”మీకు అవసరంలేని వస్తువులు, బట్టలు ఉన్నాయా…? అయితే వాటిని వృథాగా పారవేయకుండా జీహెచ్‌ఎంసీ నిర్థారించిన ప్రదేశాల్లో ఉంచండి. అక్కడ ఉన్న వాటిలో మీకు అవసరం ఉన్నవి తీసుకువెళ్లండి” అనే నినాదంతో ‘వాల్ అఫ్ కైండ్నెస్’ పేరుతో జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన ప్రాంతాలు నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తమ ఇంట్లో ఏవైనా అవసరంలేని పుస్తకాలు కానీ, బట్టలు, చెప్పులు, ఇతర వస్తువులు ఏమున్నా ఇక్కడ వదిలివేసి, ప్రస్తుతం ఉన్న వస్తువుల్లో మీకేమైన అవసరం ఉనా వాటిని తీసుకెళ్లవచ్చని పేర్కొంటూ రాజేంద్రనగర్ సర్కిల్లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. బహిరంగ ప్రదేశాల వద్ద గోడలపై ‘వాల్ ఆఫ్ కైండ్నెస్’ అనే నినాదాన్ని రాయడం జరిగింది. దీంతో రాజేంద్రనగర్‌లోని అనేకమంది స్థానికులు తమ వద్ద వృథాగా ఉన్న బట్టలు, ఇతర వస్తువులను వదిలివెళ్తున్నారు. వీటిని అవసరం ఉన్నవారికి పంపిణీ చేస్తున్నారు. డా.బి.జనార్థన్‌రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ ‘వాల్ ఆఫ్ కైండ్నెస్’ ఏర్పాటు చేశామని ఆమె పేర్కొన్నారు. నగరంలో 50కి పైగా ప్రదేశాలలో ఏర్పాటు చేశారు. వీటికి ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తోంది.
హోం
»