గత నెల సంచికలో ప్రపంచవ్యాప్తంగా మనుషులు ‘తప్పు’గా ఆలోచించే పద్ధతులను గురించి చర్చించాము. వాటిని గుర్తించి, తాము ఆలోచించే విధానం వలననే జీవితంలో అశాంతి, ఎంతో వత్తిడిని అనుభవిస్తున్నామని తెలుసుకోవాలి, దానినుండి బయటకు రావాలి అంటే, ముందు మన ఆలోచనలను శాస్త్రీయంగా విశ్లేషించుకొని, సరైన పద్ధతిలో ఆలోచనను మార్చుకుంటే.. ఎవ్వరివల్లనో వస్తుందనుకున్న వత్తిడి చివరకు మన వల్లనే అని అర్థం అవుతుంది. ఆలోచన సరి కాగానే వత్తిడి దూరమై, ఉత్సాహంగా తయారౌతాము.
tsmagazine

డా. సి. వీరేందర్‌
ఉదాహరణకు: మీరు రోడ్డుపైన వెళ్తున్నారు, ఎదురుగా మీకు తెలిసిన వ్యక్తి వస్తున్నాడు కానీ మిమ్మల్ని చూడనట్టుగా మిమ్మల్ని దాటి వెళ్ళిపోయాడు.. అప్పుడు మీరు ఎలా ఫీలౌతారు.. కోపం వస్తుందా, కన్‌ఫ్యూజ్‌ అవుతారు, విచా రంలో మునిగి పోతారా? లేదా చాలా అవమా నంగా ఫీలౌతారా? చాలా మందికి ఎప్పుడో ఒకసారి ఇలాంటి పరిస్థితి ఎదురౌతుంది.. మనం ‘విష్‌’ చేసిన అవతలి వాళ్లు అస్సలు పట్టించు కోకుండా పోవడం.. ఆ పరిస్థితికి మనకు చాలా రోజుల వరకు, బాధిస్తూనే వుంటుంది.. కొంద రికైతే.. నిద్రకూడా పట్టదు… పూర్తి విచారంలో మునిగి పోతారు.. నిజానికి ఇలాంటి ఫీలింగ్స్‌ మనకు మన ఆలోచనలోంచి ఉద్భవిస్తాయి, ఈ ఆలోచనలు ఆటోమేటిగ్గా వస్తాయి. ఒక్కోసారి మనకే ఆశ్చర్యం వేస్తుంది.. ఏంటి నాలో ఇలాంటి ఆలోచనలు తిరుగుతున్నాయా అని. ఒక్కొక్కసారి డిప్రెషన్‌, యాంక్సైటీ ఉన్న వాళ్ళకైతే ఇవే ఆలోచనలతో మెదడు నిండిపోతుంది. అదే అలవాటుగా మారిపోతుంది. అప్పుడు, ఆ వ్యక్తి నన్ను ద్వేషిస్తున్నాడు కాబోలు, అందరిలాగానే అతను కూడా నన్ను ద్వేషిస్తున్నాడు కాబోలు, అందరిలాగానే అతను కూడా నన్ను ద్వేషి స్తున్నాడు, నేను ఒట్టి చేతకానివాడుగా అనుకు ంటున్నట్టున్నాడు. అనుకోవడమేనంటే-నిజమే కదా? నేనొట్టి వెధవను.

ఇలాంటి పరిస్థితుల్లోనే మనల్ని విచారంలో ముంచే ఆలోచనలను ప్రశ్నించాలి, రేషనల్‌గా ఆలోచించడం నేర్చుకోవాలి. కనిపించే నిజాలను కూడా తప్పుగా ఆలోచించే విధానాలను మార్చు కుంటే జీవితం చాలా ఆనందంగా వుంటుంది. మన తప్పుడు ఆలోచనలను ఒక్కసారి చూద్దాం.

