tsmagazine
గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో పోటీ పరీక్షలకోసం సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు ఏకాగ్రత సాధన, విజయానికి పాటించాల్సిన పద్ధతుల గురించి ట్రెయినింగ్‌ క్లాసులను నిర్వహించే క్రమంలో చాలామంది విద్యార్థులు అడిగే ప్రశ్నలు ఎక్కువగా ఒరేకంగా వుంటున్నాయి. అందులో కొన్ని ప్రశ్నలు అందరికీ ఉపయోగకరంగా వుండే వాటిని చర్చించుదాం.

ఆత్మ విశ్వాసం
ఎందుకు సడలిపోతుంది?
(1) లక్ష్య నిర్ధారణ శాస్త్రీయంగా లేకపోవడం
(2) అశాస్త్రీయమైన నేర్చుకొనే పద్ధతులు
(3) నిజాయితీగా చదివే లక్షణం లేకపోవడం
(4) అనారోగ్యం
(5) ఆర్థిక పరిస్థితులను అంగీకరించలేకపోవడం
(6) తన బలాలు, బలహీనతలపట్ల ఉదాసీన వైఖరి

గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో పోటీ పరీక్షలకోసం సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు ఏకాగ్రత సాధన, విజయానికి పాటించాల్సిన పద్ధతుల గురించి ట్రెయినింగ్‌ క్లాసులను నిర్వహించే క్రమంలో చాలామంది విద్యార్థులు అడిగే ప్రశ్నలు ఎక్కువగా ఒరేకంగా వుంటున్నాయి. అందులో కొన్ని ప్రశ్నలు అందరికీ ఉపయోగకరంగా వుండే వాటిని చర్చించుదాం.

లక్ష్య నిర్ధారణ శాస్త్రీయంగా లేకపోవడం
తను ఏ పోటీ పరీక్షకు సన్నద్ధం కావాలో, తనకున్న లక్ష్యం, ఎలా నిర్ధారించుకోవాలో తెలియక, ప్రక్కవాళ్ళ ప్రేరణతో, విజయం సాధించిన వారిని అనుకరించడం వలన, ఆ లక్ష్యం కోసం పనిచేసే క్రమంలో తనకు కావలసినంత ప్రేరణ ఉండకపోవడం, కొన్ని రోజులు లక్ష్యం ఎలాగైనా సాధిస్తాననే భావన, మరికొన్ని రోజులు ఈ లక్ష్యాన్ని సాధించడం చాలా కష్టం, చుట్టూరావున్న వ్యక్తులు తనను నిరాశకు గురి అయ్యేట్టుచేసే కామెంట్స్‌, తను చదివినా, సరిగ్గా గుర్తుకు రాకపోవటం, చదివిన అంశాలు, మళ్ళీ చదివేటప్పుడు కొత్తగా చదువుతున్నట్టు అనిపించడం… చదువుతుంటె ఈ లక్ష్యం ఎంచుకోవడంలో ఏదో తప్పు చేసినట్టు అనిపించడం… అస్సలు ఈ లక్ష్యాన్ని ఎందుకు ఎంచుకున్నావంటే స్పష్టమైన జవాబు ఇవ్వలేకపోవడం.

లక్ష్య నిర్దారణకు ఈ క్రింది ఫార్ములాను ఉపయోగించండి
ఎస్‌-నిర్దుష్టంగా వుండాలి, స్పష్టంగా నిర్ణయించుకోవాలి
ఎం-మోటివేషనల్‌-స్ఫూర్తిదాయకంగా ఉండాలి
ఏ- అచీవబుల్‌ – సాధించదగిందై వుండాలి
ఆర్‌ – రియాలిస్టిక్‌ – వాస్తవానికి దగ్గరగా వుండాలి
టి – టైం బౌండ్‌ – సమయం నిర్ణయించుకోవాలి

అలాగే ఈ లక్ష్యం మానసిక లక్ష్యాలను ూడా నిర్ణయించాలి, ప్రతిరోజు ఎంత ఏకాగ్రతలో వుంటున్నాను. రాబోయే వారంలోగా ఏకాగ్రతను ఎక్కువే సాధిస్తాను, వచ్చేవారం నా పట్టుదలను పెంచుకుంటాను, మరొకవారం చదువుపట్ల ఆసక్తిని అభివృద్ధి పరుచుకుంటాను. ఈ లక్ష్యాలు తప్పకుండా వ్యక్తిని విజయద్వారం వద్దకు చేరుస్తాయి.
tsmagazine
అశాస్త్రీయమైన నేర్చుకొనే పద్ధతులు:
ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో వుండే పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే అభ్యర్థులు, ముందుగా సిలబస్‌ క్షుణ్ణంగా, అక్షరం విడవకుండా సూక్ష్మంగా చదివి, పాఠ్యాంశాన్ని అర్థం చేసుకోవాలి. సారాంశాన్ని, ముఖ్యమైన అంశాలను బిట్స్‌ రూపంలో వ్రాసుకోవాలి. అలా మొదటిసారి చదవడం అయిన తర్వాత, రెండవసారి చదవాలి. చదువుతూ, మొదటిసారి చదివినప్పుడు వ్రాసుకున్న నోట్స్‌ను పరిశీలించాలి. రెండవసారి చదువుతున్నప్పుడు కొత్త బిట్స్‌ను గమనిస్తే దాంట్లో జత చేయాలి. తర్వాత కొద్దిగా బిట్స్‌ మాత్రమే చదవాలి. ఒక అంశాన్ని మూడుసార్లు చదవడం అవుతుంది, ఆ తర్వాత, మార్కెట్లో వున్న క్వశ్చన్‌ బ్యాంక్స్‌ కొని నోట్స్‌ మెటీరియల్‌ చదివి, మళ్ళీ మనం రాసుకున్న బిట్స్‌తో పోల్చి కొత్త పాయింట్స్‌ వుంటే జత చేయలి. ఆ తర్వాత, క్వశ్చన్‌బ్యాంక్‌ను నిర్ణీత సమయం పెట్టుకొని, సాధించాలి. అప్పుడు 50 శాతం నుంచి 60శాతం లోపు వస్తే, నోట్స్‌ను మళ్ళీమళ్ళీ చదివి 80 శాతం మార్కులు వచ్చే వరకు సాధన చెయ్యాలి. మనం ఏ పద్ధతిలో చదివితే తొందరగా నేర్చుకోగలమో, ముందుగా అర్థం చేసుకొని ఆ ప్రయత్నం చేయాలి.

