tsmagazine
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆంధ్ర రాష్ట్రాన్ని విశాలాంధ్ర పేరుతో హైదరాబాద్‌ రాష్ట్రంలో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఉద్యోగులు,2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకు నిరంతరంగా తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో ముందు వరుసలో నిలవడం గర్వకారణం. తెలంగాణ రాష్ట్రసాధన కోసం 1969 నుండి 2001 వరకు వివిధ ప్రజా సంఘాలు, పార్టీల కృషి మరువలేనిది. కేసీఆర్‌ లాంటి నికారస్‌ అయిన నాయకత్వంతో పాటు పట్టుదలతో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాయి. 2001లో కేసీఆర్‌్‌ సారధ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడడంతోనే తెలంగాణ సాధóనకు తొలి అడుగు పడింది. రాష్ట్ర ఏర్పాటు రాజకీయ అనివార్యతగా మారి అనేక త్యాగాల, పోరాటాల నేపథ్యంలో తెలంగాణ ఏర్పడింది.

1969లో తెలంగాణ ఉద్యోగుల విరోచిత పోరాటంలో భాగంగా జరిగిన నిరవధిక సమ్మె సరైన ఫలితం ఇవ్వలేదు. దీనితో ఉద్యోగులలో ఒక రకమైన నిరుత్సాహం ఏర్పడి రాష్ట్రసాధóన ఉద్యమం బలంగా కొనసాగలేదు. 1996 తర్వాత కొంత కదలికలు ప్రారంభమైనా 2001 తర్వాత బలమైన ప్రచార ఉద్యమం జరిగింది. ఇందులో భాగంగా 610 జీఓ అమలు

చేయాలని తెలంగాణ 10 జిల్లాలలో అనేక సదస్సులు జరిగాయి. మళ్ళీ రాష్ట్ర సాధన ఉద్యమం బలపడుతున్న సందర్భంలోనే ఫ్రీజోన్‌ ఉద్యమం ప్రారంభం అయ్యి రాష్ట్రసాధóన ఉద్యమంగా మారడం, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్మికులు అన్ని వర్గాలు ఉద్యమంలో పాల్గొని సహాయనిరాకరణ, సకలజనుల సమ్మెలాంటి చారిత్రక ఉద్యమాలు నిర్వహించడంతోపాటు, కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షతో కేంద్రం దిగిరాక తప్పలేదు. మళ్ళీ కుట్రలు, కుతంత్రాలు జరిగి రాష్ట్ర ఏర్పాటు నిలువరించే ఎన్ని ప్రయత్నాలు జరిగినా వాటిని ఎదుర్కొని కేసీఆర్‌ సారధ్యంలో తెలంగాణ సాధిóంచడం ఒక చరిత్ర.

సాధించిన తెలంగాణలో కేసీఆర్‌ నాయకత్వంలో 2014 జూన్‌ 2న ప్రభుత్వం ఏర్పడటంతోపాటు విభజన వలన అనేక సమస్యలు ఏర్పడ్డాయి, కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో సహకరించక పోయినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనకున్న ఉద్యమ అనుభవంతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా మార్చాలనే ప్రయత్నం మొదలు పెట్టారు. జూన్‌ 2న ముఖ్యమంత్రి పరేడ్‌ గ్రౌండ్‌లో జెండా ఆవిష్కరణ సందర్బంగా ‘మా ప్రభుత్వం ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వం’ అని ప్రకటించడంతోపాటు, తెలంగాణ ఉద్యమంలో వీరోచిత పాత్ర పోషించిన ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్‌ ప్రకటించడంతో ఉద్యోగుల ఆత్మగౌరవం పెరిగింది, భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఏర్పడినా ఉద్యోగులకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వని చరిత్రను తిరగరాసిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్‌.
tsmagazine
ఉమ్మడి రాష్ట్రంలో వేసిన పదవవేతన సవరణ సంఘం నివేదికను ముఖ్యమంత్రి పరిశీలించి స్వయంగా ఉద్యోగ సంఘాలకు అందించి అందరి అభిప్రాయాలు తెలుసుకొని 42 రోజులు సకలజనుల సమ్మె చేసిన ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ప్రకటించడంతో ఉద్యోగుల వేతనాలలో గణనీయమైన పెరుగుదల వచ్చింది. గతంలో పీఆర్‌సీ అమలుకోసం ధర్నాలు, సమ్మెలు, జరిగే సంప్రదాయాన్ని బద్దలుకొట్టి ఒకే రోజులో సమస్యలన్ని పరిష్కరించడం తెలంగాణలో నూతన అధ్యాయానికి నాంది పలికింది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు విద్యుత్‌, ఆర్టీసీ ఉద్యోగులకు సైతం ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా వేతనాలు పెంచడం జరిగింది. దీనితోపాటు, లక్షలాదిగా ఉన్న అన్నివర్గాల ఉద్యోగుల సమస్యలపరిష్కారం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొన్నది. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌

