bandaruనల్లగొండ జిల్లా బీబీనగర్‌లో నిర్మాణంలో ఉన్న ‘నిమ్స్‌’ దవాఖానను ‘ఎయిమ్స్‌’గా అభివృద్ధి చేసేందుకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి జే.పి. నడ్డాను కలుసుకొని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు విజ్ఞప్తి చేశారు. ‘ఎయిమ్స్‌’ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను కేంద్రమంత్రి నడ్డా ప్రశంసించారు. బీబీనగర్‌ను ‘ఆరోగ్య నగరం’గా తీర్చిదిద్దాలని అనుకుంటున్నామని, అందులో భాగంగానే ‘ఎయిమ్స్‌’ ఏర్పాటు, దానికి అనుబంధంగా సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన, వైద్యకళాశాల, నర్సింగ్‌ కళాశాల, నర్సింగ్‌ హాస్టల్‌, తదితరాలు నెలకొల్పాలని భావిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.ఈ విషయమై ఆర్థికమంత్రితో చర్చించి ‘ఎయిమ్స్‌’ ఏర్పాటుకు బడ్జెట్‌లో ఏ మేరకు నిధులు కేటాయించారో తెలుసుకొని, వెంటనే అనుమతులు మంజూరు చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.

మొత్తం దేశంలోనే 33 శాతం ఫార్మా పరిశ్రమలు ఉన్న హైదరాబాద్‌ నగరంలో ఒక ఫార్మా యూనివర్సిటీని ఏర్పాటు చేసే విషయంపై ఆలోచించాలని కూడా కేంద్రమంత్రిని కె.సి.ఆర్‌. కోరారు. నీలోఫర్‌ ఆస్పత్రిని జాతీయ పిల్లల వైద్యకేంద్రంగా గుర్తించాలని కూడా కోరారు.

Other Updates