్షోభానికి రైతుబంధు తరహా పథకమే పరిష్కారమని పేర్కొనడం తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి లభించిన గొప్ప ప్రశంస. తెలంగాణ రైతుల పెట్టుబడి సమస్యను తీర్చిన రైతుబంధు నేడు జాతీయ ఎజెండాగా మారింది. చాలా రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కిసాన్‌ సమ్మాన్‌ యోజనకు రైతుబంధు పథకమే ప్రేరణ. రైతుబంధు పథకం అమలు తర్వాత దేశ వ్యాప్తంగా చట్టసభల్లో, ప్రసార మాధ్యమాల్లో, ఇతర వేదికల్లో జరుగుతున్న చర్చల్లో తెలంగాణ మోడల్‌ అనే మాట విరివిగా వినపడుతుంటే ప్రతీ తెలంగాణ బిడ్డ హదయం పులకరిస్తున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది నుంచి రైతుబంధు పథకం కింద ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచుతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ప్రస్తుతం ఎకరానికి పంటకు 4 వేల చొప్పున రెండు పంటలకు కలిపి 8 వేల రూపాయలు ప్రభుత్వం అందిస్తున్నది. ఈ మొత్తాన్ని ఎకరానికి 5 వేల చొప్పున రెండు పంటలకు కలిపి ఏడాదికి 10 వేల రూపాయలకు ప్రభుత్వం పెంచుతున్నది. రైతుబంధు పథకం కోసం ఈ బడ్జెట్లో 12,000 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం.

రైతుబీమా:

దురదష్టవశాత్తు ఏ రైతైనా మరణిస్తే అతని కుటుంబం వీధిన పడొద్దనే మానవీయమైన ఆలోచనతో ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రైతు ఏ కారణాల వల్ల మరణించినా, ఆ రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయలను కేవలం పది రోజుల వ్యవధిలో ప్రభుత్వం అందిస్తున్నది. ఇప్పటి వరకు 5,675 మంది రైతుల కుటుంబాలకు 283 కోట్ల రూపాయలు రైతుబీమా పథకం కింద సహాయం అందించింది. ఈ బడ్జెట్లో రైతుబీమా పథకం అమలు కోసం రైతుల తరువున బీమా కిస్తీ కట్టడం కోసం రూ.650 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది.

భూరికార్డుల ప్రక్షాళన:

భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించడం కోసం, భూ రికార్డుల నిర్వహణ పారదర్శకంగా ఉండడం కోసం దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయని సాహసం తెలంగాణ ప్రభుత్వం చేసింది. భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వం చేసిన కషితో దాదాపు 95 శాతం భూముల యాజమాన్యాల హక్కుల విషయంలో స్పష్టత వచ్చింది. మిగతా భూముల విషయంలో కూడా వివాదాలు పరిష్కరించి, భూముల యాజమాన్య హక్కులకు సంబంధించి వందకు వంద శాతం స్పష్టత తేవడం కోసం ప్రభుత్వం కషి చేస్తుంది. పేద రైతులకు అండగా నిలవాలనే సంకల్పంతో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం పూనుకున్నది. సాదాబైనామాల ద్వారా జరిగిన భూముల క్రయ విక్రయాలకు చట్టబద్ధత కల్పించడం కోసం ప్రభుత్వమే

ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయించింది. భూముల రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో ఇకపై వందకు వంద శాతం పారదర్శకత సాధించేందుకు సమూల సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూ రికార్డులు పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉండడానికి వీలుగా కోర్‌ బ్యాంకింగ్‌ తరహాలో ధరణి వెబ్‌ సైట్‌ రూపొందించాం. త్వరలోనే ఈ వెబ్‌ సైట్‌ సేవలు ప్రారంభం అవుతాయి.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు:

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నెలకొని ఉన్న వ్వవసాయానుకూల వాతావరణ, పర్యావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని, ఆయా జిల్లాల్లో ఉండే నేల స్వభావాన్ని కూడా పరిగణలోకి తీసుకుని రాష్ట్రాన్ని అనేక పంటల కాలనీలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రజల అవసరాలకు అనుగుణమైన పంటలు, దేశ విదేశాల్లో డిమాండ్‌ ఉన్న పంటలను రైతులు పండించేలా చేయడమే ఈ క్రాప్‌ కాలనీల లక్ష్యం. తద్వారా ప్రస్తుతం గిట్టుబాటు ధర కోసం రైతులు పడుతున్న బాధలను అధిగమించడానికి వీలవుతుంది. ఈ పథకాన్ని అమలు చేసే క్రమంలో చిన్న, మధ్యతరహా, భారీ ఆహార శుద్ధి కేంద్రాలు (ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను) రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటి నిర్వహణలో రాష్ట్రంలో పనిచేస్తున్న ఐకేపి ఉద్యోగులను, ఆదర్శంగా పని చేస్తున్న మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తున్నది.

రైతులకు మద్దతు ధర

రాష్ట్ర ప్రజలకు కల్తీ లేని ఆహార పదార్థాలను అందించాలని బహుముఖ వ్యూహంతో ప్రభుత్వం రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసింది. ఈ సమన్వయ సమితుల వేదికలుగా రైతులందరినీ సంఘటిత పరచాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. సంఘటితమైన రైతులు తమ ప్రయోజనాలను తామే రక్షించుకోగలుగుతారని ప్రభుత్వం విశ్వసిస్తున్నది. పంటకాలనీల ఏర్పాటులోనూ, అత్యధిక దిగుబడులు సాధించడంలోనూ, పంటలకు గిట్టుబాటు ధరలు రాబట్టడంలోనూ రైతు సమన్వయ సమితులు ఉజ్వలంగా వనిచేయాలని ప్రభుత్వం ఆశిస్తున్నది.

వ్యవసాయాభివద్ధి, రైతు సంక్షేమం కోసం దేశంలో మరే రాష్ట్రం ఖర్చు చేయనంత పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని యావద్దేశం ప్రశంసిస్తున్నది. చరిత్రలోనే మొదటి సారిగా రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ శాఖకు 20,107 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నది.

