టి. ఉడయవర్లు

tsmagazineహైదరాబాద్‌ నగరం మూసారాంబాగ్‌లోని జ్యోతి బాలమందిరంలో చదువుతున్న రోజుల్లో నుంచి ఎలాంటి బొమ్మనైనా గీయడం రాదురాదు రాదిక అనుకునే పరిస్థితి ఏనాడు తలెత్తలేదు ఆశా రాధికకు. ఓపిక, పట్టుదల, చిత్రలేఖనం పట్ల అభిరుచి, సృజన తోడుకావడం వల్ల రాధిక ఏనాడు నిరాశకు లోనుకాలేదు.

తల్లిదండ్రులు సత్యవాణి, సిద్ధాబత్తుల వీరాంజనేయులు ఇచ్చిన చేయూతతో ఒకవంక సాధారణ చదువు కొనసాగిస్తూనే, స్వయంకృషితో అసాధారణ చిత్రకారిణిగా రూపుదిద్దుకున్నది ఆశారాధిక.

ఖయ్యూం సార్‌ సూచనలు, ప్రసిద్ధ చిత్రకారుడు నరేంద్రరాయ్‌ చెంత వేసవి శిక్షణా తరగతులలో తర్ఫీదు పొందినప్పటికీ, ఆశారాధిక తనదికాని ఆలోచనకు, బాణీకి, ధోరణికి లోనుకాలేదు.

భూపాల్‌ బళ్ళో రాధిక చదువుకునే రోజుల్లో ఒక కార్యక్రమానికి ఆ రాష్ట్రానికి చెందిన అప్పటి ముఖ్యమంత్రి అర్జున్‌సింగ్‌ వచ్చారు. కార్యక్రమం ముగిసేలోపల, ఆమె అర్జున్‌సింగ్‌ ముఖచిత్రం వేసి, అక్కడే ఆయనకు చూపించడంతో ఆయన ఎంతో ఆనందించాడు. ఆమెను ఆశీర్వదించారు.

అనంతర కాలంలో మళ్ళీ హైదరాబాద్‌ నగరంలో, సెయింట్‌ ఆన్స్‌ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఈ మధ్య కాలంలో తమ కుటుంబ మిత్రుడు, వర్ధమాన చిత్రకారుడు శ్రీనివాసాచారి వద్ద నేర్చుకున్న ఎగ్‌టెంపెరా మాధ్యమాన్ని సాధన చేయడం, అందులో ఆమె చాలామందికి అందనంత ఎత్తు అధిరోహించారు.

నీటిలో వర్ణ ద్రవ్యాలతో పాటు అండనిర్యాసాన్ని కలిపి ఎండా, గాలి దానికి తగిలేట్టు చేసినప్పుడు అది గట్టిగా, చర్మం రీతిలో పొరదేలి అతుక్కొని ఉంటుంది. ఈ లక్షణం వల్ల శతాబ్ధాల తరబడిగా పూతరంగు పొరలన్నింటా చాలా మన్నిక కలదిగా ఉంటుంది. ఇందులో గుడ్డు సొనను వాడి, తెలుపును పారవేస్తారు. తైలవర్ణ ద్రవ్యాలతో అయితే మాత్రం మొత్తం గుడ్డును వినియోగిస్తారు.
tsmagazine
ఏడు శతాబ్దాలుగా చిత్రకళారంగంలో రంగులీనుతున్న ఈ ప్రక్రియలో పట్టు సాధించిన ఆశారాధిక ఆశాజనకమైన కళాకృతులెన్నింటికో రూపులు దిద్దుతున్నది.

ఉద్యోగ రీత్యా పనిలో ఎంతగా తలమునకలవుతున్నా, ఎంత అలసిపోయినా, ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా బొమ్మ వేయడం వల్లనే ఆమెకు శాంతి దొరుకుతున్నది. కాంతి దొరుకుతున్నది.

ఆమె మొట్టమొదటిసారి చిత్రకళాప్రదర్శన 2002లో ఏర్పాటుచేశారు. అప్పటినుంచి 2003 నుంచి ఇప్పటివరకు ఇరవైసార్లు ఆమె వ్యష్టి చిత్రకళాప్రదర్శనలు నిర్వహించారు. వాటిలో నగరంలోని డైరా, సృష్టి, లక్షణ, మినాజ్‌, అలంకృత తదితర గ్యాలరీలలో గత ఒకటిన్నర దశాబ్ధం నుంచి అలంకరిస్తూనే ఉన్నది. ఇక్కడ కాకుండా భోపాల్‌, బరోడా, ముంబై, బెంగుళూరు, పూనే, చెన్నైలాంటి నగరాలలో, అమెరికాలోని కాలిఫోర్నియా, హీసైన్‌, టెక్సాస్‌లోనూ రాధిక వ్యష్టిచిత్రకళా ప్రదర్శనలు నిర్వహించింది.

