పోటీ పరీక్షలకోసం సన్నద్ధం అయ్యే విద్యార్థులు ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఏ రకమైన ఆహారం ఆరోగ్యానికి ఉపయోగకరంగా వుంటుందో న్యూట్రిషనిస్ట్‌లు చెప్పిన సలహాలు పాటించాలి.
ఒకే విషయంపై చాలాసేపు కూర్చోవడం, ఆలోచించడం వల్ల మెదడు చురుకుదనం తగ్గి మెమొరీపైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి, ఆరోగ్యంగా, నిత్యనూతనంగా, మెమొరీ యాక్టివ్‌గా వుండాలంటే, రెగ్యులర్‌గా శారీరక శ్రమ తప్పనిసరిగా చెయ్యాలి, దీనివల్ల శరీరంలోకి, బ్రెయిన్‌లోకి కావలసినంత ఆక్సిజన్ చేరి రోజంతా యాక్టివ్‌గా వుండేందుకు దోహదపడుతుంది. రోజంతా శారీరక, మానసిక శ్రమ వల్ల శరీరానికి విటమిన్ బి, సి, డిల ఆవశ్యకత హెచ్చుగా అవసరమవుతుంది.
1. ఆపిల్స్, అరటిపండ్లు, క్యారట్ రోజూ తినాలి.
2. చాలామంది బ్రేక్‌ఫాస్ట్ చేయరు, ఇలాకాకుండా తప్పకుండా పైన పేర్కొన్న ఫ్రూట్స్ లేదా ఓట్స్ తినడం చాలా అవసరం. ఉదయం తినడంవల్ల మెదడు చాలా ఏకాగ్రతతో ఉంటుంది.
3. రోజంతా ఉత్సాహంగా ఉండడానికి, వీలైతే కిస్‌మిస్‌లు, కాజు, బాదంపప్పు ప్రతి గంటకు రెండు మూడు పలుకులు తినడంవల్ల, శారీరక శక్తి ఎప్పుడూ అందుబాటులో వుంటుంది.
మధ్యాహ్నం, రాత్రి కూడా ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకూడదు. కొంచెం కొంచెం నాలుగుసార్లు తినడంవల్ల ఉత్సాహంగా ఉంటుంది. వీలయితే, సాయంత్రం రాగులు, సజ్జలు, జొన్నలతో తయారుచేసిన ఆహారం తీసుకుంటె మంచిది.
కూల్‌డ్రింక్స్.. ఏదైనా సరే! వాటన్నింటికి దూరంగా అంటే అస్సలు వీటిని తీసుకోకండి. ఇవన్నీ ఏకాగ్రతను భంగం చేస్తాయి, మిమ్మల్ని దేనిపైనా శ్రద్ధపెట్టకుండా చేస్తాయి. వీటి PH విలువ మనం Toilet Wash చేసే ACID PH విలువకు సమానం.
కొబ్బరి నీళ్ళు త్రాగండి, ఎక్కువసార్లు టీ/కాఫీ త్రాగకండి. రోజుకు ఒకటి లేదా రెండుసార్లకు మించి త్రాగకండి.
అవకాశం ఉంటే రెగ్యులర్‌గా గ్రుడ్లు తినండి.
మిల్క్ టీకన్నా గ్రీన్ టీ మంచిది, ఎక్కువగా ద్రవాలు తీసుకోండి, నీరు బాగా త్రాగండి, అవకాశం వుంటే పళ్ళరసాలు త్రాగడం మొదలుపెట్టండి. రోజంతా ఉత్సాహంగా ఉంటే, చాలాసేపు చదువుకోగలుగుతారు. నిరుత్సాహం మీ దరికిరాకుండా ఉత్సాహంగా చదువగలుగుతారు…అప్పడు విజయం మీదే అవుతుంది.