hpuscశ్రీ అన్నవరం దేవేందర్‌

ఇంటికి సుట్టపోల్లు వస్తుండ్రంటే ఇంటిల్లాదులకు సంబురం

అన్పిస్తది. మా అవ్వగారోల్లు వస్తండ్రని అవ్వకు, మా మ్యానమామలు

వస్తండ్రని పోరలకు, బామ్మర్ది వస్తండని బావకు, ఎవలకైనా సుట్టాలంటే

ఎదిరిసూసుడే. పొద్దుగాల లేశి బోల్లు కడుగుతాంటెనే కాకి ఒర్రుతనే

ఉంటది. అప్పుడే తెలుస్తది అవ్వకు బియ్యం ఎక్కువ పెట్టాలెనని.

అంతలనే ఎవల పనులల్ల వాల్లు ఉండంగనే ఎడ్లబండి కట్టుకొని

మ్యానమామ అమ్మమ్మ రానే వస్తరు. బండి దిగి ఎడ్లను నీడకు

కట్టేశి వాకిట్లకు రాంగనే ఇయ్యపురాలు ఎదురుంగ పోయి

తోలుకొస్తది. మామ మామ అని శిన్నపోరగాండ్లు ఎదురుంగ

తిరుగుతరు. చెయ్యి సంచి, ముల్లె ఇన్ని కంకులు, బబ్బెర్లు

మక్కకంకులు సుత పండినయి అరొక్కటి తీసికస్తే లోపల

పెడ్తరు. వాకిట్ల శాద బాయిల నీళ్లు జప్ప జప్ప చేది రాజవ్వ

గోలెంల పోసింది. అంపుల కాల్రెక్కలు కడుక్కొని భుజం

మీద తువ్వాలతోని తుడ్సుకున్నరు. అందరు ఇంట్లకు

పోయింది, శనారిశీవ బావ, శనారిశీవ మామ అనుకుంట

రాజవ్వ అన్న కొమురయ్య దండంబెట్టి బల్లపీట

మీద ూకుంటడు. కొద్దిసేపు బావబామ్మర్దులు

అలయ్‌బలయ్‌ తీసికుంటరు. చాన రోజుల తర్వాత

వచ్చిండ్రని ఒగలకు ఒగలు మాట్లాడుకొని ూసుంటరు.

ఇంట్లకు ఎవలు వచ్చినా కాళ్ళకు నీళ్ళిచ్చి ఇంట్లకు

రమ్మనుడు ఆచారం. ఇగ అక్కన్నుంచి మొదలైతది.

బంధుత్వం అంటే ఒగలకు ఒగలు ఆసర. అపుడు ఆపతి

సంపతిల ఆదుకునుడు ఒగల మీద ఒగలకు పావురం

ఉంటది. సుట్టాలు ఇంటికచ్చినంక ఆ దినం కోడి తెగుడే

ఉంటది. అనుకోకుంట వస్తే కోళ్ళను దొరకపట్టాలె. లేకుంటే

ముందుగాలనే రాత్రి కమ్మిన కోడిని ఇడువకుంట గంపకింద

దాపెడుతరు. ఇప్పుడు కొమురయ్య వచ్చినంక కోడి కోసం వాకిట్ల,

పెరట్ల, పెంటల దొరకబట్టేతందుకు ఇంట్లోల్లు అందరు తండ్లాడాలె.

