ఈ-గవర్నెన్స్‌-పోయి-ఎం-గవర్నెన్స్‌-వచ్చిందిప్రభుత్వ పనుల కోసం ప్రజలు ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లే రోజులు పోయి మొబైల్‌ ఫోన్‌ నుంచే అన్ని పనులు చేసుకునే ఎం-గవర్నెన్స్‌ రోజులు వచ్చాయని ఐటీ శాఖ మంత్రి కె. తారకరామరావు అన్నారు. డిజిటల్‌ తెలంగాణ వారోత్సవాల్లో భాగంగా జూలై 6వ తేదీన హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ-గవర్నెన్స్‌లో ప్రతిభ కనబర్చిన ఐఏఎస్‌, ఐపీఎస్‌, మీ- సేవా అధికారులను సత్కరించారు.

టెక్నాలజీతో సామాజిక మార్పు రావాని, లేకపోతే ఆ టెక్నాజీతో ఉపయోగం లేదన్నారు. రాబోయేరోజుల్లో ఐటీ శాఖ ద్వారా మరిన్ని మెరుగైన సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి కేటిఆర్‌ అన్నారు.

ఇదే కార్యక్రమంలో మీ-సేవా పథకం 4 కోట్ల లావాదేవీలను పూర్తి చేసుకున్న సందర్భంగా ‘మీ-సేవా’ సిబ్బందితో కలిసి కేక్‌ కట్‌ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కల్టివేటింగ్‌ డిజిటల్‌ లిటరసిలో భాగంగా తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్స్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌), ట్రిపుల్‌ ఐటి ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఈ-గవర్నెన్స్‌ పురస్కారాలు అందుకున్నవారు: రేమండ్‌ పీటర్‌ (ముఖ్యకార్యదర్శి, పంచాయితీరాజ్‌), అథర్‌ సిన్హా (ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, లాండ్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌), మురళి (సిఈఓ, సెర్ప్‌), డాక్టర్‌ అశోక్‌కుమార్‌ (కార్యదర్శి, బోర్డ్‌ అఫ్‌ ఇంటర్మీడియట్‌), లోకేశ్‌ కుమార్‌ (కార్యదర్శి, మైన్స్‌ డిపార్ట్‌మెంట్‌), అహ్మద్‌ నదీమ్‌ (కమీషనర్‌, రవాణాశాఖ), శివశంకర్‌ (ముఖ్య కార్యదర్శి, దేవాదాయ), సందీప్‌కుమార్‌ (ఏసీపి), ఎం. రమేశ్‌ (పాస్‌పోర్డు వెరిఫికేషన్‌ ఎస్పీ), ఆర్‌. మధుసూదన్‌రావు (అదనపు కార్యదర్శి, సీఎంఆర్‌ఓ విభాగం), వేణుగోపాల్‌ (జాయింట్‌ డైరెక్టర్‌, సోషల్‌ వెల్ఫేర్‌), సంధ్యారాణి (డిప్యూటీ డైరెక్టర్‌, వ్యవసాయ శాఖ)తో పాటు మీ-సేవా, ఐటీ అనుబంధ రంగాలకు చెందిన వారిని మంత్రి సత్కరించారు.

Other Updates