ఇక ఐటీరంగంలో నూతన పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ ప్రభుత్వం నూతన ఐటీపాలసీతో పాటు అనేక సెక్టోరల్ పాలసీలను ప్రకటించింది. అవి:
ఎలెక్ట్రానిక్స్ పాలసీ
- గేమింగ్ ఎండ్ ఆనిమేషన్ పాలసీ
- ఇన్నోవేషన్ పాలసీ
- సైబర్ సెక్యూరిటీ పాలసీ
- డేటా అనలిటిక్స్ పాలసీ
- డేటా సెంటర్స్ పాలసీ
- ఓపెన్ డేటా పాలసీ
- రూరల్ టెక్నాలజీ సెంటర్స్ పాలసీ
- ఐ.ఓ.టి పాలసీ
- ఈ-వేస్ట్ మేనేజ్‌మెంట్ పాలసీ
తెలంగాణ స్వరాష్ట్రంగా సిద్ధించి అయిదేళ్లు నిండుతున్న ఈ సమయంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అనుబంధ రంగాల్లో మన రాష్ట్రం సాధించిన అద్భుత ప్రగతిని ఒకసారి బేరీజు వేసుకుంటే, ముఖ్యమంత్రి దార్శనిక నాయకత్వంలోనే ఇది సాధ్యమైందని మనకు అర్థమవుతుంది. ఆనాడు తెలంగాణ ఏర్పడితే ఐటీ రంగం అధోగతి పాలవుతుంది అని పుకార్లు సష్టించి, అయోమయం రేపిన వారికి ఒక గుణపాఠంలా తెలంగాణ ఒక తారాజువ్వలా పైకెగిసింది. నవ్విన నాప చేనే పండిన విధంగా ఇవ్వాళ దేశవ్యాప్తంగా ఐటీరంగంలో తెలంగాణ ప్రగతి ఒక చర్చనీయాంశం అయ్యింది. గోవా వంటి రాష్ట్రాలు ఏకంగా ‘మాకు ఐటీ రంగం ఎలా అభివద్ధి చేసుకోవాలో మీరు మార్గదర్శనం చేయండి’ అని ఇవ్వాళ మన రాష్ట్రాన్ని అడుగుతున్నారు. అయితే ఇదంతా ఏదో యాధచ్చికంగా జరగలేదు. దీని వెనుక ముఖ్యమంత్రి దార్శనికత, తొలి ఐటీ మంత్రి కె. తారక రామారావు సమర్ధ నాయకత్వం ఉన్నాయి.
తొలిరోజుల్లో భరోసా
తెలంగాణ ఏర్పడి ఐటీ మంత్రిగా కేటీఆర్‌ను నియమించగానే ఆయన కార్యాచరణలోకి దిగారు. ముందు తెలంగాణ ఏర్పాటు మీద జరుగుతున్న అబద్ధపు ప్రచారాన్ని ఖండించి, ఈ రాష్ట్రం ఐటీ, అనుబంధ రంగాలకు పెద్దపీట వేస్తుందని, ఇక్కడున్న కంపెనీల వాళ్లెవరూ ఆందోళనపడాల్సిన అవసరం లేదని, వారికి తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తుంది అన్న భరోసాను ఇచ్చారు. దీనికొరకు కేటీఆర్ అనేక సమావేశాలు నిర్వహించారు. పెద్ద కంపెనీల సీ.ఈ.ఓ.లతో స్వయంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఎలా ఉండబోతున్నాయో వారికి వివరించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలేవో అడిగి తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపించారు. ఈ చర్యలవల్ల ఐటీ పరిశ్రమలో అపోహలు తొలగిపోయి, ఒక విధమైన నమ్మకం ఏర్పడింది. కొత్త కంపెనీలను తీసుకురావడం కన్నా ముందు, ఇక్కడ ఉన్నవారికి అన్ని సదుపాయాలు కల్పించి, వారి మనసు గెలుచుకోవాలన్న వ్యూహం పూర్తిస్థాయిలో విజయవంతం అయ్యింది. తొలి ఆరు నెలలు గడిచేసరికి హైదరాబాదు ఐటీ రంగానికి మంచిరోజులు వచ్చాయనే నమ్మకం అందరిలో కలిగించగలిగింది ఈ ప్రభుత్వం.