నీటిపారుదల :

సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు సాగునీటి విషయంలో జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. కాగితాల మీద ప్రాజెక్టులు, కరువులతో అల్లాడే ప్రజలు అనే దుస్థితి ఆవరించింది. సమైక్య రాష్ట్రంలోనే పాలకు లు జారీ చేసిన అనేక అధికారిక

ఉత్తర్వులలోనే తెలంగాణ రాష్ట్రానికి కష్ణా, గోదావరి జలాల్లో 1350 టిఎంసిల నీటి వాటా ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఈ నీటిని వాడుకోవడానికి అనువుగా ప్రాజెక్టుల నిర్మాణం మాత్రం జరుప లేదు. నదీజలాల్లో తెలంగాణ రాష్ట్రానికున్న వాటాను సమర్ధ వంతంగా వినియోగించుకుని కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యం తో ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. గతంలో ప్రాజెక్టుల నిర్మాణానికి అనేక దశాబ్దాల కాలం పట్టేది. కానీ తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్లలోనే 90 శాతం నిర్మాణ పనులు పూర్తి చేసింది.

తలపెట్టిన అన్ని ప్రాజెక్టు లకు అటవీ, పర్యావరణ, పరిపాలనా అనుమతులను వివిధ కేంద్ర ప్రాధికారిక సంస్థల నుంచి పొందింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ అనుమతులను సాధించు కున్నాం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల పథకానికి కూడా చాలా వరకు అనుమతులు లభించాయి. మిగిలిపోయిన కొన్ని అనుమతులు సాధించడానికి కషి జరుగుతున్నది. తెలంగాణ వరదాయని కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును స్వయంగా పర్యవేక్షించిన కేంద్ర జలసంఘం, కేంద్ర ఆర్థిక సంఘం ప్రభుత్వ కషిని ఎంతగానో కొనియాడాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది వర్షాకాలంలోనే రైతులకి నీరు అందివ్వడానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులను ఈ ఐదేళ్ల కాలంలో పూర్తి చేసి, తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం కతనిశ్చయంతో పనిచేస్తున్నది.

మిషన్‌ కాకతీయ:

మిషన్‌ కాకతీయ ద్వారా ఇప్పటివరకు నాలుగు దశల్లో 20,171 చెరువుల పునరుద్ధరణ పూర్తయింది. ఈ చెరువుల్లో నీటి నిల్వ సామర్ధ్యం పెరిగి, తద్వారా భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. సంప్రదాయ నీటి వనరులను పునరుద్ధరించే మిషన్‌ కాకతీయ పథకం దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది.

రాష్ట్రంలోని చెరువులన్నీ నింపడానికి వీలుగా గొలుసుకట్టు పునరుద్దరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో 12,150 గొలుసుకట్టుల కింద 27,800 చెరువులున్నాయి. గొలుసుకట్టులోని మొదటి చెరువు నిండి పారే నీరు క్రమంగా చివరి చెరువు దాకా చేరే విధంగా కాల్వలను బాగు పరిచేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ ఏడాది నుంచే కాల్వల ద్వారా చెరువులు నింపే కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. వర్షం ద్వారా సహజంగా వచ్చి చేరే నీరు, ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోసే నీరు, ఇంకా పడువాటు నీళ్లు అన్ని చెరువులకు చేరేలా కాల్వల పునరుద్ధరణ పనులు చేపట్టపోతున్నాం. 2019-20 బడ్జెట్‌ లో నీటిపారుదల శాఖకు 22,500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వరిపుష్ఠిని
అందించే ప్రణాళిక :

సమైక్య పాలనలో తెలంగాణ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైపోయింది. సామాజిక జీవిక చెదిరిపోయింది. వ్యవసాయం పట్ల నిర్లక్ష్యం, కులవత్తుల పట్ల అనాదరణ కారణంగా గ్రామీణ జీవితం అల్లకల్లోలమయింది. వత్తి నైపుణ్యం కలిగిన తెలంగాణ బిడ్డలు పట్టణాలు, పరదేశాలు వెళ్లి బతకాల్సిన దుస్థితిలోకి నెట్టి వేయబడ్డారు. ఈ పరిస్థితిలో మార్పు రావడం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. వివిధ కులవ త్తులకు తగిన ఆర్థిక ప్రేరణ అందించి, వాటికి పునరుత్తేజం కలిగించేందుకు చిత్త శుద్ధితో ప్రయత్నిస్తున్నది.

గొర్రెల పెంపకం:

గొర్రెల పెంపకాన్ని అభివద్ధి చేసి, గొల్ల కురుమలకు ఆదాయాన్ని సమకూర్చే బహత్తర పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది. గొర్రెలు పెంచే ప్రతి కుటుంబానికి 20 గొర్రెలు, ఒక పొట్టేలును 75 శాతం సబ్సిడీతో ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది.ఇప్పటి వరకు రాష్ట్రంలో 3 లక్షల 58 వేల మందికి 75 లక్షల గొర్రెల వంపిణీ జరిగింది. ఈ గొర్రెలు ఇప్పటి వరకు 55 లక్షల గొర్రె పిల్లలను పునరుత్పత్తి చేశాయి. 2,600 కోట్ల రూపాయల సంపద గొల్ల కుర్మలకు సమకూరింది.

చేపల పెంపకం:

గంగపుత్ర ముదిరాజ్‌ కులాలవారితో పాటు బోయ కులస్తులు చేపలు పట్టడంపై ఆధారపడి జీవిస్తున్నారు. అన్ని జలాశయాల్లో మత్స్యకారుల ద్వారా చేపల పెంపకానికి చర్యలు తీసుకున్నాం. ఇప్పటి వరకు మత్స్యకారులకు 128 కోట్ల చేవ పిల్లలను, 4.27 కోట్ల రొయ్య పిల్లలను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసింది.

