magaపి.హర్ష భార్గవి

ప్రపంచంలో ఏప్రాంతమైనా సురక్షితంగా ఉండాలన్నా, అభివృద్ధి చెందాలన్నా శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే సాధ్యం. దీనిని గుర్తించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నారు. దీనిలో భాగంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటగా పోలీసు శాఖపై దృష్టిపెట్టి వారికి వాహనాలు మొదలుకొని క్షేత్ర స్థాయి సిబ్బందికి అత్యాధునిక పోలీసింగ్‌లో శిక్షణ ఇవ్వడమే కాకుండా ప్రజల్లో పోలీస్‌ శాఖపై ఉన్న అభిప్రాయాన్ని మార్చడం లో విజయవంతం అయ్యారు. అత్యున్నత సాంకేతిక పరికరాలతో సిబ్బంది విధులు నిర్వహించేందుకు ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్‌ నుండి భారీ ఎత్తున పోలీస్‌ శాఖకు నిధులు కేటాయించడం, ఆధునిక పద్ధతుల ద్వారా నేర నిర్ధారణ, సాక్ష్యాల సేకరణ, నేరం జరగ కుండా వివిధ శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంతే కాకుండా శాఖలో అవినీతికి తావు లేకుండా ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌’ పై దృష్టి సారించారు. మట్కాజూదం, పేకాట తదితర సామాజిక రుగ్మతలను ఉక్కుపాదంతో అణచివేయడానికి పోలీస్‌ శాఖ అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలీస్‌ శాఖలో పోస్టులను భర్తీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్య మంత్రి చంద్రశేఖరరావు ఆశించిన ‘బంగారు తెలంగాణ’కు బాటలు వేస్తూ పోలీస్‌ శాఖ పనితీరుతో అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ప్రశంశలతో పాటు వివిధ అంశాలలో దాదాపు 40బాహుమతులు అందుకోవడం పోలీసుశాఖ పనితీరుకు నిదర్శనం. ఇటీవల మెర్సీర్స్‌ అనే అంతర్జాతీయ సంస్థ చేసిన సర్వేలో హైదరాబాద్‌ని సురక్షిత, భద్రమైన నగరంగా గుర్తించడం జరిగింది.

HYDCOP- మొబైల్‌ అప్లికేషన్‌

హైదరాబాద్‌ అంతర్గత ఉపయోగం కోసం ఒక మొబైల్‌ ఆధారిత అప్లికేషన్‌ను సిటీ పోలీస్‌ ప్రారంభించింది. ప్రస్తుతం హైదరాబాద్‌ పోలీస్‌ శాఖలో ఉపయోగించే అన్ని ఐటీ అప్లికేషన్లు మరియు డేటాబేస్‌ ఈ యాప్‌కు అనుసంధానం చేయడంతో అధికారులు సులువుగా ఆపరేట్‌ చేయవచ్చు. నేరం జరిగిన ప్రాంతం నుండి సమాచారం, దృశ్యాలు యాప్‌ లో అప్లోడ్‌ చేయడం ద్వారా ఆన్‌ లైన్‌ విశ్లేషణాత్మక నివేదికలు పొందవచ్చు. ఈ యాప్‌ మొబైల్‌ టెక్నాలజీ అప్లికేషన్‌లో విప్లవం తీసుకొచ్చింది. సాంకేతిక పరిజ్ఞానంతో క్షేత్ర స్థాయి సిబ్బంది మరింత ఉత్తేజంతో విధులు నిర్వహించడం జరుగుతోంది.

భరోసా కేంద్రాలు

మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన సమైక్యతా మద్దతు కేంద్రం. 164 జతౄజ సెక్షన్‌ తో ”భారోసా సెంటర్‌” నుండి నేరుగా నాంపల్లి జిల్లా మెజిస్ట్రేట్‌ ముందు వీడియో కాన్ఫరెన్సింగ్‌ రికార్డింగ్‌ సౌకర్యం ద్వారా అత్యాచార బాధితులు వారి ప్రకటన చేయవచ్చు. ప్రకటన ఆడియో-వీడియో ఎలక్ట్రానిక్‌ పద్ధతులను ఉపయోగించి రికార్డ్‌ చేయడంతో అత్యాచార మరియు లైంగిక వేధింపుల బాధితులు తరచూ కోర్ట్‌ ప్రొసీడింగ్స్‌ మరియు ట్రయల్స్‌ దీర్ఘకాల విచారణ ప్రక్రియలు, ఆసుపత్రులలో, కోర్టులు మరియు పోలీస్‌ స్టేషన్లలో వేచి ఉండటం వంటివి లేకుండా ‘భరోసా సెంటర్‌’ ఈ బాధితుల పునః భీమాను నివారించడానికి లేదా కనీసం తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఉద్దేశ్యంతో, హైదరాబాద్‌ సిటీ పోలీస్‌, మహిళల మరియు పిల్లల రక్షణ కోసం ఒక ఇంటిగ్రేటెడ్‌ సపోర్ట్‌ సెంటర్‌గా భారోసా ఉంది.

