తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం లభించింది. ఈ`గవర్నెన్స్‌లో ఉత్తమంగా రాణిస్తున్న శాఖలకు అందించే ప్రతిష్టాత్మక ఈ`ఇండియా గవర్నమెంట్ టు సిటిజన్ ప్రాజెక్టు అవార్డుకు 2014 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఎంపికైంది. జాతీయ ఈ`గవర్నరెన్స్ ప్రణాళికలో భాగంగా శాస్త్ర సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకునే రాష్ట్రాలకు జాతీయ స్థాయిలో ఈ పురస్కారం అందిస్తున్నారు.
కేరళ రాష్ట్రంలోని కోవలంలో రెండు రోజులపాటు జరిగిన కార్యక్రమంలో నవంబరు 15న తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమీషనర్ సి. పార్ధసారథి, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ డాక్టర్ ఎం. పద్మ, ఎన్.ఐ.సి.కి చెందిన జి.శివాజీలు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఈ`పిడిఎస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి, అనూహ్య ఫలితాలను సాధించి దేశవ్యాప్తంగా ఖ్యాతి గడిరచింది. నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్.ఐ.సి.) రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా పౌరసరఫరాలశాఖ అద్భుతాలు సాధించింది.
రేషన్‌కార్డుల నుంచి చౌకధరల దుకాణాలకు నిత్యావసర సరకుల సరఫరా వరకూ అంతా ఆన్‌లైన్ ద్వారా నిర్వహించడంవల్ల పెత్తఎత్తున అక్రమాలకు కళ్ళెం వేయగలిగారు. రేషన్‌కార్డులకు ఆధార్ కార్డులను అనుసంధానం చేయడం ద్వారా బోగస్‌కార్డులను, డూప్లికేట్ కార్డులను, అనర్హులకు ఉన్న కార్డులను తొలగించ గలిగారు.
ఈ`పి.డి.ఎస్. సాఫ్ట్‌వేర్ వినియోగించడం ద్వారా పౌరసరఫరాల శాఖ 2014 జూన్ నుంచి అక్టోబర్ వరకు 11 లక్షల 71వేల బోగస్ రేషన్‌కార్డులను గుర్తించి రద్దు చేసింది. అలాగే, 69 లక్షల 71వేల బోగస్ రేషన్ యూనిట్లను గుర్తించి రద్దు చేసింది. దీనివల్ల పౌరసరఫరాలశాఖ అక్టోబర్ మాసం వరకు 24,093 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఆదా చేయగలిగింది. 7406 కిలో లీటర్ల కిరోసిన్ నల్లబజారుకు తరలిపోకుండా అరికట్ట గలిగింది.
అదే సమయంలో నిజమైన, అర్హతగల వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని భావిస్తోంది. ఇందుకు ఇటీవల నిర్వహించిన సర్వే వివరాలుకూడా ఉపయోగపడతాయి. ప్రతినెలా ఆయా నిత్యావసర వస్తువుల ముగింపు నిల్వలను తహశీల్దారులనుంచి తెలుసుకొని ఆన్‌లైన్ ద్వారా కొత్తగా కేటాయింపులు జరుపుతారు. ఈ మొత్తం వ్యవహారం ఈ`పి.డి.ఎస్. ద్వారా నిర్వహించి, సంబంధిత అధికారికి ఆ బాధ్యతను అప్పగిస్తారు.
ఈ`పి.డి.ఎస్. సాఫ్ట్‌వేర్ ద్వారా పౌరసరఫరాల శాఖ ఈ క్రింది సేవలను అందిస్తోందిÑ
శ్రీ తెలంగాణ రాష్ట్రంలో ఈ`పి.డి.ఎస్. వెబ్‌సైట్‌లో మొత్తం రేషన్ కార్డులను డిజిటలైజ్ చేయడం జరిగింది.
శ్రీ పౌరసరఫరాల కమీషనర్ మొదలుకొని ఎ.ఎస్.ఓ.లు, తహశీల్దార్లు, చౌక ధరల దుకాణాలస్థాయి వరకు నిర్వహించే రిజిస్టర్ ఆధారంగా నిత్యావసర వస్తువుల కేటాయింపు జరుగుతుంది.
శ్రీ నిత్యావసర వస్తువులు పొందేందుకు డీలర్లకు కావలసిన రిలీజ్ ఆర్డర్‌ను పొందడంలో జాప్యాన్ని నివారించేందుకు ఈ`సేవలో డబ్బు చెల్లించి రిలీజ్ ఆర్డర్ పొందే సౌకర్యం కల్పించారు.
శ్రీ ఆన్‌లైన్‌లో నిత్యావసర వస్తువుల కేటాయింపు జరపడంవల్ల క్షేత్రస్థాయిలో జరిగే అవకతవకలను నివారించవచ్చు.
శ్రీ సరుకులను నల్లబజారుకు తరలించకుండా, దుర్విని యోగం చేయకుండా ముగింపు నిల్వలు తెలుసుకోవడం ద్వారా అరికట్టడం సులభమవుతుంది.
శ్రీ ఈ`పి.డి.ఎస్. వినియోగం ద్వారా పౌరసరఫరాల శాఖలో కార్యకలాపాలు వికేంద్రీకరించబడ్డాయి. కార్డుదా రులు తమ సమస్యల పరిష్కారానికి సంబంధిత ఎ.ఎస్.ఓ., తహశీల్దారును కలుసుకోవచ్చు. దీనివల్ల క్షేత్రస్థాయిలో సిబ్బంది బాధ్యతతో వ్యవహరిస్తారు.
శ్రీ హైదరాబాద్ నగరంలో ఈ విధానంవల్ల నెలకు 14 శాతం సరుకులు ఆదా కావడంతోపాటు, నల్లబజారుకు తరలిపోకుండా అరికట్టగలుగుతున్నారు.
శ్రీ రేషన్‌కార్డుతో ఆధార్‌కార్డు, ఎల్.పి.జి. వినియోగదారుల డేటాను అనుసంధానం చేయడంవల్ల నెలకు కేటాయించే కిరోసిన్‌లో 7,406 కిలోలీటర్ల ఆదా చేయగ లుగుతున్నారు.
శ్రీ ప్రభుత్వం ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆహారభద్రతా కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించింది.
హోం
»