ఉద్యోగులకు కనీస వేతనం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న పథకాలలో పనిచేస్తున్న, అంగన్‌వాడి టీచర్లు, అంశాలు, ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఇజీఎస్‌), సర్వ శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ), పేదరిక నిర్మూలన పథకం (ఎస్‌ఇఆర్‌పీ), ఇందిరా క్రాంతి పథకం లాంటి వాటిలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలను గణనీయంగా పెంచింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ కోసం ప్రయత్నాలు ప్రారంభించగానే, కొన్ని రాజకీయపార్టీలకు అనుబంధంగా ఉన్న సంఘాలు కోర్టులలో కేసులు వేసి రెగ్యులరైజేషన్‌ కాకుండా అడ్డుకొంటున్న నేపథ్యంలో విద్యుత్‌శాఖలో పని చేస్తున్న 23 వేల మంది కార్మికులకు కూడా వేతనాలు పెంచి, మధ్య దళారుల ప్రమేయాన్ని తొలగించింది.

గతంలో అంగన్‌వాడీ వేతనాలు పెంచాలని అడిగితే గుర్రపు డెక్కలతో తొక్కించి, లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగించిన చరిత్రను చూశాం. ఇటీవల కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, ఇతర రాష్ట్రాలలో అంగన్‌వాడీ టీచర్ల వేతనాలు తెలంగాణతో సమానం కావాలని ఉద్యమిస్తే తీవ్రమైన నిర్భందాన్ని అమలు చేస్తున్నారు. ఇలాంటి చరిత్రను తిరగరాసి అంగన్‌వాడీ టీచర్లను ప్రగతిభవన్‌కు పిలిపించి, భోజనం పెట్టి, సమస్యలను పరిష్కరించిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్‌. వర్కర్‌ అనే పదం తొలగించి టీచర్‌ అనే ఆత్మగౌరవాన్ని నిలపడం అద్భుతం.

గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే విలేజ్‌రెవెన్యూ అసిస్టెంట్స్‌ వేతనాలు 6000 నుండి 10,700కు పెంచింది. పంచాయితీ కార్మికుల వేతనాలు గతంలో ఉండే రికార్డు అసిస్టెంట్‌ వేతనాన్ని జూనియర్‌ సహాయకుల వేతనాలుగా మార్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే అన్ని వర్గాల ఉద్యోగుల సమ స్యలను పరిష్కరించి దేశంలోనే తెలంగాణ ఉద్యోగులను అగ్రభా గాన నిలబెట్టటంతో పాటు ఒకరోజు సమగ్ర సర్వే జరుపాలని ప్రభుత్వం నిర్ణయిస్తే 24 గంటల్లో తెలంగాణ ప్రజల సమగ్ర సర్వే నిర్వహించడంతో దేశవ్యాప్తంగా చర్చగా మారింది.

