రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ పథకాలకు అయ్యే వ్యయంలో సగభాగాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ పథకాల ప్రాముఖ్యతను, ప్రయోజనాలను వివరంగా వివరించారు. న్యూఢల్లీిలో ఫిబ్రవరి 16న ప్రధానిని ఆయన నివాసంలో కలుసుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. కేంద్రం ఇప్పటికే హామీ ఇచ్చిన విధంగా ప్రాణహిత`చేవెళ్ళ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, గోదావరి పుష్కరాలకు ఆర్ధిక సహాయం అందించాలని, మహారాష్ట్ర నుంచి డిచ్‌పల్లి వరకు ట్రాన్స్‌మిషన్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని, ఎ.పి.కి సత్వరం ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీని ముఖ్యమంత్రి కోరారు.
హోం
»