నాలుగేండ్ల క్రితంనాటి మాట.. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ విభజనఖాయమైంది. ముసాయిదా బిల్లు తయారవుతున్నది. ఇవాళో.. రేపో తీర్మానం పెట్టడం తప్పనిపరిస్థితి ఏర్పడింది. ఇక్కడ హైదరాబాద్‌లో మాత్రం చివరి హైడ్రామాకు తెరలేచింది. అప్పుడు ముఖ్యమంత్రి పీఠంపై ూర్చొని ఉన్న నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి యావత్ మీడియాను పిలిచి పెద్ద సినిమా చూపించారు. ఓ తెర.. ల్యాప్‌టాప్.. ప్రొజెక్టర్‌తో.. అద్భుతమైన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఓ పొడువాటి కర్ర పట్టుకొని ఒక్కొక్కటి చూపిస్తూ.. విభజన జరిగితే తెలంగాణ ఎంత ఆగమైపోతుందో ఆర్ద్రంగా చెప్పుకొచ్చారు. తెలంగాణపట్ల తనకున్న అపారమైన ప్రేమానురాగాలను ఒలకబోస్తూ.. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోతే మరుసటి క్షణం నుంచి హైదరాబాద్‌తో సహా.. పది జిల్లాలు అంధకారంలో మగ్గిపోతాయన్నారు. ఇక్కడ కరంట్ ఉత్పత్తికి అవకాశమే లేదన్నారు. మొత్తం బోర్లపై ఆధారపడ్డ వ్యవసాయం కరంట్ లేక వట్టిపోతుందని తెగ ఆందోళన వ్యక్తంచేశారు.
పీఠభూమి ప్రాంతానికి నీళ్లే రావని.. లిఫ్ట్‌లు తప్ప ప్రాజెక్టులు కట్టలేరని.. లిఫ్ట్‌లకు మళ్లీ కరంట్ అవసరమవుతుందని.. లెక్కలు..ఎక్కాలు.. సవిస్తరంగా వివరించారు. ఆ రోజు కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖం చూస్తే.. అబ్బ.. తెలంగాణ పట్ల ఎంత ఆర్థ్రంగా ఉన్నారో అని ఎవరికైనా అనిపిస్తుంది. ఆ మాటలు.. లెక్కలు చూస్తే నిజమేనేమో.. తెలంగాణ వచ్చాక కరంట్ లేకపోతే.. వ్యవసాయం రాకపోతే.. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ఏమో అద్భుతంగా అభివృద్ధి చెందుతుంటే.. మనం దారుణంగా దెబ్బతింటామేమో.. అన్నంత నమ్మశక్యంగా కిరణ్‌కుమార్‌రెడ్డి వివరించుకొచ్చారు.
వాస్తవంగా తెలంగాణ ఏర్పాటు తప్పదని తేలినప్పటి నుంచీ తెలంగాణేతరులు ఒకటే ఊదరగొట్టారు. మీకు పాలించుకోవడం రాదు. అభివృద్ధి అంటే తెల్వదు. ఆంధ్ర నుంచి డబ్బులన్నీ తెచ్చి ఇక్కడ పోగేస్తున్నాం కాబట్టి వాటితోనే మీ ముఖాల్లో కాస్తంత వెలుగు కనిపిస్తున్నది. ఒక్కసారి ఆంధ్ర వేరుపడిపోతే.. హైదరాబాద్ సున్నా అయిపోతుంది. చందనలు..బొమ్మనలతో సహా అన్నీ మూకుమ్మడిగా ఆంధ్రకు వెళ్లిపోతాయి. చివరకు సినిమావాండ్ల దగ్గరినుంచి ఆటోవాళ్లు.. మెస్‌ల వాళ్లు అంతా కట్టగట్టుకొని వెళ్లిపోతారు. మీరు బతుకుతున్నదే హైదరాబాద్‌మీద. దాని సొమ్ములన్నీ మావే.. అవి వెనక్కిపోయి… కరంట్ లేక.. నీళ్లు లేక.. ఆగమైపోతరు. నక్సలైట్లు విజృంభిస్తారు. పాకిస్తాన్ శక్తులు వచ్చిపడుతాయి. ఉద్యమం పేరుతో మీ నాయకుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు.. మాయలో ఉంచుతున్నాడు. ఇలా.. ఎన్ని మాటలు.. హిట్లర్ గోబెల్స్ ూడా ఈ స్థాయిలో ప్రచారం చేశాడో లేదో తెలియదు కానీ.. ప్రపంచ చరిత్రలోనే రికార్డు చేయగల స్థాయిలో పేలాయి.