ఉద్యోగులంటే ఉద్యమనాయకులని, వాళ్లను కుటుంబ సభ్యులుగా ఆదరించాలని, అలాగే ఉద్యోగి పదవీవిరమణ పొందితే గౌరవంగా ఇంటివరకు సాగనంపాలని, సకాలంలో పెన్షన్‌ ప్రయోజనాలు అందించాలని, మంత్రులకు, ఉన్నత స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో ఉద్యోగుల పట్ల కొంత మంది అధికారులకు ఉన్న పరిమిత అవగాహనను విస్తృతం చేసింది. ఉద్యగుల సమస్యల పరిష్కారం కోసం ఆర్థికశాఖామాత్యులు ఈటల రాజేందర్‌ నాయకత్వంలో మంత్రులు కె. తారకరామారావు, జగదీష్‌ రెడ్డి, మహేందర్‌ రెడ్డి సభ్యులుగా క్యాబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పరచి, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంఘాలతో చర్చించి, నివేదికలు ఇవ్వడంతో రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం కలిగింది. కమీటీలు అంటేనేే కాలయాపన కమిటీలుగా మారినాయనే సహజ విమర్శను తొలగించి వారం రోజుల లోపలే అనేక సమస్యలను పరిష్కరించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. 2018 మే 16న ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మరోసారి ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వం అనే దానిని బలోపేతం చేశాయి.

పీఆర్‌సీ: 2018 జూలై 1న రావాల్సిన పేరివిజన్‌ కమీషన్‌ ఫలితాలను 2018 జూన్‌ 2 నుండి అమలుపరచడానికి, గతంలో పీఆర్‌సీ నివేదికలు తయారు చేయడానికి సంవత్సర కాలంపైన ఉండే దానిని తొలగించి ఆగస్టు 2018 లోగా నివేదిక ఇవ్వాలి అని ఆదేశించడం, అలాగే మధ్యంతరభృతి విషయంలో సాను కూలంగా స్పందించి 2014 జూన్‌ 2 నుండి ప్రకటించక బోవడం దేశచరిత్రలోనే మొదటిసారి. గత 10 పీఆర్‌సీల చరిత్రను ఒకసారి పరిశీలిస్తే పీఆర్‌సీ ఏర్పాటు కోసం, నివేదికలు వచ్చాక వాటి అమలుకోసం ఉద్యోగులు ఎన్ని ఉద్యమాలు చేశారో మన కళ్ళముందున్న చరిత్ర. ఇలాంటి చరిత్రను తిరగ రాసిన కె.సి.ఆర్‌ తెలంగాణ ఉద్యోగుల గుండెలలో శాశ్వతంగా నిలిచిపోతారు.

సాధారణ బదిలీలు: ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరగడానికి విధి విధానాలు రూపొందించి శాశ్వత ప్రాతిప్రదికగా బదిలీల విధానం ఉండాలని స్వయంగా ముఖ్యమంత్రి సూచించడం అభినందనీయం. భార్యాభర్తలు ఒకే చోట పనిచేయడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయని అందువల్ల ఎట్టి పరిస్థితులలో వాళ్ళను ఒకే దగ్గర ఉంచాలని ఆదేశించారు.

వీటితోపాటు, అనేక సమస్యలని దాదాపు 6 గంటలు చర్చించి నిర్ణయం తీసుకోవడమే కాకుండా భవిష్యత్తులో ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు ఉండకూడదని ఆదేశించారు.

తెలంగాణ ఉద్యమంలో ఏదైతే భావించామో, కలగన్నామో అది జరుగుతున్నది. అద్భుతంగా రెవెన్యూ పెరుగుదల దానికి ప్రధాన కారణం ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, వాటిని అమలు చేస్తున్న యంత్రాంగం. నీటిపారుదల విభాగంలో పెద్ద మొత్తంలో 25000 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నారు. ఇంజనీర్లు, సిబ్బంది కర్మాగారాలు పనిచేసినట్లు 24 గంటలు పనులు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రసాధనలో అద్భుతంగా ఉద్యమించిన ఉద్యోగులు రాష్ట్ర పున నిర్మాణంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. క్రమశిక్షణ, నిబద్ధత తెలంగాణ ఉద్యోగుల ప్రత్యేకతలు.