ఇతర కుల వత్తులకు ప్రోత్సాహం:

తమ వత్తి ద్వారా ప్రజలకు విశేష సేవచేస్తూ జీవిస్తున్న నాయీ బ్రాహ్మణులకు, రజకులకు ప్రత్యేక సహకారాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. విశ్వకర్మలుగా పిలవబడే ఔసుల, కమ్మరి, కంచరి, వడ్రంగి, శిల్పకారులకు, బట్టలు కుట్టి జీవించే మేర కులస్తులకు, కుమ్మరి పనివారికి, తదితర కులవత్తుల వారందరికి అవసరమైన ఆర్థిక సహకారం, పరికరాల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గీతకార్మికులకు చెట్ల రఖం (వన్ను)ను ప్రభుత్వం రద్దు చేసింది.

చేనేత కార్మికుల సంక్షేమం:

నేతన్నల దయనీయ స్థితికి చలించిన ప్రభుత్వం వీరిని కష్టాల నుంచి శాశ్వతంగా గట్టెక్కించడానికి త్రిముఖ వ్యూహం రూపొందించింది.

1. ప్రభుత్వం కొనుగోలు చేసే వస్త్రాల ఆర్డర్లను చేనేత పని వారికి ఇవ్వడం.

2. నూలు, రసాయనాలను సబ్సిడీపై ఇవ్వడం.

3. తగిన మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడం.

పెద్ద సంఖ్యలో ఉన్న పవర్‌ లూమ్‌లను ఆధునీకరించి

ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. కార్మికులకు ప్రతీ నెలా 15 వేలకు తగ్గకుండా వేతనం ఇచ్చే విధంగా పవర్‌ లూమ్‌ యాజమాన్యాలను ప్రభుత్వం ఒప్పించింది. ప్రభుత్వం తరఫున జరిపే వస్త్రాల కొనుగోళ్ల ఆర్డర్లను చేనేత, మరమగ్గాల సొసైటీలకే ఇస్తున్నది. ప్రతీ ఏటా బతుకమ్మ, రంజాన్‌, క్రిస్మస్‌ పండుగల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసే చీరల ఆర్డర్లను నేత కార్మికులకు ఇవ్వడం ద్వారా వారికి ఏడాది పొడవునా ఉపాధి లభిస్తున్నది. వరంగల్‌లో భారీ టెక్స్‌ టైల్స్‌ పార్కు, సిరిసిల్లలో ఆపరెల్‌ పార్కు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.

ఎంబిసి కార్పోరేషన్‌:

రాష్ట్రంలో సంచార జాతుల కులాల వారిని, అత్యంత వెనుక బడిన కులాల వారిని ఆదుకోవడం కోసం ప్రభుత్వం ఎంబిసి కార్పోరేషన్‌ ఏర్పాటు చేసింది.ఈ బడ్జెట్లో ఎంబిసి కార్పోరేషన్‌కు 1,000 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.

విద్యుత్తు:

తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ సంక్షోభాన్ని చాలా తక్కువ సమయంలో పరిష్కరించింది. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదవ నెల నుంచే ప్రభుత్వం నిరంతరాయ నాణ్యమైన విద్యుత్తును 24 గంటల పాటు సరఫరా చేస్తున్నది. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చేందుకు 28 వేల మెగావాట్లు స్థాపిత విద్యుత్‌ సామర్ధ్యం లక్ష్యంగా తలపెట్టిన కొత్త విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. 800 మెగావాట్ల కెటిపిఎస్‌ (ఖుూూ) 7వ దశ నిర్మాణాన్ని కేవలం 42 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసి, విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించింది. 1080 మెగావాట్ల సామర్ధ్యంతో నిర్మిస్తున్న భద్రాద్రి పవర్‌ ప్లాంటు ఈ ఏడాది నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తుందని తెలియ చేయడానికి సంతోషిస్తున్నాను. 4 వేల మెగావాట్ల సామర్ధ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి అల్ట్రామెగా పవర్‌ ప్లాంటు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 5 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకొని, ఇప్పటికే 3613 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దేశంలో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో కర్ణాటక రాష్ట్రం తరువాత తెలంగాణ రెండవ స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 7778 మెగావాట్ల స్థాపిత విద్యుత్‌ సామర్ధ్యం మాత్రమే ఉండేది.

నాలుగున్నర ఏండ్లలో ప్రభుత్వం చేసిన బహుముఖ కషి వల్ల తెలంగాణలో 16503 మెగావాట్ల స్థాపిత విద్యుత్‌ అందుబాటులోకి వచ్చింది. తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచిందని సెంట్రల్‌ ఎలక్ట్రిసిటి ఆథారిటి ప్రకటించింది. మానవ ప్రగతి సూచికల్లో ముఖ్యమైనదిగా భావించే తలసరి విద్యుత్‌ వినియోగం వద్ధిరేటులో మన రాష్ట్రం అగ్రభాగాన నిలవడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం.

మిషన్‌ భగీరథ:

దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో ఇంటింటికీ ప్రభుత్వమే నల్లా సౌకర్యం కల్పించి, పరిశుద్ధమైన తాగునీటిని అందించే బహత్తర పథకం మిషన్‌ భగీరథ. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, అన్ని ఆవాసా ప్రాంతాలు, అన్ని మున్సిపాలిటీలకు మిషన్‌ భగీరథ ద్వారా మంచినీళ్లు అందుతున్నాయి. 19,750 జనావాసాలలో ప్రతీ ఇంటికి నల్లాలు బిగించి, మంచి నీరు అందించబడుతున్నది. మిగతా మున్సి పాలిటీలు, ఆవాసాల్లో అంతర్గత పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్‌ నెలాఖరు నాటికి మిషన్‌ భగీరథ పనులు వందకు వంద శాతం పూర్తి చేసి, ప్రతీ ఇంటికి నల్లా ద్వారా మంచినీళ్లు అందిస్తామనే సంతోషకరమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను.

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు:

నిరుపేదలకు గహనిర్మాణ పథకం అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నూటికి నూరు శాతం ప్రభుత్వ ఖర్చుతో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను నిర్మించి ఇవ్వడం దేశంలోనే ప్రథమం. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పథకం కింద ఇప్పటి వరకు 2,72,763 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇండ్ల నిర్మాణం సాగుతున్నది. ప్రస్తుత పద్ధతిలో ఇండ్ల నిర్మాణం చేస్తూనే, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్వంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి ఆర్ధ్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాస్త్రీయ పద్ధ్దతిలో అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తున్నది.