1. ‘ఆల్‌ లేదా నథింగ్‌’ ఆలోచన: ఎన్నో అవకాశాలున్నా, అన్నింటిని వదిలేసి ‘అవును లేదా కాదు’ అనే రెండు ఛాయిస్‌లనే ఎన్నుకోవడం
2. ఓవర్‌ జనరలైజేషన్‌: ఒక్కసారి జరిగిన ‘నెగెటివ్‌’ సంఘటనను నిరంతరం జరిగే సంఘటనగానూ, ఎప్పుడు అపజయాన్ని తెచ్చే విషయంగా చూడడం.
3. నెగెటివ్‌ మెంటల్‌ ఫిల్టర్‌: ఎన్నో విజయా లున్నా,, అన్నింటిని వదిలేసి అపజయాలనే తలుచుకుంటూ బాధపడడం.
4. డిస్‌కౌంటింగ్‌ పాజిటివ్‌: మీకు వచ్చిన విజయాలను అస్సలు గుర్తించకపోవడం.
5. జంపింగ్‌ టు కంక్లూజన్స్‌: (ఎ) మైండ్‌ రీడింగ్‌: నీపట్ల అందరూ ‘నెగెటివ్‌’గా రియాక్ట్‌ అవుతున్నారని అనుకోవడం. నేను ఏమి అనకున్నా అలాగే రియాక్ట్‌ అవుతున్నారని అపోహ.
(బి) ఫార్చున్‌-టెల్లింగ్‌: ఏ నిరూపణ లేకున్నా, తనకు తప్పకుండా ఏదో చెడు జరుగ బోతుందని నమ్మడం.
6. మ్యాగ్నిఫికేషన్‌ లేదా మినిమైజేషన్‌: చిన్న విషయమైనా పెద్దగా చేయడం లేదా గొప్ప విషయమైనా దానిని చిన్నగా చూడడం.
7. ఎమోషనల్‌ రీజనింగ్‌: నీ ఫీలింగ్స్‌కు ఒక భాష్యం ఇవ్వడం. నేను ఒక ‘లూసర్‌’ అని అనిపిస్తుంది. నిజమే నేను నష్టజాతకుడినే.
8. ‘షూడ్‌’: నిన్ను నువ్వే విమర్శించుకోవడం. అది కూడా, అవును నువ్వు తప్పకుండా ‘నువ్వింతే’, ‘ఎప్పుడింతే’ లేదా ఎదుటి వాళ్ళను అనడం.
9. లేబులింగ్‌: అరే! ‘నేను తప్పు చేశాను’. అనేకంటే ‘నేను మూర్ఖున్ని’, ‘నేనెప్పుడు లూసర్‌’నే అని లేబుల్‌ చేసుకోవడం.
10. పర్సనలైజేషన్‌: నీకు సంబంధించినది కాన ప్పటికీ, నువ్వే బాధ్యత తీసుకుని, అవును నావల్లనే ఆ నష్టం జరిగింది. నేను ఉండ డం వలననే ఇలా జరిగింది అనుకోవడం.

ఇలాంటి ఆలోచలను సరిగా చేసుకో వాలంటే ఈ క్రింది పద్ధతులను పాటించాలి, అ ప్పుడు శాస్త్రీయంగా ఆలోచించే పద్ధతి అలవాటు అవుతుంది. తప్పుగా ఆలోచించే విధానాలను గుర్తించిన తర్వాత వాటిని మార్చుకోవడానికి ఉపయోగించాల్సిన విధానాలు.

1. కౌంటర్‌ ద డిస్టార్షన్‌ :(తప్పు ఆలోచనను ప్రశ్నించండి)
2. సాక్ష్యాన్ని పరీక్షించండి
3. ద్విస్వాభావ పద్ధతి
4. ప్రయోగాత్మకంగా చూడాలి
5. కొంత నెగెటివ్‌గా ఆలోచించడం
6. సర్వే పద్ధతి
7. పదాలను నిర్వచించడం
8. సామాన్య పదాలు వాడడం
9. కొత్తగా సమస్యను చూడడం
10. లాభనష్టాలు బేరీజు వేయడం

ఇలా తప్పుగా ఆలోచించే విధానాలను ఎలా ఎదుర్కోవాలో ఉదాహరణలతో చూద్దాం!

