డ్రగ్స్, కల్తీల నియంత్రణ విషయంలో మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని, అన్ని కోణాలనుంచి లోతుగా దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. కల్తీలకు పాల్పడడం, డ్రగ్స్ సరఫరా చేయడంలాంటి దుర్మార్గాలు తెలంగాణలో చేయలేమని అక్రమార్కులు భయపడేవిధంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ దందాలో ఎవరి ప్రమేయం ఉన్నా వదలవద్దని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులైనా, చివరికి కేబినెట్ మంత్రి పాత్ర ఉన్నా సుే పెట్టాలని ఆదేశించారు. రక్తాన్ని కూడా కల్తీ చేసి అమ్ముతున్నారనే విషయం తెలిసి తన మనసెంతో చలించిందని, ఇలాంటి వారికి జీవితకాల కారాగార శిక్ష పడే విధంగా అవసరమైతే కొత్త చట్టాలు తేవాలని సీఎం అన్నారు. పేకాట, గుండుంబా నియంత్రణ విషయంలో విజయం సాధించినట్లే డ్రగ్స్, కల్తీల విషయంలో కూడా తుది విజయం సాధించే వరకు విశ్రమించొద్దని అధికారులను కోరారు. డ్రగ్స్, కల్తీలను అరికట్టే విషయంలో తెలంగాణ పోలీస్, ఎక్సైజ్, ఇతర శాఖల అధికారులు చేస్తున్న కృషి చాలా గొప్పగా ఉందని సీఎం ప్రశంసించారు.
డ్రగ్స్, కల్తీలు, ఇతర సామాజిక రుగ్మతలకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్. నర్సింగ్‌రావు, సోమేశ్‌కుమార్, శాంతికుమారి, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, ఏసీబీ డీజీ పూర్ణ చందర్‌రావు, హైదరాబాద్, సైబరా బాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సందీప్ శాండిల్య, మహేశ్ భగవత్, ఇంటెలి జెన్స్ ఐజీ నవీన్‌చంద్, సెక్యూరిటీస్ ఐజీ ఎన్.. సింగ్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్, హైదరాబాద్, వరంగల్ రేంజ్ ఐజీలు స్టీఫెన్ రవీంద్ర, నాగిరెడ్డి, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ దామోదర్ గుప్త తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఆహార పదార్థాల కల్తీ, విత్తనాల కల్తీల విషయంలో, డ్రగ్స్ నియంత్రించే విషయంలో అధికారులు బాగా పనిచేస్తున్నారు. ఈ దందాలో భాగస్వామ్యం ఉన్న వారెందరో దొరుకుతున్నారు. ఎక్కడికక్కడ దాడులు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ దందాలున్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో వీటి నియంత్రణ విషయంలో చాలా చిత్తశుద్ధితో పని చేస్తున్నారని మనకు మంచి పేరు వచ్చింది. ఇప్పటి చేపట్టిన చర్యలతో సంతృప్తి చెందవద్దు. విశ్రమించవద్దు. ఇంకా దూకుడు ప్రదర్శించాలి. తుది వరకు శ్రమించాలి. పనిలో మరింత తీవ్రత పెంచండి. లోతుల్లోకి వెళ్లాలి. ఎవరెవరి పాత్ర ఎంతుందో వెలికి తీయాలి. బాధ్యులైన వారందరిపైనా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఈ విషయంలో అధికారులకు కావాల్సిన అధికారాలు, స్వేచ్ఛ ఇస్తున్నది. ప్రభుత్వ ఉద్దేశ్యం చాలా స్పష్టం. తెలంగాణ రాష్ట్రంలో కల్తీలు, డ్రగ్స్ దందా ఉండొద్దు. చట్ట వ్యతిరేక చర్యలకు ఈ రాష్ట్రంలో చోటులేదు. ఎంతటివారైనా సరే పట్టుకోండి. ఎంతటి ప్రముఖుడైనా వదలొద్దు. రాజకీయ నాయకులున్నా సరే కేసు పెట్టండి. టీఆర్‌ఎస్ వారి పాత్ర ఉన్నా సరే, వారిపై కేసులు పెట్టి జైలుకు పంపండి. కేబినెట్ మంత్రి ఉన్నా కేసు పెట్టండి. ప్రభుత్వానికి ఎవరినీ కాపాడాల్సిన అవసరం లేదు. అక్రమార్కుల ఆటకట్టించే విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉంది. మీకున్న అనుభవం, అధికారం ఉప యోగించి తెలంగాణ రాష్ట్రంలో ఈ అక్రమ దందాలను అరికట్టండి అని ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు.
హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా, వాడకం ఎప్పటినుంచో ఉంది. గత పాలకులు ఈ విషయంలో అశ్రద్ధ చూపారు. వారే కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడీ దుర్మార్గం మనకు వారసత్వంగా వచ్చి ఉండేదికాదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడం అత్యంత అవసరం. హైదరాబాదే తెలంగాణకు లైఫ్‌లైన్. కాబట్టి హైదరాబాద్‌లో అరాచకం అంతం కావాలి. కేసు పరిశోధనలో ఉన్న సమయంలో సెలవులో వెళ్లవద్దని నేను అకున్ సభర్వాల్‌కు సూచించా. కేసు పూర్వాపరాలన్నీ క్షుణ్ణంగా వెలికితీయండి. ఎవరినీ వదలద్దు. అందరినీ శిక్షించాలి. హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా చేయలేము, వినియోగించలేము అని భయభ్రాంతులయ్యేలా మన చర్యలుండాలి. హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలి అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో, సామాజిక రుగ్మతలను అరికట్టడంలో, సంఘ వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ విషయంలో, మహిళల రక్షణ అంశంలో గడిచిన మూడేళ్లుగా తెలంగాణ రాష్ట్రం ఎంతో పురోగతి సాధించింది. ఈ మూడేళ్ల సమయంలో ఉన్నంత ప్రశాంతత చరిత్రలో ఎన్నడూ లేదు. అక్రమాల విషయంలో ఉక్కుపాదం మోపే విషయంలో ఎలాంటి రాజీలేదు. ఈ వేడి, ఈ వత్తిడీ కొన సాగాలి. మీకు కావాల్సిన బలం ఇస్తాం. బలగం ఇస్తాం. అన్నివిధాలా ప్రభుత్వం అండగా ఉంటుంది. కేసు పరిశో ధనలో ఎక్కడా రాజకీయ జోక్యం ఉండదు. ఎవర్నీ కాపా డల్సిన అగత్యం ఈ ప్రభుత్వానికి లేదు. తప్పు చేసే వారిని ఉక్కుపాదంతో అణచివేయండి. షీటీమ్స్ ప్రయోగం ఎంతో విజయవంతమైంది. మహిళల్లో భద్రత భావన పెరిగింది. ప్రభుత్వం తమ గురించి పట్టించుకుంటున్నదని మహిళలు ఆనందంగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీస్‌యాక్టు అమలులో కూడా మనం కఠినంగా వ్యవహరిస్తున్నాం. తమకు అన్యాయం జరుగదు అనే భావన వారిలో ఏర్పడింది. శాంతి భద్రతల పరిరక్షణలో మనం దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉన్నాం. పోలీసులకు కావాల్సిన సిబ్బందిని, వాహనాలను అందజేస్తున్నం. రాష్ట్రంలో పేకాట జాడ్యాన్ని రూపుమాపగలిగాం. ఆన్‌లైన్‌లో పేకాటను ూడా నిషేధించాం. వారిలో కొందరు కోర్టుకు పోయారు. కోర్టుకు కూడా వాస్తవ పరిస్థితి వివరిస్తున్నాం. గుడుంబా మహమ్మారిని విజయవంతంగా తరిమికొట్టాం. 95 శాతం గుడుంబా పోయింది. ఇది వందశాతం కావాలి. దీనికోసం ప్రత్యేక వ్యూహం అనుసరించాలి అని సీఎం అన్నారు.
