ఒకప్పటి ఇబ్రహీంపూర్‌ గ్రామానికి, ఇవాళ్టి ఇబ్రహీంపూర్‌ గ్రామానికి అసలు పోలికే లేదు. వారిదంతా ఒకే మాట.. ఒకే బాట.! ఒక ఇంటిలోని వారే ఒక్కటిగా ఉండలేకపోతున్నా ఈ రోజుల్లో.. ఒక ఊరివారంతా అంతగా కలిసికట్టుగా ఉంటున్నారంటే నిజంగా గొప్ప విషయం. వీరిదంతా అభివద్ధి పై ఆకాంక్ష.. ఇందు కోసం గ్రామస్తులంతా ఎకతాటిపైకొచ్చి ప్రతినబూని ప్రతి ప్రభుత్వ వనరును అందిపుచ్చుకున్నారు. ఫలితంగా అద్భుతమైన సౌకర్యాలు, అబ్బురపరిచే పరిసరాలు ఏర్పాటై.. అత్యున్నత అధికారులకు ఈ గ్రామం ఓ అభివద్ధి పాఠమైంది. ఈ గ్రామ స్ఫూర్తే.. ప్రతి గ్రామానికి ఆదర్శమైంది. ఈ గోప్పంతా ఈ గ్రామాన్ని ఆనాటి మంత్రి హరీశ్‌ రావు దత్తత తీసుకోవడంతోనే వచ్చింది.

మామిడాల రాము
tsmagazine
”పల్లెలు దేశానికి పట్టు కొమ్మలు” అని గాంధీజీ చెప్పిన మాటలు అక్షరాల నిజం చేయడమే కాదు. ఇవాళ ఇబ్రహీంపూర్‌ గ్రామం ఇండియాలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులకే పాఠాలు నేర్పుతున్నది. హరిత హారం, ఇంకుడు గుంతలు, చెత్త సేకరణ, సౌర విద్యుత్‌, వంద శాతం అక్షరాస్యత.. లాంటి పలు అంశాల్లో ఇప్పటికే జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. కానీ ఇవాళ ఇక్కడి ప్రజల చైతన్యంతో గ్రామ సభలను సమర్థవంతంగా నిర్వర్తించి.. ఏ సమస్య ఉన్నా.. సమస్య పరిష్కారం దిశగా అడుగేసింది. ఎకతాటిగా గ్రామస్తులంతా కలిసి తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండటంలోను శెభాష్‌ అనిపించుకుంటూ ఇవాళ దేశంలోని కోట్లాది ప్రజలకు ఆదర్శమైంది.

సిద్ధిపేట జిల్లా కేంద్రానికి 20కిలో మీటర్ల దూరంలో ఉంది ఇబ్రహీంపూర్‌. సిద్ధిపేట రూరల్‌ మండలంలోని ఓ మారుమూల గ్రామం.

ఇబ్రహీంపూర్‌ ఈ పల్లెలో 1230 మంది జనాభాతో 273 నివాసాలున్నాయి. గత పదేళ్ల కిందట అన్ని పల్లెల మాదిరిగానే ఇక్కడా సమస్యలుండేవి. ఎక్కడ చూసినా మురికి, ఆరుబయట మల మూత్ర విసర్జనలు కనిపించేవి. దోమకాట్లతో గ్రామ ప్రజలు రోగాల బారిన పడేవారు. ఇవేగాక వర్షాభావ లేమి, కరువు పరిస్థితులు తాండవించాయి.
tsmagazine
తరుముకోచ్చిన నీటి కష్టాలు.. ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరినీ వాననీటి సంరక్షణ వైపు నడిపించేలా ఇంకుడు గుంతల ఉద్యమం మొదలైంది. ఇంటి పట్టున ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకున్నది. ఆ తర్వాత పొలాల చుట్టూ కందకాలను తవ్వుకున్న మొదటి గ్రామంగా గుర్తింపు పొంది పొలాలపై పడిన వర్షం నీరు సైతం భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకుని జలసిరిని ఒడిసి పట్టారు.