ఆల్‌ ఆర్‌ నథింగ్‌: బాగా చదివే విద్యార్థికి అను కోకుండా ఒక్కసారి ‘బి’ గ్రేడ్‌ వచ్చిందనుకోండి. వెంటనే ఈ ‘ఆల్‌ ఆర్‌ నథింగ్‌’లో పడిపోతారు. నాకెప్పుడూ ఇంతే.. అయితే నాకు ‘బ్రిలియంట్‌ మార్కులు లేదంటే జీరో మార్కులు’ ప్చ్‌! నేను ఫెయిల్యూర్‌.
ప్రశ్నించడం: నిజంగా నేను ఫెయిల్యూరేనా? ఎన్ని పరీక్షలు వ్రాశాను, ఎన్నిసార్లు నాకు ఫెయిల్‌ మార్కులు వచ్చాయి. తక్కువ మార్కులు మాత్రమే వచ్చాయని తెలుస్తుంది. దీనివలన ఆందోళన, నిరాశ రాకుండా వుంటుంది.
ఓవర్‌ జనరలైజేషన్‌: ఒక చిన్న నెగెటివ్‌ సంఘటన ‘నాకెప్పుడూ ఇంతే.. ఇలానే జరుగుతుంది’.. ట్రెయిన్‌ను సరిగ్గా టైమ్‌లో క్యాచ్‌ చేయ్యలేకపోవడం.
ఎదుర్కోవడం: నిజంగా గతంలో, కనీసం ఈ నెలలో ఎన్నిసార్లు అనుకున్న సమయంలో పనులు లేదా ట్రెయిన్‌, సినిమాకు వెళ్ళలేకపోయాను.. ఇదొక్కసారే!… ఓకే.. అయితే ఫర్వాలేదు.
మెంటల్‌ ఫిల్టర్‌: ఒక ప్రజెంటేషన్‌ ఇస్తున్నావు. 95శాతం బాగా చేశావు, 5శాతం బాగా రాలేదు. ఒక గ్లాసు నీరులో ఒక ‘ఇంకు చుక్క’ వేస్తే ఎలాగైతే గ్లాసు నిండా ఆవరిస్తుందో మన ఆలోచన కూడా మారుతుంది.
విశ్లేషించడం: ఏది బాగా చెప్పలేదు, ఎక్కడ సరిగ్గా రాలేదు? వెంటనే అర్థం అవుతుంది. సత్యం బోధపడుతుంది. అశాంతి తొల గుతుంది.
డిస్‌క్వాలిఫయింగ్‌ పాజిటివ్‌: వారు ఊరికనే నన్ను అభినందిస్తున్నారు, లేదా ఏదో నానుండి ఆశించి ఇలా ప్రవర్తిస్తున్నారు.
సాక్ష్యం ఏమిటి: వాళ్ళు అభినందించడాన్ని నేనెందుకు ఒప్పుకోలేక పోతున్నాను. ఏదైనా ఆధారం ఉందా, నాకు అలా అనిపించడానికి, ఫీలింగ్స్‌.. నిజాలు కావు.
‘జంపింగ్‌ టు కన్‌క్లూజన్‌’: మీ మిత్రునికి ‘కాల్‌’ చేస్తారు, అతను రిప్లై ఇవ్వడు, వెంటనే ఒక కన్‌క్లూజన్‌కు వస్తారు, నాపట్ల వాళ్ళు సానుకూలంగా లేరు అని.
యధార్థం చూడాలి: అవతలి వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లో వున్నారో, ఎక్కడో వున్నవారి గురించి అలా ఎలా గుర్తించగలుగుతాము.. మనకు సూపర్‌ పవర్స్‌ లేవు కదా!
మ్యాగ్నిఫికేషన్‌ ఆర్‌ మినిమైజేషన్‌: వంట చేస్తుంటే కూరలో ఉప్పు తగ్గింది.. ప్చ్‌.. అయ్యో! ఎలానో ఏమో! అందరూ ఏమనుకుంటారో లేదా.. ఉప్మాలో ఉప్పు ఎక్కువైంది.. అయితే! ఏమవుతుంది. కొంచెం ఎక్కువైందా! ఎబ్బె! ఏం ఫర్వాలేదు.. లేదు ఆయనకు బి.పి. వుంది.. ఏం ఫర్వాలేదు.. ఒక్కసారికి కొంపలేం మునగవు.
ఒక్కసారి ‘వెరిఫై’ చేసుకోవాలి: మనకు జబ్బు వున్నప్పుడు, తినకూడనిది తింటే.. మనం ఇలానే రియాక్టు అవుతామా!..
ఎమోషనల్‌ రీజనింగ్‌: జీవితంలో జరిగిన సంఘటనలవలన అది నష్టాన్ని తెస్తే.. ‘ఇందులో ఏదో! దాగివుంది’ నీకు అన్పించిందంటే అది రైట్‌ అని నమ్మకు.
నమ్మే సాక్ష్యం వెదకండి: భావనలు నిజాలు కావు. కాబట్టి ఏదైనా ఆధారంతో అంటు న్నామా! లేక జరిగిన సంఘటనను అంగీ కరించక అలా మాట్లాడుతున్నామా! చూస్తే అర్థం అవుతుంది. దానికి ఆధారం లేదని.
‘షుడ్‌’ వాక్యాలు: ‘నేను ఎలాంటి పరిస్థి తుల్లోనూ అది తినకుండా ఉండాల్సింది’. ‘నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ 10లోపు పడుకోకూడదు’.
చరించే పదాలు వాడండి: ఇలాంటి పదా లు, ఎలాంటి, ఎట్టి పరిస్థితులలో వాడ కుండా, కొంత సానుకూలంగా, సామర స్యంగా, క్షమించే పదాలు లేదా కొంత ‘వెసులుబాటు’ పదాలు వాడాలి. ‘నీకు సరిపోయే ఆహారం తీసుకోవడానికి ప్రయ త్నించండి’. 10లోపు పడుకోకుండా వుంటే నీకు ఉపయోగం, ప్రయత్నించండి, మీకు సాధ్యం అవుతుంది.
లెబెలింగ్‌: నువ్వు ఇలానే చదివితే ‘రిక్షా తొక్కాలి’, ‘పని మనిషివి’ అవుతావు, ఎందు కు పనికిరాని మీ మామయ్యలా అవుతావు.
సూటిగా మాట్లాడాలి: ఇలా చదివితే మంచి మార్కులతో, భవిష్యత్తు బావుంటుంది.
‘పర్సనలైజేషన్‌’: నేనే ఇంట్లో 10 నిమిషాలు లేట్‌ చేశాను, అందువల్లనే అతినికి రోడ్‌ మీద ప్రమాదం జరిగింది. నేను మాట్టాడకుంటే తొందరగా వెళ్ళేవాడు, ఈ ప్రమాదం జరిగి వుండేదికాదు.
నిజాలను చూడాలి: సంఘటనను, ప్రవర్తనను, వ్యక్తిని వేరు వేరుగా చూడండి, మీరు బాధ్యులు కాదని తెలుస్తుంది.

Other Updates