panchayateesఉత్తమ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం అందజేసిన అవార్డుల్లో తెలంగాణాకు 8 అవార్డులు దక్కాయి. లక్నోలో ఏప్రిల్‌ 24న జరిగిన జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఉత్తమ పంచాయతీలకు అవార్డులను అందజేశారు. ఇందులో తెలంగాణాలోని కరీంనగర్‌ జిల్లా పరిషత్‌తోపాటు… రెండు మండల పరిషత్‌లకు, మరో ఐదు గ్రామ పంచాయతీలకు అవార్డులు దక్కాయి. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్‌, కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్లు ఈ అవార్డులను అందజేశారు.

తెలంగాణా నుండి రాష్ట్రీయ్‌ గౌరవ గ్రామసభ పురస్కారాన్ని సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్‌ సర్పంచ్‌ లక్ష్మీ యాదమ్మ అందుకున్నారు. కరీంనగర్‌ జెడ్పీ ఛైర్మన్‌ తుల ఉమ…వనపర్తి జిల్లా ఘనపూర్‌ ఎంపీపీ కృష్ణ నాయక్‌, భూపాలపల్లి జిల్లా తాడ్వాయి ఎంపీపీ శ్రీదేవిలతో పాటు…నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ సర్పంచ్‌ భాగ్య, సిరిసిల్ల జిల్లా కస్బె కట్కూర్‌, గోపాల్రావు పల్లి సర్పంచులు మంజుల, రాంరెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లా నిజలాపూర్‌ సర్పంచ్‌ ఇంద్రయ్యలు పంచాయతీ సశక్తీకరణ్‌ పురస్కారాలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నీతూ ప్రసాద్‌తో పాటు పలువురు ఇతర స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ అవార్డులు ఇచ్చిన ప్రోత్సాహంతో తమ పరిధిలో మరింత కృషి చేసి… తెలంగాణా స్థానిక సంస్థలను దేశానికే ఆదర్శంగా నిలుపుతామన్నారు. ఈ అవార్డు కింద జిల్లా పరిషత్‌ 50 లక్షలు, మండల పరిషత్‌లకు 25 లక్షలు, గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన 8 నుండి 10 లక్షల నగదు నజరానా దక్కనుంది. అవార్డ్‌ గ్రహీతలను అభినందించిన పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు…తెలంగాణాలోని స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటాం.

Other Updates