హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభం నుంచి అమలు చేస్తున్న పటిష్ఠమైన, సమర్ధవంతమైన కార్యక్రమాల ద్వారా సంస్థకు మంచి పేరు లభించింది. అందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో, విస్తృత సేవలు అందించడం ద్వారా ఈ ఘనత పాధ్యమైంది. ఈ నేపథ్యంలో సంస్థ ఉన్నత పని తీరుతో అనేక జాతీయ, అంతర్జాతీయ ఉత్తమ అవార్డులను సొంతం చేసుకున్నది. వాటిలో కొన్ని.
- న్యూయార్క్ గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫోరమ్ ఆధ్వర్యంలో ”గ్లోబల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టు ఆఫ్ ది ఇయర్ 2013” అవార్డును సొంతం చేసుకుంది.
- స్కాట్లాండ్ కేంద్రంగా ఉన్న రోస్పా గోల్డ్ అవార్డ్ కన్‌స్ట్రక్షన్ సేఫ్టీీ అండ్ ఆక్యుపేషనల్ హెల్త్ కింద వరసగా 2013, 2014, 2015 లలో అవార్డులను గెల్చుకున్నది.
- బెస్ట్ మెట్రో ప్రాజెక్టు అవార్డును 2013, 2014 లలో గెల్చుకుంది. 2015లో బెస్ట్ అప్ కమింగ్ మెట్రో రైలు అవార్డును సొంతం చేసుకుంది.
- 2013లో అమెరికన్ కాంక్రీట్ ఇన్‌స్టిట్యూట్ (ఎసిఐ) అవార్డును పొందింది.
- ఇంటర్నేషనల్ సేఫ్టీ, క్వాలిటీ మరియు ఎన్విరాన్‌మెంటు మెనేజ్‌మెంటు – 2015 అవార్డును యు.కె.లోని ఐలిస్ క్యూఈఎం నుంచి పొందింది.
- 2016 స్కోచ్ అవార్డును పొందగా 2016లో జరిగిన వార్షిక మెట్రో రైల్ సమిట్‌లో బెస్ట్ అప్ కమింగ్ మెట్రోరైల్ అవార్డును గెల్చుకున్నది.
- 2017 మెట్రో రైలు స్టేషన్‌లకు ఐజిబిసి ప్లాటినమ్ రేటింగ్ అవార్డు ఐజిబిసి (ఎంఆర్‌టిఎస్) చే హైదరాబాద్‌లో ఇవ్వడం జరిగింది.