రాష్ట్రంలో ఆగస్టు 7న చారిత్రక ఘట్టానికి గజ్వెల్ వేదికైంది. దేశ ప్రధాని హోదాలో రాష్ట్రానికి తొలిసారిగా వచ్చిన
నరేంద్రమోదీకి ప్రజలు నీరాజనం పట్టారు. సీఎం కేసీఆర్ మానస పుత్రికగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన
మిషన్ భగీరథ పథకాన్ని ప్రధాని మోదీ ఆగస్టు 7న ప్రారంభించారు. దీంతో పాటు సింగరేణి థర్మల్ ప్లాంట్,
రామగుండం ఎరువుల కర్మాగారానికి ప్రధాని శంఖుసాశీవపన చేశారు. వరంగల్ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ,
మనోహరబాద్-కొత్తపల్లి రైల్వేలైన్‌లకు శంకుసాశీవపన చేసి ప్రజల కలను సాకారం చేశారు.
ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ప్రసంగం సందర్భంగా ప్రజలు ఉత్సాహంతో చప్పట్లు కొట్టారు. ముందుగా దత్తాత్రేయ మాట్లాడినప్పుడు
ప్రధానికి లేచి నిలబడి గౌరవ స్వాగతం పలకాలని పిలుపునివ్వడంతో జనంతో పాటు వేదికలపై
కూర్చున్న అతిథులు సైతం లేచి నిలబడి గౌరవ ప్రదమైన స్వాగతం పలికారు. సీఎం మాట్లాడినప్పుడు జనం నుంచి
కేరింతలు వచ్చాయి. ప్రధాని ప్రసంగంలో తెలంగాణ పదం వచ్చినప్పుడల్లా ప్రజల నుంచి భారీ స్పందన కనిపించింది.