magaప్రయాణంలో సర్వం పోగొట్టుకున్న ఒక అమెరికా పౌరుడిని తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుని తన ఔదార్యాన్ని చాటుకుంది. జూన్‌ 6న బెంగుళూరు నుంచి హైదరాబాద్‌ వచ్చిన అమెరికా పౌరుడు జాన్‌ ప్రీసన్‌ ప్రయాణ సమయంలో తన పాస్‌పోర్టు, దుస్తులు, డబ్బు పోగొట్టుకుని కట్టుబట్టలతో బేగంపేట చేరుకుని అక్కడి జీహెచ్‌ఎంసీ నైట్‌ షెల్టర్‌లో తలదాచుకున్న తీరును పత్రికలు ప్రచురించగా ఆ వార్తను చూసిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వెంటనే స్పందించారు. అభాగ్యుడిగా మిగిలిన ఆ పర్యాటకునితో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టారు. భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ కార్యాలయ అధికారులతో మాట్లాడి ఆ పర్యాటకునికి తిరుగు ప్రయాణం ఏర్పాట్లపై చర్చించారు. వారు సానుకూలంగా స్పందించారు. ఆ పర్యాటకుడిని వెంకటేశం తన కార్యాలయానికి రప్పించుకుని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

ఈ ఔదార్యానికి, ఆతిథ్యానికి, క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకున్న వైనానికి ఆ పర్యాటకుడు ఎంతో ముగ్ధుడయ్యాడు. కొన్ని రోజులు రాష్ట్ర ప్రభుత్వం సాధారణ అతిథిగా ఉంటానంటే అందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడంతో ప్రీసన్‌ సంతోషానికి అవధులు లేకుండా పోయింది.

Other Updates