రహదారులు:

రహదారులు సమాజ సంస్క తికి అద్దం పడతాయి. తెలంగాణ రాష్ట్రంలో రహదారులను మెరుగుపరచి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నది. కొత్తగా 3,150 కిలో మీటర్ల మేర జాతీయ రహదారులను సాధించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 2,527 కిలో మీటర్ల జాతీయ రహదారి మాత్రమే ఉంటే, నేడు రాష్ట్రంలో 5,677 కిలో మీటర్ల జాతీయ రహదారులు సమకూరాయి. హైదరాబాద్‌ నగరం శరవేగంగా అభివద్ధి చెందుతున్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని నగరం చుట్టూ, ప్రస్తుతమున్న ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవతల 340 కిలో మీటర్ల పొడవైన రీజనల్‌ రింగు రోడ్డును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని నిర్ణయించింది.

రాష్ట్రంలో ప్రస్తుతమున్న రహదారులన్నింటికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రహదారులన్నీ అద్దంలా రూపుదిద్దు కోవడానికి మిషన్‌ మోడ్‌లో పనిచేస్తుంది. రాష్ట్రంలోని

మొత్తం 12,751 గ్రామ పంచాయతీలకు ఖచ్చితంగా బిటి రోడ్డు ఉండాలనే విధాన నిర్ణయం తీసుకున్నది.

 

 

విద్యారంగం:

నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, మౌలిక సదుపా యాలు అందుబాటులో ఉన్నప్పుడే ప్రజల జీవన ప్రమాణాల్లో గుణాత్మక మార్పు సాధ్యమని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా నమ్ముతున్నది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తిస్తున్న మానవ ప్రగతి సూచికల్లో (హ్యూమన్‌ డెవలప్మెంట్‌ ఇండెక్స్‌) ప్రధానమైన ఈ రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది.

కేజీ టు పీజీ ఉచిత విద్యావిధానంలో భాగంగా పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్‌ స్కూళ్లు, కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి చెందిన విద్యార్థుల కోసం కేవలం 296 గురుకులాలు మాత్రమే అరకొర వసతులతో ఉండేవి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అన్ని హంగులతో, రికార్డు స్థాయిలో 542 కొత్త గురుకులాలు ఏర్పాటుచేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బిసీల కోసం మరో 119 రెసిడెన్షియల్‌ స్కూళ్లను ప్రభుత్వం ప్రారంభించబోతున్నది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థినుల కోసం 51 డిగ్రీ గురుకులాలను కూడా ప్రారంభించింది. ఈ గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై ఏడాదికి సగటున లక్ష రూపాయలు వెచ్చిస్తూ, మంచి భోజనం, వసతి, సకల సౌకర్యాలు కల్పించింది. విదేశీవిద్య కోసం వెళ్ళే అన్ని వర్గాల వారికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేస్తున్నది.

ప్రజారోగ్యం:

పేదలకు మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వం ఆసుపత్రుల్లో వసతులను ఎంతో అభివద్ధి పరిచింది. అవరమైన వైద్య పరికరాలు, మందులు, ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌ లో తెలంగాణలోని పది జిల్లాలలోని ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు అందించే మందుల కొనుగోలు కోసం కేవలం 146 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ మొత్తాన్ని మూడింతలు పెంచి ప్రతీ ఏటా 440 కోట్ల రూపాయలు మందుల కొనుగోలు కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్నది. 40 ప్రభుత్వాసుపత్రుల్లో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఎం.ఆర్‌.ఐ, సిటీస్కాన్‌, డిజిటల్‌ రేడియాలజీ, టూడి ఎకో, తదితర అత్యాధునిక పరికరాలను వివిధ దవాఖానాలలో ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. జిల్లా, ఏరియా ఆస్పత్రులలో ఐ.సి.యు కేంద్రాల సంఖ్య కూడా పెంచడం జరిగింది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ వైద్య సేవలందించే మూడు రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది.

హైదరాబాద్‌ నగరంలో వైద్యసేవలను మరింత విస్తరించింది. పేదలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతీ పదివేల మందికి ఒకటి చొప్పున బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నది. 40 బస్తీ దవాఖానాలు ఇప్పటికే సేవలు అందిస్తున్నాయి. ఈ దవాఖానాల్లో ప్రాథమిక వైద్యం, రోగ నిర్ధారణ పరీక్షలు, ఉచితంగా మందులు అందుబాటులో ఉన్నాయి.

వైద్య విద్యను, సేవలను మరింత విస్తరించడం కోసం రాష్ట్రంలో కొత్తగా నాలుగు వైద్య కళాశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. సిద్ధిపేట, మహబూబ్‌ నగర్లో వైద్య కళాశాలలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. సూర్యాపేట, నల్గొండలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవుతాయి. ఆసుపత్రిలో మరణించిన వారి మతదేహాలను ఉచితంగా తరలించడానికి ప్రభుత్వం వరమపద వాహనాలను ప్రవేశపెట్టింది. ఈ సదుపాయం దేశంలో మరెక్కడా లేదు.

కేసీఆర్‌ కిట్స్‌ :

మహిళలు గర్భవతిగా ఉండే దశ చాలా సున్నితమైనది. అత్యంత జాగ్రత్తగా ఆ సమయంలో వారిని కనిపెట్టుకుని కాపాడుకోవాలి. కానీ, పేదరికం కారణంగా ఆ దశలోనూ మహిళలు కుటుంబం గడవడం కోసం కూలీ పనులకు పోవాల్సి రావడం తల్లీ బిడ్డలకు ప్రమాదకరం.

