ktrరాష్ట్రానికి ‘ఇండియా టుడే’ ఉత్తమ అవార్డు

మౌలిక సదుపాయాల కల్పన, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఉత్తమ అవార్డు లభించింది. పత్రికారంగంలో పేరెన్నికగన్న ‘ఇండియా టుడే’ పత్రిక ప్రతియేటా నిర్వహించే ‘స్టేట్‌ ఆఫ్‌ ది స్టేట్స్‌ కాంక్లేవ్‌’ కార్యక్రమంలో మన రాష్ట్రానికి ఈ అవార్డు లభించింది.

‘ఇండియా టుడే’ పత్రిక ఒక అంతర్జాతీయ స్థాయి సంస్థతో పరిశీలన చేయించి అవార్డు గ్రహీతలను ఎంపిక చేసింది. అనేక ప్రాతిపదికలు ప్రామాణికంగా తీసుకొని ఒక్కో ప్రాతిపదికకు కొన్ని మార్కులు విధానంతో ఏ రాష్ట్రం ఏ స్థాయిలో ఉన్నదో గుర్తిస్తారు. ఇంతటి పరిశీలన అనంతరం మౌలిక సదుపాయాలు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగాలలో తెలంగాణ రాష్ట్రానికి ఇండియా టుడే ఉత్తమ అవార్డు లభించింది. మౌలిక సదుపాయాల కల్పనలో మన రాష్ట్రం గుజరాత్‌ కంటే ముందుందని ఈ అవార్డుద్వారా నిర్ధారణ అయింది.

ఢల్లీిలో అక్టోబర్‌ 31న జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర ఐ.టి. శాఖామంత్రి కె.టి. రామారావు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జయేష్‌రంజన్‌లు కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ చేతులమీదుగా ఇండియా టుడే ‘స్టేట్‌ ఆఫ్‌ ది స్టేట్స్‌ కాంక్లేవ్‌’ అవార్డును స్వీకరించారు.

సమన్వయం ` సహకారం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, సహకారం రాజకీయాలకు అతీతంగా ఉండాలని రాష్ట్ర ఐ.టి. శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ‘ఇండియా టుడే’ అవార్డు స్వీకరించిన అనంతరం, పరిపాలనారంగానికి సంబంధించిన అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. ఆయా రాష్ట్రాలకు ఎన్ని ప్రాంతీయ అవసరాలు, ప్రాధాన్యాలు ఉన్నా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు బాధ్యతకూడా ఉంటుందని అన్నారు.

పరిపాలన ప్రజల ఆకాంక్షలకు, ఆశలకు అనుగుణంగా ఉండాలని, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంపట్ల ప్రజల్లో ఎన్నో ఆశలు, నమ్మకాలు ఉన్నాయని, వీటిని పరిపూర్తి చేసే దిశగా పరిపాలన సాగుతోందని కె.టి. రామారావు చెప్పారు.ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మౌలిక వసతుల కల్పనరంగాల్లో తెలంగాణకు ఉత్తమ అవార్డు రావడంపట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

ఈ చర్చలో పాల్గొన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, కేంద్రం వివిధ రాష్ట్రాను కలుపుకుని పనిచేయాలని భావిస్తోందన్నారు. కేంద్రంలో, రాష్ట్రాలలో వేరువేరు పార్టీల ప్రభుత్వాలు ఏర్పాటవుతున్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉండడం అవసరమని కేంద్ర ఐ.టి.శాఖామంత్రి రవిశంకర ప్రసాద్‌ పేర్కొన్నారు.

Other Updates