పట్టణాల అభివృద్ధికి రూపొందించిన అమృత్ పట్టణ పథకం కింద తెలంగాణలో రూ.555 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో రూ.277 కోట్లు కేంద్రం ఆర్థిక సాయం రూపంలో అందజేస్తుంది. ఈ పెట్టుబడుల్లో కేంద్ర ప్రభుత్వ 50 శాతం వాటా ఉంటుంది. రూ. 555 కోట్ల పెట్టుబడుల్లో తాగునీటికి రూ. 502 కోట్లు, మురుగునీటి వ్యవస్థ నిర్వహణకు రూ. 40 కోట్లు, పచ్చదనం కోసం రూ.14 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది రాష్ట్రాల పరిధిలో అమృత్ కింద ఎంపికైన 500 పట్టణాల అభివృద్ధికి రూ.2085 కోట్ల సాయం అందజేయాలని ఆగస్టు 3న కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబ్ అధ్యక్షతన జరిగిన వివిధ మంత్రిత్వశాఖల అపెక్స్ కమిటీ సమావేశం నిర్ణయించింది. మొత్తం రూ.4,404 కోట్ల పెట్టుబడులకు అనుమతినిచ్చింది. ఈ పథకం కింద కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హర్యానా, నాగాలాండ్ రాష్ట్రాలతోపాటు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు నిధులు మంజూరుచేయాలని నిర్ణయించింది. ఐదేండ్లలో అమృత్ లక్ష్యాల పూర్తికి గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 500 పట్టణాల్లో రూ.44,401 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిన కేంద్రం.. తన వాటాగా రూ.20,634 కోట్లు కేటాయిస్తామని తెలిపింది.
హోం
»