గర్భవతులైన మహిళలకు ఉపాధి సమస్య ఎదురు కాకూడదని, ఆ సమయంలో వారు కోల్పోయిన ఆదాయాన్ని ప్రభుత్వమే అందించాలని సంకల్పించాం. ఆ ఆలోచన నుంచి జనించిందే కేసీఆర్‌ కిట్స్‌ పథకం. కేసీఆర్‌ కిట్స్‌ పథకానికి మూడు లక్ష్యాలున్నాయి. 1. అవాంఛనీయ ఆపరేషన్లకు అడ్డుకట్ట వేయడం. ప్రభుత్వాసుపత్రుల్లో సురక్షిత ప్రసవాలు జరగడం. 2. గర్భందాల్చిన సమయంలో కోల్పోయిన ఆదాయాన్ని ప్రభుత్వమే అందించడం. 3. ప్రసూతి మరణాలు లేకుండా చేయడం.

ఈ పథకం క్రింద నిరుపేద గర్భిణీలకు 12,000 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఆడపిల్లను ప్రసవించిన తల్లికి ప్రోత్సాహకంగా మరో 1,000 రూపాయలు ప్రభుత్వం అదనంగా చెల్లిస్తున్నది. దీనితో పాటు నవజాత శిశువులకు, బాలింతలకు కావల్సిన 16 రకాల వస్తువులతో కూడిన 2,000 రూపాయల విలువైన కిట్‌ ను కూడా అందిస్తున్నది. ఈ పథకం అమలు తర్వాత ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలు 33 నుంచి 49 శాతానికి పెరిగాయి. తెలంగాణ ఏర్పడే నాటికి శిశు మరణాల రేటు ప్రతీ వెయ్యి మందికి 39 ఉంటే, అది నేడు 28కు తగ్గింది. మాతా మరణాల రేటు కూడా 91 నుంచి 70కి తగ్గింది.

కంటి వెలుగు :

ప్రజలకు కంటి సమస్యల పట్ల అవగాహన కలిగించడంతో పాటు కంటి వైద్యాన్ని వారి ముంగిట్లోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఈ శిబిరాల ద్వారా కోటి 52 లక్షల మందికి ప్రభుత్వం పరీక్షలు జరిపింది. 50 లక్షల మందికి కంటి అద్దాలు అందించింది. కాటరాక్ట్‌, గ్లూకోమా, రెటినోపతి, కార్నియా డిసార్డర్స్‌ వంటి కంటి రుగ్మతలున్న వారిని గుర్తించి, ఉచితంగా ఆపరేషన్లు చేయడానికి ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రజలందరికీ కంటి వరీక్షలు, చికిత్సలు నిర్వహించే కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదు.

ఇ.ఎన్‌.టి – దంత పరీక్షలు !

కంటి వెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత సంబంధమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు ఊరూరా నిర్వహిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. ఈ హామీ నెరవేర్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. వైద్య ఆరోగ్య శాఖకు ఈ బడ్జెట్లో ప్రభుత్వం 5,536 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నది.

పరిపాలన సంస్కరణలు

ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయడం కోసం మన రాష్ట్రంలో విప్లవాత్మకమైన పరిపాలన సంస్కరణలను విజయవంతంగా అమలు చేసుకున్నాం. దేశ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ పాలనా సంస్కరణలు మరెక్కడా జరగలేదు. మొదట 10 జిల్లాలను 31 జిల్లాలు చేసుకున్నాం. ఇటీవలే కొత్తగా నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం. 43 రెవెన్యూ డివిజన్ల సంఖ్యను 69 కి పెంచుకున్నాం. 459 మండలాలను 584 మండలాలు చేసుకున్నాం. గతంలో 68 మున్సిపాలిటీలుంటే కొత్తగా మరో 68 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణలో ఇప్పుడు మొత్తం 136 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఉన్నాయి. కొత్తగా 4,383 గ్రామ వంచాయతీలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా పంచాయితీల సంఖ్య 12,751కు పెరిగింది.

శాంతి భద్రతలను పర్యవేక్షించడానికి ప్రభుత్వం కొత్త పోలీసు కమీషనరేట్లను ఏర్పాటు చేసింది. తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో కేవలం రెండు పోలీసు కమిషనరేట్లు మాత్రమే ఉండేవి. ప్రభుత్వం కొత్తగా ఏడు పోలీస్‌ కమిషనరేట్లు ఏర్పాటు చేసింది. కొత్త పోలీస్‌ సబ్‌ డివిజన్లను, కొత్త సర్కిళ్లను, కొత్త పోలీస్‌ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పోలీస్‌ సబ్‌ డివిజన్ల సంఖ్యను 139 నుంచి 163కు, సర్కిళ్ల సంఖ్యను 688 నుంచి 717కు, పోలీస్‌ స్టేషన్ల సంఖ్యను 712 నుంచి 814కు ప్రభుత్వం పెంచింది.

గ్రామ పంచాయతీలుగా తండాలు

మా తండాల్లో మా రాజ్యం, మా గూడాల్లో మా రాజ్యం అనే నినాదంతో తండాలు, గూడాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ఎస్టీలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. అనేక రాజకీయ పార్టీలు ఎన్నికల మానిఫెస్టోలో హామీలు ఇచ్చారు తప్ప, వారి డిమాండ్‌ నెరవేర్చలేదు. ఎస్టీ ప్రజల స్వపరిపాలన కలను తెలంగాణ ప్రభుత్వం నిజం చేసింది. 1,177 తండాలు, గూడాలను కొత్తగా గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసింది. 1,281 ఆవాస ప్రాంతాలు షెడ్యూల్డు ఏరియాలో ఉండడంతో వాటిని ఎస్టీలకే రిజర్వు చేసింది. గ్రామాల్లో ఎస్టీల జనాభాను పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలో 688 గ్రామాలను ఎస్టీలకు రిజర్వు చేసింది. దీంతో ఇటీవల జరిగిన గ్రామ వంచాయతీ ఎన్నికల్లో 3,146 మంది ఎస్టీలు సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఇంత పెద్ద మొత్తంలో ఎస్టీలకు ప్రత్యేక పంచాయతీలను ఏర్పాటు చేసి, గ్రామపరిపాలనా బాధ్యతలను ఎస్టీలకే అప్పగించే అభ్యుదయకర నిర్ణయం తీసుకున్న ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం దేశ చరిత్రలో సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్నదని చెప్పడానికి సంతోషిస్తున్నాను.

