pmఉగ్రవాద నియంత్రణలో, దేశ భద్రతను కాపాడడంలో పోలీసుల కృషి ప్రశంసనీయమని ప్రధాని మోదీ కితాబునిచ్చారు. నవంబరు 26న హైదరాబాద్‌ నగరంలోని సర్దార్‌ వల్లబ్‌భాయిపటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీలో డీజీపీలు, వివిధ రాష్ట్రాల పోలీస్‌ విభాగ అధిపతులతో జరిగిన రెండు రోజుల సదస్సులో పాల్గొని ప్రధాని ప్రసంగించారు. అంతర్గత భద్రతలో కూడా పోలీసు వ్యవస్థ కీలకమన్నారు. ఈ విషయంలో పోలీసులు రాజీలేని పోరు సాగిస్తున్నారని తెలిపారు. అయినా పోలీసు వ్యవస్థలో ఇంకా విప్లవాత్మకమైన మార్పులు రావాలన్నారు. నేరాలను నియంత్రించడా నికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. కిందిస్థాయి నుంచే ఈ పని జరగాల్సి ఉందన్నారు. ఇది పూర్తిస్థాయిలో జరగడంలేదని పేర్కొన్నారు.

ప్రస్థుత పరిస్థితుల్లో సాఫ్ట్‌ స్కిల్స్‌ ఉపయోచించుకోవడం తప్పనిసరి అన్నారు. మనం ఇక్కడ చర్చించిన విషయాలు ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ముఖ్యంగా పోలీసు అధికారులకు నాయకత్వ లక్షణాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. అందుకే ఇక్కడ శిక్షణ స్థాయిలోనే నాయకత్వ లక్షణాలు నేర్పితే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. వివిధ రాష్ట్రాలలో నేర నియంత్రణకు చేపడుతున్న కార్యక్రమాలు ఒకరితో ఒకరు షేర్‌ చేసుకుంటే పనితీరును మెరుగుపరుచుకోవచ్చని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సదస్సులు అందుకు చక్కని వేదికలుగా ఉపయోగపడతాయన్నారు. ఈ సదస్సులో డీజీపీలు, ఇతర ఉన్నతాధికారులు చర్చించుకుని ఖరారు చేసిన అంశాలను కార్యాచరణలోకి తెచ్చి మెల్లమెల్లగా చక్కటి ఫలితాలు సాధించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతికతకు, మన మేధో పరిజ్ఞానం తోడైతే అందరు కలిసికట్టుగా కృషిచేస్తే అద్భుతమైన ఫలితాలు తీసుకురాచ్చని అన్నారు.

పోలీస్‌ యాప్‌ ఆవిష్కరణ

దేశవ్యాప్తంగా పోలీసు వ్యవస్థ, పనితీరు, అత్యవసరంగా స్పందించాల్సిన సందర్భాలకోసం రూపొందించిన ‘ఇండియన్‌ పోలీస్‌ ఎట్‌ యువర్‌ కాల్‌’ యాప్‌ను ప్రధాని మోదీ ఈ సదస్సులో ఆవిష్కరించారు. అదే విధంగా ఇంటలిజెన్స్‌ బ్యూరోలో పనిచేస్తున్న అధికారులకు రాష్ట్రపతి విశిష్ట సేవాపురస్కారాలను ప్రధానం చేశారు.

అమరులకు నివాళి

ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన పోలీసు ఉన్నతాధికారులకు పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి ప్రధాని మోదీ నివాళులర్పించారు. సర్దార్‌ వల్లభ్‌ భాయి పటేల్‌ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. పోలీస్‌ అకాడమి ప్రాంగణంలో మొక్క నాటారు.

ఘన స్వాగతం.. వీడ్కోలు

డీజీపీల సదస్సులో పాల్గొనడానికి నవంబరు 25న రాత్రి రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీకి గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇతర మంత్రులు శంషాబాద్‌ విమానా శ్రయంలో ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్‌ ప్రధానికి పుష్పగుచ్చం ఇచ్చి, శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు. నవంబరు 26వ తేదీన తిరిగి ఢిల్లీ వెళ్ల్లిన ప్రధానికి సీఎం కేసీఆర్‌ శాలువా కప్పి, బొకేతోపాటు జ్ఞాపికను ఇచ్చి వీడ్కోలు పలికారు. వీడ్కోలులో గవర్నర్‌ నరసింహన్‌, ఇతర మంత్రులు, ఉన్నతాధి కారులు పాల్గొని వీడ్కోలు పలికారు.

Other Updates