ఎవ్వలకు దొరుకుతదోనని మెల్లెగ అన్ని కోళ్ళను ఇంట్లకు తోలి తలుపులు పెట్టి

పడుతరు. గట్ల పట్టెటప్పుడు, వచ్చిన సుట్టం సుత కష్టపడుతడు. అటనంగ

ఇటనంగ కొన్ని దొరుకబట్టి కాలుకు సుతిలిదారం కట్టి జరసేపు కత్తికి పీటలకు

కోసం తిరుగుతరు. తిరిగి తిరిగి కత్తిని ఆకురాయికి రాకి తెచ్చి కోసి గంపలేసి

బూరు పీకి పసుపురాసి కమ్రిస్తరు. తర్వాత ూర కోసి వక్కలు వక్కలు చేసి

ఇంట్ల రాజవ్వకిస్తే ఆమె అప్పటి అల్లం ఎల్లిపాయ దంచుకొని కారం తయారు

చేసికొని ఉంటది, ఇగ ఎంబడే పొయ్యిమీద ఏస్తది.

తాళ్ల మండువ అంటే సకల ప్రపంచం అక్కడ

ఊరుమీద అన్ని ముచ్చట్లు, పంచాయితీలు, గెట్టు

పంచాయితీలు వీల్లు వాల్లకు వీల్లకు వాల్లు అన్ని

వస్తయి, ఆడ ూకుంటే అదొక ప్రపంచం.

అది ఉడిటాెల్లకు బావ బామ్మర్దులు, అల్లుండ్లు బాయికాడికి పోయి ఎవుసం

ఎట్లనడుస్తంది. ఎడ్లు ఏ అంగట్ల కొనుక్కొవచ్చినవు బావా అనుకుంట. వడ్లు

పండిచ్చుడు ఎల్లుతున్న నీళ్ళు. గెట్టు పంచాదులు ఇవన్ని ముచ్చట్లు పెట్టుకొని

ఇంటికొస్తరు. ఇంటికచ్చినంక అందరు కల్సికోడిూరతోని బువ్వ తింటరు.

పోరగాండ్లకు సుత సుట్టం వస్తెనే కోన్ని కోస్తరని సంబ్రంతోని ఉంటరు.

ఎవలకైనా శియ్య ూరంటెనే సంబురం. ఆ కాలంలో శియ్య ూర అంటె

దసరకు, సంక్రాంతికి, బోనాలప్పుడు, దేవునికి చేసుకున్నప్పుడే ఉండేది.

లేకుంటే ఎప్పుడైనా సుట్టాలుగిన వస్తెనే ూర వండుకునుడు. ూర అంటే

మాంసం ూరే. కాయగూరలను శాకం అంటరు. ఇదో గమ్మతి. ఎన్కటికి

ఇప్పటికి మాటలు సూత మస్తు ఫరక్‌ అయిపోయినయి.

ఇంట్ల అందరు ూకోని కోడిూర మసాల ఏసి వండుతె

లగాంచి తిన్నరు. తిని జరసేపు ఇంటి ముందల అరుగు

మీద ఒరిగేటల్లకు మాపటియాల్ల అయ్యింది. ఇగ బావ

బామ్మర్దులిద్దరు కల్లు మండువలకు పోవుడు ఆశారం. బావకు

ఎప్పుడు వాడిక బింకి ఉండనే ఉంటది. బామ్మర్ది కోసం

పెద్దగౌడకు చెప్పి మంచి కల్లు లొట్టి తెప్పిచ్చిండు. తాళ్ళల్ల

సుత అందరు బామ్మర్ధిని ఎరుకవట్టిండ్రు. ఎప్పుడచ్చినవు

అని, ఆవూరి ముచ్చట్లు, ఈ ఊరి ముచ్చట్లు వాల్లు

వీల్లు మాట్లాడుకోవట్టిండ్రు. కల్లు తాగుకుంట గుడాలు

ఉడకబెట్టిన కోడిగుడ్లు అమ్మస్తే కొనుక్కొని

కడుపునిండ తాగవట్టిండ్రు.

తాళ్ల మండువ అంటే సకల ప్రపంచం అక్కడ

ఊరుమీద అన్ని ముచ్చట్లు, పంచాయితీలు, గెట్టు

పంచాయితీలు వీల్లు వాల్లకు వీల్లకు వాల్లు అన్ని

వస్తయి, ఆడ ూకుంటే అదొక ప్రపంచం. అండ్ల

ఎవలి మాట ఎవలి లెక్క వేరు వేరే ఉంటయి.