ఓ వైపు జల సంరక్షణలో గ్రామ ప్రత్యేకతను చాటుతూనే మరో వైపు.. పారిశుద్ధ్యానికి మెరుగులు దిద్దేలా ఇంటింటికీ డస్ట్‌ బిన్లను అందించింది. రెండు రిక్షాల ద్వారా గ్రామంలో ఇంటింటా తిరిగి ఆ చెత్తను సేకరించి డంప్‌ యార్డుకు తరలిస్తున్నారు. ఈ గ్రామాన్ని యశోదా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి దత్తత తీసుకుని ఆ గ్రామ ప్రజలెవరికైనా హదయ సంబంధిత వ్యాదులోస్తే ఉచితంగా వైద్యం అందించే బాధ్యత తీసుకున్నారు. జిల్లాలో వంద శాతం అక్షరాస్యత కలిగి ఉన్న గ్రామం. ప్రభుత్వ పాఠశాలలోని తరగతి గదుల్లో డెస్క్‌లు, మోడల్‌ కిచెన్‌ రూమ్‌ నిర్మాణం, ఇంటింటా వంద శాతం ఎల్‌ ఈడీ బల్బుల వాడకం, వీధుల్లో 30 ఎల్‌ ఈడీ బల్బులు, మరో 30 సోలార్‌ వీధి దీపాలు వాడుతూ విద్యుత్‌ను ఆదా చేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన హరిత హారం కార్యక్రమంలో భాగంగా 2016 జూలై 9న హరీశ్‌ రావు ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటి., నాటిన ప్రతి మొక్క సంరక్షణ బాధ్యతను సైతం గ్రామస్తులే స్వీకరించారు. ఆ తర్వాత 2016 జూలై 15న రాష్ట్ర గవర్నర్‌ నరసింహాన ఆధ్వర్యంలో ఒకే రోజు లక్షా 5 వేల మొక్కలు నాటారు. ఇబ్రహీం ”ప్యూర్‌” బంగారమని సింబల్‌ ఆఫ్‌ తెలంగాణ అని గవర్నర్‌ కితాబిచ్చారు.
tsmagazine

వనరులను వినియోగించుకోవడంలో భేష్‌..

ఉపాయం ఉంటే.. ఉపాధి హామీలో అద్భుతాలు సష్టించవచ్చని నిరూపించేలా కేవలం 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాల్లోనే ఒక్క ఉపాధి హామీ పథకం ద్వారానే ఈ గ్రామస్తులు రూ.2కోట్ల మేర ఆస్తులను సమకూర్చుకున్నారు. మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు, సామూహిక గొర్రెల షెడ్లు, పశువుల పాకలు, వర్మీకంపోస్టు పిట్‌లు, 600ల ఎకరాల్లో పొలాల చుట్టూ కందకాలు, వైకుంఠధామం, గ్రామపంచాయతీ కార్యాలయం… ఇలా ఎన్నో పనులు చేపట్టారు. ప్రస్తుతం ఒక్కొక్క రైతు పొలంలో రూ.1.15 లక్షల విలువ చేసే పందిళ్లను నిర్మించారు. వీటి ఆధారంగా కూరగాయలను సాగు చేస్తూ రైతులు లాభాల బాటలో పయనం మొదలు పెట్టారు. గ్రామంలో 110 పశువుల పాకలు, వీటికి అనుసంధానంగా వర్మీ కంపోస్టు పిట్స్‌ నిర్మించుకోవడం ద్వారా ఒక్కో రైతుకు రూ.72 వేల ఆస్తిని సంపాదించుకుంటున్నారు.

అన్నీ రి ”కార్డు”లే..!

పల్లెటూరంటే ఒకటో రెండో చెప్పుకోదగ్గ విశేషాలుంటాయి. ఈ ఊరికి వందల ప్రత్యేకతలున్నాయి. ఆ మాటకొస్తే జాతీయంగానూ ఈ విలేజ్‌ ప్రివిలేజ్‌ ని సంపాదించింది. మొన్నటి దాక ఇబ్రహీంపూర్‌ అని ఎవరినైనా అడిగితే.. ఓహో ఇంకుడు గుంతల ఊరా.. అనేవారు. ఇప్పుడు వెళ్లి అడిగితే.. అదో ఆదర్శగ్రామమని పేరొచ్చింది. వందశాతం మరుగుదొడ్లు, వందశాతం పన్నుల వసూలు, ఇంటింటికీ ఇంకుడుగుంత, దోమలు లేని ఊరు, ప్రతిష్ఠాత్మక అవార్డులు, లాభాల్లో సాగు, సమద్ధిగా భూగర్భజలాలు, ఊరంతా పచ్చదనం, సమష్టితత్త్వానికి నిదర్శనం. అభివద్ధి పుస్తకంలో ‘ఇబ్రహీంపూర్‌’ మొదటి అధ్యాయంగా మారడమే కాకుండా ఎన్నో జాతీయ స్థాయి అవార్డులను సంపాదించింది. వీటిలో జాతీయ గ్రామీణ నిర్మల్‌ పురస్కార్‌ -2013, జాతీయ స్థాయిలో స్వశక్తికరణ్‌ అవార్డు -2014-2015, రాష్ట్రీయ గౌరవ గ్రామ సభ అవార్డు-2017, స్వచ్ఛ విద్యాలయ జాతీయ స్థాయి అవార్డు-2017, స్వచ్ఛ విద్యాలయ రాష్ట్రస్థాయి అవార్డు-2017, రాష్ట్ర, జిల్లాస్థాయిలో ఉత్తమ పంచాయతీ అవార్డులు – 3, రాష్ట్రస్థాయి హరితమిత్ర అవార్డులను పొంది.. ఎంతోమంది నాయకులకు ఈ గ్రామ ప్రజలు తమ అనుభవ పాఠాలు నేర్పుతున్నారు.

