aruటి.ఎస్‌.ఐపాస్‌ ద్వారా ఐదు విడతలలో 33101 కోట్ల రూపాయలతో ఏర్పాటైన పరిశ్రమలలో 1,20,169 మందికి ఉద్యోగవకాశాలు వచ్చాయి. గతంలో పారిశ్రామిక వేత్తలు తమ పరిశ్రమలకు కావలసిన అనుమతులకోసం వివిధ శాఖలను సంప్రదించాల్సిన అవసరంవుండేది. కాని టి.ఎస్‌.ఐపాస్‌ వచ్చాక ప్రభుత్వం కేవలం వారి స్వంత దృవీకరణ ఆధారంగా అన్ని శాఖల అనుమతులను వారికి అందించి పరిశ్రమల ఏర్పాటులో మార్గం సుగమం చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో టి.ఎస్‌.ఐపాస్‌ ద్వారా ఆరవ విడత 18 కంపనీలకు సంబంధించి 2167 కోట్ల 47 లక్షల రూపాయల పెట్టుబడితో 13817 మందికి ఉద్యోగావకాశాలు కల్పించే పరిశ్రమలకు మార్చి 8 నాడు అనుమతి పత్రాలను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అందించారు.

ప్రపంచంలోనే టి.ఎస్‌.ఐపాస్‌ అనే గొప్ప పాలసీని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు గారి నాయత్వంలో అవినీతికి ఆస్కారం లేకుండా 15 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నామని మంత్రి అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పారిశ్రామిక వేత్తలు దరఖాస్తు చేసుకున్న 15 రోజులలోపు 16 నుండి 17 శాఖలకు సంబంధించిన అనుమతులన్ని అందించే ఏర్పాటును కల్పించామని మంత్రి కృష్ణారావు తెలిపారు. టి.ఎస్‌.ఐపాస్‌ ద్వారా రాష్ట్రానికి ఎంతో మేలు జరిగిందని, రాష్ట్ర ఆదాయం పెరగటమే కాకుండా స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగవకాశాలు కలుగుతున్నాయని చెప్పారు.

రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు లేకుండా మెరుగైన పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేశామని, ఈ పాలసీ ప్రకటించాక ఒక్క ఫిర్యాదు కూడా అందలేదని తెలియజేస్తూ స్థానిక యువతకు తప్పనిసరిగా ఉద్యోగాలు ఇవ్వాలని పరిశ్రమల యజమానులకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా అనుమతులు అందుకున్న పారిశ్రామిక వేత్తలు టి.ఎస్‌.ఐపాస్‌ విధానంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, గతంలో కంటే భిన్నంగా అధికారులే ముందుకు వచ్చి అనుమతులు ఇస్తున్నారని, తక్కువ సమయంలోనే వివిధ శాఖల అనుమతులు ఇస్తున్నారని, పరిశ్రమల స్థానికు మెరుగైన వాతావరణం తెలంగాణలో వుందని, ఇది పరిశ్రమలు నెలకొల్పేవారిలో నమ్మకాన్ని కల్గించిందని తెలిపారు. ఆరవ విడత అనుమతుల సందర్భంగా రంగారెడ్డి, ఖమ్మం, మెదక్‌, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ జిల్లాలలో స్థాపించే 18 పరిశ్రమలకు అనుమతి పత్రాలను మంత్రి అందజేశారు.

ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి అరవిందకుమార్‌, టి.ఎస్‌.ఐపాస్‌ యండి వెంకట నరసింహారెడ్డి, పరిశ్రమల శాఖ జాయింట్‌ సెక్రటరి సైదా, అడిషనల్‌ డైరెక్టర్‌ దేవానంద్‌, జాయింట్‌ డైరెక్టర్‌ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Other Updates