టి.యు.
tsmagazine
హాలీవుడ్‌ సినిమాల్లో జర్నలిస్టు ఎలా ఉంటాడో అచ్చం అట్లాగే సూటూ-బూటూ వేసు కుని, చక్కని ఇంగ్లీషులో, అదనంగా హిందీలో, అందమైన తెలుగులో-ఈ మూ డింట్లో ఏ భాషలోనైనా, తనదైన స్టైల్‌లో మాట్లాడుతూ, చూడగానే ఇట్టే ఎవ్వరినైనా ఆకర్షించే స్ఫుర ద్రూపంతో, అట్టడుగు బడుగు భద్రయ్యనుంచి అత్యున్నత అధ్యక్ష పీఠం అధిరోహించినవారు, ప్రధాన అమాత్యుల దాకా ఎవరితోనైనాసరే, సమానరీతిలో మాట్లాడి తన పరిశీలనతో, పరిశోధనలతో, సత్యాన్వేషణతో రచనలు చేసిన సాహసవంతుడైన సృజనాత్మక శీలి, ప్రజ్ఞాశీలి – ఆదిరాజు వెంకటేశ్వరరావు.

జర్నలిజం రంగంలోకి అప్పుడప్పుడే ప్రవేశించిన వారికాేదు, ఆ రంగానికి సంబంధం లేని వారికి ూడా ఆదిరాజు వెంకటేశ్వరరావును చూడగానే జర్నలిజం రంగంలోకి వెళితే బాగుంటుందనే అభిప్రాయం కలిగించే రూపం, రీతి ఆయనవి. ఇక యువకులైతే ఆయన బాణీని అనుసరించడానికి వృథా ప్రయత్నం చేసేవారు. ఆయన వేగం అందరికీ అసాధ్యం. వృత్తిపట్ల ఆయన అంకితభావం అనుసరణీయమైనది. ఆయనలాగా ఉన్నత స్థానాలలో ఉన్నవారితో సంబంధాలున్న జర్నలిస్టులు చాలా అరుదు. ఎంతటి అమాత్యులతోనైనా, గవర్నరులు, న్యాయమూర్తులు, ఉన్నత స్థానాల్లోని అధికారగణంతోనైనా స్నేహం చేయడం, అవసరమైతే-ముఖ్యమంత్రులనైనా ఎదుర్కోవడం, బహుశా తెలుగు జర్నలిజం రంగంలో మరొకరెవరికీ సాధ్యంకాని విషయం. తమకున్న పరిచయాలు, పలుకుబడితో ఆయన స్థాయి జర్నలిస్టులు కోటీశ్వరులైపోతున్న ఈ సమకాలీన సమాజంలో, ఈనాటికీ ఆయన వేలం మాటల కోటీశ్వరుడుగానే మిగిలిపోయాడు. సుమారు ఐదున్నర దశాబ్దాల జర్నలిస్టు జీవితంలో ఏ ప్రభుత్వం ూడా ఆయన సేవలను సరిగా గుర్తించలేదు. అయితే ఈ యేడాది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 1969నాటి తెలంగాణ ఉద్యమ నాయకుడుగా విశిష్ఠ పురస్కారం ప్రకటించింది. లోగడ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు ప్రతిభా పురస్కారం అందజేసింది.

కొంతకాలంగా అస్వస్థులుగా ఉన్న ఆదిరాజు వెంకటేశ్వరరావు తన ఎనభయ్యవయేట 2018 జూన్‌ 14వ తేదీ రాత్రి కన్నుమూశారు. 1969లో రిపోర్టర్‌గా ఉంటూనే ఆయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని 21రోజులు జైలులో గడిపారు. ఆ సమయంలోనే పీపుల్స్‌ స్ట్రగుల్‌, తెలంగాణ పోరాటం 1969 గ్రంథాలను రచించారు. 1969నుంచి ఆయనతో కలసి పనిచేసినందున ఎక్కువ స్నేహం వారితో ఉండేది. ఆయన నమ్మిన సత్యాన్వేషణకు కట్టుబడి అవినీతిపై, అన్యాయంపై కత్తికన్నా పదునైన కలం ఝుళిపించేవాడు. ఏనాడూ అలసట కనిపించనీయక ఆరాటాన్ని, పోరాటస్ఫూర్తిని ఆదిరాజు ప్రదర్శించేవారు. తన నిరంతర రచనా శీలంతో దాదాపు ఇరవై గ్రంథాలదాకా తెలుగు-ఇంగ్లీషు భాషలలో ఆయన ఇటీవలి వరకు వెలువరించి సంచలనం కలిగించారు. వారి రచనల్లో-గాంధీ టు గాంధీ, సిక్స్‌ అండ్‌ ఇండి యా, ది రైట్‌ ప్రైవ్‌ు మినిస్టర్‌ పివి, నెహ్రూస్‌ గాంధీస్‌ అండ్‌ గ్రూప్స్‌, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ది గ్రేట్‌ రివల్యూషనరీ, మహాభారత్‌ టూ మన్మో హన్‌సింగ్‌, చంద్రబాబు బండారం, మహా నాయకుడు మర్రి చెన్నారెడ్డి, హంతకు డెవడు?, ఆంధ్ర – తెలంగాణ – ప్రత్యేక రాష్ట్రో ద్యమాలు, నక్సలిజం-పెరిగి పోతున్న అరాచకాలు మొదలగునవి ఉన్నాయి.

