ఎవరెస్టు-సాక్షిగా--‘తెలంగాణా-పర్వతం’ఏడుగురు తెలంగాణా పర్వతారోహకు ఎవరెస్టునెక్కారు. తెంగాణ రాష్ట్ర ఖ్యాతిని ఎల్లెడెలా చాటారు. మునుపెన్నడూ ఏ రాష్ట్ర అవతరణను పురస్కరించుకుని కూడా జాతీయ జెండాతోపాటు ఆ రాష్ట్ర పతాకాలు ఎవరెస్టుపై రెపరెపలాడలేదు.

తెలంగాణా తొలి రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ఎవరెస్టు శిఖరం పైనుండి స్వరాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలని నిశ్చయించుకున్నారు అడ్వెంచర్‌ క్లబ్‌ ఆఫ్‌ తెంగాణ స్టేట్‌ యువకులు.

ఇందుకోసం ప్రణాళికను రూపొందించుకుని రాష్ట్ర అవతరణ దినోత్సవానికి పదిహేను రోజుల ముందు హైదరాబాద్‌ మార్గం గుండా ప్రయాణం చేసి ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడి నుండి అనుకున్న ప్రకారం కాశ్మీర్‌, డఖ్‌, స్టాక్‌ కాంగ్రీను దాటుతూ ఎవరెస్టు పర్వతాన్ని చేరుకున్నారు.

ఈ సాహసోపేత యాత్ర కోసం 25 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వగా అందులో ఏడుగురు సాహసయాత్రకు సిద్ధమై ముందుకు కదిలారు. వాతావరణం అనుకూలించకపోయినా అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలన్న తెలంగాణ కాంక్షకు సాక్షీభూతంగా నిలిచి విజయం సాధించారు.జూన్‌ 2వ తేదీ వెండికొండపై నిండైన మధ్యాహ్నం 12:15 నిమిషాలకు 21,500 అడుగుల ఎత్తులో మన జాతీయ జెండాను ఎగురవేసి, వెంటనే తెలంగాణ రాష్ట్ర పతాకాన్ని రెపరెపలాడించారు ముగ్గురు పర్వతారోహలకు. వీరిని వెన్నంటి వచ్చిన మరో ముగ్గురు పర్వతారోహలకు బృందం సాయంత్రం గం.5`15 ని॥కు అక్కడికే చేరుకుని స్వచ్ఛ తెంగాణ`స్వచ్ఛ హైదరాబాద్‌ పోస్టర్‌ను జాతీయ, రాష్ట్ర పతాకాల వరుసలో నిలిపారు.

ఈ పర్వతాన్ని అధిరోహిస్తున్న క్రమంలో 18,500 అడుగుల ఎత్తులోని పర్వతంపైన ‘బతుకమ్మ’ను ప్రతిష్టించారు. తాము తలపెట్టిన సాహస యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని జూన్‌ 7వ తేది ఉదయం తెలంగాణ రాష్ట్రావతరణ ముగింపు ఉత్సవాల రోజు ఢిల్లీకి చేరుకున్నారు.

ఈ పర్వతారోహక బృందం ఎవరెస్ట్‌పై ఇంతవరకు ఎటువంటి పేరు లేని ఒక పర్వతానికి ‘తెలంగాణా పీక్‌’ అని నామకరణం చేశారు. తెంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన ఈ బృందంలో రంగారావు, శివకుమార్‌, రాఘవేంద్ర, అలీ అహ్మద్‌, కల్సేష్‌షా, కిరణ్‌కుమార్‌, రాజేందర్ సభ్యులుగా వున్నారు. ఈ యాత్రను గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో నమోదు కోసం దరఖాస్తు చేస్తామని బృందం సభ్యుడు రంగారావు అన్నారు. ఈ ఏడుగురిని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి ఢిల్లీలోని తెంగాణ భవన్‌లో అవతరణ ఉత్సవా ముగింపు కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు.

Other Updates