నిజాయితీగా చదివే లక్షణం లేకపోవడం
ఇది వినడానికి గమ్మత్తుగా వుండొచ్చుగానీ ఇది చాలామంది అభ్యర్థుల విషయంలో నిజం. ఒక అంశాన్ని ూలంకషంగా చదివితేనే,అబ్జెక్టివ్‌కు ప్రశ్నలకు సరిగ్గా జవాబు వ్రాయగలమని అందరికీ తెలుసు కానీ… తెలిసిన విషయాన్ని సరిగ్గా అనువర్తనం చేయలేరు. ఎందుకంటే అలా క్షుణ్ణంగ చదివితే… సమయం సరిపోదని,
మొత్తం సిలబస్‌ పరీక్ష తేదీలోగా పూర్తి చేయలేము
అంత లోతుగా చదవాల్సిన అవసరం లేదు
ఎక్కువ గంటలు, ఎక్కువ అంశాలు చదివితే కన్‌ఫ్యూజ్‌ అవుతాము.
పరీక్షల్లో అంత కఠినమైన ప్రశ్నలురావు
ఇలా రకరకాల కారణాలవల్ల పరీక్షకు ఎంత అవసరమో అంతే ప్రిపరేషన్‌ కాకుండా తనకు వీలైనంత, తన ఆలోచనా పరిధి, తనకున్న లిమిటేషన్‌లో ఆలోచించి తమకుతామే ఒక ఖైదీగా మారిపోతారు. చాలా లిమిటెడ్‌గా చదవడం మొదలుపెడతారు. ఈ పద్ధతిని వదిలేసి, చాలా విస్తృతంగా చదివే విధానం మీ విజయానికి దారిని చూపెడుతుంది.

అనారోగ్యం: శారీరక, మానసిక అనారోగ్యాన్ని గుర్తించిన తర్వాత వెంటనే నిపుణులను సంప్రదించి, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. చిన్న జబ్బే! తగ్గుతుందిలే అనే నిర్లక్ష్యం… అది చదువుమీద, ఆసక్తిమీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. రెగ్యులర్‌గా చదవాల్సినవి ూడా చదవలేకపోతున్నాను అని అన్పించినపుడు, వెంటనే ఆరోగ్యం గురించి, మనమీద పనిచేసే వత్తిడి గురించి ఆలోచించి తగిన జాగ్రత్తలు, నిపుణుల సలహాలు తీసుకొని చదువును కొనసాగించాలి.

ఆర్థిక పరిస్థితులు: నిరంతరం యువతను ఇబ్బంది పెట్టేది ఆర్థికంగా వెనకబడి వుండడం, ఇంటినుండి అవసరమైనంత సహాయాన్ని అడిగితీసుకోవడంలో మొహమాటం, నిజంగానే ఇంట్లో డబ్బుల్లేకపోవడం, ఈ వయస్సు సంపాదించే వయస్సు. ఇంకా ఇంట్లో అడగడం ఏంటి అనే మీమాంస. అర్థం చేసుకోవలసింది ఏమిటంటే ఈ సమయం విలువైనదని నమ్మటం.రాబోయే కాలం అంతా డబ్బు సంపాదించడాని ఉపయోగిస్తామని గుర్తించడం… మరి వెసులుబాటు కాకుంటే… రోజులో, వారంలో కొంత ఆర్థికంగా నిలబడడానికి ఏదైనా శారీరక శ్రమ తక్కువగా వున్న పనులు చేసి డబ్బును సంపాదించడం, అమెరికా వెళ్ళిన అందరు యువతీయువకులు ఇలా చిన్నచిన్న పనులు చేసి రోజువారి ఖర్చులకు సరిపోను డబ్బు సంపాదించుకుని.. డిగ్రీలు సంపాదించుకుంటున్నారు. ఒక ప్రత్యామ్నాయ పద్ధతిని ఏర్పాటు చేసుకొని చదువును కొనసాగించాలి తప్ప, ప్రతిరోజూ దాని గురించి మదనపడూడదు.

బలాలు, బలహీనతలు గుర్తించాలి:తన బలహీనతలని గుర్తించిన తర్వాత, దానినుండి బయటపడే మార్గాలు వెతకాలి. నిపుణులను కలిసి సలహాలు తీసుకొని బయటపడాలి. ఫేస్‌బుక్‌, వాట్సప్‌ యాప్‌, అనవసర వీడియోలు, పోర్న్‌ చిత్రాలు… ఇవి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, చదువును, ఏకాగ్రతను దెబ్బకొడతాయి. వీటినుండి తప్పకుండా బయటపడవచ్చు.
పై వాటిని గుర్తించి మిమ్మల్ని మీరు శక్తివంతులుగా తయారు చేసుకుంటే విజయం మీదే.

డా. వీరేందర్‌

Other Updates