agricultureపల్లెలు కూడా పట్టణీకరణ వైపు మరలుతున్న తరుణం కాబట్టి పుస్తకానికి పట్టణ వ్యవసాయం అని పేరు పెట్టారు. రోజువారీగా వాడుకునే కూరగాయల దగ్గర నుండి, ఆహార పదార్థాలన్నింటి ధరలు అంబరాన్నంటుతున్న కాలం ఇది. ఈ కాలంలో ఇంటింటి వ్యవసాయం అంటూ ఆహార పంటలన్నీ అందుబాటులో వుండే విధంగా ఇంటి ఆవరణలో పెంచుకోవడానికి వీలుగా సమస్త సమాచారాన్ని సవివరంగా అందిస్తుంది ఈ పుస్తకం. ఆరోగ్యకర వ్యవసాయానికి అండగా వుంటున్నామని ప్రభుత్వాలు కూడా వివిధ పద్దుల ద్వారా ఇంటి పంటలకు రాయితీలు ఇస్తున్నాయి.

కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, పూలమొక్కలను పెంచడంలో పాటించవలసిన అన్ని పద్ధతులను, సులువుగా అర్థమయ్యే విధంగా అక్షరీకరించడంలో ప్రొఫెసర్‌ కె. చంద్రశేఖరరావు సఫలీకృతమయ్యారు. ఈ పుస్తకంలో పలు ప్రముఖ నగరాలలో చేస్తున్న పట్టణ వ్యవసాయం చిత్రాలు అర్థవంతంగా వున్నాయి.

ఇంటి పంటలు పండించుకోవాలనే ఆసక్తి వున్న ఎందరికో ఈ పుస్తకం ఒక మంచి నేస్తంగా నిలుస్తుందనడం స్వాభావికం.

పేరు : పట్టణ వ్యవసాయం, పబ్లిషర్‌ : రైతునేస్తం పబ్లికేషన్స్‌, పేజీలు:164 (మల్టీకలర్‌)

ధర:200/-, వివరాలకు: 6-2-959, దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్‌,

ఖైరతాబాద్‌, హైదరాబాద్‌ – 004

Other Updates