ఏమైతేనేం, ఉద్యమసారథి దృఢమైన సంకల్పంతో తెలంగాణ సాకారమైంది. రాష్ట్రం వేరుపడ్డ క్షణం నుంచే విఫల తెలంగాణ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆంధ్ర నుంచి సరఫరా కావాల్సిన కరంటును నిలిపివేశారు. మిగతావాటిపైనా నానారకాల కుట్రలు జరిగాయి. ఇప్పటికి నాలుగేండ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ఒక్కసారి తెలంగాణను చూస్తే.. ఆశ్చర్యమేస్తుంది. మనం నిలిచి ఉన్న ఈ గడ్డ నిజంగా తెలంగాణమేనా.. విస్మయం కల్గుతుంది. ఒక రాష్ట్రాన్ని ఈ రకంగా పురోగామి పథంలో నడిపించవచ్చా అని సంభ్రమానికి గురిచేస్తుంది. ఒ ఒక్కడు.. అనేక పార్శ్వాలలో.. అనేక రంగాలపై.. అన్ని వర్గాల గురించి.. ఒసాేరి ఆలోచించడం సాధ్యమేనా? ఒకవైపు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను.. మరోవైపు నగర ఆర్థిక వ్యవస్థను సమాంతరంగా పరిపుష్ఠం చేసే దిశగా నడిపించడం కుదిరేపనేనా? ఇదిగో తెలంగాణలో సాధ్యమైంది. సాధ్యం చేసి చూపించారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ కోసం ఎందుకు ఉద్యమించాల్సి వచ్చిందో ఇప్పుడు మాగాణంగా మారుతున్న ప్రతి మట్టి పెళ్లలో జవాబు కనిపిస్తున్నది. తమ్ముడూ ఇరవై ఆరేండ్ల తరువాత మా భూమిలో పంట పండింది.. నా ఇంటికి బియ్యం వచ్చినయి అని ఓ అన్నయ్య ఫోన్‌చేసి సంబురపడటమే ఉద్యమ ఫలితం. కులం లేదు.. వర్గం లేదు.. మతం లేదు.. అందరికీ సమాన స్థాయిలో సంక్షేమ ఫలాలు అందుతున్న రాష్ట్రం ఏదైనా ఉందా అంటే.. ఇప్పుడు ఠక్కున వచ్చే జవాబు తెలంగాణ. ఒక్కో అడ్డంకిని తొలిగించుకొంటూ.. ఒక్కో సమస్యను పరిష్కరించు కొంటూ.. ఏక కాలంలో అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి లెక్కకు మిక్కిలి పథకాలను అమలుచేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది తెలంగాణమే. దేశంలో ఏ రాష్ట్రం ూడా అందుకోలేని వేగంతో వృద్ధిరేటు సాధించి అభివృద్ధిలో పరుగులు పెడుతున్న రాష్ట్రం తెలంగాణ. పారిశ్రామికంగా, సంక్షేమపరంగా, శాంతిభద్రతలతోపాటు.. అన్ని రంగాలలోనూ మునుపెన్నడూ లేనిరీతిలో పురోగతి కనిపిస్తున్నది. రైతులు, విద్యార్థులు, నేత కార్మికులు, అన్ని కులవృత్తుల వాళ్లు, మహిళలు, వృద్ధులు, పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులు.. ఇలా అన్ని వర్గాల వారు ఏకరీతిన సంతృప్తి చెందేలా కార్యక్రమాలు చేపట్టిన రాష్ట్రం తెలంగాణ.
వెలుగుల తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన ఉద్యమసారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అమలుచేసిన మొదటి అజెండా తెలంగాణను అంధకారంలోకి వెళ్లకుండా చేయడం.. ఏ కిరణ్‌కుమార్‌రెడ్డి.. అతని వంది మాగధ బృందం శాపనార్థాలు పెట్టారో.. వాటిని అబద్ధం చేయడం. ఆనాడు అది అంత తేలికైన పని కాదు. ఓవైపు ముందు జాగ్రత్తపడి పవర్ ప్లాంట్లన్నీ తమ ప్రాంతాల్లో పెట్టుకొన్న ఆంధ్రపాలకులు తెలంగాణకు విద్యుత్తు సంక్షోభం సృష్టిస్తున్నా.. డిస్కంలకు ఆదేశాలిస్తున్నా కించిత్ ఆందోళన చెందకుండా విద్యుత్ ఉత్పాదకతపై దృష్టి సారించారు. ఫలితం కేవలం ఆరే ఆరు నెలల్లో కోతల్లేని తెలంగాణ ఆవిర్భవించింది. అంతకు మించి వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్తును ఇవ్వడం అద్భుతమే.. అంతటితో ఈ ప్రస్థానం ఆగలేదు. మూడున్న రేండ్లపాటు ప్రైవేటురంగ జోక్యం లేకుండా ప్రభుత్వ విద్యుత్ సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యంతో శ్రమించి 2018 జనవరి 1 నూతన సంవత్సరం వేళ 24 గంటల పాటు ఒక్క క్షణం పాటు కోత లేకుండా విద్యుత్ వెలుగులు విరజిమ్మేలా చేశారు. వ్యవసాయానికి ఆరు గంటలు కూడా విద్యుత్ ఇవ్వకుండా.. అడిగినందుకు కాల్చి చంపిన మహానుభావులకు విస్మయం కలిగిన సందర్భమది. దేశంలో ఎక్కడాలేనివిధంగా వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇచ్చి రైతు కండ్లల్లో ఆనందాన్ని నింపిన క్షణమది. తెలంగాణ నుంచి చీకట్లను పారదోలాలన్న ముఖ్యమంత్రి కల నెరవేరిన వేళ అది. దేశ చరిత్రలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ను
ఉచితంగా అందివ్వడం ఒక రికార్డు. ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా.. దేశాని మార్గదర్శకంగా మారిన క్షణాలవి.
సేద్య సంక్షేమం గ్రామాల్లో భూములు ఉన్నాయి. ఆ భూము లది పెద్ద కథ. భూమి ఒకరి పేరు మీద ఉంటే.. దాన్ని మరొకడు రాస్తాడు. జుట్లు ముడేస్తారు. పంచాయితీ లవుతాయి. ఈ బాధలు పోవడానికి దాదాపు ఎనిమిది దశాబ్దాల తరువాత భూమి సంబంధ సమస్యలు లేని సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ముఖ్య మంత్రి మహాయజ్ఞం చేశారు. భూమి సంబంధ సమస్యలను పరిష్కరించినప్పుడు తెలంగాణలో అన్నదాతకు సంక్షేమం ల్గుతుంది. అన్నదాత సంక్షేమంగా ఉంటేనే రాష్ట్రం సంక్షేమంగా ఉంటుందన్న ఆలోచనతో.. డబుల్ ఖాతాలు, నిల్ ఖాతాలు, డెత్ ఖాతాలు లేకుండా, రెవిన్యూ పరమైన సమస్యలన్నింటినుంచీ రైతుకు విముక్తి కలిగించేలా, వాస్తవ హక్కుదారుకు యాజమాన్య హక్కులు లభించేందుకు భూమి రికార్డుల ప్రక్షాళన జరిగింది. భూముల లెక్కలు తేల్చారు. నిజమైన రైతుల లెక్కలు తేల్చారు. యాజమాన్య హక్కులు కల్పించారు. అత్యంత భద్రతాఫీచర్లతో పట్టాదార్ పాస్‌పుస్తకాలను రూపొందించి అందించారు.
తెలంగాణ రాకముందు వరకు రైతు పరిస్థితి ఘోరంగా ఉండింది. వ్యవసాయంపైనే ఆధారపడ్డ రైతు జీవితమైతే దారుణంగా ఉండేది. పేరుకు పటేలు.. తెల్లబట్టలు వేసుకొని తిరుగుతాడే తప్ప లోపలంతా డొల్లే. లక్షలకొద్దీ అప్పులు.. అవి తీర్చలేక ఆత్మహత్యలు. ఈ పరిస్థితిలో మార్పు రావాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. అందరిలోనూ వ్యవసాయం చేయాలి.. చేస్తే గ్యారంటీగా డబ్బులు వస్తాయి అన్న భావన బలంగా కలుగాలన్న లక్ష్యంతో ఇందుకోసం రాష్ట్రంలో వానకాలం (ఖరీఫ్), యాసంగి (రబీ) పంటలకు పెట్టుబడి కోసం 58 లక్షల మంది రైతులకు ఎకరాకు ఎనిమిది వేల రూపాయల చొప్పున సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా వానకాలం పంటకు ఎకరాకు నాలుగు వేల చొప్పున పల్లె పల్లెలో పండుగ వాతావరణంలో వితరణకూడా జరిగింది. రైతులకు అండగా ఉండటానికి రైతు సమన్వయసమితులను కూడా ఏర్పాటు చేశారు. వాటి ద్వారానే పంట కొనుగోళ్లకు, అమ్మకాలకు చర్యలు తీసుకొంటున్నారు. ఇక్కడితో ప్రభుత్వం ఆగలేదు. 2018 జూన్ 2 నుంచి రైతులకు రూ. 5లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కూడా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కులవృత్తులకు పెద్దపీట
కులవృత్తులను అనేక మార్గాల్లో ప్రోత్సహించడం ద్వారా కార్పొరేట్ల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిన ఆయా వృత్తులను తిరిగి సామాన్యుడి చెంతకు తేవాలన్న ఆలోచన అసాధారణమైంది. సామాన్యుడి నుంచి కులవృత్తులను దూరంచేసి కార్పొరేట్ కల్చర్‌కు సాఫిస్టిటెేడ్‌గా వాటిని బదిలీచేసి కంప్యూటర్లు, ఏసీ గదుల్లో స్పెషల్ డ్రెస్‌కోడ్‌తో అవే ఉత్పత్తులను తయారుచేసి వాటిపై బ్రాండ్లు వేసి కోట్లకు కోట్లు కొల్లగొడుతున్న సంపన్నుల ఆర్థిక వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం పల్లెబాట పట్టించింది. ఒక్కోవృత్తిని గుర్తించి.. దానిద్వారా ఆర్థిక పరిపుష్ఠి ఏ విధంగా జరుగుతున్నదో సూక్ష్మస్థాయిలో అంచనాలు వేసి ఆయా వృత్తుల వారీగా పథకాలను ప్రభుత్వం అమలుచేసింది. ఇందులో మొదటగా కేసీఆర్ గొల్ల కురుమలను ఎంచు కొన్నారు. గణాంకాలు తీసుకొన్నారు. ప్రతిరోజూ రాజస్థాన్ నుంచో.. లేక