దేశంలో ఆదర్శ గ్రామాలు చాలానే ఉన్నాయి. కానీ ఇబ్రహీంపూర్‌ అన్నింటికంటే చెప్పుకోదగ్గది. ఎంతగా ఉంటే.. దేశ విదేశాల వారు సైతం వచ్చి ఊరి బాగోగుల్ని పరిశీలించి పోయారు. ఇప్పడు ఇబ్రహీంపూర్‌ ఒక టూరిజం స్పాట్‌.! ఇప్పటి దాక దాదాపు 25 విదేశీ బందాలు వచ్చి ఇబ్రహీంపూర్‌ గ్రామాన్ని సందర్శించి ఇక్కడి మార్పుని అధ్యయనం చేశాయి. భారత ప్రభుత్వ క్యాబినెట్‌ సెక్రటరీ జే.ఎస్‌.మాథుర్‌, కేంద్ర మినిస్ట్రీ ఆఫ్‌ రూరల్‌ డెవలప్మెంట్‌-ఏంఓఆర్డీ జాయింట్‌ సెక్రటరీ అపరంజిత సారంగి, దేశంలోని అరుణాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, చండీఘర్‌ రాష్ట్రం మినహాయించి మిగతా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ కార్యదర్శి స్థాయి అధికారులు వచ్చి ఈ గ్రామాన్ని సందర్శించి అధ్యయనం చేసి వెళ్లారు. ఈ గ్రామానికి ఇప్పటి వరకు దాదాపు 40 వేల మంది పై చిలుకు వరకు వచ్చి సందర్శించారు. ఈ గ్రామ సర్పంచ్‌ కుంబాల లక్ష్మీకి డెహ్రాడూన్‌ వెళ్లి ట్రైనీ ఐఏఎస్‌లకు గ్రామాభివద్ధి పాఠాన్ని వివరించే అవకాశం దక్కింది.
tsmagazine

ఈ ఐదేళ్ల కాలంలో ఈ గ్రామానికి వేలాది మంది సందర్శకులు వచ్చారంటే … వీరి పట్టుదల, కార్యదక్షతకు వందనం చేయాల్సిందే.

ఇబ్రహీంపూర్‌ చైతన్యం బాగుంది.. కితాబునిచ్చిన 15 రాష్ట్రాల ప్రజా ప్రతినిధుల బందం

ఇబ్రహీంపూర్‌ పల్లె గ్రామస్తుల చైతన్యం బాగుంది. గ్రామసభ నిర్వహణతో పాటు సమష్టి నిర్ణయాలతో గ్రామ రూపురేఖలను మార్చుకున్నారని 15 రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధుల బందం కితాబునిచ్చింది. ఇంకుడు గుంతలు, హరితహారం భేష్‌.. కందకాల నిర్మాణం, సుస్థిర వ్యవసాయం, పశువుల పాకల నిర్మాణం అద్భుతమని గ్రామస్తుల ఐక్యతతో ఇబ్రహీంపూర్‌ లో ఎవరూ ఊహించని విధంగా అభివద్ధి జరిగిందని ప్రశంసించింది.

డిసెంబర్‌ 20వ తేది జాతీయస్థాయిలో అవార్డు పొందిన ఎమ్మెల్యే హరీశ్‌ రావు దత్తత గ్రామమైన, ఆదర్శ గ్రామంగా పేరుగాంచిన సిద్దిపేట రూరల్‌ మండలం ఇబ్రహీంపూర్‌ను ఎన్‌ఐఆర్డీ (జాతీయ గ్రామీణాభివద్ధి సంస్థ) ఆధ్వర్యంలో 15 రాష్ట్రాలకు చెందిన 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర అధికారిక బందం కలిసి సందర్శించారు. గ్రామ అభివద్ధిని పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. ఇంకుడుగుంతుల నిర్మాణాలను పరిశీలించారు. మొక్కల పెంపకం, రెండు పడకల గదుల నిర్మాణాలు, వ్యక్తిగత పరిశుభ్రతకు పాటించే చర్యలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

