ఢిల్లీలోని ఇండియన్ హ్యబిటేట్ సెంటర్‌లో కేంద్ర పట్టణాభివద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలు హడ్కో ద్వరా ఉత్తమ ఫలితాలు సాధించి ముందు వరుసలో ఉన్న వారికి అవార్డులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో మంచినీటి సమస్యలను నివారించడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నీటిని నిల్వ చేసుకోవడానికి ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంలను తప్పనిసరిగా నిర్మించాలని ఈ షయంపై చట్టం తేవాల్సిన అవసరం ఎంతగానో ఉందని కేంద్ర మంత్రి సూచించారు. పెరుగుతున్న పట్టణ అవసరాల కారణంగా పూర్వ కాలంలో నిర్మించిన చెరువులు, కుంటలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆ ఆక్రమణలను తొలగించకపోవడం వల్ల పట్టణాలు కాంక్రీట్ మయం అయ్యాయని, దానివల్ల వర్షం నీరు వృధాగా పోతున్నాయని కేంద్ర మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నీటి కోసం ఘర్షణలు తలెత్తకుండా ఉండాలంటే వృధాగా పోతున్న ఈ నీటిని ఒడిసిపట్టుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని కేంద్ర మంత్రి హెచ్చరించారు. ఈ సమస్యను అధిగమించడానికి ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని, నీటిని పొదుపుగా వాడాలని, ప్రతి ఖాళీ స్థలంలో ఇంకుడు గుంతలు తవ్వాలని, ఊట చెరువుల నిర్మాణం చేపట్టాలని, వాడని నీటిని రీసైక్లింగ్ పద్ధతి ద్వారా శుభ్రపరిచి వాడుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ బోర్డు సంస్థ ద్వారా మెరుగైన మంచినీటి సరఫరా అందించడమే కాకుండా, క్రమబద్ధీకరించిన పద్ధతిలో మెరుగైన రీతిలో ప్రతి ఇంటికి మంచినీటిని అందిస్తూ, నీటి ఎద్దడి రాకుండ తీసుకున్న చర్యలను గుర్తిస్తూ ఎంపికైన హడ్కో అవార్డును మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామరావు స్వీకరించారు. ఈ సంధ్రభంగా మంత్రి మాట్లాడుతూ, కృష్ణా ఫేజ్3, గోదావరి ఫేజ్1 ద్వారా హైదరాబాద్ అవసరాలకు సరిపోయే విధంగా మంచి నీటిని సరఫరా చేసి నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ప్రతి ఇంటిలో ఖాళీ స్థలాలలో తప్పనిసరిగ ఇంకుడు గుంటలు నిర్మించే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కొత్తగా గుర్తించబడని మున్సిపల్ శివారు ప్రాంతాల్లో కూడా నీటి ఎద్దడి తలెత్తకుండా నీటి సరఫరాను మెరుగైన రీతిలో అందిస్తామని మంత్రి తెలిపారు. హడ్కో ద్వారా తీసుకున్న 3 వేల 500 కోట్ల రుణాన్ని ఈ పథాకానికి పారదర్శకంగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. గతంలో హైరదాబాద్ పరిధిలో రోజుకు 150 మిలియన్ గ్యాలన్ల నీటిని మాత్రమే సరఫరా చేసే వారమని, ప్రస్తుతం 350 మిలియన్ గ్యాలన్ల నీటిని ప్రతి రోజు సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. అంతే కాకుండా వెంకయ్యనాయుడు సూచించినట్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని కేటీఆర్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో డుబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో మెరుగైన పని తీరును కనబర్చినందుకు గానూ హడ్కో అందించిన అవార్డును, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ గృహ నిర్మాణ శాఖ సెక్రటరీ అశోక్ కుమార్ అందుకున్నారు. బలహీన వర్గాల వారికి ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి వీలుగా రుణాలను వేగవంతంగా అందించినందుకు గానూ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఛైర్మన్ బి.ఆర్.జి. ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డుల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి తారక రామారావు తో పాటూ హెచ్‌ఎండబ్లూఎస్‌ఎస్ బి డైరెక్టర్ దాన కిషోర్ పాల్గొన్నారు.