‘‘పుటకనీది, చావు నీది, బతుకంతా దేశానిది’’ అని చాటి చెప్పిన ప్రజాకవి, పద్మభూషన్ కాళోజి నారాయణరావు జయంతి సెప్టెంబర్ 9న ‘తెంగాణ భాషా దినోత్సవం’గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సెప్టెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా కాళోజి 101వ జయంతి ఉత్సవాను అధికారికంగా నిర్వహించి ఆయనకు ఘనంగా నివాళుర్పించారు. కాళోజి పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ప్రజాకవి కాళోజి పురస్కారం’ తొలిసారిగా సుప్రసిద్ధ రచయిత అమ్మంగి వేణుగోపాల్‌ను వరించింది.
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో, ప్రభుత్వ సహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి అధ్యక్షతన జరిగిన సభకు
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ప్రతి ఉద్మంలో తనదైన శైలిలో సాహితీ సమరం చేసిన కాళోజీ తెంగాణ ప్రజకు ఎప్పుడు ఓ స్ఫూర్తి ప్రదాతగా నిుస్తారని అన్నారు.
తెంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతిని జరుపుకుందామని నిర్ణయించిన మన ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ఆలోచనా సరళిని సాహితీ ప్రియుందరూ ఎంతగానో కొనియాడుతున్నారని అన్నారు. ‘నా గొడవ’ పేరుతో కాళోజీ మెవరించిన సాహిత్యం సమస్తం ప్రజ గొడవే అని అన్నారు. ప్రజ సమస్య పరిష్కారానికి తనవంతు కర్తవ్యాన్ని ఎప్పుడూ నిర్వహిస్తూనే వచ్చారని అది కాళోజీలోని విక్షణత అని పేర్కొన్నారు. పద్మవిభూషణ్ పురస్కారాన్ని తీసుకునే సందర్భంలో అప్పటి ప్రధాని పి.వి. నర్సింహారావును కూడా ప్రశ్నించిన ధీశాలీ కాళోజీ అని తెలియజేశారు. కాళోజీ స్మారకార్థం, వరంగల్‌లో నిర్మించతపెట్టిన కళాక్షేత్రం నమూనాను త్వరలో ఖరారు చేస్తామని కడియం శ్రీహరి పేర్కొన్నారు. కాళోజీతో తనకు వున్న అనుబంధాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు శ్రీహరి.
ఈ కార్యక్రమంలో ప్రసిద్ధరచయిత అమ్మంగి వేణుగోపాల్‌ని ప్రభుత్వం కాళోజీ పేరున ఏర్పాటు చేసిన సాహితీ పురస్కారంతో సత్కరించారు. ఈ పురస్కారం కోసం నెకొల్పిన క్షానూట పదహారు రూపాయ నగదును కడియం శ్రీహరి చెక్కు రూపంలో అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆర్థికమంత్రి ఈట రాజేందర్ తెంగాణ భాషకు గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చిన కాళోజీని గుర్తు చేసుకోవడం, ఆయన ఆశయాను కొనసాగించడం మనందరి బాధ్యత అన్నారు.
ఎమర్జెన్సీ కాంలో కాళోజీ పోషించిన పాత్ర అమోఘమని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు.
మహోన్నతమైన కాళోజీ వ్యక్తిత్వం, తెంగాణపై చెరిగిపోని ముద్ర వేసిందని, ఆయన అసాధారణ ప్రతిభావంతుడని, వ్యక్తగా, ఉద్యమకర్తగా ఆయనది ఆదర్శవంతమైన జీవితం అని సభాధ్యక్షు కె.వి. రమణాచారి అన్నారు.
సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ, తాను ఐఏఎస్‌గా సెలెక్ట్ అవగానే తొలి ఆశీర్వాదం కాళోజీ నుంచే అందుకున్నానన్నారు.
