తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లాద్వారా మంచి నీళ్ళు అందించే పథకానికి ‘తెలంగాణ డ్రిరకింగ్ వాటర్ ప్రాజెక్టు’ అనే పేరును ముఖ్యమంత్రికె. చంద్రశేఖరరావు ఖరారు చేశారు. ఈ పనులను అమలు చేసేందుకు ప్రభుత్వం ‘తెలంగాణ డ్రిరకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ లిమిటెడ్’ను ఏర్పాటు చేసింది. డ్రిరకింగ్ వాటర్ ప్రాజెక్టు పనులను ఇకపై ప్రతివారం సమీక్షించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతోపాటు ప్రజలకు అత్యవసరమైనఈ పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
సచివాలయంలో ఫిబ్రవరి 10న డ్రిరకింగ్ వాటర్ ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రామీణ అభివృద్ధి, నీటి పారుదల శాఖ అధికారులతో పాటు ఈ ప్రాజెక్టుతో సంబంధంవున్న నీటిపారుదల శాఖ, అటవీశాఖ, మున్సిపల్‌శాఖ అధికా రులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. మంత్రులు కె.టి. రామారావు, టి. హరీష్‌రావు, ప్రభుత్వ సలహాదారు బి.వి. పాపారావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు రేమాండ్ పీటర్, ఎస్.కె. జోషి, గోపాల్, జనార్థన్‌రెడ్డి, మిశ్రా, ఈఎన్సీలు సత్యనారాయణ, సురేందర్‌రెడ్డి, మురళీధర్, మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
రాబోయే 15 ఏళ్ళ కాలానికిఉపయోగపడే విధంగా ప్రాజెక్టు రూపకల్పన చేసినప్పటికీ, రాబోయే 30 ఏళ్ళ వరకు కూడా మంచినీళ్ళను సరఫరాచేసే వ్యవస్థను సిద్ధంగా ఉంచాలని ముఖ్యమంత్రి అన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఈ పథకం ఉండాలని చెప్పారు. ప్రధాన గ్రామాలతోపాటు గిరిజన తండా లు, ఆదివాసిగూడాలు, గంగిరెద్దుల గుడి సెలు, ఎరుకల గుడిసెలతోపాటు పది ఇండ్లున్న ఆవాసాలకు సైతం మంచి నీరు అందించాలని ఆదే శించారు. ప్రతి ఇంటికి మంచి నీటి పైపులైను వేసే బాద్యతను ఆర్. డబ్ల్యు.ఎస్. అధికారులే తీసుకోవాలని సి.ఎం. చెప్పారు. ముఖ్యంగా పైపుల నాణ్యత విషయంలో జాగ్రత్తలు ఉండాలన్నారు. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో పైపులు తయారు చేసే కంపెనీల నుండి మాత్రమే పైపులు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం వివిధ కంపెనీలకు సంబంధించిన గత పనితీరును కూడా పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణలో పైపులుఉత్పత్తి చేసే కంపెనీలకే పనులు ఇవ్వాలని సూచించారు. పైపులు వేయడం, జాయింట్లు బిగించడం, వాటిని నిర్వహించడంలాంటి పనులను పదేళ్లపాటు అవే కంపెనీలు చూసుకునే విధంగా బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రతి దశలో హైడ్రాలిక్ పరీక్షలు నిర్వహిచాలని చెప్పారు.
ఇంటెక్‌వెల్స్ నిర్మాణానికి, ప్రాజెక్టులనుండి నీటిని కేటాయించే విషయంలో పూర్తిస్థాయిలో సహకరించాలని నీటి పారుదలశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అటవీశాఖ భూములను అభివృద్ధి పనులకోసం ఉపయోగించుకొనే విషయంలో దేశవ్యాప్తంగా కొత్త విధానం కూడా అమల్లోకి రానున్నదని ముఖ్యమంత్రి వెల్లడిరచారు. తెలంగాణ రాష్ట్రంలో లక్ష ఎకరాలను సేకరించి అటవీశాఖకు నష్ట పరిహారంగా అందించేందుకు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని అటవీ భూముల్లో పనులకు సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. అన్నిశాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఈ పథకం ద్వారానే పట్టణ ప్రాంతాలకు సురక్షిత మంచినీరు అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. అయితే పట్టణంలోని వివిధ వాడలకు నీటిని తరలించేందుకు అవసరమయ్యే ఇంటర్నల్ పైపులైన్ ఆయా మున్సిపాలిటీలునిర్మించుకోవాలనిముఖ్యమంత్రి చెప్పారు.
నీటి సరఫరా సక్రమంగా జరిగేందుకు పట్టణాల సమీపంలోని గుట్టలను ఉపయోగించుకోవాలని అన్నారు. పట్టణాల్లో కాంటూరు లెవల్స్ కూడా తీసుకొని పైపుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. మే చివరినాటికి ఇంటెక్‌వెల్స్ అడుగుభాగం నిర్మాణం పూర్తి కావాలని చెప్పారు. పైపులైన్ నిర్మాణానికి సంబంధించిన రైట్ ఆఫ్ వే ను కూడా ఖరారు చేశారు. దీనికి సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
పంచాయతీరాజ్‌శాఖలో 620 మంది ఇంజనీర్లను టీఎస్‌పీఎస్సీ ద్వారా నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.
గోదావరి నుండి హైదరాబాద్‌కు మంచి నీళ్ళు తరలించే క్రమంలో మూడుచోట్ల రైల్వే ట్రాక్ దాటాల్సి వస్తున్నదని, రైల్వేశాఖ నుండి మరింత సహకారం అవసరమని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో ముఖ్యమంత్రి వెంటనే దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవతో ఫోన్లో మాట్లాడారు. సహకరించాలని కోరారు. దీనికి జీఎం కూడా సానుకూలంగా స్పందించారు.