తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై ంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి వ్యక్తంచేసింది. ంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటనలో భాగంగా సమీక్షలు, సమావేశాలతో బిజీగా గడిపింది. 31 జిల్లాల ఎన్నికల అధికారులుగా ఉన్న కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర పోలీస్ అధికారులతో ఎన్నికల బృందం ప్రతినిధులు వరుసభేటీలు నిర్వహించారు. ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
జిల్లాలవారీగా చేసిన ఏర్పాట్లపై ఎన్నికల సంఘం సంతృప్తిని వ్యక్తంచేస్తూ రాష్ట్ర అధికారులను అభినందించింది. జిల్లా ఎన్నికల అధికారులుగా విధులు నిర్వర్తిస్తున్న కలెక్టర్లు, ఎస్పీలు సీఈసీకి ప్రతినిధులని, క్షేత్రస్థాయిలో స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా, పక్షపాతం లేకుండా ఎన్నికలు నిర్వహించాలని రావత్ చెప్పారు. ఎన్నికల నిర్వహణలో నిబద్ధత, శక్తిసామర్థ్యాలను నిరూపించుకోవాలని కోరారు. వికలాంగులు, వృద్ధుల విషయంలో పత్యేక శ్రద్ధ తీసుకోవాలని, మారుమూల ప్రాంతాలు, ముురికివాడల్లోని ఓటర్లు అంతా ఓటింగ్‌లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని రావత్ స్పష్టంచేశారు. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా సరిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరు ఓటరుగా తమ పేరు నమోదు చేసుకునేలా నవంబర్ 10వ తేదీ వరకు సీఈసీ అవకాశం కల్పించింది.
దేశమంతా మిమ్మల్నే చూస్తున్నది
రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను దేశం మొత్తం ఆసక్తితో చూస్తున్నదని, ఎలాంటి వివాదాలు, విమర్శలకు అవకాశం లేకుండా నిజాయితీగా నిర్వహించాలని ంద్ర బృందం పేర్కొంది. ‘మీకు కావాల్సిన భద్రతా దళాలను పంపిస్తాం. కానీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలి’ అని ప్రతినిధి బృందం స్పష్టంచేసింది. అదిలాబాద్, ఆసిఫాబాద్, వికారాబాద్ జిల్లా కలెక్టర్లు అదనపు బలగాలను ఇవ్వాలని సీఈసీని కోరారు. సమస్యాత్మక ప్రాంతాలు ఎందుకు పెరిగాయన్న విషయంపై కలెక్టర్లు, ఎస్పీలను ంద్ర బృందం అడిగి తెలుసుకుంది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, పోలింగుకు ఆటంకాల్లేకుండా తగిన బందోబస్తు ఏర్పాటుచేయాలని పోలీసు అధికారులను ఆదేశించింది. మావోయిస్టుల ప్రాబల్యమున్న ప్రాంతాల్లో గట్టి నిఘా కోసం తాత్కాలిక సెల్‌ఫోన్ టవర్లు, మారుమూల ప్రాంతాలకు రహదారుల వ్యవస్థను పటిష్ఠం చేయాలని ంద్ర బృందం సూచించింది.
అక్రమాల నిరోధానికి సీ-విజిల్
ఎన్నికల్లో అక్రమాలను నిరోధించేందుకు గట్టి నిఘా ఏర్పాటుచేశామని రావత్ తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలను సీ-విజిల్ యాప్ ద్వారా నిరోధిస్తామన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీ-విజిల్‌ను పైలట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను 24 గంటల్లోపు పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒక ఫిర్యాదు ఈ యాప్ ద్వారా వస్తే.. దానిపై తీసుకున్న చర్యలపై వెంటనే సంబంధిత అధికారులు అదే యాప్‌లో సమాధానం ఇవ్వాలన్నారు. వీవీ ప్యాట్లపై ఓటర్లకు అవగాహన కలిగించే కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో విధిగా చేపట్టాలని చెప్పారు. దీనిద్వారా ఇప్పటివరకు ఈవీఎంలపై పజల్లో ఉన్న అనుమానాలను నివృత్తిచేసే అవకాశం ఉంటుందని అన్నారు.
