tsmagazineమంత్రి కె.టి.ఆర్‌
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ నగరానికే పరిమితమైన ఐ.టి రంగం ఇప్పుడు ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరిస్తోంది. అందులో బాగంగా కరీంనగర్‌ జిల్లా దిగువ మానేరు జలాశయం
(లోయర్‌ మానేర్‌ డ్యామ్‌) సమీపంలో 25 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఐ.టి టవర్‌కు రాష్ట్ర ఐ.టి, పురపాలకశాఖల మంత్రి కె. తారక రామారావు శంకుస్థాపన చేశారు.కరీంనగర్‌ లో 250 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్‌ను కూడా మంత్రి ఆవిష్కరించారు. ఆర్థిక శాఖా మంత్రి ఈటల రాజేందర్‌, పార్లమెంటు సభ్యుడు బి.వినోద్‌ కుమార్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శాసన సభ్యుడు గంగుల కమలాకర్‌ అధ్యక్షతన జరిగి న సభలో మంత్రి కె.టి.ఆర్‌ మాట్లా డుతూ, మారుతున్న సాంకేతిక పరిజ్ఞా నాన్ని అందిపుచ్చుకొని నవీన ఆవిష్క రణలకు యువత నాంది పలకాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ యు వత, విద్యార్థులు ఉద్యోగార్ధులుగా కాకుండా, ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.

ఐ.టి రంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోందని, ఉమ్మడి రాష్ట్రంలో 56 వేల కోట్లుగా ఉన్న ఐ.టి ఎగుమతులు గత డిసెంబరు నాటికి 87 వేల కోట్ల రూపాయలకు పెరిగాయని మంత్రి చెప్పారు. రాష్ట్ర యువతకు పనిచేసేచోటే ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కరీంనగర్‌లో ఐ.టి టవర్‌ను ఏర్పాటు చేస్తున్నా మని, సంవత్సరంలోగా దీని నిర్మాణం పూర్తిచేస్తామని చెప్పారు. కరీంనగర్‌కు మరో ఐ.టి టవర్‌ను కూడా మంజూరు చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. వరంగల్‌ తరహాలో ఐ.టి హబ్‌ ఏర్పాటుచేయడంతోపాటు, త్వరలో టాస్క్‌ నెలకొల్పు తామన్నారు.

తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో దూసుకుపోతూ, దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందన్నారు. కేంద్రమంత్రులు సయితం మన పథకాలను ప్రశంసిస్తున్నారని మంత్రి గుర్తుచేశారు. రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేయడాన్ని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవకారుడు స్వామినాథన్‌ ప్రశంసించారని, ఈ విషయమై ముఖ్యమంత్రి కే.సీ.ఆర్‌కు అభినందనలు తెలిపారని కె.టి.ఆర్‌ చెప్పారు.

ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాల ద్వారా సాధించిన ప్రగతిని వివరించారు. హైదరాబాద్‌ తరువాత కరీంనగర్‌ జిల్లా ఐ.టి రంగంలో అభివృద్ధి చెందనున్నదని చెప్పారు. విద్యార్థులను తెలంగాణ ఆస్తిగా భావిస్తామని, నిధులను దారిలో పెట్టామని, ఇక నియామకాలు మొదలుపెట్టామని ఆర్థిక మంత్రి అన్నారు.శంకుస్థాపన రోజే 8 కంపెనీలు ఒప్పందం చేసుకొని 650 ఉద్యోగాల కల్పనకు ముందుకు రావడం ఆహ్వానించతగ్గ పరిణామమని అన్నారు.

Other Updates