interview‘when you sweat more in practice, you bleed less in the war’ అంటే యుద్దానికి ముందు నువ్వు ఎక్కువగా యుద్ధవిద్యలు సాధనచేస్తే.. ఎక్కువ స్వేదం చిందిస్తే… యుద్ధంలో నువ్వు సమర్థవంతంగా పోరాడగలవు. నీకు తక్కువ గాయాలు అవుతాయి. పెద్దపెద్ద యోధులు.. ఇదే పద్ధతిని పాటించి.. విజయులుగా నిలిచి పోయారు. కాబట్టి ఇంతవరకు పోటీ పరీక్షలు వ్రాసినవారు, ఇంకా వ్రాయబోయేవారు.. ఇంటర్వ్యూలకు ప్రిపేర్‌ అయ్యేవారు పై సూత్రాన్ని పాటిస్తే.. తప్పకుండా విజేతలుగా విరాజిల్లుతారు.

రమేష్‌ చాలా చలాకీగా… ఏ విషయాలోనైనా సరే! చాలా తొందరగా జవాబులు చెప్పగలుగుతాడు.. ప్రతి పరీక్షలో 80 శాతం మార్కులు సాధించాడు. కానీ ఇప్పటివరకు జరిగిన ఇంటర్వ్యూలలో మాత్రం విజయం సాధించలేకపోయాడు. ఇలా సాధించలేకపోయినందుకు.. రకరకాల కారణాలు చెప్తాడు. ఇంటర్వ్యూలు అన్నీ రికమెండేషన్‌ వుంటేనే వస్తాయంటాడు, డబ్బులు ఇవ్వాలంటాడు.. అలాగే తనకు ఏ సపోర్ట్‌ లేదంటాడు.

సంతోషి.. మామూలుగా చదువుతుంది. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల్లో విజేతగా నిలిచింది. ఇంటర్వ్యూలకు వెళ్ళింది. కానీ ఇంటర్వ్యూ బాగా చేయలేకపోయానని బయటకు వచ్చిన తర్వాత ఒక్కటే ఏడుపు… తనకు ఏదీ వెంటనే రాదని, ప్రతీది ఎంతోకష్టపడాలని… తనలాంటి వారికి ఇవేవి అవసరంలేదని వారం రోజులు ఇల్లంతా ఒక్కటి చేసింది…

ఇంటర్వ్యూలంటే నిజంగానే చాలామందికి భయం. నేను సరిగ్గా చెప్పలేనేమో! నాకు సరిగ్గా చెప్పడం రాదు అని… సమయానికి గుర్తుకు రావని… గుర్తుకు వచ్చినా గొంతు పెగలదని… తప్పకుండా ఇంటర్వ్యూ చండాలంగా చేస్తానని… తనకు ఈ ఇంటర్వ్యూ రాదని… ఒకే విధంగా మనస్సంతా నెగెటివ్‌ భావనలతోనే వెళ్ళి… నెగెటివ్‌ ఫలితంతో బయటకు వస్తారు. ఇలాంటివారికి, ఇంకేరకమైన సమస్యలున్నా ఇంటర్వ్యూను ఈ క్రింది విధంగా సంసిద్ధం కండి.

మిమ్మల్ని ఒక మంచి ప్రొడ్యూసర్‌ అనుకోండి. దాన్ని ఇంటర్వ్యూ అనే ప్రదేశంలో మిమ్మల్ని మీరు సరిగ్గా సేల్‌ చేసుకోవాలి. అంటే దానికి సంబంధించిన గొప్పతనాలు, బలాలు అన్నింటిని ఎదుటి వ్యక్తులకు అర్థం అయ్యేలాగా చెప్పగలగాలి. ఎలాగైనా వాళ్ళకు నచ్చేవిధంగా మిమ్మల్ని మీరు వ్యక్తీకరించుకోవాలి. ఆ పద్ధతిలో మీరు ఇంటర్వ్యూలకు ప్రిపేర్‌ కావాలి.

ప్రతి ఇంటర్వ్యూ దాదాపుగా 20 నిమిషాలకంటే ఎక్కువగా వుండదు. కాబట్టి మీరు 30 నిమిషాల ఇంటర్వ్యూకు ప్రిపేర్‌ కండి.. మాక్‌ ఇంటర్వ్యూకు అటెండ్‌ కండి… మీ స్నేహితులతో, ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటే వారితో కొద్దిసేపు ఒకసారి ప్రాక్టీస్‌ చేయండి.

మీరే ఇంటర్వ్యూ బోర్డులో ఉంటే ఎలాంటి ప్రశ్నలు అడగాలని వుందో… అలాంటి రోల్‌ ప్లే చేయండి.. అప్పుడు మీకు ఏ ప్రశ్నలకు ప్రిపేర్‌ కావాల్సి వుంటుందో అర్థం అవుతుంది. తర్వాత వాటికే ప్రిపేర్‌ కండి.

మీ పట్ల మీరు నిజాయితీగా ఉండండి, మీ సబ్జెక్ట్‌, దేశీయ, అంతర్జాతీయ సంఘటనలు, తెలంగాణ ఉద్యమం.. తెలంగాణ సామాజిక పరిస్థితులు ఇవ్వన్నీ తెలుసుకోవడం అవసరం. ఈ అధ్యయనంలో నిరంతరం చదవడం, స్నేహితులతో, నిపుణులతో చర్చిండం అవసరం.

అన్నింటికంటే ముఖ్యం, నేను ఈ ఉద్యోగానికి అర్హుడను. నేను దీన్ని సాధించగలను అనుకోవడం.. అలాంటి విశ్వా సానికి తగినట్టు ప్రిపరేషన్‌ కొనసాగించడం చెయ్యాలి. వీలయితే నిపుణుల సహాయం తీసుకొని మి మ్మల్ని మీరు మెరుగు పరుచుకోవడం చేయండి.

ఇంటర్వ్యూలలో సరియైన బాడీ లాంగ్వే జ్‌ను ప్రదర్శించే విధంగా రోజూ సబ్జెక్ట్‌ పరంగా బలంగా మారడం.. ఆత్మ విశ్వాసాన్ని, పెంపొందిం చుకోవడం, ప్రాక్టీసు చేయాలి.

ఇంటర్వ్యూలలో బోర్డులో అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పకుంటే మనం క్వాలిఫై కాము అని అనుకోవద్దు. జవాబులకంటే మనం చెప్పే పద్ధతి బాగుండాలి. విశ్వాసంతో చెప్పగలగాలి. ఇది మీ విజయానికి ముఖ్యమైన అంశంగా గుర్తించాలి.

ఇంటర్వ్యూలు మీ జీవితానికి సరిపోయే ఒక ప్రొఫెషన్‌కోసం జరిగేది. కాబట్టి చాలా నిధానంగా. జవాబులు ఇవ్వండి…

డాక్టర్‌ సి. వీరేందర్‌

Other Updates