పొరుగు రాష్ట్రాల నుంచో సుమారు 650 లారీల గొర్రెలు తెలంగాణకు దిగుమతి అవుతున్నాయి. అందులో సగం హైదరాబాద్ వస్తున్నాయి. ఫైవ్‌స్టార్ ¬టళ్లు.. బావర్చీ లాంటి ¬టళ్లకు మనం వెళ్లి రకరకాల పేర్లతో పెట్టే నాన్‌వెజ్ ఐటవ్స్‌ు ఆర్డర్ ఇచ్చి తెచ్చుకుంటామే తప్ప దాని ప్రాడక్టివిటీ గురించి ఆలోచించం. హైదరాబాద్ రాంనగర్‌లోని చేపల మార్కెట్‌లోనూ అదే పరిస్థితి. దిగుమతి తప్ప మరో దారిలేదు. ఈ పరిస్థితి మారాలన్నది ముఖ్యమంత్రి దృఢ సంకల్పం. గొల్ల కురుమలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెలు, పొట్టేళ్ల పంపిణీ, మత్స్యకారులకోసం చెరువులు.. కుంటల్లో చేపల పెంపకం మొదలుపెట్టారు. ఇప్పటివరకు దాదాపు 50 లక్షల గొర్రెలను పంపిణీ చేస్తే వాటికి సుమారు 20 లక్షల పిల్లలు పుట్టాయి. ఒక గొర్రె ధర ఎంత ఉంటుందో మనకు తెలియంది కాదు.. వీటికోసం మీట్ ప్రాసెసింగ్ యూనిట్లనూ పెడుతున్నారు. ఎలాంటి అవినీతికి తావులేకుండా, సమర్ధంగా పూర్తయితే.. వాటి పెంపకం సరిగ్గా జరిగితే దిగుమతి స్థానంలో ఎగుమతి మొదలవుతుంది. గొల్ల కురుమల ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది.
తెలంగాణ వచ్చినతర్వాత గీతకార్మికుల కోసం వెంటనే కల్లుదుకాణాలు పునరుద్ధరించారు. రజకులకోసం ఆధునిక ధోభీ ఘాట్లను, డ్రైయర్లను ఇస్తున్నారు. 25 వేల మంది నాయీ బ్రాహ్మణులకు ఆధునిక సెలూన్లు ఏర్పాటు చేసుకోవడానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. విశ్వబ్రాహ్మణుల కులవృత్తులను ప్రోత్సహించడానికి రూ.250 కోట్లతో కార్యక్రమాలు అమలు చేయనున్నారు. సంచార జాతుల కోసం దేశంలోనే మొదటిసారిగా ఎంబీసీ కార్పోరేషన్ ఏర్పాటుచేసి, రూ. వెయ్యి కోట్లు నిధులు టాేయించి అత్యంత వెనుకబడిన కులాల అభివృద్ధికి పాటుపడుతున్నారు.
తెలంగాణలో క్షీరవిప్లవం
కష్టపడి సాధించుకున్న తెలంగాణ క్షీరవిప్లవం దిశగా అడుగులు వేయాలని, పాడిపంటల తెలంగాణగా రాష్ట్రం ఆవిర్భవించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రకటించింది. అన్ని రంగాలు, అన్ని వృత్తులవాళ్లు బాగుపడటంతోపాటు రాష్ట్రానికి సంపద సృష్టికర్తలుగా ప్రతి ఒక్కరినీ తీర్చిదిద్దడమే లక్ష్యంగా పాడి పరిశ్రమ అభివృద్ధికోసం యాభైశాతం సబ్సిడీపై బర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఎస్సీ ఎస్టీ రైతులకు 75శాతం సబ్సిడీపై బర్రెలను అందిస్తారు. అంతేకాదు.. విజయడైరీకి ఇస్తున్న మాదిరిగానే రాష్ట్రంలోని అన్ని డైరీలకు రూ.4 ఇన్సెంటివ్‌ను ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్రానికి కోటి లీటర్ల పాలు అవసరం. మీరంతా మొత్తం కలిపి పోస్తున్నది 7లక్షల లీటర్ల పాలు. మనకు రోజూ ఆంధ్రల్లిె 4 లక్షలు, 2 లక్షలు గుజరాత్ నుంచి వస్తున్నయి. కోటి లీటర్లు ఎక్కడా. ..7లక్షల లీటర్లు ఎక్కడా.. అందుకే రాష్ట్రానికి అవసరమైన పాలను ఇతర రాష్ట్రాలనుంచి దిగుమతి చేసుకోకుండా ఎగుమతి చేసే స్థాయిలో పాల ఉత్పత్తి జరగటం కోసం అవసరమైనన్ని బర్రెలను పంపిణీ చేయటమే కాకుండా పాలను సేకరించే సామర్ధ్యాన్ని పెంచేందుకు అవసరమైన యంత్రాలు, ఇతర మౌలిక, ఉత్పాదక సౌకర్యాల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది.
చేపల పంపిణీ
బెస్తోళ్లు. ముదిరాజ్‌లు చేపలు పడుతరు. చేపలకు మంచి గిరాకీ ఉంది. హైదరాబాద్ సిటీకి రోజుకు 40 లారీల చేపలు ఇతర ప్రాంతాల నుంచి (ఆంధ్ర, బొంబాయి) వస్తాయి. అవి మనం కొనుక్కొని తింటున్నాం. ఈ పరిస్థితిని అధిగమించడానికి వెయ్యికోట్లతో చేపలు పెంచే పని చేస్తున్నారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, నదుల్లో కోట్ల సంఖ్యలో చేపపిల్లలను వేశారు. మత్స్యకారులు, ముదిరాజ్‌లు ఉచితంగా చేపలు పట్టుకొంటున్నారు.
చేనేతకు చేయూత
వ్యవసాయం తర్వాత తెలంగాణలో అతిపెద్ద ఉపాధి కల్పనారంగం చేనేత-జౌళి. విస్తృతమైన ఉపాధి అవకాశాలను కల్పించి గ్రామీణ ఆర్థికవ్యవస్థకు ఈ రంగం చేయూతనిస్తున్నది. కొన్ని దశాబ్దాలనుంచి గత ప్రభుత్వాలకు ఈ రంగంపై అవగాహన లేకపోవడంతో ఎన్నో ఒడిదుడుకు లకు లోనైంది. తగినంత ముడి సరుకు లేకపోవడం, సరైన మార్కె టింగ్ లేకపోవడం, ఆధునిక సాంతిేక పరిజ్ఞానాన్ని అందిపుచ్చు కోకపోవడంలో వెనుకబడడంతో పాటు మిల్లుల నుంచి వస్తున్న తీవ్రమైన పోటీతో తీవ్రంగా ప్రభావిత మయింది. ఈ రంగంపై సంపూర్ణ అవగా హనతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం.. మేధావులు, నిపుణులు, స్వచ్ఛంద సంస్థలతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులతో పలుదఫాలుగా చర్చించి చేనేతపరిశ్రమ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చర్యలు తీసుకొన్నది.
థ్రిఫ్ట్ పథకం ద్వారా నేత కార్మికులు ఒక నెలలో పొందే ూలీలో 8 శాతం వాటా నేతన్న జమచేస్తే.. ప్రభుత్వం 16 శాతం జమ చేస్తుంది. గతంలో వేలం సహకార సంఘంలో ఉన్న నేతన్నల వర్తించిన ఈ పథకం ఇప్పుడు సహకార సంఘంలో లేనివారికీ వర్తింపజేశారు. డైయింగ్, డిజైనింగ్, వార్ఫింగ్, వైండింగ్, సైజింగ్ వంటి చేనేత అనుబంధ కార్మికులు ూడా దీనికి అర్హులవుతారు. చేనేత సహకార సంఘంలోని పొసైటీలు, కార్మికులు కొనుగోలు చేసే నూలు, సిల్క్, ఉన్ని, డై, రసాయనాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న 20 శాతం సబ్సిడీని 40 శాతానికి పెంచింది. ంద్ర ప్రభుత్వం ఇచ్చే 10 శాతం సబ్సిడీ అదనంగా లభిస్తుంది. ఈ పథకంతో చేనేత, అనుబంధ కార్మికులకు 35 శాతం అదనపు ఆదాయం లభిస్తుంది. చేనేత కార్మికుల సహకార సంఘాల నుంచి టెస్కో ప్రస్తుతం రూ.50 కోట్ల విలువైన సాధారణ, యూనిఫాం వస్త్రాలను కొనుగోలు చేస్తున్నది. ఇందుకోసం రూ.127 కోట్లు, హస్తకళల అభివృద్ధికోసం రూ.20 కోట్లు, చేనేత ఉత్పత్తుల బ్రాండ్ ప్రమోషన్, మార్కెటింగ్ సదుపాయాల కోసం రూ.11 కోట్లు.. ప్రభుత్వ పాఠశాలల యూనిఫారాలను, ఇతర శాఖలకు అవసరమైన వస్త్రాలు, బతుకమ్మ చీరల కొనుగోలుూ రూ.240 కోట్లు టాేయించారు. జాతీయ చేనేత అభివృద్ధి పథకం కింద రూ.10.19 కోట్లతో రాష్ట్రానికి 8 బ్లాక్ లెవల్ క్లస్టర్లు మంజూరయ్యాయి. ఆలేరు, కమలాపూర్, వెల్టూర్, ఆర్మూర్, శాయంపేట, కనుకుల, భూదాన్‌పోచంపల్లి, వేములవాడలోని 