చరిత్రలో ఎన్నడూలేనివిధంగా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన జరిగింది. 2.90 కోట్ల ఎకరాల భూమిలో 2.36 కోట్ల ఎకరాల భూమిని పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని అతి తక్కువ సమయంలో, పూర్తి చిత్తశుద్ధితో, నిజాయితీతో నిర్వహించారు. పది రోజులు గ్రామాలలో ఉండిఈ కార్య క్రమం నిర్వహించడంవలన ప్రజలమధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి రైతుకు పాస్‌బుక్‌లు, చెక్‌లు అందించే పనిని సెలవులు కూడా లెక్కచేయకుండ ఎన్నికల డ్యూటీలాగా బాధ్యతగా చేయడం ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులకే సాధ్యం. అన్ని రంగాల ఉద్యోగులు నిబద్ధతతో పనిచేస్తున్నారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం కేసీఆర్‌ చేసి జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణలాంటి విప్లవాత్మక కార్యక్రమం చేపట్టి 10 జిల్లా లను 31 జిల్లాలుగా ఏర్పరచి, 125 మండలాలు, 50కు పైగా డివిజన్‌కేంద్రాలు ఏర్పరచి, ప్రజల వద్దకు పాలన అంద జేయడంలో అవలంభించిన స్ఫూర్తి గొప్పది.

ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వంగా నడుస్తున్న ప్రభుత్వం వల్ల ఉద్యోగుల బాధ్యత మరింత పెరిగింది. కడుపునిండా తిండిపెడతాం, చేతినిండా పని ఇస్తాం అని ముఖ్యమంత్రి ప్రకటించడం స్వాగతిద్దాం. ఇప్పటికే అనేక రంగాలలో అద్భుతమైన విజయాలు సాధించి, ఎన్నో అవార్డులు స్వీకరించి ఉద్యమకారులే గొప్ప పరిపాలకులుగా మారిన స్థితిని చూసి దేశం ఆశ్చర్యానికి లోనవుతున్నది. భారతదేశంలోనే అన్ని రంగాలలో తెలంగాణ నెం.1 గా నిలవడం గర్వకారణం.

రాష్ట్రంలో అమలవుతున్న మిషన్‌ భగీరథ ద్వారా ఇంటిం టికీ నీరు అందించే కార్యక్రమం, మిషన్‌ కాకతీయ, ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా కోటి ఎకరాల మాగానికి నీరు అందించే పని, 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ సౌకర్యం, ప్రతి ఎకరానికి 8 వేల పంట పెట్టుబడి, వృద్ధులకు, వికలాంగులకు, చేనేత కార్మికులకు ఒంటరి మహిళకు, బోదకాళ్ల వ్యాధి గ్రస్తులకు ప్రతినెల పెన్షన్‌ అందించడం, గురుకులాలు, మైనారిటీ రెసిడె న్షియల్‌ పాఠశాలలు స్థాపిించి అందరికీ విద్యనందించడం, ఆత్మగౌరవంగా నిలిచె డబుల్‌బెడ్‌రూం నిర్మాణంలాంటి పథకాలలో ఉద్యోగుల భాగస్వామ్యం ఉండడం గర్వకారణం. మానవీయ కోణంతో, ప్రజల జీవన ప్రమాణాల పెంపుతో పాటు, అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం శ్రామికునిగా, రైతుగా, ఆలోచించి ప్రజల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారధ్యంలో ఉద్యోగులుగా పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవం.

వైద్యరంగాలలో అద్భుతమైన ప్రక్రియగా కేసీఆర్‌ కిట్స్‌తో పాటు, ప్రతి ఉద్యోగికి పరిమితిలేని వైద్యం అందించడం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకత. సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగి కార్పోరేట్‌ వైద్యం వైపు ప్రజలు వెళ్లే అనివార్య స్థితిని తొలగించడం ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం. వ్యవస్థల పట్ల విశ్వాసం పెంచడమే కాకుండా బలోపేతం చేయ డంలో ఉద్యోగుల కృషి మరింత పెర గాల్సి ఉంది.

జి.దేవిప్రసాద్‌

Other Updates