నూతన పంచాయతీ రాజ్‌ చట్టం

భారతీయ ఆత్మ గ్రామాలలోనే ప్రతిఫలిస్తుందని గాంధీ మహాశయుడు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివద్ధి ప్రతిపాదించిన ఆశయాలేవీ తదనంతర కాలంలో ప్రభుత్వాలు పట్టించుకోలేదు. గ్రామ స్వరాజ్య భావన నినాదంగానే మిగిలిపోయింది. తెలంగాణ ప్రభుత్వం గాంధీ కోరిన గ్రామాభ్యుదయం కోసం నిర్మాణాత్మక చర్యలు ప్రారంభించింది. నూతన పంచాయతీ రాజ్‌ చట్టాన్ని రూపకల్పన చేసింది. ఈ చట్టం ద్వారా స్థానిక సంస్థలకు కావాల్సిన అధికారాలను, విధులను అందిస్తున్నది. గ్రామంలో పచ్చదనం పెంచడం, పారిశుధ్యం నిర్వహించడం తదితర అంశాలలో బాధ్యతాయుత ప్రవర్తనను చట్టం కోరుతున్నది. బాధ్యతను విస్మరించిన వ్యక్తులను శిక్షించే అవకాశం ఈ చట్టం కల్పిస్తున్నది. ఆదర్శవంతమైన గ్రామాల రూపకల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది.

గామ పంచాయతీలకు నిధులు

గ్రామాల అభివద్ధికి నిధుల కొరత రానీయకుండా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అటు ఫైనాన్స్‌ కమిషన్‌ ద్వారా వచ్చే నిధులు, ఇటు నరేగా ద్వారా వచ్చే నిధులు, గ్రామ పంచాయతీలకున్న సొంత ఆదాయ వనరులు.. ఇలా అన్ని రకాల నిధులను కలిపి రాబోయే ఐదేళ్లలో గ్రామాల అభివద్ధికి ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ వ్యక్తికి ఏడాదికి 806 రూపాయల చొప్పున కేంద్రం నుంచి నిధులు అందుతాయి. అంటే తెలంగాణలోని 2 కోట్ల 2 లక్షల గ్రామీణ జనాభాకు ఏడాదికి 1,628 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తాయి. దీనికి తెలంగాణ మొదటి రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు కూడా జమ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున 2019-20 ఆర్థిక సంవత్సరంలో స్థానిక సంస్థలకు ఇచ్చే నిధుల విషయంలో రాష్ట్ర ఆర్థిక సంఘం ఇటీవలే మధ్యంతర నివేదిక ఇచ్చింది.

గ్రామీణ స్థానిక సంస్థలకు 1400 కోట్ల రూపాయలు, పట్టణ స్థానిక సంస్థలకు 900 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని సిఫార్సు చేసింది. అయితే, గ్రామాల అభివద్ధికి ఎక్కువ నిధులు అవసరమని భావించిన ప్రభుత్వం, రాష్ట్ర ఆర్థిక సంఘం చేసిన సిఫారసులకన్నా ఎక్కువ మొత్తంలోనే నిధులివ్వాలని నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక సంఘం రాష్ట్రానికి 1,628 కోట్ల రూపాయలు ఇస్తున్నందున, రాష్ట్రం తరువున కూడా అంతే మొత్తంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రెండు ఫైనాన్స్‌ కమీషన్ల ద్వారా గ్రామాలకు మొత్తం 3,256 కోట్ల రూపాయలు అందనున్నాయి. అంటే ఒక్కో మనిషికి 1606 రూపాయల చొప్పున ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు అందుతాయి. 500 జనాభా కలిగిన గ్రామానికి కూడా 8 లక్షల రూపాయల నిధులు వస్తాయి. ఇవికాక, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మరో 4,000 కోట్ల రూపాయలు అందుతాయి. పన్నుల ద్వారా గ్రామ పంచాయితీలకు మరో 700 కోట్ల రూపాయలు సమకూరుతాయి. ఈ మూడు మార్గాల ద్వారా గ్రామాలకు ప్రతీ ఏటా దాదాపు 8 వేల కోట్ల రూపాయల మేర నిధులు అందుబాటులో ఉంటాయి. ఐదేళ్ల కాలంలో మొత్తం 40 వేల కోట్లు గ్రామాభివద్ధి కోసం ఖర్చు చేసే అవకాశం

ఉంది. ఇంత పెద్ద మొత్తంలో గ్రామాల అభివద్ధికి గతంలో నిధులు అందలేదు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని, చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేస్తారని ఆశిస్తున్నాను. ఆదర్శ గ్రామాలను నిర్మించే కషిలో ప్రజలు కూడా తమ భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను.

నగరాల అభివృద్ధి :

రోజురోజుకు పట్టణాలు, నగరాల్లో జనాభా తీవ్రంగా పెరుగుతున్నది. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా ఆయా పట్టణాల్లో, నగరాల్లో మౌలిక సదుపా యాలను అభివద్ధి చేసేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను అమలు చేస్తున్నది. హైదరాబాద్‌ నగరంతో పాటు రాష్ట్రంలోని అన్ని నగరాల అభివద్ధి కోసం మాస్టర్‌ ప్లాన్లు రూపొందిస్తున్నది. హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా మార్చే కషి కొనసాగుతున్నది.

తెలంగాణకు హరితహారం :

సమైక్య రాష్ట్ర పాలకుల నిర్వాకం వల్ల తెలంగాణలో అడవులు క్షీణించాయి. పచ్చదనం బాగా తగ్గిపోయింది. పర్యావరణ సమస్యలు తీవ్రతరమయ్యాయి. తెలంగాణ భూభాగంలో 33 శాతం పచ్చదనం సాధించేందుకు ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఉద్యమ స్పూర్తితో అమలు చేస్తున్నది. ఈ కార్యక్రమం ప్రధానంగా మూడు లక్ష్యాలతో కొనసాగుతున్నది. 1. మిగిలి ఉన్న అడవులను జాగ్రత్తగా పరిరక్షించుకోవడం. 2. కోల్పోయిన అడవిని వునరుద్ధరించడం. 3. సామాజిక అడవుల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం.

