ఆకాశమార్గాల-ఏర్పాటుకు-నిధులుహైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా 2015-16 వార్షిక బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. హైదరాబాద్‌ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీటవేశారు.

నగరంలో రోడ్ల అభివృద్ధి, ఆకాశమార్గాల ఏర్పాటుకు రూ. 1600 కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. కృష్ణా మూడవ దశ ద్వారా 90 యం.జి.పి.డి.ల నీటిని తక్షణమే తేవడం జరుగుతుంది. ఈ సంవత్సరాంతంలోగా గోదావరి మొదటి దశలో మరో 170 యం.జి.పి.డి.ల నీటిని చేర్చి శివారు ప్రాంతాలలో కూడా తాగునీటి సరఫరా మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

సేఫ్‌సిటీ కార్యక్రమం క్రింద ఒక లక్ష సి.సి. కెమెరాలను హైదరాబాద్‌ నగరంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కెమెరాలన్నీ ప్రతిపాదించిన కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం అయి వుంటాయి. షెడ్యూల్డు ప్రకారం హైదరాబాద్‌ మెట్రోరైలు పథకం 2017 జూలై నాటికి పూర్తి కావలసి వుంది.

2015-16 ప్రణాళిక బడ్జెట్‌లో జి.హెచ్‌.యం.సి.కి రూ. 526 కోట్లు, హెచ్‌.ఎం.ఆర్‌.కు రూ. 416 కోట్లు, హెచ్‌.ఎం.డబ్ల్యూ,ఎస్‌. అండ్‌ ఎస్‌.బి.కి రూ. 1,000 కోట్లు ప్రతిపాదించినట్టు ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు.

Other Updates