కాళోజీ పురస్కార గ్రహీత అమ్మంగి వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ పురస్కారం మహోన్నతమైనదని, ఈ పురస్కారాన్ని తొలిగా అందుకునే అదృష్టం తనకు వరించే టట్టు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతు తెలియజేస్తు న్నానన్నారు. కాళోజీని తాను సుల్తాన్‌బజార్‌లో జరిగిన ఓ సభలో మొదటిసారి చూశానని, ఆ సభలో మాట్లాడిన కాళోజీ మాటతో తాను ఎంతగానో ప్రభావితుడినయ్యానని అన్నారు. ఆయన గొప్పకవే కాదు గొప్ప వక్త కూడా అని పేర్కొన్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింత రామచంద్రారెడ్డి, తొగు యూనివర్సిటీ వీసీ ఎూ్లరి శివారెడ్డి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంస్కృతిక సారథి రసమయి బాకిషన్, అంపశయ్య నవీన్, ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, వీకే విద్యార్థి, కాళోజీ కుటుంబసభ్యు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఢల్లి తెంగాణ భవన్‌లో..
కాళోజీ జయంతి ఉత్సవాు ఢల్లీిలోని తెంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. తెంగాణ సాహిత్యంలో కాళోజీ సేమ చిరస్మరణీయమని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ ప్రతినిధు, తెంగాణ విద్యావంతు వేదిక ప్రతినిధు పాల్గొన్నారు. మహాకవిగా ఎంతోమంది కవు గుర్తింపును తెచ్చుకున్నారు కానీ ప్రజాకవి అనే గుర్తింపు కాళోజీకే దక్కిందని, ప్రజకు అర్థమయ్యే భాషలోకి సాహిత్యాన్ని తీసుకెళ్ళిన గొప్ప సాహితీ వేత్త అని కేంద్ర సమాచార కమీషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు.
రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు ` తెంగాణ ఆధ్వర్యంలో కాళోజీ జయంతి వేడుక ఘనంగా జరిగింది. ఒక భాషపైన ఇంకో భాష దాడి చెయ్యొద్దని ప్రతిమనిషి తన ప్రాథమిక హక్కును కాపాడుకోవడానికి పోరాడాని తెంగాణ భాషా దినోత్సవంలో వక్తు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాట్లాడిన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తాను హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో భాషాపరంగా ఎన్నో అవమానాను ఎదుర్కొన్నానని, ఎవరేమనుకున్నా నా భాషలో నేనే మాట్లాడేదాన్నని అన్నారు. ముఖ్యమంత్రి ఓఎస్డీ, ప్రముఖ కవిగాయకుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ, మన రాష్ట్రకవి జయంతిని మనభాషాదినోత్సవంగా జరుపుకోవడం ఆనందంగా వుందన్నారు.తెంగాణ భాష, యాసపై వున్న పట్టువ్లనే మన ముఖ్యమంత్రి కేసీఆర్ విజయరహస్యమని, భాష ఒడుపు తెలిసి వుండటం వ్లనే ఆయన రాష్ట్రాన్ని సాధించగలిగారని తాను గట్టిగా నమ్ముతాననిపేర్కొన్నారు.
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో తొలి తెంగాణా భాషా దినోత్సవాన్ని, కాళోజీ జయంతిని సాంస్కృతికశాఖ,సమాచార పౌరసంబంధా శాఖ, విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లాలోనిఅన్ని పాఠశాు, కళాశాల్లోనివిద్యార్థిని, విద్యార్థుకు కాళోజీ జీవితం, సాహిత్యం, కవిత్వంపై చర్చు ఉపన్యాసాు, వ్యాసరచరను కవిసమ్మేళనాు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయు విద్యార్థినీ విద్యార్థుకు మాతృభాష గొప్పదనం, తెంగాణ భాష, యాసకు కాళోజీ చేసిన సేవను వివరించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డి.ఎస.్‌లోకేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ (ఇంచార్జ్) కె. బాబూరావు, భాషా సంస్కృతిక జిల్లా కన్వీనర్ పాకా భాస్కర్, వివిధ ప్రభుత్వాధికాయి పాల్గొన్నారు.
వరంగల్: వరంగల్ జిల్లా హన్మకొండలోని కాళోజీ విగ్రహానికి పూ మాు వేసి ఎమ్మెల్యేు దాస్యం వినయ్‌భాస్కర్, డాక్టర్ టి.రాజయ్య, కలెక్టర్ కరుణ తదితయి పాల్గొని ఘనంగా నివాళుర్పించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల్లో, పు ప్రభుత్వ కార్యాయాల్లో కాళోజీ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు.
హోం
»