2602 చేనేత కార్మికులకు లబ్ధి చేూరుతుంది. రూ.14.98 కోట్లతో గద్వాలలో కొత్తగా హ్యాండ్‌లూవ్‌ు పార్క్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. వరంగల్ జిల్లాలో 1190 ఎకరాల విస్తీర్ణంలో ఫైబర్‌టు ఫ్యాషన్ విధానంతో ఏర్పాటుచేస్తున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు అక్టోబర్ 22న సీఎం సీేఆర్ శంకుస్థాపన చేశారు. దేశ, విదేశాలకు చెందిన 23 మంది పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వం ఎంవోయూలను కుదుర్చుకొన్నది. ఫలితంగా రూ.3,900 కోట్ల పెట్టుబడులతోపాటు 60వేల నుంచి 80వేల మందికి ఉపాధి అవకాశాలు కల్గుతాయి. చేనేత కార్మికులు జాతీయ బ్యాంకుల నుంచి, జిల్లా ంద్ర సహకార బ్యాంకుల నుంచి చేనేత
ఉత్పత్తులకోసం జనవరి 1, 2014 నుంచి మార్చి 31, 2017 వరకు తీసుకున్న వర్కింగ్ క్యాపిటల్ వ్యక్తిగత రుణాలు రూ.లక్ష వరకు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆసరా పింఛన్లు
రాష్ట్రంలో ఎక్కడా ఆకలిచావులు ఉండొద్దన్న లక్ష్యంతో పింఛన్లను వెయ్యి రూపాయలకు పెంచారు. వృద్ధులకు, భర్త చనిపోయిన మహిళలకు, ఒంటరి స్త్రీలకు, దివ్యాంగులకు, బోదకాలు బాధితులకు.. ఇలా నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆసరాగా నిలిచింది. సుమారు 39.18 లక్షల మందికి ప్రభుత్వం ఆసరా పింఛన్లను అందిస్తున్నది. వీరిలో దివ్యాంగులకు 15 వందల రూపాయల పింఛన్లనిస్తున్నారు. గీతకార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులకు కూడా పింఛన్లను ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ.
కల్యాణలక్ష్మి-షాదీ ముబారక్
ఇదొక అద్భుతం. పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులు కూతు రు పెండ్లికోసం కనాకష్టం పడకుండా ఉండటానికి 51,116 రూపాయల ఆర్థిక సహాయంతో ప్రారంభమైన కల్యాణలక్ష్మి పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక అయింది. ఈ ఆర్థిక సహాయాన్ని ఇప్పుడు లక్షా నూటా పదహారువేలకు పెంచారు. రాష్ట్రంలో లక్షలాది ఆడపిల్లలు దీంతో లబ్ధి పొందుతున్నారు.
కేసీఆర్ కిట్లు
ఇదొక అద్భుత పథకం. గర్భిణులకు అనవసరంగా ఆపరేషన్లు చేసే దోపిడీ వైద్యవిధానాన్ని నిర్మూలించడానికి ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్లు పూర్తిగా విజయ వంతమయ్యాయి. ప్రభుత్వ దవాఖానలో ప్రసవం చేయించు కొన్న వారికి 16 రకాల వస్తువులతో కూడిన కిట్‌ను ఉచితంగా అందిస్తున్నారు. దీంతోపాటు ఆడపిల్లలు పుడితే అదనంగా మరో వెయ్యి కలిపి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారు. గర్భిణులు దవాఖానకు రావడం ఇబ్బంది అయితే.. వారిని జాగ్రత్తగా తీసుకొచ్చి.. ప్రసవం అనం తరం తిరిగి తల్లీబిడ్డల్ని క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యతను కూడా ప్రభుత్వమే చేపట్టింది.