జిల్లాలకు షీ టీమ్స్‌

తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు భద్రత కలిపిం చేందుకు పోలీస్‌ శాఖ వివిధ విధానాలు అవలంభిస్తోంది. హైదరాబాద్‌ నగరంలో ప్రారంభించిన షి టీమ్స్‌ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. బాధితులు 100 నెంబర్‌ కు డయల్‌ చేసి సమాచారం ఇవ్వడంతో సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. షీ టీమ్‌ల సమాచారం అనేక కళాశాలలు మరియు హాస్టళ్లలో వివిధ అవగాహన కార్యక్రమాలు, పోస్టర్లు, ప్రజా ప్రదేశాల్లో ప్రదర్శించబడే కరపత్రాల ద్వారా ప్రచారం చేయడం జరుగుతుంది. పట్టుపడిన ఈవ్‌ టీజర్స్‌ తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్‌ చేయడం జరుగుతుంది. షీ టీమ్స్‌ స్థాపించిన రెండు సంవత్సరాలలో 800 మందిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవడం జరిగింది. మహిళలపై నేరాలు 20 శాతం తగుముఖంపట్టాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం లో అమలు అవుతున్న షీ టీమ్స్‌ పై అధ్యయనం చేస్తున్నాయి.

HAWK EYE
హైదరాబాద్‌ పోలీస్‌ మహిళల భద్రత కోసం ‘హాక్‌ ఐ’ మొబైల్‌ అప్లికేషన్ను ప్రారంభించింది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ లో భాగంగా ప్రారంభించిన ‘హాక్‌ ఐ’ యాప్‌ తో సిటిజన్‌ పోలీసింగ్‌, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు, ట్రాఫిక్‌ ఉల్లంఘనలను నిరోధించడం జరుగుతుంది. యాప్‌లో సహాయం కోసం ూూూ బటన్ను కలిగి ఉంటుంది. మహిళలు ప్రయాణించే వాహనం యొక్క ఫోటోను లేదా రికార్డు వీడియోను క్లిక్‌ చేసి, అప్లోడ్‌ చేసినట్లయితే అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం పోలీసులను సంప్రదించడానికి ూూూ ఫీచర్‌ ఉపయోగపడుతుంది.

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ లైవ్‌:

ఫాస్ట్‌ మరియు సేఫ్‌ డ్రైవ్‌ హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ సదుపాయం కోసం ఒక సాధనం ”హైదరాబాద్‌ ట్రాఫిక్‌ లైవ్‌” మొబైల్‌ అనువర్తనం ప్రారంభించింది, ఈ మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా ట్రాఫిక్‌ సంబంధిత సమాచారాన్ని ఎప్పటికపుడు ప్రయాణీకులు / పౌరులకు అందించడం జరుగుతుంది.

పాస్‌ పోర్ట్‌ దరఖాస్తుదారుల ధృవీకరణ:

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ ”మెసేజింగ్‌ సిస్టమ్‌” ప్రవేశపెట్టబడింది, ఇందులో పాస్‌ పోర్ట్‌ దరఖాస్తుదారులకు ప్రి-పోస్ట్‌ మరియు పోస్ట్‌ వెరిఫికేషన్‌ ఎస్‌ఎమ్‌ఎస్‌ హెచ్చరికలు, వారి ధృవీకరణ యొక్క స్థితిని తెలుసుకునే సౌకర్యం కలిగించడం జరిగింది. అంతే కాకుండా 5 రోజులలో విచారణ పూర్తి చేయడం జరుగుతుంది.