గుడుంబా నిర్మూలన విషయంలో మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన పిలుపును గుడుంబా తయారీపై ఆధారపడి జీవించేవారు అందుకున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధివైపు మళ్లుతున్నారు. వారందరికీ జీవనోపాధి కల్పిస్తాం. హైదరాబాద్‌లోని ధూల్‌పేటలో ూడా ప్రత్యేక వ్యూహం అనుసరించాలి. గుడుంబా తయారీ, అమ్మకం సాగించేవారితో మాట్లాడి, వారికి ప్రత్యామ్నాయం చూపెట్టాలి. ఇందుకోసం కేంద్రమంత్రి ఆధ్వర్యంలో త్వరలోనే సమావేశం నిర్వహిస్తాం. మొత్తంగా తెలంగాణను వందశాతం గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అని సీఎం దిశానిర్దేశం చేశారు.
ఆహార పదార్థాల కల్తీపై, కల్తీ విత్తనాల అమ్మకంపై రాష్ట్రవ్యాప్తంగా తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా డీజీపీ వివరించారు. కల్తీ విత్తనాల విషయంలో 56 బృందాలు, ఆహార కల్తీ విషయంలో 14 బృందాలు పని చేస్తున్నాయని చెప్పారు. కల్తీ విత్తనాలకు సంబంధించి ఇప్పటిదాకా 77 సుేలు నమోదు చేసి, 72మందిని అరెస్టు చేశామన్నారు. ఆహార కల్తీకి సంబంధించి 340 సుేలు నమోదు చేసి, 562 మందిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ఈ రెండు విషయాల్లో వైద్య, ఆరోగ్యశాఖ, మున్సిపల్‌శాఖ, వ్యవసాయశాఖ సహకారం ూడా ఉందన్నారు. ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాలు పరీక్షించేందుకు అవసరమైనంత మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్లను వెంటనే నియమించాలని, విత్తనాల నాణ్యత పరీక్షల ఫలితాలు వెంటనే వచ్చేలా చూడాలని వ్యవసాయశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఆహార పదార్థాల కల్తీ, నకిలీ-కల్తీ విత్తనాలు, డ్రగ్స్ సరఫరా తదితర అంశాలు వ్యవస్థీకృత నేరాలు. తయారీ నుంచి అమ్మకందాకా చాలామంది భాగస్వామ్యం ఉంటుంది. కాబట్టి ఎక్కడ తయారు చేస్తున్నారనే దగ్గరనుంచి ఎవరికి అమ్ముతున్నారనే విషయం వరకు అన్ని విషయాలు కూలంకషంగా పరిశీలించాలి. ఎవరెవరి భాగస్వామ్యం ఉందో నిర్ధారించాలి. ఒకసారి దొరికినతర్వాత కేసు అయిపోయిందని అనుకోవద్దు. అసాంఘికశక్తులు, టెర్రరిస్టులు, సాయుధసంస్థల కార్యకలాపాలపై నిరంతరం నిఘా పెట్టడానికి కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉన్నట్లే వీటిపై కూడా నిరంతర నిఘా కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. శాంతి భద్రతల పర్యవేక్షణకోసం ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన చరిత్ర, సామర్థ్యం తెలంగాణ పోలీసుల కుంది. మీ అనుభవం, శక్తియుక్తులన్నీ ఉపయోగించి కల్తీలు, డ్రగ్స్‌లాంటి దురాగతాలమీద ఉక్కుపాదం మోపం డి. ప్రజలకు మంచి జీవితం అందిం చడంలో మీ పాత్ర చాలా ఉంది. ఇలా నేరాలు జరిగినప్పుడు, అక్రమం వెలుగు చూసినప్పుడు ఎలా గోలా తప్పించుకోవచ్చనే భావన తప్పు చేసినవారికి ఉంటుంది. గతాను భవాలు అలా ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో అలా జరగదు. ఇక్కడ ఎవర్నీ ఉపేక్షించరు. చట్టం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అనే సందేశం పోవాలి. కల్తీలు, డ్రగ్స్ విషయంలో బాగా పనిచేసిన పోలీసు అధికారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వండి. ముఖ్యంగా కిందిస్థాయిలో పనిచేసే ఎస్సై వరకు ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించండి. బాగా పనిచేస్తే ప్రోత్సహించండి. ఇంక్రిమెంట్లు ఇవ్వండి. ఆగస్టు 15న నేనే వారికి స్వయంగా అవార్డులు ఇస్తా అని సీఎం వెల్లడించారు.
ఇటీవల రక్తంలో సెలైన్ ఎక్కించి రోగులకు అమ్ముతు న్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. నాకు ఎంతో బాధ కలిగింది. బతికిస్తాడని నమ్మి వచ్చిన వారిని చంపుతారా? ఇదెంత దుర్మార్గం. ఇలాంటి వారిని ఏం చేసినా తప్పులేదు. వీరిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. యావజ్జీవ కారాగార శిక్ష పడేందుకు అనుగుణమైన చట్టాలకు రూపకల్పన చేయండి. ఇప్పుడున్న చట్టాలకు అవసరమైన సవరణలు, మార్పులు చేయండి. ఆహార పదార్థాల కల్తీ అంటే అది విషంతో సమానం. ఇలాంటి తప్పులు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలూడదు. అసలు సూత్రధారులెవరో గుర్తించండి. ఈ దందాలో కింగ్‌గా, డాన్‌గా చలామణి అవుతున్న వారు ఎక్కడున్నా వెంటనే పట్టుకోండి. ఎక్కడ కల్తీ చేస్తున్నారో గుర్తించి పట్టుకోండి. నగరం చుట్టు ప్రక్కల ూడా నిఘా పెట్టండి. హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాలపై కూడా దృష్టి పెట్టండి. ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి సిద్ధం. చట్టాలైనా, విధానాలైనా అన్నీ ఏపీలో ఉన్నట్లే ఉండాలని లేదు. మనం కొత్తగా తెలంగాణ తెచ్చుకున్నాం. అక్రమాల నిరోధానికి కొత్త బాటలు వేద్దాం.అది భవిష్యత్తు తెలంగాణకు మార్గమవుతుంది. డ్రగ్స్‌తోపాటు గంజాయి కూడా నగరాల్లో సరఫరా అవుతుంది. రాష్ట్రంలో ఎక్కడ గంజాయి సాగు అవుతుందో గుర్తించండి. పట్టుకోండి. పక్క రాషా్టలనుంచి వస్తే అరికట్టండి. సరిహద్దుల్లో నిఘా, తనిఖీలు పెంచండి అని సీఎం దిశానిర్దేశం చేశారు.
కల్తీలు, డ్రగ్స్, గంజాయిలాంటి దుర్మార్గాలు కొనసాగడానికి అవినీతి అధికారుల సహకారం కూడా ముఖ్యమైన కారణం. కొందరు అధికారుల అవినీతివల్ల ఈ చెడంతా జరుగుతుంది. అవినీతి నిరోధకశాఖ మరింత బాగా పనిచేయాలి. రాష్ట్రవ్యాపగా అవినీతి అధికారుల చిట్టా తయారు చేయండి. వారిపై నిఘా పెట్టండి. వారి కార్యకలాపాలను గమనించండి. డబ్బులిచ్చి పనిచేయించుకునే వారిని, డబ్బులు తీసుకుని పనిచేసే వారిని గుర్తించి, కేసులు పెట్టి శిక్షించాలి. ఏ శాఖలో అయినా అవినీతి రూపుమాపాలనుకుంటే అసాధ్యం కాదు. పరిశ్రమల అనుమతిలో సింగిల్‌విండో విధానం తెచ్చిన టిఎస్‌ఐపాస్ అద్భుతమే చేసింది. ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా అన్ని అనుమతులొస్తున్నాయి. ఇలాగే అన్ని విషయాల్లో అవినీతిలేని పరిస్థితి రావాలి అని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలు, పోలీస్ కమిషనరేట్లకు అనుగుణంగా తలపెట్టిన పోలీస్ కార్యాలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం కోరారు.
అధికారులకు బాధ్యతలు
సమీక్షలో అధికారుల వారీగా ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఫలప్రదం కావాలంటే అధికారులు మరింత అంకితభావం ప్రదర్శించి సహకరించాలని సీఎం కోరారు.
గుడుంబా తయారీదారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధికోసం బ్యాంకులతో సంబంధం లేకుండా ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యతలను సీఎంవో అధికారులు ఎస్. నర్సింగ్‌రావు, శాంతికుమారికి అప్పగించారు.
కల్తీలు, డ్రగ్‌స తదితర విషయాల్లో వ్యవస్థీకృత నేరాలను అదుపు చేయడానికి, బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవడానికి అనువుగా చట్టాల్లో ఎలాంటి మార్పులు, సవరణలు తీసుకురావాలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫారసు చేసి బాధ్యతను హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డికి అప్పగించారు.
వ్యవస్థీకృత నేరాలను అదుపు చేయడానికి కౌంటర్ ఇంటెలిజెన్స్ తరహాలో నిరంతర నిఘాకోసం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పే బాద్యతలను ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్‌చంద్‌కు ఇచ్చారు.
కల్తీ విత్తనాలు తయారుచేసేకేంద్రాలపై, ఆహార పదార్థాలు జరిగే ప్రదేశాలపైనా ఆకస్మిక దాడులు చేయడంతోపాటు, ఇతర వ్యూహాల అమలు పర్యవేక్షణ బాధ్యతను డీజీపీ అనురాగ్‌శర్మకు అప్పగించారు
డ్రగ్స్ విషయంలో పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి, భాగస్వామ్యం ఉన్న ప్రతీ ఒక్కరికి కఠినశిక్ష పడేదాకా చర్యలు తీసుకునే బాధ్యతను ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్‌కు అప్పగించారు.
హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో ూడా ఇలాంటి దందాకు పునాదులు పడుతున్నాయి. కాబట్టి, వాటిని ఆదిలోనే అరికట్టడానికి అనుసరించాల్సిన వ్యూహం రూపొందించి, అమలు చేయాలని హైదరాబాద్, వరంగల్ ఐజీలు స్టీఫెన్ రవీంద్ర, నాగిరెడ్డిలను ఆదేశించారు.
హైదరాబాద్ చుట్టుపక్కల విత్తనాలు, ఆహార కల్తీ జరిగే ప్రాంతాలను గుర్తించి, కలెక్టర్ల సహకారంతో తగిన చర్యలు తీసుకునే బాధ్యతను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు అప్పగించారు.
అక్రమాలకు పాల్పడే అధికారులను గుర్తించి, అవినీతి ఎక్కడ జరుగుతున్నదో పసిగట్టి, అవినీతి అధికారుల చిట్టా తయారుచేసే బాధ్యతను ఏసీబీ డీజీ పూర్ణచందర్‌రావుకు అప్పగించారు.
కొత్త పోలీస్ కార్యాలయాలు, పోలీస్‌స్టేషను, ఎక్సైజ్ స్టేషన్లు, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణ పనులను పర్యవేక్షించే బాధ్యతను పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ దామోదర్‌గుప్త, ఎండీ మల్లారెడ్డిలకు అప్పగించారు.
డ్రగ్స్, గుడుంబా, గంజాయి తదితర విషయాల్లో కఠినంగా వ్యవహరించాల్సి ఉన్నందున ఎక్సైజ్‌శాఖను బలోపేతం చేసే చర్యలు తీసుకునే బాధ్యతను ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మకు అప్పగించారు.
విత్తనాల నాణ్యత పరీక్షల ఫలితాలు వెంట వెంటనే వచ్చే విధంగా చర్యలు తీసుకునే బాధ్యతను వ్యవసా యశాఖ కమిషనర్ జగన్మోహన్‌కు అప్పగించారు.
హైదరాబాద్‌లో కావాల్సినంత మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్లను నియమించి, ఆహార పదార్థాల పరీక్షలు వెంటవెంటనే నిర్వహించి, సుేల్లో సహకరించే బాధ్యతను జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్థన్‌రెడ్డికి అప్పగించారు.
ధూల్‌పేటలో గుడుంబా నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, తయారీదారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించే బాధ్యతలను కేంద్రమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రి పద్మారావుకు అప్పగించారు.
డ్రగ్స్, కల్తీ నియంత్రణపై సీఎం ఆదేశం