రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నిర్వహించిన అయుత చండీ మహాయగం కొనసాగిన అయిదు రోజులపాటు యావత్ప్రపంచం దృష్టి ఎర్రవల్లి గ్రామంవైపే కేంద్రీకృతమైంది. గడచిన మూడు నెలలుగా స్పష్టమైన అవగాహనతో సిఎం రూపొందించిన కార్యాచరణ అంచనాలకు మించి జయప్రదంగా పూర్తయింది. అహోరాత్రులు కర్తవ్యదీక్షతో విధులు నిర్వహించిన కార్యకర్తల అంకితభావం, అసంఖ్యాకంగా తరలివచ్చిన లక్షలాది మంది భక్తజనుల స్వీయ నియంత్రణా భావన మహాయాగాన్ని విజయవంతం చేయగలిగాయి. మహాయాగాన్ని దర్శించుకుంటే జన్మ ధన్యమైనట్టే అనే ఆకాంక్షతో సూర్యోదయానికి ముందే తరలివచ్చి క్యూలైన్లలో నిరీక్షిస్తున్న ప్రజానీకానికి నిర్వాహకులు అందించిన తోడ్పాటు, చేయూత వెలకట్టలేనిది. చివరగా ముఖ్యమంత్రి ముగింపు సమావేశంలో మహాయాగ పూర్వాపరాలను సవివరంగా పేర్కొంటూ చేసిన ప్రసంగం ఆయన అంకితభావానికి, కార్యదీక్షకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుందని ఆశీర్వదించిన శృంగేరీ జగద్గురు మహాస్వామి వారి పలుకులు అక్షరాలా నిజమయ్యాయి.
హోం
»