ఈ లక్ష్యాలను సాధించడంలో భాగంగా, అడవులను నరికివేసే స్మగ్లర్ల వట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలవ స్మగ్లింగ్‌ ఇక ఎంత మాత్రం లాభసాటి కాదనీ, నష్టదాయకమని కలప స్మగ్లర్లు గుర్తించాలి. అడవుల నరికివేత మానుకుని ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూసుకునే వారికి ప్రభుత్వం సహకరిస్తుంది. లేని పక్షంలో తీవ్రంగా శిక్షిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం అటవీ చట్టాలను మరింత కఠినతరం చేయబోతున్నది. పర్యావరణ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రజలంతా ఉద్యమ స్ఫూర్తితో భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాను.

పారిశ్రామికాభివద్ధి

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకోసం ముందుకువచ్చే వారికి టి.ఎస్‌-ఐ.పాస్‌ సింగిల్‌ విండో విధానం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. కేవలం 15 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు పరిశ్రమల స్థాపనకు లభిస్తున్నాయి. ఇప్పటి వరకు 1.41 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో కూడిన 8,419 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వటం జరిగింది. దీంతో 8.58 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడింది.

ఐ.టి రంగంలో…

తెలంగాణ రాష్ట్రం ఐ.టి రంగంలో బలీయమైన శక్తిగా ఎదిగింది. ప్రపంచంలో హైదరాబాద్‌ ప్రముఖ ఐ.టి హబ్‌గా గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన ఐ.టి విధానంతో పాటు, సింగిల్‌ విండో పారిశ్రామిక అనుమతుల విధానం వల్ల ఐ.టి రంగంలో గణనీయమైన పెట్టుబడులు రావడం ప్రారంభమైంది. ఎన్నో దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాయి. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఏర్పాటుచేసిన టి-హబ్‌ దేశవ్యాప్తంగా సంచలనం సష్టించింది. ఐ.టి ఎగుమతులు ఈ ఏడాది లక్ష కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఐ.టి. పరిశ్రమను రాష్ట్రంలోని ఇతర నగరాలకు విస్తరించడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలమవుతోంది.

సజావుగా శాంతిభద్రతలు:

పోలీసు శాఖను బలోపేతం చేయడం వల్ల సమర్ధవంతంగా శాంతిభద్రతల పరిరక్షణ జరుగుతున్నది. చరిత్రలో ఎన్నడూ లేనంత ప్రశాంతంగా జనజీవనం సాగుతున్నది. అభివద్ధిలో శాంతి భద్రతలకున్న ప్రాధాన్యతను గుర్తించి, ప్రభుత్వం పోలీసు శాఖకు అత్యధిక బడ్జెట్‌ కేటాయించింది. హైదరాబాద్‌లో త్వరలోనే అంతర్జాతీయ స్థాయి పోలిస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభం కానున్నది. పేకాట, గుడుంబా వంటి దురాచారాలను పోలీస్‌ శాఖ సమర్ధవంతంగా అరికట్ట గలిగింది. డ్రగ్స్‌, కల్తీల నిరోధానికి ఉక్కుపిడికిలి బిగించింది. మహిళలకు భద్రత కల్పించడం కోసం షీ టీమ్స్‌ విశేష కషి చేస్తున్నాయి.

స్వీయ ఆదాయంలో స్థిరమైన వృద్ధి :

తెలంగాణ రాష్ట్రం దేశంలో మరే రాష్ట్రానికి సాధ్యం కాని రీతిలో స్థిరమైన ఆదాయాభివద్ధి రేటు సాధిస్తున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి నాలుగు సంవత్సరాల్లో స్వీయ ఆదాయంలో (ూ.ూ.ు.=) 17.17 శాతం వార్షిక సగటు వద్ధి సాధించి, దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్ల, అవినీతి నిరోధానికి పటిష్టమైన విధానాలు అమలు చేయడం వల్ల ఈ ఆదాయాభివద్ధి సాధ్యమవుతున్నది.

అత్యధిక మూలధన వ్యయం :

మొత్తం వ్యయంలో మూలధన వ్యయ శాతం (క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌) పరంగా చూస్తే దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలుస్తుంది. 2016-17 సంవత్సరం ప్రకారం తెలంగాణ రాష్ట్ర మొత్తం వ్యయంలో మూలధన వ్యయం 28.2 శాతంగా ఉంది.

తెలంగాణ ప్రభుత్వం అభివద్ధి కార్యక్రమాల కోసం నిధులను ఎంత సమర్ధవంతంగా వినియోగిస్తున్నదో చెప్పడానికి ఒక పోలికను ఈ సభ ముందుంచుతున్నాను.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మొత్తం 23 జిల్లాలకు కలిపి 2004-05 నుంచి 2014 వరకు అనగా పది సంవత్సరాల్లో మొత్తం మూలధన వ్యయం (క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌) 1,29,683 కోట్ల రూపాయలు, అదే సమయంలో తెలంగాణలోని పది జిల్లాలకు చేసిన వ్యయం కేవలం 54,052 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ 2014 నుంచి 2019 వరకు తెలంగాణ రాష్ట్రంలో కేవలం నాలుగున్నరేళ్లలో 1,68,913 కోట్ల రూపాయల మూలధన వ్యయం జరిగింది. ఇది ప్రభుత్వం సాధించిన ప్రగతికి నిదర్శనం. ఈ స్ఫూర్తిని ఇదే విధంగా కొనసాగిస్తామని సవినయంగా సభకు తెలియచేస్తున్నాను.

రెండు రెట్లు పెరిగిన జిఎస్టీపి వృద్ధి రేటు:

రాష్ట్ర ఏర్పాటుకు ముందు రెండు సంవత్సరాలలో, స్థిర ధరల వద్ద జిఎస్థిపి వద్ధి రేటు కేవలం 4.2 శాతంగా

ఉంది. 2017-18 నాటికి ఈ వద్ధిరేటు రెండు రెట్లు మించి 10.4 శాతంగా నమోదైంది. ఈ గణాంకాలను స్వయాన కేంద్ర గణాంక సంస్థ వెల్లడించింది.

ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ ప్రవేశ పెట్టడానికి కారణం !

ప్రభుత్వం ఈ సారి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ను ప్రవేశపెట్టడానికి ప్రత్యేక కారణాలున్నాయి. రాష్ట్ర ఏర్పాటు సమయంలో రాష్ట్రానికి రాబడిని పెంచటం, అవసరాలను తీర్చుకోవడం ఎలా అనే అంశాలపై స్పష్టమైన అంచనాలు లేవు. దాదాపు ఐదు సంవత్సరాలు పదవీకాలం పూర్తి అయిన తరువాత, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక స్థితి, సామర్ధ్యం, ఆర్థిక వద్ధి, రాష్ట్ర ప్రాధాన్యతలపై పూర్తి అవగాహన ఏర్పడింది.

రాష్ట్రంలోని పరిస్థితులను దష్టిలో పెట్టుకొని రాబోయే ఐదేళ్ల అభివద్ధికి సంబంధించి ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది. ఈ ప్రణాళిక ప్రకారమే ప్రతీ ఏటా బడ్జెట్లో నిధులు కేటాయించాలని నిర్ణయించింది. ఈ సారి కేంద్ర ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ ప్రవేశ పెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయి? ఏఏ రంగాలకు ఎట్లా కేటాయింపులుంటాయి? వారి ప్రాధాన్యతలేంటి? కేంద్ర ప్రాయోజిత పథకాలు ఎలా ఉండబోతున్నాయి? ఇలాంటి విషయాలపై స్పష్టత లేదు. కేంద్రంలో పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెడితేనే, రాష్ట్రానికి ఏ రంగంలో ఎంత మేరకు ఆర్థిక సహకారం అందుతుందనే విషయంపై స్పష్టత వస్తుంది. అందువల్లనే ఈ సారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్నది. ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం కూడా మరోసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ ను సంపూర్ణ స్పష్టతతో ప్రవేశ పెడుతుందని గౌరవ సభ్యులకు తెలియచేస్తున్నాను.

అధ్యక్షా, 2019-20 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ప్రతిపాదనలు సభకు సమర్పించదలుచుకున్నాను.

అకౌంట్స్‌ 2017-18

రాష్ట్ర అకౌంటెంట్‌ జనరల్‌ ధ్రువీకరించిన ఫైనాన్స్‌ అకౌంట్స్‌ ప్రకారం 2017-18 సంవత్సరంలో చేసిన మొత్తం వ్యయం 1,43,133 కోట్ల రూపాయలు. మొత్తం రెవెన్యూ రాబడుల విలువ 88,824 కోట్ల రూపాయలు. రెవెన్యూ ఖాతాలో మొత్తం ఖర్చు 85,365 కోట్ల రూపాయలు. రెవెన్యూ మిగులు 3,459 కోట్ల రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొత్తం వ్యయం 1,43,133 కోట్ల రూపాయలు కాగా ఇందులో మూలధన వ్యయం 23,902 కోట్ల రూపాయలు.

సవరించిన అంచనాలు 2018-19

సవరించిన అంచనాల ప్రకారం, 2018-19 సంవత్సరానికి వేసిన మొత్తం అంచనా వ్యయం 1,61,857 కోట్ల రూపాయలు. ఇందులో రెవెన్యూ వ్యయం 1,19,027 కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం 28,053 కోట్ల రూపాయలు. సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ ఖాతాలో మిగులు 353 కోట్ల రూపాయలు.

బడ్జెట్‌ అంచనాలు 2019-20 :

2018-19 సంవత్సరానికి 72,777 కోట్ల రూపాయల సవరించిన అంచనాలతో పోలిస్తే 2019-20 సంవత్సరానికి రాష్ట్ర సొంత రెవెన్యూ రాబడుల ప్రతిపాదనలు 94,776 కోట్లరూపాయలు. 2018-19 సంవత్సరానికి 28,042 కోట్ల రూపాయల సవరించిన అంచనాలతో పోలిస్తే 2019-20 సంవత్సరానికి బడ్జెట్‌ అంచనాల్లో కేంద్ర ప్రతిపాదిత బదిలీలు 22,835 కోట్ల రూపాయలు. ప్రగతి పద్దు అంచనా వ్యయం 1,07,302 కోట్ల రూపాయలు. కాగా నిర్వహణ పద్దు అంచనా వ్యయం 74,715 కోట్ల రూపాయలు.

2019-20 సంవత్సరానికి మొత్తం ప్రతిపాదిత వ్యయం 1,82,017 కోట్ల రూపాయలు కాగా, ఇందులో రెవెన్యూ వ్యయం 1,31,629 కోట్ల రూపాయలు, కాగా మూలధన వ్యయం 32,815 కోట్ల రూపాయలు.

2019-20 సంవత్సరానికి బడ్జెట్‌ అంచనాలలో రెవెన్యూ మిగులు 6,564 కోట్ల రూపాయలు. ఆర్థిక లోటు 27,749 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇది అంచనా వేసిన జిఎస్డిపి లో (రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి) లో 2.81 శాతం..

రాష్ట్రంలో ప్రస్తుతం అమలు జరుగుతున్న అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నింటిని యధావిధిగా కొనసాగిస్తూనే, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త కార్యక్రమాలను ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.

ప్రభుత్వం తదేక దీక్షతో తపస్సు వలె పనిచేయడం వల్లనే ప్రజలు గత ఎన్నికలలో తమ నిండు దీవెనలను అందించారు. రాబోయే కాలంలోనూ, ప్రజల ఆకాంక్షలే ప్రాతిపదికగా, ప్రభుత్వం వినూత్న పథకాలతో ముందుకు సాగుతుంది. పచ్చని పంటలతో తులతూగుతూ, అన్ని వర్గాల ప్రజలు సమాన అభివద్ధిని పొందే బంగారు తెలంగాణ నిర్మాణం కోసం.. మనసా, వాచా, కర్మణా పునరంకితమవుతామని సవినయంగా ప్రకటిస్తున్నాను.

Other Updates