ప్రగతిశీల పారిశ్రామిక విధానాలతో పెరిగిన పెట్టుబడులు
తెలంగాణకు నూతన పెట్టుబడులను ఆకర్షించాలంటే ఏమేమి చేయవలసి ఉంటుందో తెలుసుకోవడానికి రాష్ట్రం ఏర్పడ్డ తొలిరోజుల్లోనే ఇక్కడ పరిశ్రమల అధిపతులతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. వివిధ ప్రభుత్వ శాఖలు అనుమతులు ఇవ్వడానికి చేస్తున్న జాప్యం, కొన్ని చోట్ల ఉన్న అవినీతిని గురించి వారు ముఖ్యమంత్రి దష్టికి తీసుకువచ్చారు. వారి సూచనల ఆధారంగా ముఖ్యమంత్రి పర్యవేక్షణలో సింగిల్ విండో అనుమతుల విధానం టీ.ఎస్.ఐ.పాస్ ప్రవేశపెట్టబడింది. ఈ విధానం అనతికాలంలోనే దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ మొదలైంది. అనేక దిగ్గజ ఐటీకంపెనీలు తెలంగాణలో పెట్టుబడి పెట్టడం, తద్వారా మన రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కూడా బాగా పెరిగాయి. ప్రపంచశ్రేణి కంపెనీలు గూగుల్, ఆపిల్, అమెజాన్, సేల్స్ఫోర్స్, ఊబర్, జెడ్‌ఎఫ్, డెవలప్మెంట్ బ్యాంక్ అఫ్ సింగపూర్, డి.ఈ షా వంటివెన్నో తమ టెక్నాలజీ డెవలప్మెంట్ కేంద్రాలు హైదరాబాదులో స్థాపించాయి.
ఐటీరంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడం, దానికి తగ్గవిధంగా ఇక్కడ మన ప్రభుత్వ విధానాలను రూపొందించుకోవడం వల్ల గత అయిదేళ్లుగా మన రాష్ట్రంలో ఐటీరంగం దినదినప్రవర్ధమానం అవుతోంది. దీనికి తోడు అప్పటి ఐటీమంత్రి కేటీఆర్ నేతత్వంలో భారత దేశంలోని ప్రధాన నగరాలు, అమెరికా, చైనా, తైవాన్, జపాన్, సింగపూర్, స్విజర్లాండ్ వంటి దేశాల్లో కూడా తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ పెట్టుబడులను ఆకర్షించడానికి అనేక సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించింది. ఒక్క హైదరాబాదు నగరం మాత్రమే ఐటీ రంగంలో అభివద్ధి చెందితే సరిపోదు అన్న దష్టితో తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ వంటి పట్టణాలలో కూడా ఐటీ టవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం.
2019 ప్రథమార్దంలో కమర్షియల్ ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో దేశంలోనే తొలిస్థానంలో హైదరాబాద్ నగరం ఉన్నది. తొలి మూడు నెలల్లోనే 3.5 మిలియన్ స్క్వేర్ ఫీట్ల ఆఫీసు స్థలం లీజుకు ఇచ్చిన నగరంగా హైదరాబాద్ నిలిచింది. ఇది మన రాష్ట్రంలోకి వెల్లువలా వస్తున్న పెట్టుబడులకు సూచిక.
రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో ఒక సమావేశంలో మాట్లాడుతూ, అయిదేళ్లలో తెలంగాణ రాష్ట్ర ఐటీ ఎగుమతులు రెట్టింపు చేస్తామని అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వాగ్దానం చేశారు. ఆయన మాటలు అక్షరసత్యాలై మొన్న మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ఐటీ ఎగుమతులు రు.57,258 కోట్ల నుండి రు.1,09,219 కోట్లకు చేరుకున్నాయి. ఈ రంగంలో ప్రత్యక్ష ఉపాధి 2013-14లో 3,23,396 మందికి
ఉండగా అది 2018-19 నాటికి 5,43,033 కు చేరింది.
