tsmagazineమానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పూర్తిగా మన చేతిలోనే వుంటుంది.రాఘవ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి కాంపిటీటివ్‌ పరీక్షలకోసం సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికి రెండు పరీక్షలు వ్రాశాడు కానీ దేంట్లోను విజయం సాధించలేకపోయాడు. దాంతో కృంగిపోయివుంటే, వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరికి తీసుకొని వచ్చారు. అతనితో గంటసేపు చర్చించిన తర్వాత, తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు అర్థం అయ్యిందేమిటంటే తను ఆలోచించే విధానం సరిగ్గా లేదని.. ఆ విధానం ఆయన్ను సరిగ్గా పని చేయనీయట్లేదని అర్థం అయింది.

స్నేహితులందరితోనూ ఏదో రూపంలో గొడవలు.. అందరూ దూరం అయ్యారు. తను ఎందుకు పనికిరాను అనే భావన, ప్రతిరోజూ తనకు ఏదో అన్పిస్తోంది.. అలా అన్పించిన ఫీలింగ్‌ ప్రకారమే రోజూ నడుస్తుంటాడు. ఏదైనా విషయంలో తల్లిదండ్రులు చెప్పడానికి ప్రయత్నిస్తుంటె.. నాకు తెలుసు మీరేమంటారో అంతే కదా! అంటూ మిగతా విషయం చెప్పనీయకుండా మధ్యలోనే అందుకొని వాక్యాన్ని ఆయనే పూర్తి చేస్తాడు. అదికాదు నేను చెప్పాల్సిన విషయం అంటె.. ఎంతకూ వినడు.. ఇలా రాఘవ ప్రవర్తిస్తున్నాడు.. సరిగ్గా ఆలోచించే పద్ధతులు ఏమిటో వివరంగా చెప్పి… వాటిని సాధన చేసిన తర్వాత మంచి మార్కులతో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాడు. అంతలా ప్రభావితం చేసిన తప్పుడు ఆలోచన విధానం ఏమిటో తెలుసుకుందాం!

డిస్‌క్వాలిఫైయింగ్‌ ది పాజిటివ్‌
జీవితంలో జరిగే ఎన్నో మంచి సంఘటనలు ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా,పరిగణనలోకి తీసుకోకుండా ఉండే లక్షణం.
ఉదా: వార్షిక పరీక్షల్లో నీవు గణితంలో మంచి మార్కులు సాధించావు అనే అభినందనను స్వీకరించకుండా, నాకా! ఎబ్బె! చాలా తక్కువ మార్కులు వచ్చాయి. ఏదో కావాలని, నన్ను పొగడాలని అంటున్నావు తప్ప అవేమీ గొప్ప మార్కులు కావు.

ఆల్‌ ఆర్‌ నథింగ్‌
ఉదా|| కాలేజీలో జరిగిన పరీక్షల్లో 80% వచ్చింది, అని అనగానే అబ్బె! 90% వస్తేనే గొప్ప కాని 80% వస్తే వేస్ట్‌, పనికిరాని మార్కులు అని అనడం.

మెంటల్‌ ఫిట్టర్‌
మంచిని వదిలేసి చాలా చిన్న తప్పును పెద్దదిగా ఆలోచించి, దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం. ఉదా: కాలేజీలో ఒక ప్రజెంటేషన్‌ ఇచ్చావు.. అందరూ మెచ్చుకున్నారు. చివర్లో ఒక పదం సరిగ్గా చెప్పలేదు అని ఒక్కరు అనగానే.. ఇహ నేను ఎప్పుడు, ప్రజెంటేషన్‌ ఇవ్వను… తప్పు చేశాను.

జెంపింగ్‌ టూ కన్ల్‌ూజన్‌
ప్రతి విషయానికి, ఒక నెగెటివ్‌ అభిప్రాయానికి రావడం, భవిష్యత్తును ముందే భయానకంగా, బాధగా ఊహించేసుకోవడం.
ఉదా: మీరు ఒక పార్టీకి వెళ్ళారు. మీ డ్రెస్‌ బాగా లేదనుకుంటున్నారు, వెంటనే అందరూ నిన్ను చూసి నవ్వుకుంటున్నారు.
(బి) డ్రైవింగ్‌ లైసెన్స్‌కోసం పరీక్షకు వెళ్తున్నారు. పరీక్షకంటే ముందే… నేను తప్పకుండా ఫెయిల్‌ అవుతాను

మాగ్నిఫైయింగ్‌ లేదా మినిమైజింగ్‌
వీరు జీవితంలో జరిగే పెద్ద మంచి పనులు చాలా చిన్నవిగా చేసి, చిన్నగా జరిగే నెగిటివ్‌ పనులను పెద్దదిగా చేసి చూడడం.. ఎదుటి వాళ్లలో చిన్నచిన్న తప్పులను పెద్దగా చూడడం, మంచి పనులను చాలా చిన్నగా చూడడం లేదా రివర్స్‌గా ఆలోచించడం.

ఎమోషనల్‌ రీజినింగ్‌
మన భావనలు, నిజాలకు కొలమానాలు అని అనుకొనే వాళ్లు, నాకు ఇది కరెక్ట్‌కాదు అన్పిస్తుంది కాబట్టి ఇది కరెక్ట్‌కాదు, అంతే, నా ఫీలింగ్స్‌ ఎప్పుడు కరెక్ట్‌ అవునో కాదో అని చెప్తుంది అని అంటారు. దానికి ఏ ఆధారం వుండదు, ఏ నిరూపణ ూడా లేకుండా నమ్మడం.
ఉదా|| నేను చూడడానికి బాగుండను, అంతే నా ఫీలింగ్‌ నాకు నిజం, అందు నేను మంచి బట్టలు కొనుక్కోను. ఎంత మంచి బట్టలు వేసుకున్నా నేను బాగుండను. వేసుకొని ఏం లాభం.
(బి) నేను గొప్ప స్టూడెంట్‌ కానని నా నమ్మకం. అందు నాకు ఎన్ని మార్కులు వచ్చినా నేను నమ్మను.

లేబెలింగ్‌
ఏదైనా సంఘటన జరగ్గానే వెంటనే వాళ్ళకు వాళ్లు ఒక పేరు పెట్టుకుంటారు. దాంతో రోజులు రోజులు బాధపడుతుంటారు. ఉదా: ఏదో ఒక పరీక్షలో కొన్ని తప్పులు జరుగుతాయి. వెంటనే అంతే. నేను ఓ పెద్ద లూసర్‌ను, నాకు ఏమిరాదు అన్ని వచ్చినట్టె వచ్చి, చేజారిపోతాయి. నేను నష్టజాతకుడును అని లేబుల్‌ వేసుకుంటారు.

పై విధానాల్లో ఎన్ని తప్పుగా ఆలోచించే విధానాలు పాటిస్తున్నారో తెలుసుకోండి. వాటిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తే తప్పకుండా జీవితం సంతోషంగా ఉండడమేకాకుండా, రోజువారి కార్యక్రమంలో ూడా ఉత్సాహంగా వుంటుంది. మానవ సంబంధాలు, కుటుంబంలో సంబంధాలు ూడా ఆరోగ్యంగా ఉంటాయి. చదువుపట్ల ఆసక్తి, లక్ష్యంపట్ల పట్టుదలను కోల్పోకుండా ప్రయాణం కొనసాగిస్తే, అది విజయాల తీరాన్ని చేరుతుంది.

Other Updates