రూ.20 కోట్ల నగదు సీజ్
రాష్ట్రంలో అధికారులు రూ.20 కోట్ల నగదును సీజ్‌చేశారు. రెండు వేల మందిని బైండోవర్ చేశారు. రాష్ట్రంలో లైసెన్స్ కలిగిన ఆయుధాలు 9 వేల వరకు ఉండగా, 1900 మంది ఇప్పటి పోలీస్‌స్టేషన్లలో అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారులు సీఈసీకి నివేదిక ఇచ్చారు. నేరచరిత్ర కలిగినవారిని గుర్తించి, వారిపై నాన్‌బెయిలబుల్ సుేలు పెట్టి అరెస్టుచేస్తామని ఎస్పీలు వివరించారు. అవసరమైతే వీరిపై నగర బహిష్కరణ లేదా గృహనిర్బంధానికి ప్రణాళికలు తయారుచేస్తున్నామని తెలిపారు.
పారదర్శకంగా ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికలను నిష్పక్షపాతంగా, సుహృద్భావ వాతావరణంలో నిర్వహిస్తామని ంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ ఓపీ రావత్ చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్లపై ఆయన సంతోషం వ్యక్తంచేశారు. ఈ క్రతువులో భాగస్వాముులైన ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా అభినందించారు. రాజకీయ పార్టీల ఆందోళనలు, సలహాలను తెలుసుకున్నామని.. ఎన్నికలను సజావుగా జరిపేందుకు పటిష్ఠమైన చర్యల్ని తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఇంటెలిజెన్స్ అధికారుల వ్యవహారశైలిపై ఓ రాజకీయ పార్టీ ఫిర్యాదు చేసిందని, ఆ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే కల్పిత కథనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందుకోసం జాతీయస్థాయిలో ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలతో చర్చిస్తున్నామన్నారు.
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌వంటి రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఎన్నికలను సజావుగా నిర్వహిస్తామన్నారు. ప్రత్యేకంగా ంద్ర భద్రతా బలగాలను రాష్ట్రంలో వినియోగిస్తామని తెలిపారు. వైద్య అవసరాల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు విడుదల చేయడానికి అనుమతిస్తున్నామని రావత్ వెల్లడించారు. వైద్యం అనేది అత్యవసరం కాబట్టి మానవీయకోణంలో ఆలోచించే ఇందుకు అనుమతినిస్తున్నట్టు చెప్పారు. వివిధ రాజకీయ పార్టీలు లేవనెత్తిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల యంత్రాంగాన్ని ఆదేశించినట్టు తెలిపారు. ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి సమస్యలొచ్చినా అక్కడికక్కడే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. నేరచరిత్ర గల అభ్యర్థులు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తప్పనిసరిగా సంబంధిత వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనాలని చెప్పారు. ఇందుకు సంబంధించిన నమూనాపై దినపత్రికలు, టీవీల్లో మూడుసార్లు ప్రకటనలను విడుదలచేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారులను ఆదేశించారు. అభ్యర్థుల అఫిడవిట్లను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామని చెప్పారు. ఎన్నికల్లో అక్రమాలను నిరోధించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సీ-విజిల్ యాప్ సాయంతో ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. వాటిని ఇరవై నాలుగు గంటల్లోపు పరిష్కరిస్తామని చెప్పారు. తమ మూడురోజుల పర్యటనలో భాగంగా ప్రభుత్వ, పోలీసు ఉన్నతాధికారులతోపాటు రాజకీయపార్టీల ప్రతినిధులు, దివ్యాంగులతో సమావేశమై.. వివిధ అంశాలపై చర్చించామని తెలిపారు. రాష్ట్రంలో ప్రశాంతమైన వాతవరణంలో ఎన్నికలు నిర్వహించాలని పలు రాజకీయ పార్టీలు కోరాయని రావత్ తెలిపారు. తెలంగాణలో 38 నియోజకవర్గాల సరిహద్దులు ఒకటికంటే అధిక జిల్లాలతో కలిసి ఉన్నాయి. వీటిలో సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. మీడియాలో ప్రకటనల రూపంలో ప్రచారంపై ఎన్నికల కమిటీ అనుమతి మేరకు నడుచుకోవాలని రావత్ సూచించారు. పింక్ అనేది మహిళలకోసం ఏర్పాటు చేసిన పోలింగ్ ంద్రాలకు సంబంధించిన కోడ్ మాత్రమేనని.. వాటిలో పింక్‌రంగు ఎక్కడా ఉండదని స్పష్టంచేశారు. తెలంగాణలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్ల విషయంలో అనుకున్న దానికంటే ముందంజలో ఉన్నారని ప్రశంసించారు.
