ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకోసం జరిగిన తొలి ఉద్యమంలోనూ, సీేఆర్‌ నాయకత్వంలో జరిగిన మలి ఉద్యమంలోనూ తెలంగాణ ఆడపడుచులు క్రియాశీలకంగా పాల్గొన్నారు. అనేక ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ బతుకులు మారిపోతాయని కలలుకన్నారు.

తెలంగాణ ఆడపడుచుల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక విశిష్ట పథకాలకు సీేఆర్‌ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది. ఈ పథకాల్లో చాలా వరకు దేశంలోని ఇతర ఏ రాష్ట్రాల్లో అమల్లో ఉన్నవికాదు. అనేక వినూత్న పథకాలు మన రాష్ట్రంలో అమలు జరుగుతుండడంతో ఇతర రాష్ట్రాలనుంచి ప్రతినిధి బృందాలు ఇక్కడికివచ్చి, పరిశీలించి తమ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకోవడం తెలంగాణకు గర్వకారణం.

ఆడబిడ్డలకు ఆపన్నహస్తం

నూతన తెలంగాణ రాష్ట్రంలో సీేఆర్‌ నాయకత్వంలో ఏర్పడిన తొలి ప్రభుత్వం మహిళల సంక్షేమం గురించి ఆలోచించని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. ఈ మూడే ళ్లలో మహిళలకు ఎన్ని విధాలుగా అండదండలందించవచ్చో, ఆపన్నహస్తం అందించవచ్చో మన ప్రభుత్వం నిరూపించింది. ఆయా పథకాలను అలవోకగా అవలోకిద్దాం రండి!

ఆసరా పెన్షన్లు
ts2
తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకు నిరుపేదలకు నెలకు ఇచ్చే పింఛను వేలం 200 రూపాయలు. ఈపింఛన్‌ను ప్రభుత్వం అమాంతం 1000 రూపాయలకు పెంచి ‘ఆసరా’ పింఛన్లుగా అందిస్తోంది. ఈ ఆసరా పింఛన్లను ఎక్కువ భాగం అందుకునేది మహిళలే. వితంతువులు, వృద్ధ మహిళలు 1000 రూపాయల పింఛన్‌ను నెలనెలా తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి మనస్సులోనే ఆశీస్సులు పలుకుతున్నారు. 35 లక్షలమందికిపైగా ‘ఆసరా’ పింఛన్లు అందించడానికిగాను 2016-17 బడ్జెట్‌లో ప్రభుత్వం 4693 కోట్ల రూపాయలను టాేయించింది.

బీడీ కార్మికులకు పెన్షన్లు

బీడీ కార్మికులలో దాదాపు అందరూ మహిళలే అనే విషయం అందరికీ తెలిసిందే. వీరికి ప్రభుత్వం పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. 3.71 లక్షలమంది బీడీ కార్మికులు ప్రతి నెల 1000 రూపాయల పింఛన్‌ను అందుకుంటున్నారు.

ఒంటరి మహిళలకు భృతి
ts4
వివిధ రకాల కారణాలతో కుటుంబాలు లేక, ఉన్నా కుటుంబాలకు దూరమై
ఒంటరిగా బతుకుతున్న అభాగ్య మహిళలకు నెలనెలా 1000 రూపాయల భృతి అందించాలని సీేఆర్‌ నిర్ణయించారు. ఈ ఏడాది రాష్ట్రావతరణ దినోత్సవం నాడు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దాదాపు 3 లక్షల మంది ప్రయోజనంపొందే ఈ పథకానికి బడ్జెట్‌లో 172.92 కోట్ల రూపాయలను ప్రభుత్వం టాేయించింది.

కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్‌: ts7

ఆడపిల్ల పుట్టినప్పటినుంచే ఆ పిల్ల పెళ్లి ఎలా చేయాలా అనే దిగులుపడే సమాజం మనది. ఆడపిల్లను భారంగా భావించి గర్భంలోనే పిండ విచ్ఛిత్తి చేయించడం, లేదా నవజాత ఆడ శిశువులను అంతం చేయడంవంటి అకృత్యాలు కొనసాగడం చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి సీేఆర్‌ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన యువతులకు పెండ్లి సమయంలో రూ. 51,000లను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాలని నిర్ణయించిన సీేఆర్‌ ఇప్పుడు ఆ మొత్తాన్ని 75,116 రూపాయలకు పెంచి, ఈ బడ్జెట్‌లో 850 కోట్ల రూపాయలను టాేయించారు. ఇప్పటివరకు (2016 డిసెంబర్‌ ఈ పథకంకింద 1,74,278మంది యువతులు లబ్ధి పొందారు. తొలుత ఎస్సీ/ఎస్టీ/మైనారిటీ కుటుంబాలకు చెందిన యువతుల ఈ పథకం వర్తింపజేసినప్పటికీ, 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ఇతర అగ్రకులాలవారికి, బీసీలకు ూడా వర్తింపజేస్తున్నది ప్రభుత్వం.