దేశంలోనే మేటి స్టార్టప్ ఎకోసిస్టం
రానున్న సంవత్సరాలలో కొత్త ఉద్యోగాల కల్పన భారీ పరిశ్రమల నుండి కాక అంకుర పరిశ్రమల నుండి జరుగుతుంది అన్న వాస్తవం గ్రహించిన అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ -రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలకు, అంకుర పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్, రీసెర్చ్ ఎండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్) వంటి సంస్థలెన్నో నెలకొల్పారు. ఈ ప్రభుత్వరంగ సంస్థలు స్కూలు స్థాయి నుండే పిల్లల్లో నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తిపెరిగేలా చేయడం, గ్రామీణ ఆవిష్కర్తలకు గుర్తింపు, తోడ్పాటు అందించడం, అంకుర పరిశ్రమలకు ఇంక్యుబేషన్ సౌకర్యాలు కల్పించడం, వారికి పెట్టుబడులు సమకూర్చడంలో సాయం అందించడం వంటి చర్యలు ఎన్నో చేపట్టాయి. దీనివల్ల మన రాష్ట్రం లో అంకుర పరిశ్రమల కార్యకలాపాలు జోరందుకున్నాయి. ఇక ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల కొరకు దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్ర ప్రభు త్వం స్థాపించిన వి-హబ్, అనేక విజయవంతమైన కార్యక్రమాలు చేస్తోంది.
పాలనలో ఐటీ వినియోగం
తెలంగాణ రాష్ట్రం ఇవ్వాళ దేశంలోనే అతి ఎక్కువ డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న రాష్ట్రంగా పేరుగాంచింది. దీనికి కారణం గత అయిదేళ్లలో మన రాష్ట్ర ప్రభుత్వం పాలనలో ఐటీ వినియోగం పెంచడమే. దాదాపు అన్ని ముఖ్యమైన పౌరసేవలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో, మొబైల్ ద్వారా లభ్యం అవుతున్నాయి. ఐటీ వినియోగం వల్ల పౌరులకు శ్రమతగ్గుతోంది, అవినీతి తగ్గి పారదర్శకత కూడా పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన
టీ-వ్యాలెట్ ద్వారా డిజిటల్ చెల్లింపులు సులభతరం కాగా, టీ-యాప్ ఫోలియో ద్వారా మొబైల్ ద్వారా పౌరసేవలు పొందడం వీలవుతోంది. త్వరలోనే పూర్తికానున్న టి-ఫైబర్ ద్వారా ఈ సేవలు ఇంకా ఊపందుకుంటాయి.
ఎలక్ట్రానిక్స్ రంగానికి ఊతం
దేశంలో నానాటికీ ఎలక్ట్రానిక్స్ పరికరాల దిగుమతులు ఎక్కువ అవుతుం డటంతో దీనికి ఒక అవకాశంగా మలుచుకున్న మన రాష్ట్రం ఈ పరిశ్రమకు ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. హైదరాబాదు నగరానికి సమీపంలోనే 910 ఎకరాల విస్తీర్ణంలో రెండు ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ పార్కుల ను నెలకొల్పింది మన రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ పరిశ్ర మల ఆకర్షణకు తీసుకున్న వివిధ చర్యల ఫలితంగా గడచిన అయి దేళ్లలో రాష్ట్రంలోకి ఈ రంగంలో దాదాపు రూ.5,125 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
నైపుణ్యాలకు మెరుగు
తెలంగాణ ఏర్పడ్డాక వస్తున్న నూతన ఐటీ, ఐటీ అనుబంధ కంపెనీల్లో మన పిల్లలకు ఉద్యోగాలు రావాలనే సత్సంకల్పంతో ఏర్పాటు చేసిన నైపుణ్యాభివద్ధి సంస్థ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ ఎండ్ నాలెడ్జ్ (టాస్క్) గత అయిదేళ్లలో 2,80,000పై చిలుకు విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది. ఏ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయో ఆయా సంస్థల భాగస్వ్యామ్యంతో తెలంగాణలోని ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలల్లో టాస్క్ సంస్థ నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలు అత్యంత
ఉపయుక్తంగా ఉంటున్నాయని అనేకమంది విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు.
శాటిలైట్ ద్వారా విద్యా భోదన
తెలంగాణ ఐటీశాఖ టెక్నాలజీ సాయంతో నిర్వహిస్తున్న మరో బహత్తర కార్యక్రమం టీ-శాట్ విద్య, నిపుణ టీవీ చానెళ్లు. స్కూలు, కాలేజీ విద్యార్థులకు ఆకర్షణీయమైన డిజిటల్ పాఠాలు చెప్పడానికి విద్య చానెల్ ఉపయోగ పడుతుండగా, వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన శిక్షణ అందిస్తోంది నిపుణ టీవి చానెల్. రాష్ట్రంలోని లక్షలాది విద్యార్థులకు ఈ రెండు చానెల్స్ గణనీయమైన సేవలు అందిస్తున్నాయి.