అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో చిత్రమయిలో అక్టోబరు 1నుంచి 10వ తేదీ వరకు జరిగిన అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్శకులను ఆలరించింది.ఈ ప్రదర్శనను రాష్ట్ర స్పీకర్ వి. మధుసూదనాచారి ప్రారంభించగా, తెలంగాణ సాంస్కృతిక సారథి, శాసనసభ్యులు రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. తెలంగాణలో పుట్టి జాతీయ స్థాయిలో ప్రముఖులైన ఫొటో జర్నలిస్టులు, గత తరానికి చెంది హైదరాబాద్‌లో పుట్టి అంతర్జాతీయ స్థాయి ఫొటో గ్రఫీ చరిత్రలో తమ పాత్రను పోషిం చిన వ్యక్తుల కళాఖండాలు ఈ ప్రదర్శనలో చోటు చేసుకోవడం విశేషం. ఇరాక్ పై అమెరికా చేసిన దాడిని, దానిదరిమిలా అక్కడి సమాజంలో తలెత్తిన విపత్కర పరిస్థితులను చూపించే ఫోటోలు ఈ ప్రదర్శనకే తలమానికంగా నిలిచాయి.
తెలంగాణ నుంచి జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఫోటో జర్నలిస్టులు భరత్ భూషణ్, రవీందర్‌రెడ్డి ప్రదర్శించిన ఫొటోలుఛాయచిత్రాలు విశిష్టమైనవి. భారతదేశ ఆధునిక ప్రస్తానంలో ఒక మైలు రాయిగానిలిచే బాబ్రీమసీదు కూల్చివేత సంఘటనను తన కెమెరాలో బంధించి దేశ విదేశాలలో పేరుగాంచిన హైదరాబాద్ ఫొటో జర్నలిస్టు రవీందర్ రెడ్డి. ఒక చారిత్రిక ఘట్టాన్ని, దాని క్రమాన్ని అపురూపంగా కెమెరాలో బంధించిన రవీందర్ రెడ్డి అంకిత భావానికి, వృత్తి ధర్మానికి గీటురాయిగా నిలుస్తాయి. అదేవిధంగా తెలంగాణ గ్రామీణ జీవితాన్ని, అందులో భిన్న సామాజిక శ్రేణుల జీవన శైలిని కళాత్మక స్థాయిలో నిక్షిప్తం చేసిన ఫొటో జర్నలిస్టు భరత్ భూషన్. 150కి పైగా ఉన్న రంగుల ఛాయా చిత్రాలు ఆయన జీవిత కాలపు శ్రమకు మచ్చు తునకగా నిలుస్తాయి. సమాకాలీన ఫొటో గ్రఫీ చరిత్రలో తమదైన ముద్ర వేసిన బ్లూవీరేష్, రమేష్, శ్రీశైలం ఛాయాచిత్రాలు సందర్శకులను అలరించాయి..
ఛాయా చిత్రాన్ని కళాత్మక స్థాయిని చేకూర్చిన రాజా దీన్‌దయాల్, రాజా త్రయంబక్, రాజన్‌బాబు పిక్టోరియల్ ఫొటో గ్రఫీలో అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఛాయా చిత్రాలు ఈప్రదర్శనకే హైలైట్‌గా నిలిచాయి. శిల్పికంటే కూడా మిన్నగా ఛాయాచిత్రంలో బంధించిన రాజన్ బాబు పనితనం హైదారాబాద్ ఛాయాచిత్రాల చరిత్రలో చిరస్మరణీయమైంది.