ధనప్రవాహంపై కఠినంగా వ్యవహరిస్తాం
కొన్ని పార్టీలు ఎన్నికల్లో ధనప్రవాహం గురించి తమ దృష్టికి తీసుకొచ్చాయని, ఈ విషయంలో పలు ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలు కఠినంగా వ్యవహరిస్తాయని రావత్ చెప్పారు. ఓటర్ల జాబితాలో పొరపాట్లను తక్షణమే సవరించాలని కోరామని తెలిపారు. భారతీయులు కాని ఓటర్లను జాబితానుంచి తొలిగించినట్టు చెప్పారు. తెలంగాణలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఏడు మండలాల్లో ఓటర్ల జాబితా బదిలీ గురించి ఓ రాజకీయ పార్టీ కోరిందన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు జనవరి 1వ తేదీని కటాఫ్ తేదీగా పెట్టడంపై ఓ రాజకీయ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసిందని చెప్పారు. దీనిపై కమిషన్ తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపామన్నారు. గిరిజన ప్రాంతాల్లో గ్రామాలకు దూరంగా ఉన్న పోలింగ్ ంద్రాలను మార్చాలన్న సూచనపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. బహిరంగసభలకు 24 గంటల్లో అనుమతిని మంజూరు చేస్తామని రావత్ చెప్పారు.
మభ్యపెట్టే పార్టీలపై చర్యలు
మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను, అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని కొన్ని రాజకీయపార్టీలు కోరాయని రావత్ తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలకు వంత పాడుతున్న అధికారులపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ, బహుమతులు, ఇతరత్రా వస్తువులతో ఓటర్లను మభ్యపెట్టాలని కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, వాటిని అరికట్టడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని తెలిపారు. వివిధ రవాణామార్గాల ద్వారా పలు రాజకీయపార్టీలు ధనాన్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నాయని, అటువంటివాటిని పక్కాగా నియంత్రిస్తామని చెప్పారు. రైళ్లు, విమానాల ద్వారా డబ్బును తరలించకుండా పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు ఐటీ అధికారులతో గట్టి నిఘా ఏర్పాటుచేస్తామన్నారు. పోలీసు అధికారులను పునర్వవస్థీకరిస్తామని, ప్రత్యేకంగా విజిలెన్స్ బృందాలను ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీటీవీ, వెబ్‌క్యాస్టింగ్ ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు నియంత్రిస్తామని తెలిపారు. మీడియాలో వచ్చే పెయిడ్ న్యూస్‌పై కమిటీలు అధ్యయనం చేస్తాయని, దానికి అనుగుణంగా తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
ముుస్లిం మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు
కొందరు ముుస్లిం మహిళలు బురఖాలు ధరించి ఓటింగ్‌లో పాల్గొంటారని, వారిని తనిఖీచేయడానికి ప్రత్యేకంగా మహిళా పోలీసులతోపాటు పోలింగ్‌స్టేషన్లలోనూ మహిళా సిబ్బందిని నియమిస్తామని రావత్ తెలిపారు. తెలంగాణలో పోలింగ్ జరిగే రోజు
శుక్రవారం కావడంతో ముుస్లింలు ప్రార్థనలు చేసుకునే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, పోలింగ్ సమయాన్ని పొడిగించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. పోలింగ్ ంద్రాల్లో ఓటర్లకు అవసరమయ్యే కనీస సదుపాయాలైన ర్యాంపులు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, విశ్రాంతి గది తదితరాలను తప్పనిసరిగా ఏర్పాటుచేయాల్సి ఉంటుందని తెలిపారు.
సమావేశంలో కమిషనర్లు సునీల్‌అరోరా, అశోక్‌లావసా, ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు
ఉమేశ్‌సిన్హా, సందీప్‌స్సనా, సుదీప్‌జైన్, చంద్రభూషణ్ కుమార్, దిలీప్‌శర్మ, ధీరేంద్ర ఓఝా, సుందర్
భెయిల్‌శర్మ, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్, అడిషినల్ సీఈవో జ్యోతిప్రసాద్, జాయింట్ సీఈవో ఆమ్రపాలి, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు.