janaradana-raoమిరిమిట్లు గొలుపుతూ, జిగేలుమనిపించే కాంతి విన్యాసాలు, అబ్బుర పరిచే నటుల నటనా కౌశలం, ఊపిరి బిగపట్టించే సన్నివేశాలు ఒకటేమిటి ఇలా ఎన్నో ..
అంటువంటి నాటకాల పరంపర ఇటీవల హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రేక్షకులను అలరించింది. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం భాష సాంస్కృతిక శాఖ సమర్పణలో నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా వారిచే ‘పూర్వోత్తరనాటకోత్సవాల’ పేరిట డిసింబర్‌ 23 నుండి 27 వరకు పలు నాటకాలను ఏర్పాటు చేసింది. వాటిని జంటనగరాల ప్రేక్షకులు చూసి, ఆస్వాదించి తన్మయత్వం పొందారు.
నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా సంస్థ ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైన ఈ నాటకోత్సవాలను తొలిసారిగా మన తెలంగాణా రాష్ట్రంలో నిర్వహించడం గర్వకారణమని నాటకాభిమానులు ఆనందాన్ని వెలిబుచ్చారు. విభిన్నమూ, వైవిధ్యమూ అయిన ఈశాన్య రాష్ట్రాల కళారూపాలని తొలిసారిగా మన నాటక కళాప్రియులు వీక్షించే అవకాశాన్ని మన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ కల్పించడం అభినందనీయ మైనదని కళాకారులు, అభిమానులు హర్షాతిరేకాలు తెలియ జేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కె.వి. రమణ మాట్లాడుతూ ‘కావ్యేషు నాటకం రమ్యమ్‌’ అని ప్రాచీన అలంకా రికులు చెప్పినదాన్ని బట్టి కళాప్రక్రియలన్నింటిలోనూ నాటకం అత్యంత జనరంజకమైనదనే అవకాశం కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా, న్యూఢల్లీి, సొసైటీ ఛైౖర్మన్‌, ప్రపంచ ప్రసిద్ధి పొందిన దర్శకులు రతన్‌ థియామ్‌ నాటకోత్సవాలను జ్యోతి ప్రకాశనం గావించి ఘనంగా ప్రాంరంబించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది దక్షిణ భారదేశంలోని వివిధ నగరాల్లో పూర్వోత్తర నాట్య సమారోప్‌ాను ఏర్పాటు చేస్తున్నందుకు నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా ఎంతో ఆనందిస్తోందని అన్నారు. ఈశాన్య భారతం నుంచి మైసూరు, హైదరాబాద్‌, బెంగళూరు వరకు వివిధ భాషలు, వివిధ శైలి, రూపాలు ఉన్న నాటకాలను ఒక్కచోట, ప్రదర్శితమయ్యేలా చేయడం ఈ ఏడాది తమ లక్ష్యం అని పేర్కొన్నారు.
సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ స్వాగతం పలుకుతూ, కళాకారులకు, కళారూపాలకు చిరునామా అయిన తెలంగాణాలో ‘నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా’ చేస్తున్న ప్రయత్నాన్ని ఆహ్వానించారు. ఈ సంస్థ అద్యక్షుడు ప్రముఖ నాటక కర్త రతన్‌ థియమాన్‌, నిర్వాహకులకు, కళాకారులకు ధన్యవాదాలు తెలిపారు. రథన్‌ థియామ్‌ను సాంస్కృతిక శాఖ పక్షాన ఘనంగా సత్కరించారు. సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి బి.పి. ఆచార్య తతిదరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Other Updates