హైదరాబాద్ జిల్లాలో ఏప్రిల్ 11న జరిగే లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లు సంతప్తికరంగా ఉన్నాయని, అయితే ఎన్నికల నిర్వహణలో ప్రతి అంశంలోనూ అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జిల్లాకు నియమితులైన కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ పరిశీలకులు అర్వింద్‌సింగ్ పాల్ సంధు పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై పై మరో సాధారణ పరిశీలకులు వినయ్‌కుమార్ రాయ్‌తో కలిసి జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఉన్నతస్థాయి అధికారుల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, అడిషనల్ పోలీస్ కమిషనర్ డి.ఎస్.చౌహాన్, హైదరాబాద్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి మాణిక్‌రాజ్, సికింద్రాబాద్ రిటర్నింగ్ అధికారి రవి, నోడల్ అధికారులు ఏఆర్‌ఓలు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్వింద్ సింగ్ పాల్ సంధు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ ప్రతిసారి నూతన నియమ నిబంధనలు ఆదేశాలతో కొత్తగానే ఉంటుందని, ఎన్నికల నిబంధనలను అనుసరించే విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని అన్నారు. పోలింగ్ రోజు హైదరాబాద్ నగరంలో ఓటర్లు సులభంగా స్వేచ్ఛగా తమ పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు తగు ఏర్పాట్లు చేయాలని అన్నారు. ముఖ్యంగా దివ్యాంగులు, వద్ధులు పోలింగ్ కేంద్రానికి చేరుకునేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రధానంగా నగర ఓటర్లలో విశ్వాసాన్ని పెంచేవిధంగా పారామిలటరీ దళాలు విస్త తంగా నగరంలో మార్చ్‌ఫాస్ట్ చేపట్టాలని అన్నారు.
ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో అతితక్కువ ఓటింగ్ శాతం నమోదు అయిన పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దష్టి సారించాలని, ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఓటరు చైతన్య కార్యక్రమాన్ని మరింత విస్తతంగా చేపట్టాలని సూచించారు.
హైదరాబాద్ జిల్లాలో
41,77,703 ఓటర్లు
హైదరాబాద్ జిల్లాలో 41,77,703 మంది ఓటర్లు ఉన్నారని, మొత్తం 3,979 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్ వివరించారు. హైదరాబాద్ నగరంలో ఎన్నికల ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సాధారణ పరిశీలకులకు దానకిషోర్ వివరించారు. ఎన్నికల నిర్వహణకుగాను 18వేల మంది అధికారులు, సిబ్బందికి తొలి విడత శిక్షణ పూర్తిచేశామని, రెండో విడత శిక్షణను నుండి ఏప్రిల్ 2వ తేదీలోపు విడతల వారిగా ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 1,311 పోలింగ్ కేంద్రాలను క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని, ఈ పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్‌లను నియమించనున్నట్టు పేర్కొన్నారు.
92 మొబైల్ బందాల ద్వారా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల నిర్వహణ, ఎన్నికల నియమావళి అతిక్రమణ తదితర అంశాలపై నగరవాసుల నుండి ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్ 1950ను ఏర్పాటు చేశామని, ఈ కాల్ సెంటర్ ఉదయం 9గంటల నుండి రాత్రి 9గంటల వరకు పనిచేస్తుందని తెలియజేశారు.
నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ నగరంలో 2,86,78,916 రూపాయలు స్వాధీనపర్చుకున్నామని తెలిపారు. అన్ని డి.ఆర్.సి కేంద్రాల వద్ద విస్తత బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు నగరంలో సున్నిత, కీలక ప్రాంతాల్లో పోలీసు, పారా మిలటరీ దళాలచే మార్చ్ ఫాస్ట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. 4,521 ఆయుధాలు డిపాజిట్ అయ్యాయని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయడానికి మూడు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న దాదాపు రెండు లక్షల సీసీ టివి కెమెరాల ద్వారా శాంతి భద్రతల పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.
మరో 11 గుర్తింపు కార్డులు
హైదరాబాద్ జిల్లాలో ఉన్న ఓటర్లకు ఓటరు స్లిప్‌లను పంపిణీ చేయనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి ఎం.దానకిషోర్ తెలిపారు. ఏప్రిల్ 11న జరిగే పోలింగ్‌కు ఐదు రోజుల ముందుగా ఓటరు స్లిప్‌ల పంపిణీని పూర్తిచేయనున్నట్టు, బిఎల్‌ఓల ద్వారా ఈ స్లిప్‌లను పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే ఏప్రిల్ 11న జరిగే పోలింగ్‌కు ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఈ క్రింది గుర్తింపు డాక్యుమెంట్లను చూపించి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు.
కొత్త ఓటర్లకు ఎపిక్ కార్డులను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఓటు వేయడానికి ముందు పోలింగ్ కేంద్రంలో వారి గుర్తింపు నిర్థారణకు ఓటరు స్లిప్పులు చూపితే సరిపోదని, ఓటరు గుర్తింపు కార్డులయినా చూపాలి లేదా అవి చూపలేనివారు వారి గుర్తింపు నిర్థారణకు కింద తెలిపిన ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డులలో ఏదయినా ఒకదానిని చూపాలని ఆయన స్పష్టం చేశారు.
1. పాస్‌పోర్ట్
2. డ్రైవింగ్ లైసెన్స్
3. ఫోటోతో కూడిన సర్వీస్ ఐడెంటిఫై కార్డ్
4. ఫోటోతో కూడిన బ్యాంకు పాస్‌బుక్
5. పాన్ కార్డు
6. ఆర్.జి.ఐ, ఎన్.పి.ఆర్ స్మార్ట్ కార్డు
7. జాబ్ కార్డు
8. హెల్త్ కార్డు
9. ఫోటోతో కూడిన పింఛన్ డాక్యుమెంట్
10. ఎం.ఎల్.ఏ, ఎం.పి, ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికార గుర్తింపు పత్రం.
11. ఆధార్ కార్డు