మార్కెట్‌ కమిటీలలో మహిళలకు రిజర్వేషన్లు: ts5

మార్కెట్‌ కమిటీలు ఆదినుంచి పురుషుల అధీనంలోనే నడిచేవి. అలాంటి ఈ కమిటీలలో దేశంలో ఎక్కడాలేనివిధంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఈ చర్యవల్ల ఎస్సీ/ఎస్టీ/బీసీ వర్గాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో మార్కెట్‌ కమిటీలకు ఛైర్‌పర్సన్‌లుగా నియమితులయ్యారు.

మహిళా, శిశు సంక్షేమంts1

మహిళలు లేని కుటుంబంకాని, సమాజంకాని మనం ఊహించలేం. సమాజంలో సగభాగం ఉన్న మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే సంకల్పంతో 2016-17 బడ్జెట్‌లో 1552 కోట్లు, 2017-18 బడ్జెట్‌లో 1731 కోట్ల రూపాయలను ప్రభుత్వం టాేయించింది. రాష్ట్రం అధీనంలోని మార్కెట్‌ కమిటీల్లో 33 శాతం స్థానాలను మహిళలకు టాేయించడమేకాక, చట్ట సభల్లో ూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కావాలని అసెంబ్లీలో తీర్మానం చేయించి ంద్రానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం.

ఆరోగ్యలక్ష్మి పోషకాహారంts8

ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయం మనందరికీ తెలిసినదే. రాష్ట్రంలోని తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండడానికిగాను అంగన్‌వాడీ ంద్రాలద్వారా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, పిల్లలకు ప్రతిరోజూ ఒక పూట పోషకాలతోూడిన సంపూర్ణ భోజనం అందించే కార్యక్రమాన్ని నూతన సంవత్సర కానుకగా, జనవరి 1, 2015 నుంచి అమలు చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ‘ఆరోగ్యలక్ష్మి’ అనే పేరిట ఈ పథకాన్ని 35,700 అంగన్‌వాడీ ంద్రాలలో అమలు చేస్తున్నారు. ఈ పథకానికి ప్రభుత్వం 2016-17 బడ్జెట్‌లో 396.77 కోట్లు, 2017-18 బడ్జెట్‌లో 675.02 కోట్లు టాేయించింది.

ఈ పథకంద్వారా 3,90,181మంది గర్భిణులు, బాలింతలు, 7 నెలలు-3 సంవత్సరాల మధ్య

వయస్కులైన పిల్లలు 9,63,709మంది, 3-6 సంవత్సరా మధ్య వయస్కులైన పిల్లలు 5,36,372మంది లబ్ధి పొందుతున్నారు. ఈ ఆరోగ్యలక్ష్మి పథకాన్ని

సమర్థవంతంగా నిర్వహించడానికిగాను అంగన్‌వాడీ టీచర్లకు, హెల్పర్లకు, సూపర్‌వైజర్లకు 24 ంద్రాలద్వారా శిక్షణ ఇస్తున్నారు. ఒక మిడిల్‌ లెవెల్‌ ట్రెయినింగ్‌ సెంటర్‌ను ూడా నిర్వహిస్తున్నారు.

దీపం

కిరోసిన్‌ వాడకంవల్ల వంట చేస్తున్న మహిళలు అనారోగ్యం బారిన పడుతున్నారని భావించిన రాష్ట్ర ప్రభుత్వం దీపం పథకాన్ని పెద్దెత్తున అమలు చేస్తోంది. 2000-2014 మధ్య 14 సంవత్సరాలలో వేలం 19.84 లక్షల దీపం కనెక్షన్లు మాత్రమే ఇవ్వగా, ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లు ూడా గడవకముందే 9.37 లక్షలమందికి దీపం కనెక్షన్లు ఇచ్చింది. ఇవేకాక, 20 లక్షల గ్యాస్‌ కనెక్షన్లను సామాజిక బాధ్యతకింద ఆయిల్‌ కంపెనీలు ఇచ్చేలా ప్రభుత్వం సంప్రదిస్తున్నది. తద్వారా కిరోసిన్‌ వాడని రాష్ట్రంగా రూపొందించాలని ప్రభుత్వ సంకల్పం. 2016-17 సంవత్సరంలో రూ. 27.22 కోట్ల మేరకు దీపం పథకానికి ప్రభుత్వం టాేయించింది.

అమ్మఒడి

గర్భిణులు, ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతాల్లోనివారు సుదూర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు వెళ్లాలన్నా, ప్రసవం తర్వాత ఇళ్ళకు వెళ్లాలన్నా అనేక కష్టాలు పడుతుండడం గమనించిన రాష్ట్రప్రభుత్వం ‘అమ్మఒడి’ పథకాన్ని ప్రారంభించింది. రోడ్లు, బస్సుల సదుపాయాలు లేని ప్రాంతాల్లో గర్భిణీలకు ఈ పథకం వరంగా మారింది. ఈ పథకంకింద గర్భిణులను ఆస్పత్రులకు క్షేమంగా తీసుకొని రావడం, ప్రసవం తరువాత తల్లీబిడ్డలను సురక్షితంగా ఇల్లు చేర్చడం చేస్తున్నారు. ‘102’కు ఫోన్‌ చేస్తే చాలు ప్రత్యేక సదుపాయాలున్న వాహనం వస్తుంది. డిసెంబర్‌ 21, 2016న 39 వాహనాలను మొదటి విడతగా ప్రవేశపెట్టారు. 2017-18 బడ్జెట్‌లో 144 కోట్ల రూపాయలను ఈ పథకానికి టాేయించారు.

గర్భిణీలు ప్రతి మూడు నెలలకు చెకప్‌లకోసం ఆస్పత్రులకు వెళ్ళాల్సివచ్చినా ఈ వాహన సేవలను ఉపయోగించుకోవచ్చు.

అంగన్‌వాడీల జీవితాల్లో పెనుమార్పు
ts3
అంగన్‌వాడీల కార్యకర్తలు, సహాయకులు చాలీచాలని జీతాలతో పడుతున్న వెతలను చూసి కదిలిపోయిన సీేఆర్‌ వారిపై ఈ మూడేళ్లలో రెండుసార్లు వరాల జల్లులు కురిపించారు. రాష్ట్రం ఏర్పడేనాటికి అంగన్‌వాడీ కార్యకర్తల జీతం రూ. 4200, సహాయకుల జీతం రూ. 2200 మాత్రమే. 2015 మార్చిలో అంగన్‌వాడీ కార్యకర్తల జీతాలు 7000 రూపాయలకు, సహాయకుల జీతాలు 4500 రూపాయలకు పెంచిన సీేఆర్‌ 2017 ఫిబ్రవరిలో కార్యకర్తల వేతనాలను అమాంతం రూ. 10,500లకు, సహాయకుల వేతనాలను రూ. 6000లకు పెంచడమేకాక, కార్యకర్తల ¬దాను టీచర్లుగా మార్చారు.

తెలంగాణ వచ్చిననాటినుంచి లెక్కగడితే, అంగన్‌వాడీ టీచర్ల జీతం 150 శాతం, సహాయకుల జీతం 172 శాతం పెరిగాయి. అంతేగాక, టీచర్లుగా పనిచేస్తున్న వారికి అర్హతలను బట్టి సూపర్‌వైజర్లుగా పదోన్నతి కల్పించడం, టీచర్లకు, సహాయకులకు బీమా సౌకర్యం కల్పించడం వంటి చర్యలు చేపట్టడంతో రాష్ట్రంలోని 35,700 ంద్రాలలో పనిచేస్తున్న 67,411మంది సిబ్బందికి ప్రయోజనం కలిగింది. పెరిగిన జీతాల కారణంగా 2017-18 బడ్జెట్‌లో రూ.459.71 కోట్లను టాేయించారు.

ప్రసవానికి రూ.12000 ఆర్థిక సాయం: ూలీనాలీ చేసుకునే పేద మహిళలు ప్రసవ సమయంలో అనేకపాట్లు పడుతుంటారు. పనికిపోలేక, ఆదాయం లేక ఇబ్బందులు పడుతుండడం గమనించిన సీేఆర్‌ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవం అయ్యే మహిళలకు ఆసుపత్రిలో చేరిన వెంటనే వారి జీవన అవసరాలకు మొదటి విడుతగా 4000 రూపాయాలు, డిశ్చార్జి సమయంలో మరో 4,000 రూపాయలు, శిశువులకు పోలియో టీకాలు వేసే సమయంలో మరో 4000 రూపాయలు ఇవ్వనున్నారు. ఆడపిల్ల పుడితే ప్రోత్సాహకంగా అదనంగా మరో 1000 రూపాయలు ఇవ్వనున్నారు. భ్రూణ హత్యల నివారణకు ఈ పథకం ఉపయోగపడుతున్నది.

కెసిఆర్ కిట్
నవజాత శిశువులకు కావలసిన 16రకాల సామాన్లతో 2000 రూపాయల వ్యయంతో ఒక కిట్‌ బహుమానంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కిట్‌కు సీేఆర్‌ కిట్‌ అని పేరు పెట్టాలని వినతులు రావడంతో ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. సీేఆర్‌ కిట్‌కు ప్రభుత్వం 2017-18 బడ్జెట్‌లో రూ. 600 కోట్లను టాేయించింది.

ఆశ కార్మికులకు వేతనాలు 6000 రూపాయలకు పెంపు: క్షేత్రస్థాయిలో ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశ కార్మికులకు నెలకు వేలం రూ. 1000, రూ. 1500 మాత్రమే ఇవ్వడం సరికాదని భావించిన ముఖ్యమంత్రి వారి జీతాలను నెలకు రూ. 6000 లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే బడ్జెట్‌నుంచి ‘ఆశ’ వర్కర్ల పారితోషికాలు అంగన్‌వాడీ వర్కర్ల స్థాయికి చేరుకుంటాయని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆశ వర్కర్లను ఇకనుంచి తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలుగా పిలవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యార్హతలు కలిగి తగిన శిక్షణ పొందిన ఆశ వర్కర్లకు ఏఎన్‌ఎం ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని ూడా ముఖ్యమంత్రి ఆదేశించారు.

స్త్రీనిధి – పది లక్షల వరకు వడ్డీలేని రుణంts6

పేద మహిళలను ఆర్థిక స్వావలంబనవైపు నడిపించడానికి ప్రభుత్వం ‘స్త్రీనిధి’ పథకానికి ప్రాధాన్యత ఇస్తున్నది. రాష్ట్రంలోని 4.22 లక్షల స్వయం సహాయక బృందాల్లోని 50 లక్షలమంది సభ్యులకు ఉపయోగపడేలా బృందాల రుణ పరిమితిని 5 లక్షలనుంచి 10 లక్షల రూపాయలకు పెంచింది ప్రభుత్వం. ఇందుకోసం నిధుల టాేయింపును ూడా రూ. 700 కోట్లనుంచి రూ. 1400 కోట్లకు పెంచింది.

రెవిన్యూ డివిజన్లలో మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలు: రాష్ట్రంలోని ప్రతి రెవిన్యూ డివిజన్‌లో ఒక మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, వచ్చే విద్యా సంవత్సరంనుంచి వీటిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని సంక్షేమ గురుకుల విభాగాల అధికారులను ఆదేశించింది.

ఎస్టీ విద్యార్థినులకు 15 రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలలు

రాష్ట్రంలో ఎస్టీ విద్యార్థినులకు ప్రత్యేకంగా డిగ్రీ రెసిడెన్షియల్‌ కళాశాలలు ఏర్పాటు చేయాలని సీేఆర్‌ నిర్ణయించారు. ఎస్సీ విద్యార్థినులకోసం ఇప్పటి 30 డిగ్రీ కళాశాలలను మంజూరు చేశారు. అదే తరహాలో ఎస్టీ విద్యార్థినులకు 15 డిగ్రీ రెసిడెన్షియల్‌ కళాశాలలు ఏర్పాటు చేయాలని సీేఆర్‌ ఆదేశించారు. గిరిజనుల జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో చదువులకోసం బాలికలు ఇబ్బందులు పడడం గుర్తించిన ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఉద్యోగినులకు 90 రోజులు చైల్డ్‌ ర్‌ే లీవ్‌

ఉద్యోగినులు తమ పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చే లోపల 15 రోజుల చొప్పున దశలవారీగా వాడుకునే విధంగా 90 రోజుల చైల్డ్‌ర్‌ే లీవ్‌ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల పిల్లల వివిధ అవసరాలకు సెలవు వాడుకోవడానికి ఉద్యోగినులకు వెసులుబాటు లభించింది.

షీక్యాబ్‌ సర్వీసులు

మహిళల భద్రతకు తెలంగాణ రాష్ట్రంలో అధిక ప్రాధాన్యం లభిస్తోంది. మహిళా ప్రయాణీకులకు మేలు జేయడంతో పాటు, మహిళా డ్రైవర్లకు ఉపాధి కల్పించే ఈ పథకం కింద తొలుత 10మంది మహిళా డ్రైవర్లతో షీ క్యాబ్‌ పథకాన్ని ప్రాంభించారు. 100 కార్ల వరకు త్వరలో విస్తరించనున్న ఈ పథకం కింద అర్హులైన మహిళా డ్రైవర్లకు 35 శాతం సబ్సిడీతో రూ.8.25 లక్షల విలువైన స్విఫ్ట్‌ డిజైర్‌ కార్లను అందజేస్తున్నారు.

మిషన్‌ వుమెన్‌ ప్రొటెక్షన్‌

మహిళలు, బాలికల భద్రత, రక్షణకోసం సీేఆర్‌ ఆదేశాల ప్రకారం ప్రభుత్వం పకడ్బందీ చర్యలను తీసుకున్నది. మహిళల భద్రత విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని సీేఆర్‌ నిర్ణయించారు. ఆయన ఆదేశాల ప్రకారం ఒక వుమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ఏర్పాటైంది. అలాగే బాలికలు, మహిళలపై యాసిడ్‌ దాడులకు పాల్పడినవారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకునేవిధంగా నేరస్తులకు 10ఏళ్లనుంచి జీవితకాలం శిక్ష విధించే విధంగా చట్టంలో మార్పులు తేనున్నారు.

షీటీవ్స్‌ు:

బాలికలకు, మహిళలకు పెద్ద బెడదగా పరిణమించిన ఈవ్‌ టీజింగ్‌ అనే జాడ్యానికి విరుగుడుగా సీేఆర్‌ షీటీవ్స్‌ుకి రూపకల్పన చేశారు. ముందు హైదరాబాద్‌ నగరంలో ఏర్పాటైన షీ టీమ్స ఈవ్‌టీజింగ్‌ను మహిళలపై వేధింపులను సమర్థవంతంగా అరికట్టడంతో, వీటిని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించారు. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన ఈ చర్యలను పలు ఇతర రాష్ట్రాలుూడా అనుసరించడం మనకు గర్వకారణం. ఏపీ, ఒడిశా, చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలు షీటీవ్స్‌ు బాటపట్టాయి. మహిళల భద్రత విషయంలో షీటీవ్స్‌ు పనితీరు ప్రశంసాపూర్వకంగా వుంది.

భరోసా

కుటుంబంలో, సమాజంలో పలు సమస్యలు ఎదుర్కొంటున్న బాలికలు, మహిళలకు ఆపన్నహస్తం ‘భరోసా’ ంద్రం తాగుబోతు భర్తలు, హింసకు పాల్పడే భర్తలు, వేధించే భర్తలనుంచి, తండ్రులనుంచి మహిళలకు, బాలికలకు రక్షణ కల్పిస్తున్నది భరోసా.. అటువంటివారిని పిలిచి కౌన్సిలింగ్‌ నిర్వహించడం, వారిలో సమూల మార్పు కలిగేలా కృషి చేయడంతో ‘భరోసా’ ంద్రం మహిళల పాలిట వరంగా మారింది.

మహిళల కోసం ప్రత్యేక కోర్టులు:

మహిళలపై జరిగే నేరాలను సత్వరం పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణా వ్యాప్తంగా 31 జిల్లాల్లోనూ జిల్లాకో మహిళా కోర్టుచొప్పున అందుబాటులోకి రాను న్నాయి. ఈ కోర్టుల్లో వేలం మహిళలకు సంబంధించిన నేరాలపైనే విచారణ జరుపుతారు. ఆయా జిల్లాల్లో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల్లో మొదటికోర్టును మహిళా కోర్టుగా మారుస్తారు. మహిళలను మానసికంగా, భౌతికంగా హింసించేవారిపై ఈ కోర్టు ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఇంత పెద్ద సంఖ్యలో మహిళా కోర్టులను ఏర్పాటు చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ కావడం గమనార్హం. మనందరికీ గర్వకారణం.

మహిళల భద్రత, రక్షణ విషయాలేకాక, వారికి సంబంధించిన అన్ని అంశాలలో రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటూ, వారి సమగ్ర అభివృద్ధికి, సాధికారతకు కృషి చేస్తోంది. వేలం మూడేళ్లలో మహిళలకోసం ఇన్ని పథకాలను గతంలో ఏ ప్రభుత్వమూ చేపట్టలేదు. ఏ రాష్ట్రంలోనూ చేపట్టలేదు. ఈ ప్రతి పథకం వెనుక ముఖ్యమంత్రి సీేఆర్‌ దార్శనికత దాగి ఉంది. ప్రతి చర్య వెనుక ఆయన చొరవ ఉంది. ప్రతి విజయం వెనుక ఆయన ఆశీస్సులున్నాయి.

శ్రీ గొట్టిపాటి సుజాత

Other Updates