గ్రామంలోని సీసీ రోడ్లు, పార్కు, బాలవికాస స్వచ్చంధ సంస్థ ద్వారా తాగు నీటి సరఫరా, నమూనా పంచాయతీ భవనం, వైకుంఠధామాన్ని చూశారు. గ్రామంలో గ్రామసభ నిర్వహణ, మహిళా సాధికారతకు దోహదం చేస్తున్న తీరును స్థానిక నాయకుడు ఎల్లారెడ్డి వారికి వివరించారు. సాగులో అవలంబిస్తున్న పద్ధతుల గురించి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామంలో అమలు చేస్తున్న 26 పనులను, దక్షిణ భారత దేశంలోనే మొదటి నగదు రహిత గ్రామం, ఏక కాలంలో గవర్నర్‌ సమక్షంలో 2 లక్షల మొక్కలు నాటిన గ్రామంగా.. ఇలా అన్నింటిలో ఆదర్శ గ్రామంగా నిలిచిన ఇబ్రాహీంపూర్‌ లో అభివ ద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బందానికి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు, జిల్లా కలెక్టర్‌ క్రిష్ణ భాస్కర్‌లు స్వాగతం పలికి అభివద్ధి కార్యక్రమాలను వివరించారు.
tsmagazine

గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని తమ నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతామని ప్రజా ప్రతినిధుల బందం ధీమా వ్యక్తం చేసింది. ఇబ్రహీంపూర్‌లో జరిగిన అభివద్ధిని హరీశ్‌ రావు దగ్గరుండి స్వయంగా సవివరంగా వివరించారు. ఈ మేరకు ఈ గ్రామానికి మీరంతా రావడం మాకు సంతోషంగా ఉన్నదని అభివద్ధి అంటే ఇబ్రహీంపూర్‌ అని.. అభివద్ధి అంటే ఇక్కడి ప్రజలేనంటూ.. గ్రామ సందర్శనకు వచ్చిన 61 మంది ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సిద్ధిపేట ప్రత్యేకత చాటి చెప్పే కాపు రాజయ్య పెయింటింగ్‌ చిత్రాల మేమెంటోలను బహుకరించారు. మహిళా ప్రజా ప్రతినిధులకు సిద్ధిపేట ప్రత్యేకత చాటుకున్న గొల్లభామ చీరలను బహుకరించారు.

గ్రామంలో ప్రభుత్వ పథకాలు సద్వినియోగమయ్యాయి.

– హర్యాన రాష్ట్ర స్పీకర్‌ కుంవర్‌ పాల్‌

ఇబ్రహీంపూర్‌ గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉందని.. అభివద్ధి, ఐక్యతకు ఈ గ్రామం స్ఫూర్తిగా నిలిచిందని హర్యాన రాష్ట్ర స్పీకర్‌ కుంవర్‌ పాల్‌ అన్నారు. ప్రభుత్వ పథకాలను గ్రామంలో చాలా బాగా సద్వినియోగం చేసుకున్నారని, ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు పెంపుదల చేయడం విషయంలో వీరు కనబరచిన శ్రద్ధ ఐక్యత అందరికీ స్ఫూర్తి దాయకం అని చెప్పారు.

గ్రామాభివద్ధితోనే దేశ వికాసం సాధ్యమవుతుందని చెప్పారు. ఇబ్రహీంపూర్‌ గ్రామాన్ని సందర్శించడం తామందరికీ సరికొత్తగా అనుభూతినిచ్చిందని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలిపారు. గ్రామ అభివద్ధి ఎంతో స్ఫూర్తిదాయకమని, గ్రామస్తులంతా ఐక్యంగా నిలిచి ప్రభుత్వ పథకాలను బాగా సద్వినియోగం చేసుకున్నారని ప్రశంసించారు. సుస్థిర వ్యవసాయం, గ్రామ పరి శుభ్రత, ఇంకుడు గుంతలు నిర్మాణం, పశువుల పాకల నిర్మాణాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని.. ఇలాంటి పథకాల అమలు కోసం ప్రత్యేకంగా చట్టాలు చేయాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మొదటగా.. గ్రామీణ పరి పాలన మెరుగుదల వ్యూహాలు..అమలు ఏలా.? అన్న అంశం, అలాగే అత్యంత అధ్వాన్నంగా వెనుకబడిన ప్రాంతం ఏలా అభివ ద్ధి చెందిందని ఆరా.. తీయడం రెండవ అంశం.. ఇలా 6 బందాలుగా ఈ ప్రజా ప్రతినిధుల బందం గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపినట్లు జిల్లా అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Other Updates