వృత్తిరీత్యా అమెరికా, స్విట్జర్లాండ్‌వంటి దేశాలు పర్యటించి మెరుపువేగంతో వార్తలు వ్రాసి తన ప్రత్యేకతను చాటారు. స్థానికంగా ముషీరాబాద్‌ జైలులో ఉరిశిక్షకు సిద్ధంగా ఉన్న నక్సలైట్‌ ఖైదీలు భూమాగౌడ్‌, కిష్టయ్యలను మారుపేరుతో కలుసుకుని, వారు అమా యకులు, నిర్దోషులని పేర్కొంటూ సంచలనాత్మక వ్యాసాలు వ్రాసిన సత్యాన్వేషి ఆదిరాజు. ఇట్లా ఆయన జర్నలిస్టు జీవితంలో ఎన్నెన్నో సంఘటనలను సంకోచం లేకుండా చెప్పేవారు.

ఏ రంగంలోకి ఆయన ప్రయత్నపూర్వకంగా వెళ్లలేదని చెప్పేవారు. ఖమ్మంజిల్లా పండితాపురానికి చెందిన ఆదిరాజు వెంకట సుబ్బారావు – వెంకట సుబ్బమ్మలకు 15 జూన్‌ 1938న జన్మించిన ఈయన చదువు అయిపోగానే 1957లో ఖమ్మం రికాబ్‌ బజార్‌ ఉన్నత పాఠశాలలో చేరాలనుకోలేదు, దానికి దరఖాస్తు ూడా చేయలేదు. కానీ స్వల్పకాలం ఆ అనుభవం గడించాడు. అట్లాగే హైదరాబాద్‌ జిల్లా పరిషత్‌ ఉద్యోగానికి సైతం ఎవ్వరినీ ఆశ్రయించలేదు. జిల్లా పరిషత్‌ కార్యదర్శి అవినీతి కార్యకలాపాలు సహించలేక బయటపెట్టి బయటకొచ్చాడు. ఈ దశలో ప్రముఖ జర్నలిస్టు జీఎస్‌ వరదాచారి ఎడిటర్‌ గోరాశాస్త్రి వద్దకు తీసుళ్ళాెడు. ఆదిరాజుని తన చొరవ, భాష చూసి ఆంధ్రభూమిలో ఉప సంపాదకుడుగా ఉద్యోగమిచ్చాడు. ఆ తర్వాత నూకల నరోత్తమరెడ్డి సంపాదకత్వాన వెలువడే గోలకొండ పత్రికలో సహాయ సంపాదకుడిగా రమ్మని పిలిచారు. ఆ తర్వాత ప్రసిద్ధ ఎడిటర్‌ నార్ల వెంకటేశ్వరరావు కోరి అప్పటి ఆంధ్రజ్యోతిలో రిపోర్టర్‌గా తీసుకున్నారు. అదే పత్రికలో ఢిల్లీ ప్రత్యేక విలేకరిగానూ పని చేశారు. రిపోర్టర్‌నుంచి స్పెషల్‌ కరస్పాండెంట్‌ స్థాయికి ఎదిగిన క్రమంలో ఉదయం, దక్కన్‌ క్రానికల్‌, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, హిమాచల్‌ప్రదేశ్‌ టైవ్స్‌ు మొదలైన ఎన్నో పత్రికలలో హైదరాబాద్‌, ఢిల్లీలో పనిచేశారు. 1978నుంచి సమాచార భారతి వార్తా సంస్థకు దక్షిణాది, మహారాష్ట్రల అధిపతిగా పనిచేశారు. స్వయంగా రాజధాని, జనతలాంటి పత్రికలు నడిపారు. కొంతకాలం జెమిని టీవీలో ఎగ్జ్యిూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేసి 1996వరకు అక్కడ ఉన్నారు. ఎక్కడ పనిచేసినా మీరు మా సంస్థలో ఫలానా బాధ్యత నిర్వహించండి ‘అని కోరితేనే’ చేశాడుతప్ప తనకుగా తాను ప్రయత్నించి ఎక్కడా పనిచేయ లేదనేవారు.

అయితే ఎక్కడ పనిచేసినా నమ్మిన సత్యాన్ని వ్రాయడాని ప్రాముఖ్యతనిచ్చాడు తప్ప ఉద్యోగం పోతుందని సత్యాన్ని ఏనాడూ ఆయన దాచలేదు. వృత్తిరీత్యా ఏనాడూ లాలూచీ పడలేదు. ఈ క్రమంలో ఎన్నైనా సంఘటనలను ప్రస్తావించవచ్చు. ఇంత నిజాయితీ, నిబద్ధత ప్రదర్శించిన ఆదిరాజు స్మృతికి నివాళి

Other Updates