ఇక సమష్టి చిత్రకళా ప్రదర్శనలైతే హైదరాబాద్‌, న్యూ ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, పూణే, నాగపూర్‌లతో పాటు అమెరికాలోని హోస్టీన్‌, టెక్సాస్‌ నగరాలలో

మొత్తం నలభైరెండు పర్యాయాలు పాల్గొన్నారు. ఇవేకాకుండా పదిసార్లు, హైదరాబాద్‌, తిరుపతి, న్యూయార్క్‌ నగరాలలో నిర్వహించిన చిత్రకళా శిబిరాలతో పాల్గొని అక్కడికక్కడే బొమ్మలు వేశారు. ఆమెవేసే చిత్రాల్లో రంగులు, రేఖలు కనులకు ఇంపైనవి. వస్తువు, వివరణ తీరు సంఖ్యాపరంగా ప్రమాణీకరణ దృష్ట్యా ప్రేక్షకులను పెంచుతాయి.

రాధిక వేసిన చిత్రాలకు 2002లోనే హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ నిర్వహించిన చిత్రకళా పోటీ ప్రదర్శనలో ప్రశంసాపత్రం లభించింది. తాజాగా ఈ ఏడాది 2018లో సైతం హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ ఏర్పాటు చేసిన చిత్రకళా పోటీ ప్రదర్శనలో రాధిక చిత్రానికి కమలామిత్తల్‌
tsmagazine

పద్మశ్రీ డాక్టర్‌ జగదీశ్‌మిత్తల్‌ అవార్డు వచ్చింది. ఇవేకాకుండా 2003లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన సప్తమ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రస్థాయి పోటీలో ఆమె అవార్డు గెలుచుకున్నది.

తొలిరోజులలో మూర్తి చిత్రాలు, స్టిల్‌ లైఫ్‌లు, ప్రకృతి చిత్రాలు గీసిన ఆశారాధిక ఆ తర్వాత పుస్తకాలు, కాగితాలు వస్తువుగా అనేక చిత్రాలు వేసింది. పిదప బాలికలు, మహిళలు ఆమె చిత్రాల్లో ప్రతిబింబించారు. పక్షులు, పండుగలు, కలలు, కల్పతరువుకు చిత్రాల్లో చోటిచ్చారు. వాళ్ళమ్మాయి హాసిని పుట్టకముందు హాస్యం తొణికిసలాడే చిత్రాలు ఎక్కువగా ఆమె వేసింది. అనంతరకాలంలో నిత్య జీవితంలో మనస్సున ఒకటి పెట్టుకొని, ముఖాన మరొకటి వెల్లడించేవారికి సంబంధించిన వస్తువును తీసుకొని పలు కోణాల్లో బోలెడు చిత్రాలు వేశారు. ఎక్కువగా 3ఞ4 లేదా 5ఞ5 ప్రమాణంలో ఆమె వేసే చిత్రాలకు మార్కెట్‌ బాగా ఉంది. ఆమె వేసిన వేలాది చిత్రాల్లో కనీసం వెయ్యి చిత్రాల దాకా కళాభిమానులు కొనుగోలు చేయడం విశేషం. ఇంకా ఆమె వద్ద ఎన్నో చూడచక్కని డ్రాయింగ్స్‌, రంగురంగుల రమణీయ చిత్రాలు ఉన్నాయి.

వాస్తవానికి ఆమె చదివిన చదువు ఎం.ఏ. ఇంగ్లీషు సాహిత్యం, చేసే వృత్తి బ్యాంకులో ఉన్నతోద్యోగం, అసలు ప్రవృత్తి చిత్రాలు గీయడం. ప్రస్తుతం ఆమె సరికొత్త పద్ధతిలో డిజిటల్‌ బాణీలో చిత్రాలు వేసి, త్వరలో వ్యష్టి చిత్రకళాప్రదర్శన బెంగుళూరులో ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు.
అంతేకాదు, వారి నాన్నగారి కోరికమేరకు కొంత అధ్యయనం, పరిశోధన చేసి శివుడి ప్రాశస్త్యాన్ని వివరించే చిత్రపరంపర గీయాలనేది ఆశారాధిక ఆశయం.
tsmagazine

Other Updates