ఎలక్ట్రానిక్‌ లైవ్‌ స్కాన్‌

హైదరాబాద్‌ ఫింగర్‌ ప్రింట్‌ యూనిట్‌ నగరంలో ఎలక్ట్రానిక్‌ లైవ్‌ స్కాన్‌ పరికరాన్ని ఆవిష్కరించింది. దీన్ని ఉపయోగించి నిందితుల ముద్రలు సులువుగా పరిశీలించవచ్చు. ఈ వ్యవస్థ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ రంగంలో తీవ్ర మార్పును తెస్తుంది. ఇంక్‌, రోలర్‌ మరియు స్లాబ్‌ తో ఫింగర్‌ ప్రింట్స్‌ తీసుకోవడం పాత, సాంప్రదాయ పద్ధతి నుండి తెలంగాణ పోలీస్‌ శాఖ మార్పు తీసుకొని వచ్చింది.

ఫోర్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ యొక్క కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఈ వెబ్‌ సైట్‌ ఏర్పాటు చేయడం జరిగింది.మొబైల్‌ ఫోన్ల ద్వారా డేటాను నమోదు చేయడానికి పోలీసు సిబ్బందిని అనుమతిస్తుంది. అంతే కాకుండా అధికారులు, సిబ్బంది సెలవు దరఖాస్తులను ఆన్‌ లైన్‌ ద్వారా మంజూరు చేయబడతాయి. హెడ్‌ ఆఫీసు ఉద్యోగుల అవసరాలను తీర్చటానికి ఆఫీస్‌ లో వివిధ ఆటోమేటిక్‌ పరికరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఆదేశాలు, మెమోలు ఆన్‌లైన్‌లో జారీ చేయబడతాయి. ఉద్యోగుల సర్వీస్‌ వివరాలు అన్ని ఆన్‌లైన్‌లో అప్లోడ్‌ చేయబడ్డాయి. కార్యాలయంలో పేపర్‌ రహిత ప్రక్రియ కొనసాగుతోంది. ఆఫీసు వద్ద అందుకున్న అన్ని పత్రాలు మంచి ట్రాకింగ్‌ కోసం ఆన్‌లైన్‌ వ్యవస్థలో నమోదు చేయబడ్డాయి.

విశ్లేషణ ల్యాబ్‌

మెట్రిక్‌-టేబుల్స్‌ ద్వారా వివిధ సంచలనాత్మక, క్లిష్టమైన కేసులను గుర్తించడంలో దర్యాప్తు అధికారులకు సహాయం చేయడానికి విశ్లేషణ ల్యాబ్‌లు కమిషనరేట్‌ స్థాయిలో ఏర్పాటు చేయబడింది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, వరంగల్‌ జిల్లాల్లోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో 2335 కేసులలో ఈ లాబ్‌ ద్వారా ఏడాదిలో ఫలవంతమైన ఫలితాలను సాధించారు.

కమ్యూనిటీ సి సి టి వి ప్రాజెక్ట్‌ :

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ యాక్ట్‌ అమలులో భాగంగా, కమ్యూనిటీల ప్రేరణతో హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ నిఘా కెమెరాలు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా హనుమాన్‌ జయంతి, శ్రీరామనవమి, బోనలూ, గణేష్‌ శోభాయాత్ర, నిమజ్జణం, మిలాద్‌ ఉన్‌ నబి మొదలైన కార్యక్రమాలను కమిషనరేట్‌ సెంట్రల్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుండి పర్యవేక్షించడం జరుగుతుంది. కొన్ని ముఖ్యమైన కేసులలో కమ్యూనిటీ సిసి టివి ఫుటేజ్‌లతో పరిష్కరించడం జరిగింది.

వెహికల్‌ మౌంటెడ్‌ కెమెరాస్‌:

హైదరాబాద్‌ నగరంలో ఏదైనా శాంతి భద్రతల సమస్యలను పరిష్కరించడానికి వేల్లే పోలీస్‌ వాహనాల పై కెమెరా బిగించి ఉంటుంది, నేరస్థులను తనిఖీ చేయడానికీ సి.సి.టి.వి. కెమెరాలు, జిపిఎస్‌ ద్వారా కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానించబడి ఉన్నాయి, దీని ద్వారా ఏ సమయంలోనైనా సంఘటనా స్థలానికి చేరుకోవచ్చు.

Other Updates