ఎవనికి ఎవడు పెద్దగాదు ఎవనివెడు చిన్నగాదు.

సకలం ఇకమతులు అక్కనే వస్తయి. కల్లు

మండువల పంచాయితులు పుడుతయి మల్ల అక్కన్నే

తెగుతయి. కల్లు తాగడం ఎవరికైనా కుతి తీరినట్లు

అన్పిస్తది. మండువల కల్లు తాగి బావ బామ్మర్దులు

ఇంటికి సుత ఒక లొట్టి తీస్కవోతరు. ఇంటికి పోయినంక

ఇంట్ల ఆడోల్లు పొలగాండ్లు సుత సీసం గిలాసల పోసుకొని గుట్క

ఏస్తరు. అదొక కమ్మని కథ. మల్ల రాత్రిపూట ూడ ఎక్క దీపం

ఎలుగుకు కంచాలల్ల బువ్వ ఏసుకొని పొద్దటిూర ఇంత తొక్కు ఇంత

ఏసుకొంటరు. ఇగ తిని అన్న శెల్లెలు ముచ్చట్లు పెట్టుకుంట ఉంటరు.

పోరగాండ్లు నిద్రపోతరు.

పెద్దెగిలివారంగ లేసి మల్ల ముచ్చట్లు పెట్టుకుంటరు. ఆడోల్లు అయితె

ఎగిలివారంగ నెత్తి ఈర పోసుకొని నూనె రాసుకుంట ఈ పెద్దవ్వ కోడలు

ఎట్లున్నది. ఆ చిన్నవ్వ చిన్న కోడలు నీళ్ళు పోసుకున్నదా అనుకుంట

మాట్లాడుతరు. వాల్ల ఇంట్ల గచ్చుకాడ ూకుంటరు. ఎక్క దీపం చిన్నగ

ఎలుగుతది వాల్లకు నిద్ర పురాగరాదు. తెల్లారకముందే వాల్ల సుట్టాల మంచి

చెడు మాట్లాడుతరు. అప్పుడే తెలుస్తయి. ఇట్ల గంట సేపటిదాంక ముచ్చట్లు

మార్చి 2016 శ్రీ తెలంగాణ శ్రీ 25

పెట్టిినంక తెల్లారి లేశి ఇంటామె మొక్కి చీపురు పట్టుకొని

వాకిలి ఊడ్వపోతది. అదే యాల్లల అత్త ఏమన్న

గోసపెడుతన్న ముచ్చట ూడ అన్నకు చెప్పుతది. బావ

ఏమన్న అంటండా అన్న ముచ్చట ూడ గుసగుసలనే

చెప్పుతది. ఎందుకంటే అందరు పన్నట్టు ఉంటరు గని ఇదేం

ముచ్చట్లు పెడుతుందని అత్త పండి ఇంటది అందుకు.

మనుసుల ఎతను అంత చెప్పుకుంటరు. ఇగ ఆ తర్వాత

వాకిలి ఊడ్చి వచ్చి ఇండ్లు ఊడ్చి వాకిట్లకు మల్ల పొయ్యి

పెండకల్లు తీసి సాన్పు సల్లుతది. తెల్లారేవరకు పచ్చగ సాన్పు

సల్లిన వాకిలి. వాకిట్ల ముగ్గులు, గల్మల్ల ఎర్ర మన్నుతోని

అల్కుడు. ఆ అల్కిన దానిమీద ముగ్గులు కడగనే ఉంటయి.