తెలంగాణ ఓ గురుకులం
ప్రతి మారుమూల గ్రామంలోని ప్రతి విద్యార్థికీ కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా విద్యనందించే దిశగా గురుకుల విద్యాలయాలను స్థాపించి.. తెలంగాణ రాష్ట్రమే ఒక గురుకులంగా మారిపోయింది. ప్రతి వర్గానికీ, ప్రతి విద్యార్థికీ జీే నుంచి పీజీ వరూ నాణ్యమైన విద్యను అందిస్తామంటూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇచ్చిన వాగ్ధానం అమలుదిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. పీజీ స్థాయి వరూ ప్రతి విద్యార్థికీ ఉచితంగా చదువు చెప్పేందుకు జీే టూ పీజీ విద్యావిధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. పాఠశాలల్లో డ్రాపవుట్లకు ఎలాంటి ఆస్కారం ఇవ్వకుండా గురుకుల వ్యవస్థను దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా బలోపేతం చేసింది. ప్రత్యేక వ్యూహంతో వివిధ వర్గాల విద్యార్థులకు వేరువేరుగా గురుకులాలను ఏర్పాటుచేసి పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు, జనరల్ విద్యార్థుల కోసం ూడా గురుకుల విద్యాలయాలను పెద్ద ఎత్తున ప్రారంభించింది. జూనియర్, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నది. నాలుగేండ్ల క్రితం
ఉమ్మడి రాష్ట్రంలో అన్ని క్యాటగిరీలకు చెందిన రెసిడెన్షియల్ పాఠశాలల సంఖ్య 298 మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల సంఖ్య ఏకంగా 815కు పెంచారు. గురుకులాలను ఏర్పాటుచేయడంతోనే ప్రభుత్వం చేతులు దులుపుకోలేదు. ఆయా విద్యాసంస్థల్లో నాణ్యతాప్రమాణాలను ూడా కార్పొరేట్ విద్యకు దీటుగా తీర్చిదిద్దారు. ఈ గురుకులాల్లో 2, 00,297 మంది విద్యార్థులు చదువుకోవడం, రాష్ట్రంలో జీేటు పీజీ విద్యకు వేసిన ముందడుగు. ఏడున్నరేండ్ల దీర్ఘకాలిక లక్ష్యంతో 1200 గురుకులాలను ఏర్పాటుచేసి కనీసంగా 7.60 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా విద్యనందించే ప్రణాళికతో తెలంగాణ సర్కారు దూసుకుపోతున్నది. గురుకుల విద్యాలయాల్లో చదువుకొనే ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం ఏటా దాదాపు రూ.లక్షకు పైగా ఖర్చు చేస్తున్నది. విద్యార్థులకు పౌష్టికాహారం, తగిన వసతి సౌకర్యాలు కల్పించడంతోపాటు, అవసరమైన పుస్తకాలు, నోటుబుక్కులు, దుస్తులు, కాస్మొటిక్ వస్తువులను అందజేస్తారు. అంతేకాకుండా విద్యాబోధనతోపాటు సాంస్కృతిక, క్రీడాంశాల్లోనూ విద్యార్థుల నైపుణ్యం పెంచేందుకు దృష్టి సారించారు.
ఓవర్సీస్ విద్యాపథకం
విదేశాల్లో ఉన్నత విద్యలు చదువుకోవాలనుకొనే పేద విద్యార్థులకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్ఠాత్మకంగా ఓవర్సీస్ విద్యాపథకాన్ని చేపట్టింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు రూ.20 లక్షల వరకు విద్యాభ్యాసం చేయడానికి అవసరమైన సహాయాన్ని ఈ పథకంద్వారా చేస్తున్నారు.
డబుల్ బెడ్‌రూం ఇండ్లు
రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంతింటి కలను నిజం చేసేందుకు పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో ఒక్కో ఇంటికి సుమారు ఐదు నుంచి ఏడు లక్షల వరకు ఖర్చు చేస్తూ దాదాపు రెండున్నర లక్షల డబుల్‌బెడ్‌రూం ఇండ్లను నిర్మించి ఇవ్వడం దేశంలోనే కనీవినీ ఎరుగని పథకం. గతంలో అనేక రకాల హౌసింగ్ స్కీంలు ఎంత దారుణంగా అమలయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు లబ్ధిదారుడు ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా ఇంటి యజమాని కావడం అపూర్వ విషయం. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి.
కంటి వెలుగు
సాధారణంగా మనకు ఆరోగ్యంపై శ్రద్ధ తక్కువ. దవాఖానకు వెళ్తే అడ్డగోలు దోపిడీ. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి.. ఉచితంగా కండ్లద్దాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2018 జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే ఈ పథకం కోసం 106 కోట్ల రూపాయలను ఇప్పటికే విడుదల చేసింది.
మిషన్ కాకతీయ-మిషన్ భగీరథ
మీకు నీళ్లే రావన్న వాళ్లకు ఈ రెండు పథకాలు చెంపపెట్టు లాంటివి. కాకతీయుల కాలంనాటి గొలుసుకట్టు చెరువుల ద్వారా జరిగిన నీటి నిర్వహణ విధానాన్ని విధ్వంసం చేసిన వలసపాలకులకు కనువిప్పు కలిగేలా రాష్ట్రంలోని 46 వేల చెరువులను పూడిక తీసి.. ఆ పూడికను పొలాలకు తరలించి సంప్రదాయ సేంద్రియ వ్యవసాయాన్ని పెంపొందించడంలో అద్భుత విజయాన్ని సాధించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన మంచినీటిని సరఫరా చేయడం ద్వారా ఆరోగ్య తెలంగాణ కోసం పాటుపడుతున్నారు. ఈ ఏడాది చివరికల్లా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నీళ్లు రానున్నాయి. దీంతోపాటే.. ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా కల్పించడం మరో అద్భుతం.
