Untitled-11రాష్ట్రావతరణ జరిగిన రెండేళ్లలోనే ప్రపంచ ఐటీ యవనికపై తిరుగులేని ముద్రవేసింది తెలంగాణ. దశాబ్దాలుగా మనుగడలో ఉన్న రాష్ట్రాలను తలదన్నే వైవిధ్యమైన విధానాలు, ఆవిష్కరణలతో, అనితర సాధ్యమైన ఆచరణతో దూసుకుపోతోంది. రాష్ట్రాన్ని అగ్రశ్రేణిలో నిలపాలనే పట్టుదల, ఐటీ రంగంపై మంచి పట్టు, ఆకట్టుకునే వాగ్ధాటి కలిగిన యువనాయకుడు ఐటి శాఖా మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో ఐటీ శాఖ గత ఏడాది కాలంలో గణనీయమైన విజయాలను సాధించింది.

రాష్ట్రం ఏర్పడితే ఐటీ రంగం కుదేలవుతుందనే అపోహలను తొలి ఏడాదిలోనే పటాపంచలు చేశారు మంత్రి కేటీఆర్‌. స్థానిక ఐటి పరిశ్రమల అధిపతులతో నిత్యం సంభాషిస్తూ వారిలో విశ్వాసాన్ని నిలబెట్టారు. కొత్త రాష్ట్రంలో వారి వ్యాపారాభివృద్ధి అవుతుందనే నమ్మకాన్ని కల్పించారు. అదే సమయంలో గతంలో ఉన్న ఐటి పాలసీని సమగ్రంగా సమీక్షించి నూతన ఐటీ పాలసీ రచనకు ఉపక్రమించారు.

భూమిపుత్రులకు ఉద్యోగాల కొరకు టాస్క్‌!

నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇటు దేశీయ, అటు విదేశీ పారిశ్రామిక వేత్తలకు పరిచయం చేయడం, ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానాలు రూపొందించడం తొలిదశలో చేపట్టిన రాష్ట్ర ఐటీ శాఖ, తదనంతరం యువతలో నైపుణ్యాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది.

కొత్త పరిశ్రమలు రాగానే సరిపోదని, అందులో తెలంగాణ భూమిపుత్రులకు అత్యధిక శాతం ఉద్యోగాలు రావాలనే ఐటీ మంత్రి కేటీఆర్‌ సత్సంకల్పంతో తెలంగాణ అకాడెమీ ఆఫ్‌ స్కిల్‌ ఎండ్‌ నాలెడ్జి (టాస్క్‌)ని ఏర్పాటు చేశారు. ఐటీ శాఖ. డిగ్రీ, ఇంజనీరింగ్‌, డిప్లొమా చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగాలు సాధించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సాఫ్ట్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ వంటి శిక్షణ తరగతులను టాస్క్‌ నిర్వహిస్తోంది. నూతనంగా వస్తున్న పరిశ్రమలకు అవసరమైన నిపుణులను తెలంగాణ విద్యాసంస్థల నుండి తయారు చేయడం టాస్క్‌ ప్రత్యేకత. విస్తృతంగా ఉద్యోగావకాశాలు ఉన్న ఏరోనాటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ వంటి రంగాల్లో పేరుమోసిన సంస్థలతో టాస్క్‌ ఒప్పందాలను కుదుర్చుకుంది.

ప్రస్తుతం 294 కాలేజీలలో కార్యకలాపాలను సాగిస్తున్న టాస్క్‌ గత ఏడాది కాలంలో దాదాపు 43 వేల మంది యువతీ యువకులకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చింది.

స్టార్టప్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇండియా !

అంకుర పరిశ్రమల కొరకు ప్రోత్సాహం ఇచ్చే వ్యవస్థ ఒకటి హైదరాబాదులో ఉండాలనే ఐటీ శాఖ మంత్రి ఆలోచనల ప్రతిరూపమే టీ-హబ్‌. దేశంలోనే అతి పెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ హైదరాబాదులో స్థాపించాలనే సంకల్పం, కొద్ది కాలంలోనే కార్యరూపం ధరించింది. నవంబర్‌ 5, 2015 నాడు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, ప్రఖ్యాత వ్యాపారవేత్త రతన్‌ టాటా చేతుల మీదుగా హైదరాబాదులో టీ-హబ్‌ ప్రారంభమయ్యింది. అనతికాలంలోనే టి-హబ్‌ దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సాధించింది. మైక్రోసాఫ్ట్‌, యాహూ, అడోబ్‌, మెర్క్‌, ఇంఫోసిస్‌ వంటి అగ్రశ్రేణి సంస్థల అధినేతల నుండి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం టీ-హబ్‌ లో 200 అంకుర సంస్థల్లో దాదాపు 700 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నారు. నెలకొల్పిన కొద్ది నెలల కాలంలోనే టీ-హబ్‌లో ఉన్న అనేక స్టార్టప్‌ కంపెనీల్లో పెట్టుబడులు. వెల్లువెత్తుతున్నాయి.

అన్ని దారులూ తెలంగాణ వైపే

దార్శనిక నాయకత్వం, ప్రగతిశీల పారిశ్రామిక విధానాలు, అపారమైన వనరులు ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఐటీ రంగంలో అన్ని ప్రసిద్ధ కంపెనీలకు చిరునామాగా మారుతున్నది. గడచిన సంవత్సర కాలంలో అనేక పేరుమోసిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు తెలంగాణను తమ చిరునామాగా మార్చుకున్నాయి. ఇట్లా వచ్చిన, రాబోతున్న కంపెనీల జాబితాలో ఆపిల్‌, అమెజాన్‌, ఫ్లిప్‌ కార్ట్‌, థాంసన్‌, ఊబర్‌, సెల్‌ కాన్‌, మైక్రోమాక్స్‌, డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సింగపూర్‌, వాల్యూ లాబ్స్‌ తదితరమైనవి ఉన్నాయి.

గత ప్రభుత్వాల కాలంలో హైదరాబాదులోనే ఐటీ రంగ అభివృద్ధి మొత్తం కేంద్రీకృతం అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఆ తప్పు పునరావృతం కాకుండా ఐటీ మంత్రిత్వ శాఖ కృషిచేస్తోంది. దీని ఫలితంగానే మహబూబ్‌ నగర్‌ జిల్లా కొత్తూరు వద్ద అమెజాన్‌ ఫుల్‌-ఫిల్మెంటు సెంటర్‌ ఏర్పాటు చేయగా, వరంగల్‌ ఐటీ పార్కులో ప్రఖ్యాత ఐటీ కంపెనీ సైఎంట్‌ ఏర్పాటు కానున్నది. త్వరలో మరికొన్ని కంపెనీలను కూడా వరంగల్‌, కరీంనగర్‌ వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

డిజిటల్‌ తెలంగాణనే లక్ష్యం:

సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా పరిపాలనలో పారదర్శకత పెంచడం, పౌరులకు ఇంటి ముంగిటనే ప్రభుత్వ సేవలు అందేలా చేయడం వంటి లక్ష్యాలతో తెలంగాణ ఐటీ శాఖ డిజిటల్‌ తెలంగాణ ప్రణాళికను రచించింది. దీనిలో భాగంగా ఇంటింటికీ ఇంటర్నెట్‌ ఇచ్చే ఫైబర్‌ గ్రిడ్‌ పథకానికి శ్రీకారం చుట్టింది. గ్రామ స్వరాజ్యం కలగన్న గాంధీ మహాత్ముని జన్మదినం అక్టోబర్‌ నాడు గ్రామీణ ప్రాంతాల్లో పౌరసేవలు అందించే ఈ-పంచాయత్‌ వ్యవస్థను మొదలుపెట్టడం జరిగింది.

తొలి యేడాది బుడిబుడి నడకలతో ప్రారంభం అయిన రాష్ట్ర ఐటీ శాఖ ప్రస్థానం రెండో ఏడాది ముగిసేనాటికి స్థిరత్వాన్ని, వేగాన్ని సంతరించుకుని లక్ష్య సాధనవైపు వడివడిగా సాగిపోతో

అంకురానికి ఊతం!

టీ-హబ్‌ లో ఉన్న అంకుర పరిశ్రమలకు వచ్చిన పెట్టుబడులు

1) బాన్యన్‌ నేషన్‌ – వ్యర్ధాల నిర్వహణ రంగంలో పని చేసే ఈ అంకుర సంస్థలో అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్‌ సంస్థలు 8,00,000 డాలర్ల పెట్టుబడి పెట్టాయి.

2) ఫ్లాట్‌ పెబుల్‌ – ఆన్లైన్‌ లో ఫొటోగ్రాఫర్లను, వీడియోగ్రాఫర్లను సమకూర్చే సేవలు ఇచ్చే ఈ అంకుర సంస్థలో ఇండియన్‌ ఏంజెల్‌ నెట్‌వర్క్‌ రు. 4 కోట్లు పెట్టుబడి పెట్టింది

3) వి-డెలివర్‌: లాజిస్టిక్స్‌ రంగంలో నెలకొల్పిన ఈ స్టార్టప్‌ సంస్థలో రిలయన్స్‌ జెన్‌ ఎక్స్‌ వెంచర్స్‌ రు.2.5 కోట్లు పెట్టుబడి పెట్టింది

4) లైఫ్‌ సర్కిల్‌ – హోం నర్సింగ్‌ సేవలు అందించే ఈ స్టార్టప్‌లో ఫ్రెంచ్‌ హెల్త్‌ కేర్‌ గ్రూప్‌ 1,50,000 డాలర్లు పెట్టుబడి పెట్టింది

5) మై డెంటిస్ట్‌ చాయిస్‌ – డెంటిస్టులకు ఆన్లైన్‌ ప్లాటాార్మ్‌ే సమకూర్చే ఈ అంకుర సంస్థ అమెరికన్‌ ఏంజెల్‌ ఇన్వెస్టర్ల నుండి 1,50,000 డాలర్ల పెట్టుబడి సాధించింది

6) న్యూస్‌ డాష్‌: ఆన్లైన్‌ న్యూస్‌ అగ్రిగేటర్‌ స్టార్టప్‌ తొలి దశలో రూ. 20 లక్షల పెట్టుబడి సాధించింది

7) తెరనోసిస్‌ లైఫ్‌ సైన్సెస్‌ – బయోటెక్‌ అంకుర సంస్థ – తొలిదశలో రు. 20 లక్షల పెట్టుబడిని సాధించింది

ంది.

Other Updates