ఇంతలనే సుట్టమై వచ్చిన కొమురయ్య తన బండెడ్లు

సగపెట్టుకుంటడు. ఎడ్లకు మ్యాత ఏస్తడు. గోలెంల కుడిది

తాగిపిస్తడు నీళ్ళు వెడ్తడు. మంచిగ అరుసుకుని ఇగ మల్ల

ఊరికి ఎల్లి పోవడానికి తయారయితడు. అప్పటి ఇంత

ఉడుకు అన్నం వండి పెడితె తింటడు. సద్ది కడతే ఆ సద్ది

ముల్లెను సుత బండి శేరెలకు కట్టుకుంటడు. రెండు సొప్ప

కట్టెలు సుత వాముల ల్లిె గుంజుకచ్చుకొని బండ్లె ఏసుకొని

పోతన్న బావ, పొయ్యస్త శెల్లె, పొయస్త అత్త, పొయస్త మామ

అంట బయిలెల్లుతడు. ఆయన ఎంట శెల్లె బావ కొంత

దూరం పోతరు. అంతలనే బావ ఇగనేను బాయికాడికి పోయి

ఎడ్లను ఇడవాలె అనుకుంట ఎనుకకు వస్తడు. శెల్లె ఇంక

కొంత దూరం అన్నతోనే పోతది. అన్న శెల్లెలు జరసేపు కండ్ల

నీళ్ళు తెచ్చుకొని ఏడుస్తరు, కని అవి ఆవేదనల ఏడుపులు

కాదు. ఒక కనపడని తనం వల్ల దుక్కపడుతరు. చెల్లె ఇంటి

బాట పడ్తది. అన్న సవార్‌ బండిమీద వాల్ల ఊరుకు ఆయన

పోతడు. మధ్యల ఓ బాయికాడ బండి ఇడిశి చెల్లె పెట్టిన సద్ది

మామిడికాయ తొక్కు కలుపుకొని తిని ఎడ్లకింత మ్యాత ఏసి

జరసేపు ఒరిగి మల్ల వాల్ల ఊరికి పోతడు.

మన పల్లెల్ల ఇసొంటి రీతి సుట్టాల రాక పోకలు ప్రేమలు

ఉండె. కలువక కలువక కల్సిన సుట్టాలు కలిస్తే ఇద్దరు

ఆడోల్లు తనివితీర ఏడుస్తరు. ఒగలను పట్టుకొని ఒగలు

రాగాలు తీసికుంట ఏడుస్తరు. వాల్లకు ఏదో బాధలు

ఉన్నయని కాదు కష్టాలు అని కాదు. ఏడుపు ఒక రాగం

ఏడుపు ఒక కవిత్వ ప్రవాహం. ఏడుసుకుంటనే ఒకరికి

ఒకొక సందేశం ఇస్తరు. లంబాడా మహిళలు అంగట్ల

కల్సుకొని కొంగులు కప్పుకొని గిట్లనే ఏడుస్తరు. అట్లనే

తీరాశీవలల్ల కల్సుకొని ూడ ఏడుస్తరు. ఆ ఏడుపులో కలవక

కలవక కల్సినమనే ఆనందం కలెకల్సి ఉంటది. సుట్టాలను

సాగదోలెటప్పుడు ూడా చానా దూరం దాకా నడిశిపోయి

అక్కడ మల్లొక్క సారి శోకం పెట్టి ఎ్కక్కిపడి ఏడిశి

ఇంటికస్తరు. ఇండ్లల్ల సుట్టాలకు గౌరవం ఉంటది. ప్రేమ

ఉంటది. రాత్రిపూట అన్నం అద్దెం అద్దెం వండరు. కొలిశి

బియ్యం పొయ్యరు. దబ్బన్న ఎవలన్న రాత్రి వస్తే ఎట్ల అని

అరసోలెడన్ని ఎప్పుడు ఎక్కువ వండుతరు. ఎవలన్న వస్తే

తింటరు. లేకుంటే సలన్నం పోరగాండ్లు తెల్లారి లేవంగనే

తింటరు. ఇదీ సుట్టాలు సంబురాలు.

Other Updates