అధికార వికేంద్రీకరణ-దళితులకు రాజ్యాధికారం
అధికార వికేంద్రీకరణలో భాగంగా 10 జిల్లాల తెలంగాణ 31 జిల్లాల తెలంగాణగా మారింది. పరిపాలన సౌకర్య వంతంగా మారింది. 78 కొత్త మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. కొత్తగా 1326 ఎస్టీ గ్రామాలు, 1311 ఏజెన్సీ గ్రామాలు ఏర్పడ్డాయి. పలు తండాలు, గూడేలు గ్రామశోభను సంతరించుకొన్నాయి. ఈ గ్రామాల్లో నూటికి నూరు శాతం ఎస్టీలే సర్పంచ్‌లుగా, వార్డు సభ్యులుగా ఉంటారు. వారి గ్రామాలను వారే అభివృద్ధి చేసుకొంటారు. మైదాన ప్రాంత గిరిజన గ్రామాల్లో నూరు శాతం సర్పంచ్ పదవులు గిరిజనులకే దక్కుతాయి. వార్డు సభ్యుల్లోనూ 50 శాతం ఎస్టీలకు కేటాయిస్తూ కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. నిజమైన గ్రామ స్వరాజ్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలు వేశారు.
సర్వమత సమభావం
దేశంలో ఎక్కడా లేనివిధంగా నిజమైన లౌకిక ప్రభుత్వం తెలంగాణలోనే కొనసాగుతున్నది. మొట్టమొదటిసారిగా తెలంగాణలో దేవాలయాలలో పనిచేసే అర్చకస్వాములకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ట్రెజరీ నుంచి ప్రతినెలా మొదటితేదీన వేతనాలు చెల్లిస్తున్న ప్రభుత్వం తెలంగాణనే, అలాగే ముస్లిం ఉలేమాలకు మతగురువులకు గౌరవ భృతిని అందిస్తున్నారు. క్రైస్తవ మతగురువులకూ అనేక వరాలు అందించారు.
ఉద్యోగులు-ఉపాధ్యాయులకు అండ
రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట్నుంచీ స్నేహభావంతో ఉన్నారు. రాష్ట్ర ఆవిర్భావం జరిగిన వెంటనే తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇవ్వడమే కాకుండా 43శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆర్టీసీ ఉద్యోగులకు మరోశాతం ఎక్కువగా ఫిట్‌మెంట్‌ను ప్రకటించారు. వారి వేతనాలు, సర్వీసు నిబంధనలు, బదిలీలు.. ఇలా ప్రతి ఒక్క సమస్యనూ తానే అన్నీ అయి పరిష్కరిస్తున్నారు.
అన్ని వర్గాలకూ చేయూత
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నడూ ఓట్ల లెక్కలు వేసుకోలేదు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధినే ఆకాంక్షించారు. అందుకే కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీలే కాకుండా అగ్రవర్ణాల్లో పేదలకు కూడా మేలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొన్నారు. బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటు చేసి వివిధ పథకాలు వర్తించేలా చేశారు. బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, మైనార్టీ సంక్షేమం ఇలా అన్ని వర్గాలకు సంక్షేమం జరిగేలా చర్యలు తీసుకొన్నారు.
ఇవాళ సంక్షేమంలో, అభివృద్ధిలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సారథ్యంలోని ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. ఇక్కడ అమలవుతున్న పథకాలు, నిర్మాణ మవుతున్న ప్రాజెక్టులను చూసి యావద్దేశం అబ్బురపడుతున్నది. అన్ని రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి.. వ్యక్తులు, సంస్థలు, ప్రజాప్రతినిధులు వచ్చి చూసి పోతున్నారు. వీటిని తమ తమ ప్రాంతాల్లో అమలు చేయడానికి పూనుకొంటున్నా రు. ఇవాళ దేశానికి తెలంగాణ ఒక రోల్‌మోడల్‌గా నిలిచింది. ఐటీ రంగం నుంచి వ్యవసాయం దాకా సమస్త రంగాల్లో దార్శనికుడైన ముఖ్యమంత్రి మార్గదర్శనంలో.. సవ్యసాచుల్లాంటి మంత్రులు తెలంగాణను పుత్తడి తెలంగాణగా మార్చడానికి విశేషంగా కృషిచేస్తున్నారు. నాడు నొసళ్లు నొక్కుకున్న వాళ్లంతా ఇవాళ్టి అద్భుత తెలంగాణను చూసి కళ్లు తేలేస్తున్నారు.
కోవెల సంతోష్ కుమార్